జోధ్‌పూర్‌లో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ
జోధ్‌పూర్: భారతదేశం గళాన్ని నేడు ప్రపంచ దేశాలు వింటున్నాయని, ఇది చూసి ప్రతిపక్ష కాంగ్రెస్ తట్టుకోలేకపోతుందని ప్రధాని మోదీ అన్నారు. ఆ పార్టీ బీజేపీని వ్యతిరేకించే క్రమంలో భారత్‌ను వ్యతిరేకించడం ప్రారంభించిందని విమర్శించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాజస్తాన్‌లో మోదీ గురువారం పర్యటించారు. దాదాపు రూ.5,000 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించారు.
మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జోధ్‌పూర్‌లో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. గహ్లోత్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పేపర్ లీక్ మాఫియా వల్ల లక్షలాది మంది యువత భవిష్యత్తు అంధకారంగా మారిందన్నారు. రాజస్తాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ అవినీతిని బయటపెడతామన్నారు.
మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
కాంగ్రెస్ పారీ్టకి రైతుల పట్ల గానీ, సైనికుల పట్ల గానీ ఏమాత్రం శ్రద్ధ లేదని మోదీ ఆరోపించారు. ఆ పారీ్టకి అధికారమే పరమావధిగా మారిందని ఆక్షేపించారు. సొంత ఓటు బ్యాంకును ప్రేమించడం తప్ప ప్రజా ప్రయోజనాల గురించి ఆలోచించడం లేదని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయని, ప్రపంచ దేశాల్లో మన ప్రభావం విస్తరిస్తోందని, విదేశాల్లో మన గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారని, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇదంతా నచ్చడం లేదని అన్నారు.
భారత్ త్వరలో ప్రపచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని, ఇది మోదీ ఇస్తున్న గ్యారంటీ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ బిల్లు పరిస్థితి ఏమిటో తెలిసిందేనని పేర్కొన్నారు. కేంద్రంలో తాము అధికారంలోకి వచి్చన తర్వాత దేశంలో పేదరికం గణనీయంగా తగ్గిందని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. కోట్లాది మంది పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు.
‘ద వ్యాక్సిన్ వార్’పై మోదీ ప్రశంసలు
బాలీవుడ్ చలనచిత్రం ‘ద వ్యాక్సిన్ వార్’పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రం ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసిందని అన్నారు. వివేక్ అగి్నహోత్రి దర్శకత్వం వహించిన ద వ్యాక్సిన్ వార్ సినిమా సెపె్టంబర్ 28న విడుదలైంది. కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి మన సైంటిస్టులు అహోరాత్రులు శ్రమించారని, వారి శ్రమను ఈ చిత్రంలో చక్కగా చూపించారని మోదీ కొనియాడారు. మన సైంటిస్టుల అంకితభావాన్ని తెరకెక్కించిన చిత్ర దర్శకుడు, నిర్మాతలను ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment