tourists visit
-
Lok sabha elections 2024: ఎన్నికల భారతం చూసొద్దాం!
ప్రపంచ ప్రజాస్వామ్య జాతరలో పూనకాలు లోడింగ్... అని చెప్పేందుకు ఈ అంకెలు చాలు! 1952 నుంచి ఇప్పటిదాకా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా క్రమం తప్పకుండా ఎన్నికలు జరిగిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ ట్రాక్ రికార్డు ఇది. అంతేకాదండోయ్... యూరప్ మొత్తం జనాభా (75 కోట్లు) కంటే ఈ ఎన్నికల్లో మన ఓటర్లే ఎక్కువ! అందుకే ఇప్పుడు ప్రపంచమంతా మన ఓట్ల పండుగ వైపు చూస్తోంది. విదేశీ టూరిస్టులు కూడా ఈ కోలాహలాన్ని కళ్లారా చూసేందుకు ఉవి్వళ్లూరుతున్నారు. ఈ ఆసక్తిని గమనించిన పలు భారతీయ ట్రావెల్ కంపెనీలు వినూత్న ఐడియాతో వారికి ‘ద గ్రేట్ ఇండియన్ ఎలక్షన్ మేజిక్’ను చూపించేందుకు ప్లాన్ చేశాయి. అదే ‘ఎన్నికల టూరిజం’. దేశంలో ఇప్పుడిది నయా ట్రెండ్! ‘కోడ్’ కూతతో 7 విడతల్లో 44 రోజుల పాటు ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మెగా సార్వత్రిక సమరంలో పారీ్టల ప్రచారం జోరందుకుంది. ఇసుకేస్తే రాలనంత జనంతో భారీ సభలు.. పోటీ చేసే అభ్యర్థులు చేసే విన్యాసాలు... ప్రసంగాల్లో నేతల వాగ్దాటి... రాత్రికిరాత్రే పారీ్టలు మార్చే ఆయారాంలు, గయారాంలు.. హోరెత్తించే ర్యాలీలు.. కార్యకర్తల సందడితో దేశమంతా ఎన్నికల జ్వరం ఆవహించింది. మనకు ఇవేమీ కొత్తకాదు. అయితే, ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల క్రతువును ప్రత్యక్షంగా చూడాలనుకునే విదేశీయుల కోసం దేశంలోని పలు ట్రావెల్ ఏజెన్సీలు ఎన్నికల టూరిజం పేరుతో ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తున్నాయి. 2019లో ప్రత్యేకంగా పార్లమెంట్ ఎన్నికలను చూసేందుకు దాదాపు 8,000 మంది విదేశీ టూరిస్టులు వచి్చనట్లు అంచనా. ముఖ్యంగా అమెరికా, చైనా, నేపాల్, యూఏఈ, ఉక్రెయిన్, ఆ్రస్టేలియా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలకు చెందిన వారు ఇందులో ఉన్నారు. విద్యార్థులు, జర్నలిస్టులు, రీసెర్చ్ స్కాలర్లు, మహిళా బృందాలు, చరిత్ర–సంస్కృతి, రాజకీయాల పట్ల మక్కువ చూపేవారు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఈసారి ఎన్నికల టూరిజం కోసం 25,000 మందికి పైగానే విదేశీ పర్యాటకులు రావచ్చని ట్రావెల్ కంపెనీలు లెక్కలేస్తున్నాయి. మెక్సికో స్ఫూర్తి 2005లో మెక్సికోలో బాగా విజయవంతమైన పోల్ టూరిజం స్ఫూర్తితో అహ్మదాబాద్‌కు చెందిన అక్షర్ ట్రావెల్స్ అనే సంస్థ ఈ కాన్సెప్టును తొలిసారి దేశంలో ప్రవేశపెట్టింది. 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రత్యేక ప్యాకేజీలతో ఆకట్టుకుంది. వణ్యప్రాణుల టూరిజం... మెడికల్ టూరిజం... విలేజ్ టూరిజం... హిమాలయన్ ట్రెక్కింగ్ టూరిజం... తీర్థయాత్రల టూరిజం... దేవాలయాలు–ఆధ్యాతి్మక టూరిజం.. యోగా టూరిజం.. ఇలా విదేశీ టూరిస్టులను ఆకర్షిస్తున్న జాబితాలోకి ఎన్నికల టూరిజాన్ని కూడా చేర్చింది. గుజరాత్లో సక్సెస్ కావడంతో 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ దేశవ్యాప్తంగా దీన్ని కొనసాగించినట్లు ఆ సంస్థ చైర్మన్ మనీష్ శర్మ చెప్పారు. ‘ఎన్నికల సమయంలో భారత్‌ను సందర్శించేందుకు ఆసక్తి చూపుతున్న విదేశీ టూరిస్టుల్లో యూరోపియన్లు, మధ్య ప్రాచ్యం, పశి్చమాసియాకు చెందిన వారు ఎక్కువ. ర్యాలీల్లో లక్షలాది మంది పాల్గొనడం వారికి సరికొత్త అనుభూతిని అందిస్తోంది’ అని ఆయన వివరించారు. ప్రస్తుతం దేశంలో 20కి పైగానే ట్రావెల్ ఏజెన్సీలు ఎలక్షన్ టూరిజం ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి. 6 రోజులకు ప్రారంభ ధర రూ. 40,000 కాగా, 2 వారాల ప్యాకేజీకి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. ప్యాకేజీల ప్రత్యేకతేంటి? అటు పర్యాటకంగా, ఇటు రాజకీయంగా ఆసక్తి రేకెత్తించే కీలక ప్రాంతాలు, రాష్ట్రాలను ఏజెన్సీలు ప్రధానంగా ఎంచుకుంటున్నాయి. వారణాసి, ఢిల్లీతో సహా కేరళ, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటివి ఎన్నికల టూరిజం ప్యాకేజీల్లో ప్రధానంగా చోటు దక్కించుకుంటున్నాయి. భారీ ఎన్నికల ర్యాలీలు, సభల్లో పాల్గొనడంతో పాటు స్థానిక రాజకీయ నాయకులతో మాటామంతీ, కలిసి భోజనం చేయడం, గ్రామ పంచాయతీలను సందర్శించడం వంటివన్నీ ప్యాకేజీల్లో చేరుస్తున్నారు. పోటీ చేసే అభ్యర్థులను కలుసుకునే అవకాశాన్ని కూడా టూరిస్టులకు కలి్పస్తున్నారు. దీనివల్ల వారి ప్రచార వ్యూహాలు, ఇతరత్రా ఎన్నికల సంబంధ విషయాలను నేరుగా తెలుసుకోవడానికి వీలవుతుంది. కేవలం ఎన్నికల కార్యక్రమాలనే కాకుండా చుట్టుపక్కల గుళ్లూ గోపురాలు, కోటలు, బీచ్‌ల వంటి ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలను చుట్టేసే విధంగా ప్యాకేజీలను రూపొందిస్తున్నామని శర్మ వివరించారు. అంతేకాదు ధాబాల్లో భోజనం, స్థానికంగా నోరూరించే వంటకాలను రుచి చూపించడం, ఆ ప్రాంతంలోని సంస్కృతి, సాంప్రదాయాలతో పర్యాటకులు మమేకం కావడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. కాగా, ఢిల్లీకి చెందిన ఇన్క్రెడిబుల్ హాలిడేస్ అనే సంస్థ విదేశీ టూరిస్టులతో పాటు దేశీ పర్యాటకులకు కూడా ఇలాంటి ప్యాకేజీలను అందిస్తోంది. సందర్శనీయ ప్రదేశాలను చూపడంతో పాటు ఎన్నికల సంబంధ కార్యక్రమాల్లో కూడా పాల్గొనే విధంగా పర్యాటకుల అభిరుచిని బట్టి ప్యాకేజీలను రూపొందిస్తున్నామని ఈ కంపెనీ కన్సల్టింగ్ పార్ట్నర్ సుదేశ్ రాజ్‌పుత్ పేర్కన్నారు. ఒక్కో వ్యక్తికి ప్యాకేజీ రూ.25,000 నుంచి ప్రారంభమవుతుందని ఆయన వివరించారు. ట్రావెబ్రేట్.కామ్ ప్యాకేజీ కూడా ఇలాంటిదే. ఢిల్లీలోని ఎలక్షన్ మ్యూజియం సందర్శనలో మన ఎన్నికల చరిత్ర, చిరస్మరణీయ నాయకుల గురించి తెలుసుకోవడం, పోలింగ్‌ను తీరును చూపించడం, ఫలితాల రోజు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉత్కంఠ, విజేతల సంబరాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం వంటి పలు ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆతిథ్య రంగం జోరు..
