పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలి
పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలి
Published Sat, Oct 1 2016 11:27 PM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM
సీపీఐ జిల్లా కార్యదర్శి కె రామాంజనేయులు డిమాండ్
ఆత్మకూరు: రాయలసీమ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న సాగునీటిప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కె. రామాంజనేయులు డిమాండ్ చేశారు. ఆత్మకూరు డివిజన్ పరిధిలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, బానకచర్ల క్రస్ట్‌గేట్లు, సిద్ధాపురం చెరువు, తెలుగు గంగ ప్రాజెక్టులను శనివారం సీపీఐ బందం పరిశీలించింది. అంతకు ముందు మల్యాల, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాలను సందర్శించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజధాని పేరుతో ఒక ప్రాంతాన్ని మాత్రమే అభివద్ధి చేస్తున్నారని విమర్శించారు. వెనుకబడిన సీమ జిల్లాలను కూడా పట్టించుకోవాలని కోరారు. 10 ఏళ్లుగా సిద్ధాపురం ఎత్తిపోతల పథకం పూర్తికాకపోవడం బాధాకరమన్నారు. ఈ పథకం పూర్తయితే 23 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. తాము రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, భారీ నీటిపారుదలశాఖ మంత్రిని ఈ నెల 3న కలిసి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని ఒత్తిడి తీసుకువస్తామన్నారు. స్పందించకపోతే రాయలసీమ రైతాంగం తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ నేతలు రసూల్, బాబా ఫకద్ధిన్, పద్మన్‌రాజు, రఘురాంమూర్తి, ఏఐఎస్‌ఎప్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement