భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి పెరిగింది. దీనితో భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కూనవరం ప్రాంతంలో శబరి నది ఎగపోటు ఆందోళన రేపుతోంది.సీలేరు నది నుంచి నీరు విడుదల చేయడంతో శబరి నది ఉధృతంగా మారుతున్నది.గోదావరి నదిలో వరద ఉధృతి భద్రాచలం వద్ద శుక్రవారం ఉదయం 11:30 గంటలకు 43 అడుగులుగా నమోదైంది.ఎగువ ప్రాంతాలు దుమ్ముగూడెం, వెంకటాపురం, పేరూరు, ఏటూరునాగారం, పాతగూడెం, కాళేశ్వరం వద్ద కూడా నీటి మట్టాలు పెరుగుతున్నాయి.