కాలువ పనులు వేగవంతం చేయండి
కాలువ పనులు వేగవంతం చేయండి
Published Wed, Feb 8 2017 10:35 PM | Last Updated on Tue, Sep 5 2017 3:14 AM
జిల్లా కలెక్టర్ విజయమోహన్
కర్నూలు(అగ్రికల్చర్): సిద్ధాపురం ఎత్తిపోతల పథకం కాలువల తవ్వకం పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అధికారులను ఆదేశించారు. ఇంతవరకు పనులు జరుగకపోవడదానికి కారణాలు తెలుసుకొని పరిష్కరించేందుకు రెవెన్యూ సిబ్బందితో 9 బృందాలు ఏర్పాటు చేశారు. బుధవారం కలెక్టర్ తన సమావేశ మందిరంలో నీటిపారుదల అధికారులు, భూసేకరణ అధికారులతో కాలువ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ప్రతి గ్రామంలో మిషన్లు ఏర్పాటు చేసి కాలువ తవ్వకం చేపట్టాలని తెలుగుగంగ ప్రాజెక్టు ఎస్‌ఈ రాఘవరెడ్డిని ఆదేశించారు.
సిద్దేపల్లి, కరివెన, కృష్ణాపురం, తదితర గ్రామాలకు ఒక జూనియర్ ఇంజనీర్‌ను నియమించి నిరంతరం పర్యవేక్షించాలన్నారు. గ్రామం వారిగా ఎన్ని క్యూబిక్ మీటర్లు తవ్వారు, ఇంకా ఎంత తవ్వాలనే దానిని పరిశీలించాలన్నారు. పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోయినా, ఽనిర్లక్ష్యం వహించినా షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఎస్‌ఈని ఆదేశించారు. రైతులందరికీ పరిహారం అందిందని, ఏ ఒక్కరూ పనులకు అడ్డు పడకుండా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కర్నూలు ఆర్డీఓ హుసేన్‌సాహెబ్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సత్యం, తహసీల్దార్లు పాల్గొన్నారు.
Advertisement
Advertisement