ముంబై: ఆతిథ్య రంగం ఆదాయం వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2024–25) 11–13 శాతం మేర వృద్ధి చెందనుంది. దేశీయంగా పర్యాటకానికి డిమాండ్ స్థిరంగా కొనసాగనుండటంతో పాటు విదేశీ పర్యాటకుల సంఖ్య కూడా పెరగనుండటం ఇందుకు తోడ్పడనుంది. క్రిసిల్ రేటింగ్స్ ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. ప్రస్తుత ఆరి్థక సంవత్సరంలో పరిశ్రమ ఆదాయ వృద్ధి 15–17 శాతం స్థాయిలో ఉండగలదని పేర్కొంది. డిమాండ్ పటిష్టంగా ఉండటం, కొత్తగా హోటల్స్ లభ్యత ఒక మోస్తరుగానే పెరుగుతుండటంతో సమీపకాలంలో పరిశ్రమ లాభదాయకత ప్రస్తుత, వచ్చే ఆరి్థక సంవత్సరాల్లో మెరుగ్గా ఉండనుందని నివేదిక వివరించింది. గదుల అద్దె రేట్లు (ఏఆర్ఆర్) సగటున ఈ ఆరి్థక సంవత్సరం 10–12 శాతం మేర, వచ్చే ఆర్థిక సంవత్సరం 5–7 శాతం మేర పెరగవచ్చని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ ఆనంద్ కులకర్ణి తెలిపారు. ఆక్యుపెన్సీ ఆరోగ్యకరంగా 73–74 శాతం స్థాయిలో కొనసాగవచ్చని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, విదేశీ టూరిస్టుల రాక ఈ ఆరి్థక సంవత్సరమూ పెరగనున్నప్పటికీ కోవిడ్ పూర్వ స్థాయితో పోలిస్తే 10 శాతం తక్కువగానే నమోదు కావచ్చని చెప్పారు. అయితే, వచ్చే ఏడాది ఇది పుంజుకోగలదన్నారు. ఆచితూచి పెట్టుబడులు.. డిమాండ్ పుంజుకోవడం పరిశ్రమ సెంటిమెంటు మెరుగుపడేందుకు ఊతమిస్తున్నప్పటికీ కొత్తగా పెట్టుబడులు పెట్టేటప్పుడు పరిశ్రమ ఆచితూచి వ్యవహరిస్తోందని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ నితిన్ కన్సల్ తెలిపారు. ‘స్థల సేకరణ వ్యయాలు అధికంగా ఉండటం, నిర్మాణ వ్యయాలు పెరిగిపోవడం, పరిశ్రమ సైక్లికల్ స్వభావం కారణంగా లాభాలకు మళ్లాలంటే సుదీర్ఘ సమయం పట్టనుండటం వంటి అంశాల వల్ల కొత్తగా పెట్టుబడి వ్యయాలు చేయాలంటే ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. కాబట్టి బ్రాండ్లు తమ ముందస్తు పెట్టుబడి వ్యయాలను తగ్గించుకునేందుకు మేనేజ్మెంట్ కాంట్రాక్టుల ద్వారా గదులను పెంచుకోవడాన్ని కొనసాగించే అవకాశం ఉంది‘ అని కన్సల్ పేర్కొన్నారు. ఏఆర్ఆర్పరమైన ఆదాయ వృద్ధితో సమానంగా నిర్వహణ వ్యయాలు పెరగకపోవడం వల్ల లాభదాయకత మెరుగుపడగలదని ఆయన చెప్పారు. హోటళ్లు ఖర్చులను తగ్గించుకునే క్రమంలో గత రెండేళ్లుగా సిబ్బందిని, ఫుడ్.. బెవరేజ్‌ల వ్యయాలను క్రమబదీ్ధకరించుకుంటూ పలు చర్యలు తీసుకోవడం కూడా పరిశ్రమకు సానుకూలాంశమని కన్సల్ వివరించారు. -
లుక్కుండాలె.. లెక్కుండాలె..!
సాక్షి, హైదరాబాద్: ఇక ఇష్టారాజ్యంగా సాహసక్రీడలు నిర్వహించడం కుదరదు. వీటిపై ఓ లుక్కుండాలి.. వీటికో లెక్కుండాలని కేంద్రం స్పష్టం చేసింది. విధివిధానాలు రూపొందించింది. భూపాలపల్లి జిల్లాలోని పాండవులగుట్టతోపాటు భువనగిరి గుట్ట వద్ద ట్రెక్కింగ్ చేస్తున్న యువ కులు కనిపిస్తారు.. ఈ ట్రెక్కింగ్‌కు సారథ్యం వహిస్తున్న సంస్థ ఏంటి? వికారాబాద్ సమీపంలోని అనంతగిరి గుట్టల్లో తరచూ మోటారు సైకిల్, సాధారణ బైసికిల్ రేసులు కనిపిస్తాయి. కానీ, వీటిని నిర్వహిస్తున్నదెవరు? వీటి గురించి తెలంగాణ పర్యాటకశాఖ వద్ద ఎలాంటి సమాచారం ఉండదు. దీనిపై కేంద్రం సీరియస్ అయింది. సాహస క్రీడలు నిర్వహిస్తున్న సంస్థలేవో కూడా సమాచారం లేకుండా పర్యాటకశాఖ ఉండటమేంటని ప్రశ్నించింది. ఇక నుంచి సాహస క్రీడలకు సంబంధించి విధివిధానాలను అనుసరిం చాల్సిందేనని స్పష్టం చేసింది. ఎవరు పడితేవారు నిర్వహించొద్దు రాష్ట్రంలో రాక్ క్లైంబింగ్, ట్రెక్కింగ్, మోటారు బైక్స్ రేసింగ్, సైక్లింగ్, టెర్రయిన్ కార్ స్పోర్ట్స్... ఇలాంటివి చాలా ప్రాంతాల్లో జరుగుతున్నాయి. కొన్ని సంస్థలు ప్రత్యేకంగా స్థలం ఏర్పాటు చేసుకుని గో కార్టింగ్లు నిర్వహిస్తున్నాయి. కొన్నిసంస్థలు క్లబ్‌గా ఏర్పడి సభ్యులను చేర్చుకుని తరచూ సైక్లింగ్, బైక్ రైడింగ్ లాంటివి నిర్వహిస్తున్నాయి. వీటిల్లో ధనార్జన లక్ష్యంగా లేకున్నా, సాహసక్రీడలను నిర్వహించే కుతూహలం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సైక్లింగ్, ట్రెక్కింగ్ లాంటి భూమి మీద నిర్వహించే 15 రకాల సాహస క్రీడలు, నీటిలో, గాలిలో నిర్వహించే ఏడు చొప్పున క్రీడలకు సంబంధించి ఈ విధివిధానాలను సిద్ధం చేసింది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలంటే ఈ సాహస క్రీడలను విస్తృతం చేయాలని గతంలోనే కేంద్ర పర్యాటక శాఖ నిర్ణయించింది. దీనికి తగ్గట్టుగా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో స్థానిక వనరుల ఆధారంగా సాహస క్రీడలు పెరిగిపోయాయి. ప్రస్తుతం ఆ రూపంలో 430 బిలియన్ డాలర్ల ఆదాయం వస్తోందని అంచనా వేసింది. ఇది వచ్చే కొద్ది సంవత్సరాల్లో ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. కానీ, మనదేశంలో చాలా ప్రాంతాల్లో కనీస జాగ్రత్తలు తీసుకోకుండా వీటిని నిర్వహిస్తున్న తీరును గుర్తించింది. విదేశీ పర్యాటకులు సైతం వీటిపై ఫిర్యాదు చేస్తున్నట్టు పేర్కొంది. చాలాచోట్ల కనీస జాగ్రత్తలు లేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని కొత్త విధివిధానాలను రూపొందించింది. మనోహర్, ఎండీ, టీఎస్‌టీడీసీ సాహస క్రీడల విధివిధానాలపట్ల కేంద్ర పర్యాటక శాఖ కచ్చితంగా వ్యవహరిస్తోంది. ఇది మంచి పరిణామమే. ఇటీవలే ఢిల్లీలో దీనిపై సదస్సు నిర్వహించి ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఎలాంటి అనుమతులు కూడా లేకుండా ఎవరికి వారుగా వాటిని నిర్వహించే పద్ధతి ఇక ఉండదు. దీనిపై నిర్వాహకులకు కూడా త్వరలో