
హైదరాబాద్: కొన్ని రోజులుగా హైదరాబాద్‌ను వరుణుడు అతలాకుతలం చేస్తున్నాడు. ఏదొక సమయంలో నగరాన్ని ముంచెత్తుతున్నాడు వరుణుడు. ఈరోజు(సోమవారం, ఆగస్టు 11వ తేదీ) మహా నగరాన్ని వర్షం తడిపేసింది. వనస్థలిపురం, ఎల్బీనగర్, ఉప్పల్‌లో కుండపోత వర్షం కురిసింది. సాయంత్రం వేళ చినుకు చినుకుగా మొదలైన భారీ వర్షంగా మారడానికి ఎంతో సమయం పట్టలేదు.
మెహిదీపట్నం, అత్తాపూర్, రాజేంద్రనగర్‌లో సైతం కుండపోత వర్షం పడింది. అల్వాల్, మల్కాజ్‌గిరి, తార్నాక, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, అమిర్‌పేట, ఎర్రగ్డ, కూకట్‌పల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడింది.