18న జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్
Published Wed, Nov 16 2016 12:37 AM | Last Updated on Mon, Sep 4 2017 8:10 PM
కర్నూలు సిటీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంకేతిక మండలి, జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల18వ తేదీన జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ప్రాజెక్టుల ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు డీఈఓ రవీంద్రనాథ్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని ఏ క్యాంపులోని మాంటిస్సోరి స్కూల్‌లో ఉదయం 9 గంటలకు ప్రారంభ మవుతుందన్నారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాల స్కూల్ నుంచి ఒక సైన్స్ గైడ్ టీచర్, విద్యార్థి తయారు చేసిన ప్రాజెక్టును ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలన్నారు. ప్రతి స్కూల్ ఈ ప్రదర్శనలలో పాల్గొవాలని ప్రాజెక్టును ఠీఠీఠీ.nఛిటఛి.ఛిౌ.జీn అనే వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు జిల్లా సైన్స్ కో–ఆర్డినేటర్లు రంగమ్మ, కె.వి సుబ్బారెడ్డిలను 9948605546, 8790111331 నంబర్లలో సంప్రదించాలన్నారు.
Advertisement
Advertisement