హైదరాబాద్‌సిటీ: "రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం కాదని చంద్రబాబే చెప్పారు..అనుకూలంగా లేఖ కూడా ఇచ్చారు.ఇప్పుడెందుకు మళ్లీ నాటకాలు" అని కాంగ్రెస్ ఎమ్మెల్యే తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రశ్నించారు. విలేకరులతో మాట్లాడుతూ..రాష్ట్ర విభజన విషయంపై ప్రజల మనోభావాలు రెచ్చగొట్టేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బిల్లులు ఆమోదం పొందే సమయంలో తలుపులు మూయడం పార్లమెంట్ ఆనవాయితీ అని పేర్కొన్నారు.
దేవాదాయ చట్టానికి భిన్నంగా కేసీఆర్ మొక్కులు చెల్లించారని విమర్శించారు. ఏపీ స్పెషల్ స్టేటస్ కు టీఆర్ఎస్ మద్ధతు తెలపడం వారి ద్వంద్వనీతికి నిదర్శనమన్నారు. టీడీపీ, టీఆర్ఎస్ లు కుమ్మక్కు అయ్యాయని ఆరోపించారు. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్‌ను ఉరితీయాలా? అని ప్రశ్నించారు. "టీఆర్ఎస్ ప్రాజెక్టులు కట్టిందెక్కడ...కాంగ్రెస్ అడ్డుకున్నదెక్కడ?" అని ప్రశ్నించారు. ఉరితీయాల్సి వస్తే అది టీఆర్ఎస్నే తీయాల్సి ఉంటుందన్నారు. నిర్వాసితులకు అండగా నిలవడం ప్రాజెక్టులను అడ్డుకోవడమా? అదే నిజమైతే మిడ్ మానేరు నిర్వాసితులకు గతంలో కేసీఆర్ ఎలా అండగా నిలబడ్డారు? అని నిలదీశారు.
రాష్ట్ర విభజనకు లేఖ ఇచ్చింది చంద్రబాబే: జీవన్‌రెడ్డి
Published Fri, Mar 3 2017 6:14 PM | Last Updated on Wed, Aug 15 2018 8:58 PM
Advertisement