siddapuram
-
ఏపీ భవిష్యత్ జగన్‌పైనే ఆధారపడి ఉంది : సజ్జల
కర్నూలు : ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైనే ఆధారపడి ఉందని ఆయన రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చలువ వల్లే కర్నూలు జిల్లా సిద్ధాపురం ఎత్తిపోతల పథకం పూర్తవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిద్ధాపురం చెరువు వద్ద మంగళవారం గంగా హారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ తాను ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఎన్నికల హామీలు నిలబెట్టుకోని చంద్రబాబుని చూసి మనిషి ఎలా ఉండకూడదో ప్రజలు నేర్చుకోవాలన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు చెప్పే మాయమాటల్ని నమ్మవద్దని, వైఎస్సార్ ఆశయాల్ని తిరిగి బతికించే సత్తా వైఎస్ జగన్‌కే సాధ్యం అని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు కూడా దక్కకుండా వైఎస్సార్ సీపీ కార్యకర్తలు సయన్వయంతో పనిచేయాలని కోరారు. జనం సమస్యల్ని పరిష్కరించడమే వైఎస్ జగన్ ఏకైక లక్ష్యం అని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. -
ఏపీ ప్రజల్నిమోసం చేస్తున్నచంద్రబాబు
సాక్షి, కర్నూలు : వ్యవసాయం దండగ అన్న సిద్ధాంతాన్ని చంద్రబాబు తన ప్రభుత్వంలో అమలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. రైతులందరికీ రుణమాఫీ చేస్తామంటూ ఎన్నికల సమయంలో హామీనిచ్చిన చంద్రబాబు ఇప్పుడా ఊసే ఎత్తడంలేదన్నారు. సిద్దాపురం చెరువు వద్ద నిర్వహించిన వైఎస్సార్ గంగా హారతి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబు నిర్వాకం వల్ల రుణమాఫీ జరగకపోవడంతో రైతులు మరింత అప్పుల్లో కూరుకుపోయారని ఆరోపించారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వంలో ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లేవని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. -
కాలువ పనులు వేగవంతం చేయండి
జిల్లా కలెక్టర్ విజయమోహన్ కర్నూలు(అగ్రికల్చర్): సిద్ధాపురం ఎత్తిపోతల పథకం కాలువల తవ్వకం పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అధికారులను ఆదేశించారు. ఇంతవరకు పనులు జరుగకపోవడదానికి కారణాలు తెలుసుకొని పరిష్కరించేందుకు రెవెన్యూ సిబ్బందితో 9 బృందాలు ఏర్పాటు చేశారు. బుధవారం కలెక్టర్ తన సమావేశ మందిరంలో నీటిపారుదల అధికారులు, భూసేకరణ అధికారులతో కాలువ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ప్రతి గ్రామంలో మిషన్లు ఏర్పాటు చేసి కాలువ తవ్వకం చేపట్టాలని తెలుగుగంగ ప్రాజెక్టు ఎస్ఈ రాఘవరెడ్డిని ఆదేశించారు. సిద్దేపల్లి, కరివెన, కృష్ణాపురం, తదితర గ్రామాలకు ఒక జూనియర్ ఇంజనీర్‌ను నియమించి నిరంతరం పర్యవేక్షించాలన్నారు. గ్రామం వారిగా ఎన్ని క్యూబిక్ మీటర్లు తవ్వారు, ఇంకా ఎంత తవ్వాలనే దానిని పరిశీలించాలన్నారు. పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోయినా, ఽనిర్లక్ష్యం వహించినా షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఎస్ఈని ఆదేశించారు. రైతులందరికీ పరిహారం అందిందని, ఏ ఒక్కరూ పనులకు అడ్డు పడకుండా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కర్నూలు ఆర్డీఓ హుసేన్‌సాహెబ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సత్యం, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
పరిహారమిచ్చి పనులు చేయండి
- సిద్దాపురం ఎత్తిపోతల పథకం పనులను అడ్డుకున్న బాధితుడు – ఎస్డీసీ, తహసీల్దార్ చొరవతో సమస్య పరిష్కారం బాపనంతాపురం(ఆత్మకూరురూరల్): పరిహారం ఇచేంత వరకు పనులు జరగనిచ్చేది లేదని సిద్దాపురం ఎత్తిపోతల పథకంలో భూమి కోల్పోయిన రైతులు అధికారులకు తెగేసి చెప్పారు. మండల పరిధిలోని బాపనంతాపురం వద్ద బుధవారం రైతులు తమ పొలాల్లో పంట కాల్వలు తీయడానికి వచ్చిన జేసీబీలను అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన శివప్రసాద్, ప్రమీలమ్మలకు చెందిన భూమిలో పంటకాల్వ తవ్వాల్సి ఉంది. వీరి భూమిని ప్రభుత్వం సేకరించింది. శివప్రసాద్‌కు చెందిన 1.58 ఎకరాల సేకరణ భూమిలో 58 సెంట్లకు రావాల్సిన పరిహారాన్ని(దాదాపు రూ 3.5 లక్షలు)అదే సర్వే నంబర్లో ఉన్న మరో రైతు శివయ్య బ్యాంకు ఖాతాలో వేశారు. జరిగిన పొరపాటును వివరిస్తూ తగు ఆధారాలతో రెండేళ్లుగా శివప్రసాద్ నంద్యాలలో ఉన్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అయినప్పటికీ అతనికి జరిగిన లోటును అధికారులు సరిదిద్దలేదు. దీంతో తమ పొలంలో కాల్వలు తీయడానికి వచ్చిన జేసీబీని అడ్డుకున్నాడు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి బాధితుడితో ఫోన్లో మాట్లాడి పరిహారం సొమ్ము ముట్టేవరకు పొలంలో పనులు చేయనీయవద్దని తాను కలెక్టర్‌తో మాట్లాడతానని హామీ ఇచ్చారు. అయితే రెవెన్యూ అధికారులు పనులకు అడ్డు తగిలితే íపరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించినట్లు బాధిత రైతు తెలిపాడు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సత్యం, ఆత్మకూరు తహసీల్దార్ రాజశేఖరబాబు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని రైతులను సమావేశ పరచి శివప్రసాద్. సరోజమ్మలకు రావాల్సిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. శివయ్యకు రావాల్సిన మరో చెక్‌ను బాధితులకు బదలాయించేందుకు అంగీకరించారు. మిగిలిన సొమ్మును నెలలోపు బాధిత రైతులకు ఇచ్చేలా శివయ్యతో అంగీకార పత్రం రాయించి ఇచ్చారు. -
పెండింగ్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలి
సీపీఐ జిల్లా కార్యదర్శి కె రామాంజనేయులు డిమాండ్ ఆత్మకూరు: రాయలసీమ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న సాగునీటిప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కె. రామాంజనేయులు డిమాండ్ చేశారు. ఆత్మకూరు డివిజన్ పరిధిలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, బానకచర్ల క్రస్ట్‌గేట్లు, సిద్ధాపురం చెరువు, తెలుగు గంగ ప్రాజెక్టులను శనివారం సీపీఐ బందం పరిశీలించింది. అంతకు ముందు మల్యాల, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాలను సందర్శించారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజధాని పేరుతో ఒక ప్రాంతాన్ని మాత్రమే అభివద్ధి చేస్తున్నారని విమర్శించారు. వెనుకబడిన సీమ జిల్లాలను కూడా పట్టించుకోవాలని కోరారు. 10 ఏళ్లుగా సిద్ధాపురం ఎత్తిపోతల పథకం పూర్తికాకపోవడం బాధాకరమన్నారు. ఈ పథకం పూర్తయితే 23 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. తాము రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, భారీ నీటిపారుదలశాఖ మంత్రిని ఈ నెల 3న కలిసి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని ఒత్తిడి తీసుకువస్తామన్నారు. స్పందించకపోతే రాయలసీమ రైతాంగం తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ నేతలు రసూల్, బాబా ఫకద్ధిన్, పద్మన్రాజు, రఘురాంమూర్తి, ఏఐఎస్ఎప్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.