ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి శైలాజానాథ్ మండిపడ్డారు. చంద్రబాబుకు స్పష్టమైన సాగునీటి ప్రణాళిక లేదన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నిండినా కరువు ప్రాంతాలకు నీరు తరలించలేదని ఆరోపించారు. అనంతపురానికి 20 టీఎంసీల నీటిని వెంటనే తరలించి హెచ్ఎల్సీ ఆయకట్టును కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.