
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటుకు సంబంధించి స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదించిన ప్రాజెక్టుల ప్రగతిని శనివారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్ రెడ్డి పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఎస్ఐపీబీ ఆమోదం పొందిన ప్రాజెక్టులన్నీ వేగవంతంగా ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
వీటి ప్రగతిపై ప్రతి 15 రోజులకు నివేదిక సమర్పించాలని పరిశ్రమల శాఖ కమిషనర్ ప్రవీణ్ కుమార్‌ను సీఎస్ ఆదేశించారు. నెలకు ఒకసారి ఈ అంశంపై సమీక్షిస్తానని సీఎస్ అన్నారు. అలాగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పరిశ్రమలకు సంబంధించి చేసుకున్న అవగాహనా ఒప్పందాలపై సీఎస్ సమీక్షించారు. ఆ సమ్మిట్‌లో పరిశ్రమల శాఖకు సంబంధించి వివిధ కంపెనీల ద్వారా 3 లక్లల 41వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో 2 లక్షల 38 వేల మందికి ఉపాధి కల్పించే 107 అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకోగా ఇప్పటికే కొన్ని కంపెనీలు, పరిశ్రమలకు ముఖ్యమంత్రి స్వయంగానూ, వర్చువల్‌గానుశంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారని చెప్పారు
చదవండి: బాబు అండ్ బ్యాచ్ ఓవరాక్షన్.. నిర్మల సీతారామన్ చెప్పింది విన్నారా?
డిశంబరు నెలాఖరులోగా మరో 36 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. ఇంకా పరిశ్రమలు ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ, నిర్వాసితులకు పునరావాస చర్యలు తదితర అంశాలపై సీఎస్ అధికారులతో సమీక్ష జరిపారు.
అంతకు ముందు రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్ కే.ప్రవీణ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎస్ఐపీబీలో ఆమోదించిన ప్రాజెక్టులు వాటి ప్రగతిని వివరించారు. అలాగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో చేసుకున్న అవగాహనా ఒప్పందాలు ఆయా కంపెనీల ఏర్పాటుకు సంబంధించిన వివిధ అంశాలను వివరించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జేడీ రామలింగేశ్వర రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment