నిర్ణీత వ్యవధిలో పూర్తయ్యేలా సీఎం ప్రత్యేక చొరవ
ప్రతినెలా సమీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా భావిస్తు న్న 19 ప్రాజెక్టులను నిరీ్ణత కాలవ్యవధిలో పూర్తి చేయా లని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు సీఎం రేవంత్ ఇకపై ప్రతీనెలా ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించనున్నారు. ‘స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ’(స్పీడ్) పేరుతో సరికొత్త కార్యాచరణను చేపట్టినట్టు సీఎంవో వర్గాలు వెల్లడించాయి. స్పీడ్ కార్యాచరణలో భాగంగా ఆ 19 ప్రాజెక్టులపై సంబంధిత విభాగాల అధికారులతో సీఎం నెలకోసారి సమావేశమవుతారు. ప్రాజె క్టుల పనుల్లో భాగంగా వివిధ విభాగాల మధ్య ఉన్న అడ్డంకులు, అవరోధాలన్నింటినీ అధిగమించేందుకు ‘స్పీడ్’ప్రత్యేక చొరవ తీసుకుంటుంది. పనుల్లో ఎక్కడా ఆలస్యం లేకుండా నేరుగా సీఎం రేవంత్‌రెడ్డి స్థాయిలోనే అవసరమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఈ ‘స్పీడ్’ దోహదపడుతుందని భావిస్తున్నారు.
అన్ని చోట్లా ’స్పీడ్’
పట్టణాలు, నగరాలకే పరిమితం కాకుండా...అన్ని ప్రాంతాల్లోని అభివృద్ధి పనులపై ‘స్పీడ్’దృష్టి కేంద్రీకరిస్తుంది. ‘స్పీడ్’కార్యక్రమంలో భాగంగా తమ పరిధిలో చేపడుతు న్న ప్రాజెక్టులు, పనులపై సంబంధిత విభాగాలు ప్రత్యేక ప్రణాళికలు తయారు చేస్తాయి. ఏ గడువులోగా ఎంత పని జరుగుతుందనే నిరీ్ణత కాల వ్యవధిని ఇందులో పొందుపరుస్తారు. ఎప్పటివరకు ఏయే పనులు పూర్తవుతాయనే పనుల అంచనాలను అందులో ప్రస్తావిస్తారు. ’స్పీడ్’ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీలుగా ప్రణాళిక విభాగం ప్రత్యేకంగా ఆన్‌లైన్ పోర్టల్‌ను నిర్వహించనుంది, ఏ రోజుకు ఎంత పని జరిగిందనే అప్ డేట్ డేటాను ఇందులో పొందుపరుస్తారు.
ఆ 19 ప్రాజెక్టులు ఏవంటే..
మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్, శాటిలైట్ టౌన్ల అభివృద్ధి, మెట్రోరైలు విస్తరణ, జీహెచ్‌ఎంసీ పునర్వ్యవస్థీ కరణ, రీజినల్ రింగ్ రోడ్, హైదరాబాద్ సిటీలో ఎలివే టెడ్ కారిడార్లు, రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలు, ఢిల్లీ లో తెలంగాణ భవన్ నిర్మాణం, మహిళాశక్తి పథకం అమలు, జిల్లా సమాఖ్య భవనాల నిర్మాణం, సమీకృత గురుకుల పాఠశాలల సముదాయాలు, అమ్మ ఆదర్శ పా ఠశాలల కమిటీల సంస్థాగత అభివృద్ధి, ఐటీఐల్లో అడ్వా న్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు, కొత్త ఉస్మానియా హాస్పిటల్, 15 కొత్త నర్సింగ్, 28 కొత్త పారా మెడికల్ కాలేజీలు, హెల్త్ టూరిజం ప్రమోషన్, ఎకో టూరిజం ప్రాజెక్టుల ప్రమోషన్, టెంపుల్ సర్క్యూట్స్ టూరిజం, మత్తుమందుల నిరోధక విధానం అమలు.
Comments
Please login to add a commentAdd a comment