స్పష్టతనిస్తాం ఇలా ఉండాలి.. ఇక నుంచి సాహసక్రీడలు నిర్వహించే సంస్థలన్నీ తెలంగాణ పర్యాటకశాఖలో పేర్లు రిజిస్టర్ చేసుకోవాలి. ఎక్కడ ఎలాంటి క్రీడలు నిర్వహించబోతున్నారో ముందుగా స్థానిక పర్యాటక శాఖ కార్యాలయంలో సమాచారం ఇచ్చి అనుమతి పొందాలి ఆయా క్రీడలకు సంబంధించి కనీసం మూడేళ్ల నిర్వహణ అనుభవం ఉన్నట్టుగా పర్యాటక శాఖ నుంచి సర్టిఫికెట్ పొందినవారే వాటి నిర్వహణకు అర్హులు నిర్వాహకులు, కార్యక్రమాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించేవారు ఆయా క్రీడల్లో కనీస శిక్షణ తీసుకుని ఉండాలి. వారు కనీస విద్యార్హతలను కూడా కలిగి ఉండాలి పర్యాటక శాఖ నిర్దేశించిన పరికరాలనే వినియోగించాలి. వాటిల్లో పాల్గొనేవారు కచ్చితంగా హెల్మెట్లులాంటి రక్షణపరికరాలు వాడాలి. క్రీడలు నిర్వహించే ప్రాంతంలో ప్రమాద నియంత్రణ పరికరాలుండాలి. గాయపడ్డవారికి చికిత్స చేసేందుకు అవసరమైన మెడికల్ కిట్స్ అందుబాటులో ఉండాలి -
‘పోచారం’ వద్ద పర్యాటకుల సందడి
సాక్షి, నాగిరెడ్డిపేట(నిజామాబాద్) : నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు వద్ద సోమవారం పర్యాటకుల సందడి నెలకొంది. చాలారోజుల తర్వాత ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరడంతో కామారెడ్డి, మెదక్ జిల్లాలతోపాటు హైదరాబాద్ నుంచి సందర్శకులు ప్రాజెక్టుకు తరలివచ్చారు. ప్రాజెక్టు అలుగుపై నుంచి పర్యాటకులు నడుచుకుంటూ ఉత్సాహాంగా గడిపారు. ప్రాజెక్టు వద్ద వంటలు చేసుకొని సామూహికంగా భోజనాలు చేశారు. ప్రాజెక్టులో నీటిమట్టం 18ఫీట్లకు చేరుకుంది. ప్రాజెక్టు ఎగువప్రాంతం నుంచి ప్రస్తుతం 285క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 1461.33అడుగులతో 1.398టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టిందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. -
జమ్మూకశ్మీర్ వెళ్లడం మానుకోండి!
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, టెర్రర్ అలర్ట్ నడుమ ఆ రాష్ట్రంలో పర్యటించేవారు ‘అప్రమత్తంగా ఉండాలని’ జర్మనీ, బ్రిటన్‌తో సహా ఆస్ట్రేలియా ప్రభుత్వాలు తమ దేశ పౌరులకు సూచించాయి. ఉగ్ర మూకలు తెగబడే అవకాశం ఉందని నిఘా వర్గాలు జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ప్రత్యేకంగా అమర్నాథ్ యాత్రికులను, పర్యాటకులను వీలైనంత త్వరగా లోయ నుంచి బయలుదేరాలని శుక్రవారం కోరిన సంగతి తెలిసిందే. అంతేకాక అమరనాథ్ యాత్రను ఉన్నపళంగా నిలిపివేసింది. తాజా పరిణామాలను దృష్టిలో ఉంచుకొని.. జమ్మూకశ్మీర్‌లో ఉంటే అప్రమత్తంగా ఉండి, స్థానిక అధికారుల సలహాలను పాటించాలని తమ పౌరులకు పలు దేశాలు సూచనలు జారీ చేశాయి. ఢిల్లీలోని బ్రిటిష్ హైకమిషన్ కశ్మీర్‌లోని పరిస్థితిని పర్యవేక్షిస్తూ తమ దేశ పౌరులకు హెచ్చరిక జారీచేసింది. జనావాసంతో కూడిన ప్రాంతాలు, పర్యాటక ప్రాంతాల్లో బాంబు, గ్రెనేడ్ దాడులు, కాల్పులు లేదా కిడ్నాప్లతో హింసాత్మక ఘటనలు జరిగే ప్రమాదం ఉందని, జాగ్రత్త వహించాలని కోరింది. ‘లద్దక్‌లోని పశ్చిమ ప్రాంతాలకు ప్రయాణించేటప్పుడు అతి జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రాంతాల్లో ఒంటరిగా లేదా గుర్తు తెలియని గైడ్‌తో అస్సలు ప్రయాణించొద్దు. పాకిస్తాన్, లద్దక్‌లోని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాతో తక్షణ సరిహద్దు ప్రాంతాలకు వెళ్లడం మానుకోండి’ అని జర్మనీ ప్రభుత్వం తమ పౌరులకు విజ్ఞప్తి చేసింది. యుకే, జర్మనీ తమ పౌరులకు ప్రయాణ సలహా ఇచ్చిన కొద్ది నిమిషాల తరువాత, ఆస్ట్రేలియా కూడా జమ్మూ కశ్మీర్‌కు వెళ్లవద్దని తన పౌరులకు సూచించింది. -
కిన్నెరసానిలో పర్యాటకుల కోలాహలం
పాల్వంచరూరల్ : కిన్నెరసానిలో పర్యాటకుల కోలాహలం కన్పించింది.ఆదివారం ఒక్కరోజు ఆదాయం అరలక్ష పైనా లభించింది. పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానికి పర్యాటకుల తాకిడి నానాటికి పెరుగుతుంది. సెలవు రోజు కావడంతో జిల్లా నలుమూలల నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో కిన్నెరసాని పరిసరాలు పర్యాటకులు సందడి చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సవాల నడుమ గడిపారు. డీర్ పార్కులోని చుక్కల దుప్పులను, నెమళ్లను వీక్షించిన పర్యాటకులు డ్యామ్ మీదకు వెళ్లి రిజర్వాయర్‌లోని నీటి మట్టాన్ని వీక్షించారు. బోటు షికారు చేశారు. 1100 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించడం ద్వారా వైల్డ్‌లైఫ్‌శాఖకు రూ.28 వేల ఆదాయం రాగా, 500 మంది బోటు షికారు చేయడంతో రూ.24వేల ఆదాయం లభించినట్లు నిర్వహకులు తెలిపారు. -
జంట జలాశయాలకు సందర్శకుల తాకిడి
-
జంట జలాశయాలకు సందర్శకుల తాకిడి
మొయినాబాద్: జంట జలాశయాలకు ఆదివారం సందర్శకుల తాకిడి పెరిగింది. ఆరేళ్ల తరువాత గండిపేట (ఉస్మాన్‌సాగర్), హిమాయత్‌సాగర్ జలాశయాల్లో జలకళ సంతరించుకోవడంతో కొత్తనీటి కళకళలు చూసేందుకు జనం తరలివస్తున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో సందర్శకులు తరలి వచ్చారు. 2010లో గండిపేట, హిమాయత్‌సాగర్ జలాశయాలు పూర్తిస్థాయిలో నిండడంతో నీటిని దిగువకు వదిలారు. అప్పట్లో జలాశయాలను చూసేందుకు సందర్శకులు భారీగా వచ్చారు. జలాశయాల కట్టలపై నుంచి కొత్తనీటిని చూస్తూ.. జలాశయం అందాలను సెల్ఫోన్లలో బందిస్తూ.. సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేశారు. పది రోజులకు పైగా భారీ వర్షాలు కురుస్తుండడంతో జలాశయాల్లోకి వరదనీరు పోటెత్తింది. గండిపేట జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1,790 అడుగులు కాగా ఆదివారం సాయంత్రానికి 1,779 అడుకులకు చేరింది. హిమాయత్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,763.5 అడుగులు కాగా 1,743 అడుగులకు చేరింది. ఈసీ వాగులో భారీగా వరద వచ్చింది. దీంతో సోమవారం ఉదయానికి మరో రెండు అడుగులకు పైగా నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని జలమండలి అధికారులు తెలిపారు.