తెలంగాణాస్ గ్రోథ్ స్టోరీ–ద రోడ్ టు డాలర్స్ 1 ట్రిలియన్ ఎకానమీ’ నివేదికలో ఆసక్తికర అంశాలు
ప్రస్తుత 176 బిలియన్ డాలర్ల ఎకానమీ నుంచి 2036కల్లా ఒక ట్రిలియన్ డాలర్ల ఎకానమీ వైపు పరుగులు పెట్టొచ్చన్న అంచనాలు
చురుకైన ఆర్థికాభివృద్ధితోపాటు సాంస్కృతిక భిన్నత్వం, పటిష్ట ఫార్మా, లైఫ్‌సైన్సెస్, ఐటీ, జీసీసీ, ఏరోస్పేస్ రంగాలతో ముందుడుగు
ఫ్యూచర్ సిటీ, ఆర్‌ఆర్‌ఆర్, మూసీ రివర్‌ఫ్రంట్ లాంటి ప్రాజెక్టులతో పెరగనున్న నూతన అవకాశాలు
సాక్షి, హైదరాబాద్: దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందంజలో సాగుతోంది. చురుకైన ఆర్థికాభివృద్ధితోపాటు సాంస్కృతిక భిన్నత్వం, పటిష్టమైన ఫార్మా, లైఫ్‌సైన్సెస్, ఐటీ, జీసీసీ, ఏరోస్పేస్ వంటి విభిన్న రంగాల్లో దూసుకుపోతోంది. దీనికితోడు ఫ్యూచర్ సిటీ, రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్), మూసీ రివర్‌ఫ్రంట్ తదితర మౌలిక వసతుల ప్రాజెక్టులు పట్టలెక్కనుండటంతో కొత్త అవకాశాలు విస్తృతం కానున్నాయి. గ్రాస్ వాల్యూ యాడెడ్ (జీవీఏ) రంగాల్లో రియల్ ఎస్టేట్, ప్రొవిషనల్ సరీ్వసెస్, ట్రేడ్, హోటల్స్, రెస్టారెంట్లు తదితరాలు సింహభాగం అయ్యాయి.
అక్షరాస్యత 67 శాతంగా ఉండటంతోపాటు 1.6 కోట్ల మంది (రాష్ట్ర జనాభాలో 66 శాతం) 15–59 ఏళ్ల మధ్య వర్కింగ్ ఏజ్‌లో ఉండటం తెలంగాణకు కలిసొచ్చే అంశం. దీంతో ప్రస్తుతమున్న 176 బిలియŒన్ డాలర్ల ఎకానమీ నుంచి 2036 కల్లా ఒక ట్రిలియŒన్ డాలర్ల ఎకానమీ వైపు పరుగులు పెట్టొచ్చని ట్రేడ్ పండిట్స్ అంచనా వేస్తున్నారు. ప్రభుత్వపరంగా కూడా ‘ద మెగా మాస్టర్‌ప్లాన్ 2050’ దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశిస్తూ ప్రణాళికలను సిద్ధం చేసిన విషయం తెలిసిందే. తాజాగా డబ్ల్యూటీసీ శంషాబాద్, జీనోమ్ వ్యాలీ ఆధ్వర్యంలో ‘తెలంగాణాస్ గ్రోథ్ స్టోరీ–ద రోడ్ టు డాలర్స్ 1 ట్రిలియన్ ఎకానమీ’ పేరిట విడుదల చేసిన నివేదికలో పలు ఆసక్తికరమైన అంశాలను పొందుపరిచారు.
దేశంలోనే ‘యంగెస్ట్ స్టేట్’గా తెలంగాణ ఇప్పటికే పలు రంగాల్లో ఆధిక్యతను కనబరుస్తూ ముందుకు సాగుతోంది. భారత్ అభివృద్ధి, ముందంజలో తన వంతు పాత్ర పోషిస్తూ తెలంగాణ పురోగతి బాటలో నడుస్తోంది. నూతన ఆవిష్కరణలు, సాంకేతికలపై ప్రత్యేక దృష్టి పెడుతూ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో వేగంగా అడుగులు వేస్తోంది. కేవలం హైదరాబాద్ మహానగరం, ఇతర నగరాలు, పట్టణ ప్రాంతాలకే పరిమితం కాకుండా సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లోనూ కొత్త అవకాశాలు అందిపుచ్చుకొనేలా చర్యల ద్వారా ప్రాంతీయంగా వ్యాపార, వాణిజ్యాల వృద్ధికి చర్యలు చేపడుతోంది.
నివేదిక ముఖ్యాంశాలు
⇒ 2024 ఆర్థిక సంవత్సరంలో జీఎస్‌డీపీ (కరెంట్) యూఎస్ డాలర్లు 176 బిలియన్లు
⇒ 2024లో తలసరి ఆదాయం 4,160 డాలర్లు
⇒ 2021 జనాభా లెక్కల ప్రకారం 3.8 కోట్ల మంది జనాభా
⇒ 2011 లెక్కల ప్రకారం 39 శాతం పట్టణ జనాభా
⇒ 2011 లెక్కల ప్రకారం స్త్రీ పురుష లింగ నిష్పత్తి 988
⇒ రాష్ట్ర జనాభాలో 66% పనిచేసే వయసు (15 నుంచి 59 ఏళ్ల లోపు) ఉన్న 1.6 కోట్ల మంది
⇒ 2011 లెక్కల ప్రకారం అక్షరాస్యత 67 శాతం
⇒ దేశ భూభాగంలో 3.4 శాతమున్న తెలంగాణ: 1,12,077 చ.కి.మీ.లలో విస్తరణ
తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా టాప్...
⇒ రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం రూ. 9.52 లక్షలు
⇒ హైదరాబాద్ జిల్లా తలసరి ఆదాయం రూ. 4.96 లక్షలు
⇒ సంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం రూ. 3.24 లక్షలు
⇒ మేడ్చల్–మల్కాజిగిరి తలసరి ఆదాయం రూ. 2.97 లక్షలు
గ్రాస్ డి్రస్టిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్–జీడీడీపీ ( బిలియన్ డాలర్లలో) రంగారెడ్డి జిల్లా టాప్..
⇒ రంగారెడ్డి జిల్లా 33.94 బిలియన్ డాలర్లు
⇒ హైదరాబాద్ జిల్లా 27.38 బిలియన్ డాలర్లు
⇒ మేడ్చల్–మల్కాజిగిరిజిల్లా 10.64 బిలియన్ డాలర్లు
⇒ సంగారెడ్డి జిల్లా 7.23 బిలియన్ డాలర్లు
Comments
Please login to add a commentAdd a comment