కమీషన్ల కోసమే ప్రాజెక్టులకు అధిక నిధులు
Published Thu, Aug 25 2016 10:04 PM | Last Updated on Mon, Sep 4 2017 10:52 AM
ఆత్మకూరు (ఎం) : కమీషన్ల కోసమే ప్రాజెక్టులకు రిడిజైనింగ్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తోందని డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్య గౌడ్ విమర్శించారు. గురువారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహా రాష్ట్రతో జల ఒప్పందం వెనుక ప్రాజెక్టు కాంట్రాక్ట్ పనులను‡ముఖ్యమంత్రి తన బంధువైన మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు సంబంధికులకు కట్టబెట్టడం ఒక ప్రధాన కారణమన్నారు. ఎన్నికల హామీలను ఏ ఒక్కటి అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. వేసిన పంటలు ఎండిపోతూ రైతులు అల్లాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ గంగపురం మల్లేశం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొడిత్యాల నరేందర్‌గుప్త, నాయకులు కందాడి అనంతరెడ్డి, యాస లక్ష్మారెడ్డి, కొడిమాల యాదగిరిగౌడ్, కట్టెకోల హన్మంతుగౌడ్, లోడి శ్రీను పాల్గొన్నారు.
Advertisement
Advertisement