పెండింగ్ ప్రాజెక్టులకు సీఎం పచ్చజెండా
Published Mon, Sep 16 2013 12:07 AM | Last Updated on Fri, Sep 1 2017 10:45 PM
సాక్షి, ముంబై: పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం లభించనుం ది. నవీముంబైలో ప్రతిపాదిత, పెండింగ్‌లో ఉన్న వివిధ ప్రాజెక్టులన్నీ పూర్తిచేయాలని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ నగరాభివృద్ధి శాఖ ప్రధాన కార్యద ర్శులకు సూచిం చారు. అదేవిధంగా ‘నవీముంబై-తలోజా-ఉల్లాస్‌నగర్-కల్యాణ్-ముర్బాడ్’ మెట్రో రైల్వే కొత్త ప్రాజెక్టుకు అధ్యయనం పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని సిటీ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (సిడ్కో) అధ్యక్షుడు ప్రమోద్ హిందూరావ్ తెలిపారు. ఇటీవల ముఖ్యమంత్రి చవాన్, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్‌తో సహ్యాద్రి అతిథిగృహంలో హిందూరావ్ భేటీ అయ్యారు.
నవీముంబై-కల్యాణ్ మెట్రో రైల్వే ప్రాజెక్టు ప్రారంభించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ ప్రాజెక్టు ప్రారంభించేందుకు రాయ్‌గఢ్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి గణేశ్ నాయిక్ కూడా మద్దతు పలుకుతున్నట్లు చవాన్ దృష్టికి తీసుకొచ్చారు. సీడ్కో దాదాపు రూ. నాలుగు వేల కోట్లతో కూడిన మెట్రో ప్రాజెక్టు పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో రూ.1,600 కోట్ల పనులు ఇదివరకే ప్రారంభమయ్యాయి. ఠాణే, రాయ్‌గఢ్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు ముంబై మెట్రో పాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) పరిధిలోకి వస్తున్నాయి.
అలాగే శివ్డీ-చిర్లే ట్రాన్స్ హార్బర్ లింక్ రోడ్ కోట్ల రూపాయల ప్రాజెక్టు సిడ్కో పరిధిలోంచి వెళుతోంది. అందుకు అవసరమైన 200 ఎకరాల స్థలం తీసుకునేందుకు సిడ్కో నో అబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసీ) ఎమ్మెమ్మార్డీయేకు అందజేసింది. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం నగరాభివద్థి శాఖ ప్రధాన కార్యదర్శి మన్‌కుమార్ శ్రీవాస్తవ్‌కు నవీముంబై-తలోజా-ఉల్లాస్‌నగర్-కల్యాణ్ మీదుగా ముర్బాడ్ వరకు మెట్రో రైల్వే ప్రాజెక్టు కోసం అధ్యయనం చేపట్టాలని సూచించడంతో ఈ ప్రాజెక్టుకు ఎమ్మెమ్మార్డీయే కూడా సహకరించనుందని హిం దూరావ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అధ్యయన పనులు పూర్తికాగానే రెండున్నరేళ్లలో మెట్రో రైల్వే పనులు ప్రారంభమైతాయని ఆయన అన్నారు.
Advertisement
Advertisement