జంట జలాశయాలకు ఆదివారం సందర్శకుల తాకిడి పెరిగింది. ఆరేళ్ల తరువాత గండిపేట (ఉస్మాన్‌సాగర్), హిమాయత్‌సాగర్ జలాశయాల్లో జలకళ సంతరించుకోవడంతో కొత్తనీటి కళకళలు చూసేందుకు జనం తరలివస్తున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలి వచ్చారు.