మంచినీటి ప్రాజెక్టుల నిర్మాణానికి చర్యలు
Published Tue, Sep 27 2016 11:06 PM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM
ఏలూరు: జిల్లాలో ప్రజల సౌకర్యార్థం భారీ మంచినీటి ప్రాజెక్టులు చేపట్టేందుకు రూ.750 కోట్ల వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్ అతిథి గహంలో మంగళవారం పంచాయతీరాజ్ అధికారులతో ఆయన సమీక్షించారు. జిల్లాలో భవిష్యత్ అవసరాలను దష్టిలో పెట్టుకుని భారీరక్షిత మంచినీటి పథకాలు చేపట్టాలన్నారు. గోపాలపురం నియోజకవర్గంలో కొండపై ఓహెచ్‌ఎస్‌ఆర్ ఏర్పాటు చేసి దాని ద్వారా గ్రావిటీ మీద ప్రజలకు రక్షితనీరు అందేలా చేపట్టిన పథకం బాగుందని, ఇదే విధానాన్ని అనుసరించి మరిన్ని నూతన భారీ మంచినీటి పథకాలకు రూపకల్పన చేయాలని అయ్యన్నపాత్రుడు అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement