'రాజ' ముద్ర | 'Royal' stamp | Sakshi
Sakshi News home page

'రాజ' ముద్ర

Published Fri, Sep 2 2016 3:52 AM | Last Updated on Sat, Jul 7 2018 3:09 PM

'రాజ' ముద్ర - Sakshi

'రాజ' ముద్ర

వైఎస్ హయాంలోనే ‘తెలంగాణ మాగాణ’కు బీజాలు
- జలయజ్ఞంలో మొత్తం 86 ప్రాజెక్టులు చేపట్టిన నేత
- అందులో 33 ప్రాజెక్టులు తెలంగాణలోనే..
 
 కరువు రక్కసితో అల్లాడుతున్న తెలంగాణలో సిరులు పండాలి.. వలసబాట పట్టిన తెలంగాణ రైతన్న ముఖంపై చిరునవ్వు వెల్లివిరియాలి..సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు నీళ్లు పారాలి.. నాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కన్న కలలివి! ఈ మహా సంకల్పానికి మహోన్నత యజ్ఞం.. అదే జలయజ్ఞం!! ఏళ్ల తరబడి బీళ్లుగా మిగిలిపోయిన భూములకు చేవనిచ్చేందుకు చేపట్టిన ఆ యజ్ఞ ఫలాలు ఇప్పుడిప్పుడే ప్రజలకు చేరువవుతున్నాయి. తెలంగాణలో సుమారు 50 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు నాడు తలపెట్టిన సంకల్పం ప్రస్తుతం లక్ష్యానికి చేరువైంది. జలయజ్ఞం పేరుతో వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 86 ప్రాజెక్టుల నిర్మాణం మొదలుపెట్టగా అందులో 33 ప్రాజెక్టులు తెలంగాణలో చేపట్టినవే. 18 భారీ, 12 మధ్యతరహా ప్రాజెక్టులు, రెండు ప్రాజెక్టుల ఆధునీకరణ, మరో ఫ్లడ్ బ్యాంకు పనులను రూ.1,11,433.23 కోట్లతో చేపట్టారు.

ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 387.88 టీఎంసీల కృష్ణా, గోదావరి నీటిని వినియోగంలోకి తెచ్చి 51.47 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చేలా ప్రణాళికలు రూపొందించారు. ఇందులో వైఎస్ హయాంలోనే గుత్ప, అలీసాగర్, సుద్దవాగు ప్రాజెక్టులు పూర్తయ్యాయి. వాటి కింద 1,07,584 ఎకరాలకు సాగు నీరిచ్చారు. ఏఎంఆర్‌పీ, దేవాదుల, ఎస్సారెస్పీ-2, మత్తడివాగు వంటి ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసి మరో 4 లక్షల ఎకరాలకు నీరందించారు. ఇప్పటివరకు జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టులపై మొత్తం రూ.48 వేల కోట్లు ఖర్చుకాగా సుమారు 6.50 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చింది. మరో లక్ష ఎకరాల మేర స్థిరీకరణ జరిగింది. ఈ ఏడాది మరిన్ని ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయి. అందులో పాలమూరు, ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులు ముందు వరుసలో ఉన్నాయి.
 - సోమన్నగారి రాజశేఖర్‌రెడ్డి, సాక్షి ప్రతినిధి
 
‘పాలమూరు’పై చెరగని ముద్ర
 కరువుతో కొట్టుమిట్టాడుతున్న మహబూబ్‌నగర్ జిల్లా ముఖచిత్రం మార్చాలంటే పొలం తడపడం తప్ప మరో మార్గం లేదని భావించిన వైఎస్.. జలయజ్ఞం ప్రాజెక్టుల్లో ఈ జిల్లాకు పెద్దపీట వేశారు. ఇందులో భాగంగా కల్వకుర్తి (25 టీఎంసీలు), భీమా (20 టీఎంసీలు), నెట్టెంపాడు (20 టీఎంసీలు), కోయిల్‌సాగర్ (3.90 టీఎంసీలు) ప్రాజెక్టులు చేపట్టారు. 7.80 లక్షల ఎకరాల ఆయకట్టును సాగులోకి తెచ్చే లక్ష్యంతో రూ.7,969.38 కోట్లతో వీటిని చేపట్టారు. భారీగా నిధులు కేటాయించడంతో పనులు శరవేగంగా జరిగాయి. 2009లో సెప్టెం బర్ నాటికే ఈ 4 ప్రాజెక్టుల కింద 60% పనులు పూర్తయ్యా యి. రూ.2,990 కోట్లతో చేపట్టిన కల్వకుర్తిలో వైఎస్ హయాంలో రూ.2,904.01 కోట్లు ఖర్చవగా, భీమా కింద రూ.1,492.38 కోట్లు, నెట్టెంపాడు కింద రూ.1,124.52 కోట్లు, కోయిల్‌సాగర్ కింద రూ.235.91 కోట్లు ఖర్చు చేశారు. అయితే వైఎస్ మరణానంతరం వచ్చిన సీఎంలు ప్రాజెక్టులపై చిన్నచూపు చూశారు. భూసేకరణ, పరిహారం చెల్లింపులో ఇబ్బందులు, రహదారులు, రైల్వే క్రాసింగ్‌లపై పట్టింపు తగ్గడంతో ప్రాజెక్టులు అటకెక్కాయి. అయితే ప్రస్తుత ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇచ్చి వాటి పూర్తికి చొరవ చూపుతోంది. దీంతో ఈ ఏడాది 4.60 లక్షల ఎకరాలకు నీరందించే చర్యలు మొదలయ్యాయి. ఇప్పటికే కొంత ఆయకట్టుకు జూరాల నుంచి నీరు అందుతోంది. వచ్చే ఏడాది మిగతా 3.20 లక్షల ఎకరాలకు నీరిచ్చి మొత్తం ఆయకట్టును వృద్ధిలోకి తెచ్చేలా ప్రణాళికలు వేశారు. అదే జరిగితే ఆయకట్టుకు పారే ప్రతి నీటి  బొట్టులో వైఎస్ ముద్ర కనబడటం ఖాయం.
 
ఎల్లంపల్లి’ ఘనత వైఎస్‌దే..
 2004 జూలై 28న వైఎస్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. కరీంనగర్ జిల్లాలో 1,65,700 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు, ఆదిలాబాద్ జిల్లాలోని 30 వేల ఎకరాల స్థిరీకరణ కోసం 20.17 టీఎంసీల నీటి నిల్వతో దీన్ని చేపట్టారు. ఈ ప్రాజెక్టు ఈ ఏడాది నుంచి పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చింది. గతేడాది 10 టీఎంసీల మేర నిల్వ చేయగా.. అది ఈ ఏడాది 20 టీఎంసీలకు చేరింది. గతేడాది నిల్వ చేసిన నీటితోనే ప్రస్తుత ప్రభుత్వం హైదరాబాద్ తాగునీటి అవసరాలను తీర్చింది. ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టు లక్ష్యం 1.65 లక్షల ఎకరాల్లో ఈ ఏడాది సుమారు 25 వేల ఎకరాలకు నీరివ్వాలని  అధికారులు ప్రణాళికలు వేస్తున్నారు. ప్రాజెక్టులో ఉన్న మేడారం పంప్‌హౌస్, గంగాధరం పంప్‌హౌస్‌కు త్వరలో ట్రయల్న్ ్రనిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. సెప్టెంబర్ చివర్లో డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్‌కు నీటిని అందించేందుకు ట్రయల్ రన్ నిర్వహించాలని భావిస్తున్నారు. వచ్చే ఏడాదికల్లా పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరందించే ఈ ప్రాజెక్టు వెనుక వైఎస్ కృషిని మరవలేం.
 
 గోదావరి ప్రణాళిక ఆయనదే
 ఎగువ రాష్ట్రాల జల దోపిడీతో కృష్ణా జలాలు కిందకు రావడం కరువైన పరిస్థితుల్లో.. గోదావరి జలాలే తెలంగాణకు శరణ్యమని భావించిన వ్యక్తి వైఎస్సార్! సముద్రం పాలవుతున్న గోదావరి నీటికి అడ్డుకట్ట వేసి.. ఉపనదులైన వార్దా, పెన్‌గంగ, ఇంద్రావతి, ప్రాణహిత నదుల నీటిని ఎక్కడికక్కడ వినియోగంలోకి తెచ్చేలా ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. ప్రాణహిత-చేవెళ్ల, ఎల్లంపల్లి, దేవాదుల, కంతనపలి,్ల, రాజీవ్ దుమ్ముగూడెం, ఇందిరా దుమ్ముగూడెం ప్రాజెక్టులు ఇందులో ప్రధానమైనవి. వీటి ద్వారా 300 టీఎంసీల నీటిని వినియోగంలోకి తెచ్చేలా ప్రణాళిక వేశారు. ఇందులో దేవాదుల, ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఇప్పటికే వినియోగంలోకి రాగా, ప్రాణహిత, కంతనపల్లి ప్రాజెక్టులు రీ ఇంజనీరింగ్ చేసుకొని టెండర్ల దశలను దాటుకొని ముందుకు వెళ్తున్నాయి.
 
ప్రాణహితకు ప్రాణం పోసిన నేత..
 చెంతనే గోదావరి పారుతున్నా చుక్క నీటికి నోచుకోక బీళ్లుగా మారిన ఉత్తర తెలంగాణలోని పొలాలకు ఊపిరిలూదేందుకు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు ఊపిరిలూదారు వైఎస్! ఏకంగా 160 టీఎంసీల నీటిని మళ్లించి 16.40 లక్షల ఎకరాలకు సాగునీరు, పరిశ్రమల అవసరాలకు 16 టీఎంసీలు, జంటనగరాల తాగునీటికి 30 టీఎంసీలు, గ్రామీణ ప్రాంత తాగునీటికి 10 టీఎంసీలు వినియోగించేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. 2008 డిసెంబర్ 16న ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన వైఎస్.. మరుసటి రోజు.. అంటే డిసెంబర్ 17నే ప్రాజెక్టుకు రూ.35,200 కోట్ల పనులకు పరిపాలన అనుమతులు ఇస్తూ జీవో విడుదల చేశారు. టెండర్లు ఆహ్వానించి 28 ప్యాకేజీలకు ఒప్పందాలు చేసుకున్నారు. అనుమతుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. విసృ్తత ప్రయోజనాల దృష్ట్యా, కేంద్రం సూత్రప్రాయ అంగీకారం తెలపడమే కాకుండా ప్రధానమంత్రి ప్యాకేజీ కింద ఆర్థిక సాయం చే సేందుకు సైతం ముందుకు వచ్చింది. దీన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలంటూ కేంద్రంపై వైఎస్ ఒత్తిడి తెచ్చారు. అయితే ప్రస్తుతం వివిధ కారణాలతో రీడిజైన్ చేస్తుండటంతో ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement