Commissions
-
అవినీతి నిర్మాణానికి రెట్టింపు ‘అడుగు’
సాక్షి, అమరావతి: రాజధానిలో భవనాల నిర్మాణ పనుల టెండర్లలో అడుగు అడుగుకు కమీషన్లు దండుకోవడానికి ముఖ్య నేతలు ప్రణాళికాయుతంగా పావులు కదుపుతున్నారు. ఐఏఎస్ అధికారుల బంగ్లాల పనుల టెండర్లలోనైతే మరీ బరితెగించారు. అడిగినంత కమీషన్ ఇచ్చే కాంట్రాక్టు సంస్థకు కట్టబెట్టేందుకు సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) అధికారులపై ముఖ్య నేతలు ఒత్తిడి తెచ్చారు. నిర్మాణ అంచనా వ్యయాన్ని పెంచేసేలా చక్రం తిప్పారు. ఆ కాంట్రాక్టు సంస్థ బ్రోచర్నే నిబంధనలుగా పెట్టి టెండర్ నోటిఫికేషన్ జారీ చేయించారు. నిర్దేశించిన కాంట్రాక్టు విలువ కంటే అధిక ధరకు కాంట్రాక్టు సంస్థకు పనులు కట్టబెట్టాక.. అందులో పది శాతాన్ని ప్రభుత్వ ఖజానా నుంచి మొబిలైజేషన్ అడ్వాన్సుగా ముట్టజెప్పి.. దాన్నే తొలి విడత కమీషన్‌గా వసూలు చేసుకోవడానికి స్కెచ్ వేశారు. ఆ తర్వాత చేసిన పనులకు బిల్లులు చెల్లించేటప్పుడు మిగతా కమీషన్ వసూలుకు ప్రణాళిక రచించారు. వివరాల్లోకి వెళితే..రాజధానిలో రాయపూడి వద్ద ఐఏఎస్ అధికారులకు 30.47 ఎకరాల్లో జీ+1 పద్ధతిలో పైల్ ఫౌండేషన్‌తో ఆర్సీ కాలమ్స్, బీమ్స్‌తో లోపల, బయట విద్యుదీకరణ, ఐటీ పనులు.. లోపల, బయటి ప్రాంతాల్లో ప్లంబింగ్‌తో బంగ్లాల నిర్మాణ పనులకు సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ బంగ్లాలకు రహదారులు, విద్యుత్తు వంటి మౌలిక సదుపాయాలను కల్పించాలి. మొత్తం 5,28,100 చదరపు అడుగుల్లో 115 బంగ్లాలను నిర్మించాలని టెండర్లో పేర్కొంది. కాంట్రాక్టు సంస్థలు టెండర్లో పాల్గొంటూ బిడ్లు దాఖలు చేసుకోవడానికి మార్చి 3వరకు గడువు ఇచ్చింది. అదే రోజున టెక్నికల్ బిడ్ తెరుస్తారు. అందులో అర్హత సాధించిన కాంట్రాక్టు సంస్థల ఆర్థిక బిడ్లను మార్చి 7న తెరిచి, తక్కువ ధర(ఎల్–1)కు కోట్ చేసిన సంస్థకు పనులు అప్పగించనున్నారు.వ్యయంపై నోరెళ్లబెడుతున్న బిల్డర్లు, ఇంజినీర్లుఒక్కొక్కటి 5,464 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో ముఖ్య కార్యదర్శుల కోసం జీ+1లో 25 బంగ్లాలు.. కార్యదర్శుల కోసం జీ+1లో ఒక్కొక్కటి 4,350 చదరపు అడుగులతో 90 బంగ్లాలు నిర్మించాలి. మొత్తం నిర్మిత ప్రాంతం 5,28,100 చదరపు అడుగులు.. ఇందులో రూ.2,500 వెచ్చిస్తే అత్యంత విలాసవంతంగా నాణ్యంగా బంగ్లాలు కట్టవచ్చని బిల్డర్లు, ఇంజినీర్లు చెబుతున్నారు. ఈ లెక్కన 115 బంగ్లాల నిర్మాణ విలువ రూ.132.02 కోట్లే అవుతుంది. బంగ్లాల నిర్మిత ప్రాంతంలో అంతర్గత రహదారులు, విద్యుత్తు, తాగు నీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇంటర్నెట్ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు రూ.100 కోట్లకు మించి కాదని స్పష్టం చేస్తున్నారు. అంటే.. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.232.02 కోట్లకు మించదు. మౌలిక సదుపాయాలను కూడా కలుపుకొంటే 115 బంగ్లాల నిర్మాణంలో చదరపు అడుగుకు అన్ని పన్నులతో కలిపి రూ.4,393.48కు మించదని ఇంజినీర్లు స్పష్టం చేస్తున్నారు. సీఆర్డీఏ మాత్రం ప్రాజెక్టు కాంట్రాక్టు విలువను రూ.498.16 కోట్లకు నిర్ణయించింది. దీనిప్రకారం చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.9,433.06 అవుతోంది. ఒక్కో చదరపు అడుగుకు రూ.5,040.12కు పెంచేసినట్లు స్పష్టమవుతోంది. ఇలా భారీగా పెంచేయడంపై బిల్డర్లు, ఇంజినీర్లు అవాక్కవుతున్నారు. అడిగినంత కమీషన్ ఇచ్చే కాంట్రాక్టు సంస్థకు పనులు కట్టబెట్టి దోచుకోవడానికి ముఖ్య నేతలు సీఆర్డీఏ అధికారులపై ఒత్తిడి తెచ్చారని, అంచనా వ్యయాన్ని పెంచేలా చక్రం తిప్పారని చెబుతున్నారు.తన రికార్డు తానే బద్దలురాజధాని ప్రాంతంలో జీ+12 పద్ధతిలో (14 టవర్లలో 1440 ఫ్లాట్లు) గెజిటెడ్ అధికారుల క్వార్టర్ల నిర్మాణానికి సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్లో చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.1806.29. రాజధానిలో ప్రభుత్వ రియల్ ఎస్టేట్ వెంచర్ హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టులో జీ+18 పద్ధతిలో 12 టవర్లలో 1200 ఫ్లాట్ల నిర్మాణానికి అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏడీసీఎల్) జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్ చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.4,511.75. అంతస్తులు పెరిగే కొద్దీ భవన నిర్మాణ వ్యయం తగ్గుతుంది. బహుళ అంతస్తులతో అత్యంత విలాసవంతంగా నిర్మించినా చదరపు అడుగుకు రూ.1,800 నుంచి రూ.2 వేలకు మించదని అప్పట్లో బిల్డర్లు, ఇంజినీర్లు స్పష్టం చేశారు. కానీ.. హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టులో కాంట్రాక్టు సంస్థతో కుమ్మక్కై అంచనా వ్యయాన్ని భారీగా పెంచేయించిన ముఖ్య నేతలు కమీషన్ల దందాకు తెరతీశారు. ఇప్పుడు ఐఏఎస్ అధికారుల బంగ్లాల నిర్మాణ పనుల టెండర్లలో కూడా సీఆర్డీఏ, ఏడీసీఎల్ తమ రికార్డులను తామే బద్ధలు కొడుతూ అంచనా వ్యయాన్ని పెంచేశాయనే చర్చ బిల్డర్లు, ఇంజినీర్లలో జోరుగా సాగుతోంది. -
కాంట్రాక్టర్లకు వరం ఖజానాకు సున్నం
సాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పనుల టెండర్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ వంటి పారదర్శక, అవినీతి రహిత విధానాలు రద్దయిపోయాయి. ఇష్టారీతిన నిబంధనల సడలింపులు, మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేసి కాంట్రాక్టర్లకు ప్రభుత్వ ఖజానాను దోచి పెట్టి కమీషన్లు దండుకొనే పద్ధతులు వచ్చేశాయి. ఇందులో భాగంగా తాము కోరుకొనే బడా కాంట్రాక్టర్లకే పనులు దక్కేలా తాజాగా నిబంధనలు రూపొందించారు. కాంట్రాక్టర్లు భారీ మొత్తంలో పనులు దక్కించుకునేలా బిడ్ సామర్థ్యం లెక్కింపు నిబంధనను 2 ఏఎన్–బీ నుంచి 3 ఏఎన్–బీగా సడలించే ప్రతిపాదనపై మంత్రివర్గంతో ఈనెల 6న ఆమోద ముద్ర వేయించారు. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 2003 జూలై 1న జారీ చేసిన జీవో 94 ద్వారా రూపొందించిన టెండర్ విధానంలో బిడ్ కెపాసిటీని మార్చుతూ జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఉత్తర్వులు (జీవో ఎంఎస్ నెంబరు 4) జారీ చేశారు.విదేశీ రుణ సాయంతో చేపట్టిన ప్రాజెక్టుల పనులు మినహా రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ), అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏడీసీఎల్), జల్‌జీవన్ మిషన్ సహా అన్ని శాఖల ద్వారా చేపట్టే పనులకు జారీ చేసే టెండర్ నోటిఫికేషన్లకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే కాంట్రాక్టర్లు దక్కించుకున్న పనులను ఆ టెండర్ నిబంధనల్లో నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయకపోవడం వల్ల వాటి అంచనా వ్యయం పెరిగి ప్రభుత్వ ఖజానాపై భారం పడుతోంది.అయినా అదే కాంట్రాక్టర్లకు భారీ మొత్తంలో మరిన్ని పనులు అప్పగించేలా నిబంధనలను సడలించడంపై ఇంజినీరింగ్ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. అడిగినంత కమీషన్ ఇచ్చే కాంట్రాక్టర్లకే పనులు కట్టబెట్టడానికే బిడ్ సామర్థ్యం లెక్కించే ప్రతిపాదనను సడలించారనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.రూ.వేల కోట్ల పనులు కట్టబెట్టేందుకే..అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) రుణం రూ.15 వేల కోట్లతో చేపట్టిన పనులకు ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు పిలిచింది. 2024 ఏప్రిల్ 1 నాటికి ఒప్పంద విలువలో 25 శాతం లోపు పూర్తయిన పనులను రద్దు చేసి, వాటి స్థానంలో కొత్తవి చేపట్టేందుకు సిద్ధమైంది. జల వనరులు, పురపాలక పట్టణాభివృద్ధి, రహదారులు భవనాలు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, పరిశ్రమలు – మౌలిక సదుపాయాల కల్పన శాఖల పరిధిలో పలు పనులు చేపడుతోంది.అడిగినంత కమీషన్ ఇచ్చే కాంట్రాక్టర్లకే కట్టబెట్టి వాటి ఒప్పంద విలువలో ప్రభుత్వ ఖజానా నుంచి 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్సుగా ముట్టజెప్పి, అందులో 8 శాతాన్ని కమీషన్‌గా రాబట్టుకోవడానికి స్కెచ్ వేశారు. ఈ క్రమంలోనే బిడ్ సామర్థ్యం లెక్కింపు నిబంధనను 3 ఏఎన్–బీగా మార్చారు. ఈ నిబంధనలో ‘ఏ’ అంటే గత ఐదేళ్లలో ఏదైనా ఒక ఏడాది గరిష్టంగా పనులు పూర్తి చేసి, పురోగతిలో ఉన్న పనుల విలువ. ‘ఎన్’ అంటే టెండర్ నోటిఫికేషన్లో ఆ పని పూర్తి చేయడానికి నిర్దేశించిన సమయం. ‘బీ’ అంటే ఆ కాంట్రాక్టర్ అప్పటికే దక్కించుకున్న పనుల్లో మిగిలిన పనుల విలువ.ఉదాహరణకు ఓ కాంట్రాక్టర్ పదేళ్లలో ఒక ఏడాది గరిష్టంగా రూ.1000 కోట్ల విలువైన పనులు చేశారనుకుందాం. ప్రస్తుతం టెండర్ పిలిచిన పనిని రెండేళ్లలో పూర్తి చేయాలని నిబంధన పెట్టారనుకుందాం. అప్పటికే ఆ కాంట్రాక్టర్ దక్కించుకున్న పనుల్లో మిగిలిన పనుల విలువ రూ.500 కోట్లు అనుకుందాం. అప్పుడు 3 ఏఎన్–బీ కింద ఆ కాంట్రాక్టర్‌కు రూ.5,500 కోట్ల విలువైన పనులు దక్కించుకోవడానికి అర్హత వస్తుంది. అదే 2 ఏఎన్–బీ కింద అయితే ఆ కాంట్రాక్టర్‌కు రూ.3,500 కోట్ల విలువైన పనులకే అర్హత ఉంటుంది.పనుల్లో జాప్యం.. ఖజానాపై తీవ్ర భారం సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, మౌలిక సదుపాయాల కల్పన, తాగునీటి పథకాలతోపాటు వివిధ విభాగాల్లో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు గడువులోగా పనులు పూర్తి చేయడంలేదు. తీవ్ర జాప్యం జరుగుతోంది. సిమెంట్, ఇనుము, పెట్రోల్, డీజిల్ తదితర ధరలు పెరగడం వల్ల అంచనా వ్యయం కూడా భారీగా పెరుగుతోంది. దీని వల్ల ఖజానాపై తీవ్రంగా భారం పడుతోంది. ప్రభుత్వ తాజా నిబంధన వల్ల రూ.వంద కోట్ల విలువైన పనులను రెండేళ్లలో పూర్తి చేయలేక చతికిలబడిన కాంట్రాక్టర్‌కే కొత్తగా రూ.వెయ్యి కోట్ల విలువైన పనులు దక్కుతాయి.వీటినీ రెండేళ్లలో పూర్తి చేసేలా ప్రభుత్వం నిబంధనను సడలించింది. రూ.100 కోట్ల పనులకే వనరులు సమకూర్చుకోలేక, ఏళ్ల కొద్దీ జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లు.. అంతకంటే పదింతల పనిని ఎలా చేయగలుగుతారని ఇంజినీర్లు అంటున్నారు. ఫలితంగా ఆ పనుల ఫలితాలను ప్రజలకు అందించడంలో తీవ్ర జాప్యం జరగడంతోపాటు ప్రభుత్వ ఖజానాపై పెద్ద ఎత్తున భారం పడుతుందని, ఇది ప్రజలను ఇబ్బందులకు గురిచేయడమేనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
బటన్ నొక్కితే కమీషన్లు రావు
సాక్షి, అమరావతి: ‘ఎలాంటి లంచాలకు తావు లేకుండా బటన్ నొక్కి రూ.2.73 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో జమ చేసింది గత ప్రభుత్వం. ఆ పని ఇప్పుడు చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడు? ఎందుకు బటన్ నొక్కలేక పోతున్నాడు? బటన్ నొక్కితే ఏమీ రాదు కాబట్టి.. కమీషన్లు అందవు కాబట్టి.. అందుకే ఆయన బటన్ నొక్కలేకపోతున్నాడు’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు అత్యంత పారదర్శకంగా జరిగినా, అక్రమాలు జరిగినట్లు సృష్టించి.. దానితో ఎలాంటి సంబంధం లేని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ పక్ష నాయకుడు ఎంపీ మిథున్‌రెడ్డిని సీఎం చంద్రబాబు ఏదో రకంగా కేసులో ఇరికించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ‘మా ప్రభుత్వ హయాంలో వాల్యూమ్స్ తగ్గాయి.. రేట్లు షాక్ కొట్టేలా ట్యాక్స్‌లు పెంచాం. ఇందుకు కమీషన్లు ఇస్తారా? లేక వాల్యూమ్స్ పెంచి, రేట్లు పెంచారు కాబట్టి చంద్రబాబుకు కమీషన్లు ఇచ్చారా? చంద్రబాబుకు కమీషన్లు ఇచ్చారని ఈనాడు రాస్తుందా?’ అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు.లేనిది ఉన్నట్టుగా చెబితే పెట్టుబడులు వస్తాయా?పెట్టుబడులు రావాలంటే.. రాష్ట్రం కోసం గొప్పగా చెప్పడం మొదలు పెట్టాలి. నువ్వంతట నువ్వే రాష్ట్రంలో లేని పరిస్థితులు ఉన్నట్టుగా, నెగిటివ్‌గా చెప్పడం మొదలు పెడితే ఏ విధంగా కాన్ఫిడెన్స్ ఇస్తావ్? దావోస్ నుంచి నీతి ఆయోగ్ దాకా చంద్రబాబు స్టేట్మెంట్లు చూడండి. రాష్ట్రంలో లేని పరిస్థితులు ఉన్నట్టుగా దుష్ఫ్రచారం చేస్తున్నారు. పెట్టుబడులను ఆకర్షించేలా చంద్రబాబు ఏ చర్యలు తీసుకుంటున్నారు? జిందాల్ వంటి సంస్థలు వస్తుంటే వాళ్లపై కేసులు పెట్టి భయబ్రాంతులకు గురిచేసి పంపించేశాడు. వాళ్లు పది మందికి చెప్పరా? జిందాల్ లాంటి వాళ్లకే ఈ పరిస్థితి ఉంటే.. మిగిలిన వాళ్లెందుకు వస్తారు? ఇలాంటప్పుడు ఏ పరిశ్రమైనా ఎందుకు వస్తుంది? అసెంబ్లీ సమావేశాలు మేం ఎందుకు బహిష్కరిస్తున్నామనే దానికి స్పీకర్‌ను అడిగితే బాగుంటుంది. అందుకే మీడియా ద్వారా ప్రజల గొంతుక విన్పిస్తున్నాం. సూపర్ సిక్స్‌లు లేవు.. సూపర్ సెవన్లు లేవు.. చెప్పేవన్నీ అబద్ధాలు, చేసేవన్నీ మోసాలు. వైఎస్సార్సీపీ–2 పాలన కార్యకర్తలకు భరోసాగా ఉంటుందని కచ్చితంగా చెప్పగలుగుతాను. రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత, వ్యక్తిత్వం ప్రధానం. కష్టకాలం ఎల్లకాలం ఉండదు. ఓపిక ఉండాలి. జిల్లాల పర్యటనకు ఇంకా సమయం ఉంది. -
మళ్ళీ నామినేషన్ దందా షురూ!
సాక్షి, అమరావతి: రూ.లక్ష లోపు అంచనా ఉన్న పనులను ఈఈ.. రూ.2 లక్షల్లోపు పనులను ఎస్ఈ.. రూ.3 లక్షల్లోపు పనులను సీఈ నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టర్లకు అప్పగించవచ్చన్నది ప్రభుత్వ నిబంధన. అదీ వరదలు, కరువు వంటి ఉత్పాతాలు ఏర్పడినప్పుడు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టేందుకు సంబంధించిన పనులను మాత్రమే నామినేషన్ పద్ధతిలో అప్పగించాలన్నది నిబంధన. ఆ పనులకు టెండర్లు పిలిస్తే తక్షణమే సహాయక చర్యలు చేపట్టడానికి వీలుండదు కాబట్టి నామినేషన్ పద్ధతిలో అప్పగించే వెసులుబాటు కల్పించారు. కానీ, ఈ నిబంధనను నిక్కచ్చిగా అమలుచేయాల్సిన ప్రభుత్వమే దాన్ని నిలువునా పాతరేసింది. రూ.లక్ష కాదు, రూ.2 లక్షలు కాదు.. ఏకంగా రూ.480.22 కోట్ల విలువైన పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ పనులను ఎన్సీసీ సంస్థకు ప్రభుత్వం కట్టబెట్టింది. ఇవి యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాల్సినవి కావు. అయినా, నిబంధనలు ఉల్లంఘించి వాటిని ఎన్సీసీ సంస్థకు అప్పగించడం వెనుక భారీఎత్తున కమీషన్లు చేతులు మారాయనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ అక్రమాలను కప్పెట్టుకోవడానికి కేబినెట్‌తో ఆమోదముద్ర వేయించడం గమనార్హం. అక్రమాల దందా పునరావృతంఅస్మదీయులకు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టి.. ప్రభుత్వ ఖజానాను దోచిపెట్టి కమీషన్లు వసూలుచేసుకోవడం 2014–19 మధ్య ముఖ్యనేతలు రివాజుగా మార్చుకున్నారు. పోలవరం హెడ్‌వర్క్స్ పనుల్లో రూ.2,917 కోట్ల పనులను నవయుగ సంస్థకు నామినేషన్‌పై కట్టబెట్టడమే అందుకు పరాకాష్ట. దేశ చరిత్రలో ఇంత పెద్దఎత్తున నామినేషన్ పద్ధతిలో పనులు కట్టబెట్టిన దాఖలాలు ఎక్కడాలేవు. కృష్ణా పుష్కర ఏర్పాట్లలో భాగంగా ఘాట్ల నిర్మాణం దగ్గర నుంచి నీరు–చెట్టు పనుల వరకూ రూ.15 వేల కోట్లకు పైగా విలువైన పనులను నామినేషన్ పద్ధతిలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అస్మదీయులకు కట్టబెట్టింది. ఇప్పుడూ అదే రీతిలో నామినేషన్ దందాకు తెరతీసింది. 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏ ఒక్క పనిని కూడా నామినేషన్‌పై కట్టబెట్టకపోవడం గమనార్హం. పూర్తికాక ముందే నిధులు మిగులా?.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 2014–19 తరహాలోనే మళ్లీ నామినేషన్ దందాకు తెరతీసింది. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం రెండో దశలో అంతర్భాగమైన పుంగనూరు బ్రాంచ్ కెనాల్ పనులను ఇందుకు వేదికగా చేసుకుంది. నిజానికి.. ఈ కెనాల్‌ను 79.6 కిమీ నుంచి 220.35 కిమీ వరకూ వెడల్పుచేసి, ప్రవాహ సామర్థ్యం పెంచే పనులకు రూ.1,929 కోట్ల వ్యయంతో 2021, సెపె్టంబరు 4న వైఎస్సార్సీపీ ప్రభుత్వం సాంకేతిక అనుమతిచ్చింది. ఈ పనులకు నిర్వహించిన టెండర్లలో రూ.1,217.49 కోట్లకు ఎన్సీసీ సంస్థ దక్కించుకుని.. వాటిని పూర్తిచేయానికి 2023, ఫిబ్రవరి 1న ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ పనులను ఎన్సీసీ సంస్థ ఇప్పటివరకూ పూర్తిచేయలేదు. 25 శాతంలోపు మాత్రమే పూర్తయ్యాయని అధికారవర్గాలు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాయి. వాస్తవానికి.. ఏదైనా పని పూర్తయ్యాకే ఆ పనికి కేటాయించిన నిధుల్లో మిగిలాయాన్నది తేల్చవచ్చు.కానీ.. ఇక్కడ పూర్తికాక ముందే వాటికి ప్రభుత్వం ఇచ్చిన సాంకేతిక అనుమతిలో రూ.711.51 కోట్ల మేర మిగులు ఉందంటూ తేల్చడంపై అధికారవర్గాలు విస్మయం వ్యక్తంచేస్తున్నాయి. ఇందులో రూ.480.22 కోట్ల వ్యయంతో పుంగనూరు బ్రాంచ్ కెనాల్‌కు 75.075 కిమీ నుంచి 207.80 కిమీ వరకూ లైనింగ్ చేసే పనులను నామినేషన్ పద్ధతిలో ఎన్సీసీ సంస్థకు కట్టబెట్టాలని ముఖ్యనేత ఆదేశించారు. దాంతో ఆ పనులను ఎన్సీసీకి అప్పగిస్తూ జలవనరుల శాఖ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. -
మద్యం దుకాణంలో కమీషన్ల కోసం టీడీపీ నాయకుల వేధింపులు
-
బిల్లు బకాయిలు చెల్లిస్తేనే డయాఫ్రం వాల్!
సాక్షి, అమరావతి: కొత్త డయాఫ్రం వాల్ పనుల సన్నాహాల సాక్షిగా పోలవరంలో 2016–19 మధ్య మరో కమీషన్ల బాగోతం బట్టబయలైంది. అప్పట్లో తాము చేసిన డయాఫ్రం వాల్ పనులకు సంబంధించి రూ.94 కోట్ల బిల్లులు చెల్లించలేదని.. ఇప్పుడు అవి చెల్లిస్తేనే కొత్త డయాఫ్రం వాల్ పనులను చేపడతామని బావర్ సంస్థ ప్రతినిధులు తేల్చి చెప్పినట్లు జలవనరుల శాఖ అధికారవర్గాలు తెలిపాయి. ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌కి బిల్లులు చెల్లించామని.. అక్కడి నుంచి బిల్లులు వసూలు చేసుకోవాలంటూ అధికారులు చేసిన సూచనను బావర్ ప్రతినిధులు తోసిపుచ్చుతున్నారు. ఎస్క్రో అకౌంట్ ద్వారా బిల్లులు చెల్లిస్తామని నాటి ప్రభుత్వం 2017 ఫిబ్రవరి 6న ఉత్తర్వులు (జీవో ఆర్టీ నెంబరు 41) జారీ చేస్తేనే తాము పనులు చేశామని స్పష్టం చేస్తున్నారు. కానీ.. ఎస్క్రో అకౌంట్ ద్వారా తమకు బిల్లులు చెల్లించకుండా బకాయిలు పెట్టారని పేర్కొంటున్నారు.ట్రాన్స్ట్రాయ్ను అడ్డుపెట్టుకుని చంద్రబాబు, లోకేష్ సబ్ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి దోచుకున్నారంటూ ఆ సంస్థ అధినేత రాయపాటి రంగారావు 2024 జనవరి 12న మీడియాకు వెల్లడించడం గమనార్హం. కమీషన్ల కోసం పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారంటూ 2019 ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ సైతం ఆగ్రహం వ్యక్తం చేయడం అప్పట్లో సంచలనం కలిగించింది. కమీషన్ల కోసమే ఎస్క్రో అకౌంట్ తుంగలోకి.. పోలవరం ప్రాజెక్టులో వరదను మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనులు పూర్తి చేయకుండానే.. ఎర్త్ కమ్ రాక్ ఫిల్(ఈసీఆర్ఎఫ్) డ్యామ్ గ్యాప్–2లో పునాది డయాఫ్రం వాల్ పనులను బావర్ సంస్థకు సబ్ కాంట్రాక్టు కింద 2016లో టీడీపీ ప్రభుత్వం అప్పగించి చారిత్రక తప్పిదానికి పాల్పడింది. ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్ట్రాయ్ ద్వారా కాకుండా ఎస్క్రో అకౌంట్ ద్వారా బిల్లులు చెల్లిస్తామని నాడు హామీ ఇచ్చి తుంగలో తొక్కింది. ఎందుకంటే.. ఎస్క్రో అకౌంట్ ద్వారా బిల్లులు చెల్లిస్తే కమీషన్లు వసూలు చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఈ క్రమంలో 2018 జూన్ నాటికి గ్యాప్–2లో డయాఫ్రం వాల్‌ను బావర్ సంస్థ పూర్తి చేసింది. చేసిన పనులకు బిల్లుల రూపంలో రూ.56 కోట్లు, జీఎస్టీ రూపంలో రూ.38 కోట్లు వెరసి రూ.94 కోట్ల మేర బిల్లులు బావర్‌కు టీడీపీ ప్రభుత్వం బకాయిపడింది. బావర్ సంస్థ ఇదే అంశాన్ని అప్పట్లో అనేక మార్లు జలవనరుల శాఖ దృష్టికి తెచ్చి బిల్లులు చెల్లించాలని కోరింది. అయితే తాము ట్రాన్స్ట్రాయ్కు బిల్లులు చెల్లించేశామని, ఆ సంస్థ నుంచి వసూలు చేసుకోవాలని అధికారులు సూచించారు. కానీ.. అప్పటికే ట్రాన్స్ట్రాయ్ దివాలా తీసింది. చంద్రబాబు ప్రభుత్వం చారిత్రక తప్పిదం వల్ల గోదావరి వరదల ఉద్ధృతికి డయాఫ్రంవాల్ ధ్వంసమైంది. డీఆర్ఐకి ఫిర్యాదు చేసినా.. రూ.94 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంపై బావర్ సంస్థ అప్పట్లో డీఆర్ఐకి ఫిర్యాదు చేసింది. ఈ అంశంపై 2018 నుంచి అనేక మార్లు డీఆర్ఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించినా స్పందించలేదు. 2014 ఎన్నికల్లో ఖర్చుల కోసం చంద్రబాబు, లోకేష్ తమ వద్ద రూ.150 కోట్లు తీసుకున్నారని.. ఆ తర్వాత పనులన్నీ సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించి తమను నాశనం చేశారని ట్రాన్స్ట్రాయ్ అధినేత రాయపాటి రంగారావు మీడియాకు ఎక్కడం అప్పట్లో సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో బావర్ సంస్థకు చెల్లించాల్సిన రూ.94 కోట్ల బిల్లులు ఏ బాబు జేబులోకి చేరాయనే చర్చ కాంట్రాక్టర్లలో జోరుగా సాగుతోంది. -
50 శాతం కమీషన్ల పాలన : కమల్‌నాథ్
నర్సింగాపూర్: మధ్యప్రదేశ్‌లో శివరాజ్‌సింగ్ చౌహాన్ పాలనలో 50 శాతం కమీషన్ల రాజ్యం నడుస్తోందంటూ పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ ఆరోపించారు. చౌహాన్ అవినీతి పాలన రాష్ట్ర భవిష్యత్తును అంధకారమయం చేసిందన్నారు. బుధవారం నర్సింగాపూర్ జిల్లాలో ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో యువత, రైతులు, అన్ని సామాజిక వర్గాల భవిష్యత్తును బీజేపీ పాలన సర్వనాశనం చేసిందన్నారు. కేవలం బీజేపీ నేతలు, అధికార పెద్దలు మాత్రమే అభివృద్ధి చెందారని ఆరోపించారు. 18 ఏళ్ల బీజేపీ పాలనలో రాష్ట్రంలో విద్య, వైద్యం, ఉపాధి వ్యవస్థ వంటివన్నీ పూర్తిగా పట్టాలు తప్పాయన్నారు. అబద్ధపు పథకాలను ప్రకటించనిదే చౌహాన్‌కు నిద్ర పట్టదని ఎద్దేవా చేశారు. -
మార్క్‘ఫ్రాడ్’
ఆయన ఓ మార్క్‌ఫెడ్ అధికారి...కొన్నాళ్ల క్రితం ఇంట్లో ఒక శుభకార్యం జరిగింది. ఆ సమయంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ బుక్ చేశారు. అతిథులకు భోజన ఏర్పాట్లు చేశారు. దానికి లక్షల్లో ఖర్చు అయ్యింది. అయితే ఆ ఖర్చును ఒక ప్రైవేట్ బ్యాంకు భరించింది. మరో అధికారి మూడేళ్ల కాలంలోనే హైదరాబాద్‌లో ఒక విల్లా, మరో జిల్లాలో 10 ఎకరాల భూమి కొనుగోలు చేశారు.కమీషన్ల కారణంగానే ఆయనకు భారీగా సొమ్ము అందిందని సమాచారం. సాక్షి, హైదరాబాద్: మార్క్‌ఫెడ్‌లో ఇష్టారాజ్యంగా అక్రమాలు జరుగుతున్నాయనడానికి పైరెండు ఘటనలు ఒక నిదర్శనం. ఒక ప్రైవేట్ బ్యాంకుతో మిలాఖతై ప్రభుత్వ సొమ్ముతో కమీషన్లు పొందుతున్నారు. ప్రభుత్వ సంస్థ అయిన మార్క్‌ఫెడ్ తన ఆర్థిక లావాదేవీలను ప్రైవేట్ బ్యాంకులతో జరుపుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఏడాదికి దాదాపు రూ. 2 వేల కోట్ల వరకు లావాదేవీలు ప్రైవేట్ బ్యాంకుతో చేయడం భద్రత దృష్ట్యా సరైన పద్ధతి కాదని మార్క్‌ఫెడ్‌లోని కొందరు అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ పూచీకత్తుతో జాతీయ బ్యాంకుల నుంచి అప్పులు చేసి, రైతులకు ఇస్తున్న మార్క్‌ఫెడ్, ఆ సొమ్మును ఒకట్రెండు ప్రైవేట్ బ్యాంకుల్లో పెడుతోంది. ఈ ఒక్క యాసంగి సీజన్లోనే దాదాపు రూ.826 కోట్లు వివిధ జాతీయ బ్యాంకుల నుంచి అప్పుగా తెచ్చి, ఆ సొమ్మును ఒక ప్రైవేట్ బ్యాంకు ద్వారా రైతులకు అందజేసింది. వానాకాలం సీజన్‌కు చెందిన రూ.వందల కోట్లు, యాసంగి సీజన్‌కు సంబంధించి రూ. వందల కోట్లు ప్రైవేట్ బ్యాంకుల్లోనే పెడుతోంది. ఒక్క ఏడాదిలోనే రూ.2400 కోట్లు 2022–23లో ఫెర్టిలైజర్స్ అమ్మగా వచ్చిన సొమ్ము దాదాపు రూ. 700 కోట్లు, పంట సేకరణకు తీసుకొచ్చిన దాదాపు రూ. 900 కోట్లు, పంట విక్రయాలకు వచ్చిన దాదాపు రూ. 800 కోట్లు కూడా ప్రైవేట్ బ్యాంకుతోనే లావాదేవీలు జరిపారు. కమీషన్లు... బహుమతులు.. టూర్ ప్యాకేజీలు వందలాది కోట్ల రూపాయలు ప్రైవేట్ బ్యాంకులో జమ చేసేందుకు అవకాశం కలి్పంచిన కొందరు కీలకమైన మార్క్‌ఫెడ్ అధికారులు, ఉద్యోగులకు సంబంధిత ప్రైవేట్ బ్యాంకు భారీ నజరానాలు, కమీషన్లు, బహుమతులు, స్వదేశీ, విదేశీ టూర్ ప్యాకేజీలు ఇస్తున్నట్టు సమాచారం. లక్షల్లో డబ్బు ముట్టజెపుతున్నట్టు తెలిసింది. వాస్తవంగా ప్రైవేట్ బ్యాంకులు షెడ్యూల్డ్ బ్యాంకు లిస్టులో ఉన్నా, జాతీయ బ్యాంకులను కాదని ప్రైవేట్‌లో పెట్టడం రిస్క్‌తో కూడిన వ్యవహారంగానే చెబుతుంటారు.అలాంటి రిస్క్ ఎవరికోసం మార్క్‌ఫెడ్ అధికారులు తీసుకుంటున్నారన్నది ప్రశ్న. ఒకప్పుడు ఆయిల్‌ఫెడ్‌లోనూ ప్రైవేట్ బ్యాంకులో డబ్బులు జమ చేసేందుకు అధికారులు ప్రయత్నించగా, అప్పట్లో ఒక ఎండీ దానిని తిరస్కరించారు. ప్రభుత్వ సొమ్మును ప్రైవేట్ బ్యాంకులో పెట్టడం శ్రేయస్కరం కాదంటూ నిర్ణయం తీసుకున్నారు. కానీ మార్క్‌ఫెడ్ మాత్రం ప్రభుత్వ సొమ్మును ప్రైవేట్ బ్యాంకుల్లో పెట్టి కొందరు అధికారులు కమీషన్ల కోసం కక్కుర్తి పడడం వల్లే ఇదంతా జరుగుతుందన్న చర్చ జరుగుతోంది. గతంలో ఇక్కడ పనిచేసిన ఇద్దరు అధికారులు, ప్రస్తుతం పనిచేస్తున్న ముగ్గురు అధికారులు అక్రమాల్లో పాలుపంచుకున్నట్టు తెలిసింది. ఇక్కడ రుణాలు...అక్కడ జమ మార్క్‌ఫెడ్ ప్రభుత్వ పూచీకత్తుతో పంట ఉత్పత్తుల కొనుగోలుకు జాతీయ బ్యాంకులు, వివిధ ప్రభుత్వ సంస్థల్లో రుణాలు తీసుకొస్తుంది. అలా తీసుకొచ్చిన రుణాలను అవే జాతీయ బ్యాంకుల్లో జమ చేయకుండా, ప్రైవేట్ బ్యాంకుల్లో ఎందుకు జమ చేస్తున్నారన్నది ప్రశ్న. పోనీ డిపాజిట్లు జమ చేసిన ప్రైవేట్ బ్యాంకు ఏమైనా రుణాలు ఇస్తున్నాయా అంటే అదేమీ లేదు. కొనుగోలు చేసిన పంటలను తిరిగి టెండర్లు వేసి విక్రయిస్తారు. అలా విక్రయించగా వచ్చిన సొమ్మును కూడా ప్రైవేట్ బ్యాంకుల్లోనే జమ చేస్తున్నారు. ఇలా ఒక ప్రైవేట్ బ్యాంకులోనే అధికంగా జమ చేస్తుండటంపై ఆరోపణలు వస్తున్నాయి. ఎరువులను అమ్మగా వచ్చిన సొమ్ము కూడా ప్రైవేట్ బ్యాంకుల్లోనే ఉంచుతున్నారు. ఇలా వందల కోట్ల రూపాయలు ప్రైవేట్ బ్యాంకులో జమ అవుతున్నాయి. బ్యాంకుకు కోట్ల రూపాయల లాభాలు వస్తున్నాయి. -
కమీషన్లపై బీమా కంపెనీలకు స్వేచ్ఛ
న్యూఢిల్లీ: కమీషన్ల పరంగా పరిమితులను బీమా రంగ అభివృద్ధి, నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) తొలగించింది. బీమా కంపెనీలు తమ పాలసీలను విక్రయించే మధ్యవర్తులకు కమీషన్లు చెల్లిస్తుంటాయి. ఈ భారం పరోక్షంగా పాలసీదారులపైనే పడుతుంది. అందుకే లోగడ ఈ విషయంలో ఐఆర్డీఏఐ పరిమితులు పెట్టింది. తాజాగా వీటిని ఎత్తివేస్తున్నట్టు తెలిపింది. మధ్యవర్తులకు ఎంత కమీషన్ చెల్లించాలన్నది బీమా కంపెనీలే నిర్ణయించుకోవచ్చని పేర్కొంది. కాకపోతే పాలసీదారుల ప్రయోజనాలకు భంగం కలగకుండా ఇది ఉండాలని స్పష్టం చేసింది. పాలసీదారులు, ఏజెంట్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కమీషన్ పాలసీని ఇన్సూరెన్స్ కంపెనీ బోర్డ్ రూపొందించుకోవాలంటూ తాజాగా విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్లో పేర్కొంది. కమీషన్లలో సౌలభ్యం ఉంటే అది దేశంలో బీమా కవరేజీ వ్యాప్తికి దోహదపడుతుందని, వ్యయాల పరంగా సామర్థ్యాలను పెంచుతుందని పేర్కొంది. బోర్డు స్థాయిలో నిర్ణయించే కమీషన్ అనేది తాజా నోటిఫికేషన్లో పేర్కొన్న నిర్వహణ వ్యయ పరిమితుల పరిధిలోనే ఉండాలని స్పష్టంగా నిర్ధేశించింది. నూతన నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. నోటిఫికేషన్ తేదీ నుంచి ప్రతి మూడేళ్లకోసారి నిబంధనలను సమీక్షిస్తామని ఐఆర్డీఏఐ ప్రకటించింది. ఇప్పటి వరకు బీమా కంపెనీలు చెల్లించే కమీషన్లను ఉత్పత్తుల వారీగా ఐఆర్డీఏఐ నిర్ణయిస్తోంది. తాజా సవరణలు ఆవిష్కరణలను ప్రోత్సహిస్తాయనే అభిప్రాయాన్ని ఐఆర్డీఏఐ వ్యక్తం చేసింది. నూతన వ్యాపార నమూనాలు, ఉత్పత్తులు, వ్యూహాల అభివృద్ధికి వీలు కల్పిస్తాయని పేర్కొంది. సవరించిన నిర్వహణ వ్యయ పరిమితులు, కమీషన్ పరిమితులు అనేవి సరైన మార్గంలో ఉన్నాయని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ తపన్ సింఘాల్ తెలిపారు. -
విజయ డెయిరీ చైర్మన్ చలసాని మాయ.. వెన్న నుంచి కమిషన్లు
అంతులేని అక్రమాలు.. ఎన్నో వివాదాలు.. మరెన్నో విమర్శలకు ఆలవాలంగా మారిన విజయ డెయిరీలో రోజుకో అక్రమాల చిట్టా బయటపడుతోంది. భూముల కొనుగోలులో చేతివాటం మొదలుకొని.. రూ.కోట్లలో నిధులను మింగేయడం.. కమీషన్ల దందా నడిపించడం.. బోనస్‌ల బాగోతం వంటి అక్రమాల పుట్టలెన్నో విజయ డెయిరీ ప్రతిష్టను మసకబారుస్తోంది. తాజాగా వెన్న, పాల పౌడర్ కొనుగోళ్లలో చోటుచేసుకున్న అవినీతి వ్యవహారం బట్టబయలు కావడంతో పాల సొసైటీల చైర్మన్లు అవాక్కవుతున్నారు. సాక్షి, అమరావతి: వెన్న నుంచి నెయ్యి తీయడం అందరికీ తెలుసు. కానీ.. విజయ డెయిరీలో మాత్రం వెన్న నుంచి కమీషన్లు కూడా పిండారు. డెయిరీని ప్రగతి పథంలో నడిపిస్తున్నట్టు ఆ డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు గొప్పలు చెప్పుకుంటున్నా.. ఆయన హయాంలో ప్రతి వ్యవహారం అవినీతిమయంగా మారిందని పాడి రైతులు వాపోతున్నారు. తాజాగా వెన్న, పాల పౌడర్ కొనుగోళ్ల తీరు తెలుసుకుని పాల సొసైటీల చైర్మన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. అవసరం లేకపోయినా వీటిని భారీగా కొనుగోలు చేసి కమీషన్ల రూపంలో రూ.కోట్లు మింగేశారని చెబుతున్నారు. గతంలో రెండు నెలలకు ఒకసారి అవసరాన్ని బట్టి వెన్న, పాల పౌడర్ కొనేవారు. అది కూడా ఎక్కడ పడితే అక్కడ కాకుండా మంచి పేరున్న సంస్థల నుంచే కొనుగోలు చేసేవారు. డెయిరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు కొద్దినెలల క్రితం 2,500 టన్నుల వెన్నను మద్రాసుకు చెందిన ఒక మధ్యవర్తి ద్వారా ప్రైవేట్ కంపెనీల నుంచి కొనుగోలు చేయించారు. ఇదికాకుండా సంస్థలో మరో 500 టన్నుల వెన్న తయారైంది. మొత్తం 3 వేల టన్నుల వెన్న విజయ డెయిరీ వద్ద నిల్వ ఉంది. ఇంత వెన్న ఒకేసారి కొనుగోలు చేయడం అంటే కమిషన్ కోసమే తప్ప వేరే ప్రయోజనం లేదని స్పష్టమవుతోంది. ఎంత పక్కాగా నిల్వ చేసినా సంవత్సరం లోపు మాత్రమే దాన్ని వినియోగించాల్సి ఉంటుంది. ఆ విషయం తెలిసి కూడా కమిషన్ కోసం ఒకేసారి భారీగా కొనేశారు. అప్పు చేసి కొని.. కోల్డ్ స్టోరేజీల్లో దాచారు యాక్సిస్ బ్యాంక్ ఇచ్చిన రుణంలో సుమారు రూ.75 కోట్లను వెచ్చించి వెన్న కొన్నారు. తర్వాత దాన్ని విశాఖ, హైదరాబాద్‌లోని కోల్డ్ స్టోరేజీల్లో భద్రపరిచారు. స్థానిక కోల్డ్ స్టోరేజీల్లో అయితే ఎక్కువ అద్దె కట్టాల్సి వస్తుందని, అందుకే ఆ నగరాల్లోని కోల్డ్ స్టోరేజీల్లో పెట్టినట్టు సమర్ధించుకుంటున్నారు. అసలు కొనడమే అనవసరమని రైతులు వాపోతుంటే కొని ఎక్కడో కోల్డ్ స్టోరేజీల్లో పెట్టామని చెప్పుకోవడం ఏమిటనే ప్రశ్నలు రైతుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు సుమారు వెయ్యి టన్నుల వెన్నను అతికష్టం మీద వినియోగించారు. రాబోయే రెండు నెలల్లో మహా అయితే మరో 500 టన్నులు వినియోగించే అవకాశం ఉంది. ఇంకా 1500 టన్నుల వెన్న మిగిలిపోయే పరిస్థితి ఉంది. చివర్లో దీన్ని చిన్న డెయిరీలకు ఎంతోకొంతకు అమ్మి వదిలించుకోవాల్సిందే. దీనివల్ల సంస్థకు రూ.కోట్లలో నష్టం వాటిల్లనుంది. చైర్మన్‌కు మాత్రం ముందే భారీగా లాభం సమకూరింది. పాల పొడి కొనుగోళ్లలోనూ కమీషన్ల పర్వం పాల పొడి కొనుగోళ్లలోనూ ఆనవాయితీకి భిన్నంగా వ్యవహరించి కమీషన్లు దండుకుంటున్నారు. సహకార రంగంలో ఉన్న అమూల్ వంటి పెద్ద సంస్థల నుంచి గతంలో పౌడర్, వెన్న కొనేవారు. ఆంజనేయులు చైర్మన్ అయ్యాక పెద్ద సంస్థల నుంచి నామమాత్రంగా కొంటూ ఎక్కువ భాగాన్ని నాసిరకం సరుకు ఇచ్చే ప్రైవేట్ సంస్థల నుంచి కొంటున్నారు. హర్యానా ఫుడ్స్, బోయీ బాబా, స్టెర్లిన్ ఆగ్రో, మధు డైరీస్ వంటి సంస్థల వద్ద వీటిని కొనడమంటే నాణ్యతకు తిలోదకాలిచ్చినట్టే. కానీ.. కమీషన్లు భారీగా ముడుతుండటంతో చైర్మన్‌కు అవే పెద్ద సంస్థలుగా కనబడుతున్నాయి. కమీషన్ల కక్కుర్తి వల్ల విజయ బ్రాండ్ మసకబారుతోందని రైతులు వాపోతున్నారు. విజయ పాల నాణ్యత తగ్గిపోవడానికి ఇవే కారణాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా ప్రస్తుత పాలకవర్గాన్ని సాగనంపకపోతే విజయ డెయిరీ పరువు గంగలో కలిసిపోయే పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. -
ఖాళీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కమిషన్లు
సాక్షి, హైదరాబాద్: రిజర్వేషన్ల అమలులో అన్యాయం.. అట్రాసిటీ కేసుల్లో సత్వర న్యాయం.. సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించే కమిషన్లు ఖాళీ అయ్యాయి. పదవీ కాలం ముగియడం.. వాటిని తిరిగి ఏర్పాటు చేయకపోవడంతో బడుగు, బలహీన వర్గాల్లో అన్యాయానికి గురైన బాధితుల గోడు వినేవారు కరువయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ–ఎస్టీ కమిషన్తోసహా బీసీ కమిషన్, మైనార్టీ కమిషన్లు ప్రస్తుతం ఖాళీ అయ్యాయి. చైర్మన్, సభ్యుల పదవీ కాలంముగిసి నెలలు గడుస్తోంది. వాస్తవానికి పదవీ కాలం ముగిసిన వెంటనే నూ తన కమిషన్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాల్సి ఉం డగా.. ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకోలేదు. ఇంతకీ కమిషన్ ఏం చేస్తుంది? జాతీయ స్థాయిలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కమిషన్లు చట్టబద్దత కలిగిన సంస్థలు. వీటికి సమాంతరంగా రాష్ట్రాల్లో ఏర్పాటైన కమిషన్లకు విశిష్ట అధికారాలుంటాయి. ప్రధానంగా రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలు, అట్రాసిటీ చట్టం అమలు, సంబంధిత సామాజిక వర్గాల స్థితిగతుల అధ్యయనం, క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రభుత్వానికి సిఫారసు చేయడం, సంక్షేమ పథకాల రూపకల్పనకు సూచనలు తదితర అంశాల్లో రాష్ట్ర కమిషన్లు కీలక భూమిక పోషిస్తాయి. ఇక కులాల విభజన, కేటగిరీల్లో మార్పులు చేర్పులు, రిజర్వేష్లనలో మార్పులపై ప్రతిపాదనలు చేయడం లాంటి అంశాల్లో చురుకుగా ఉంటాయి. కమిషన్‌ను ఆశ్రయించిన వారికి సత్వర సాయం అందించడం, క్షేత్రస్థాయి అధికారులకు నేరుగా ఆదేశాలు జారీ చేయడం, వాటి అమలులో అలసత్వం ప్రదర్శిస్తే తక్షణ చర్యలు తీసుకునే అధికారాలు కమిషన్‌కు ఉంటాయి. ఏడాదిన్నరకు పైగా... తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం రాష్ట్ర బీసీ కమిషన్‌ను 2016 అక్టోబర్‌లో ఏర్పాటు చేసింది. మూడేళ్లపాటు సాగిన ఈ కమిషన్ గడువు 2019 అక్టోబర్‌తో పూర్తయింది. 2018 ఫిబ్రవరిలో ఏర్పాటైన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ గడువు ఈ ఏడాది ఫిబ్రవరితో ముగిసింది. ఇక మైనార్టీ కమిషన్‌ను గడువు సైతం ఈ ఏడాది జనవరితో ముగిసింది. ఎస్టీ, ఎస్టీ కమిషన్‌కు ఎక్కువగా అట్రాసిటీకి సంబంధించిన ఫిర్యా దులు వస్తుంటాయి. ఇది వరకున్న కమిషన్‌కు మూడేళ్ల కాలంలో పదివేలకు పైగా ఫిర్యాదులు వచ్చాయి. రోజు కు సగటున పది ఫిర్యా దులు వచ్చినట్లు చెప్పొచ్చు. ఈ ఫిర్యాదులను యుద్దప్రాతిపదికన పరిశీలించి వేగంగా పరిష్కరం చూపింది. ప్రస్తుతం ఐదు నెలలుగా కమిషన్ ఖాళీ కావడంతో ఫిర్యాదులపై గందరగోళంనెలకొంది. తక్షణమే కమిషన్లు ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాలు డిమాం డ్ చేస్తున్నాయి. ఆశ్రిత కులాలకు గుర్తింపు దక్కింది బీసీ సమాజంలో దాదాపు 30 రకాల కులాలకు గుర్తింపు లేదు. అలాంటి కులాలకు మా హయాంలో గుర్తింపు దక్కింది. 30 కులాల నుంచి వినతులు, అభ్యంతరాల స్వీకరణకు ఉపక్రమించాం. కానీ 18 కులాల నుంచి మాత్రమే స్పందన వచ్చింది. పరిశీలన చేసి 17 కులాలకు గుర్తింపు ఇచ్చాం. ఇందులో 14 కులాలను బీసీ–ఏ కేటగిరీలో, 3 కులాలను బీసీ–డీ కేటగిరీలో చేర్చాం. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లపై సుధీర్ కమిషన్ నివేదిక ప్రకారం ప్రక్రియను పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదించినప్పటికీ కోర్టు పరిధిలో ఈ అంశం పెండింగ్‌లో ఉంది. – బీఎస్ రాములు, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ విప్లవాత్మక మార్పులు తెచ్చాం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ విప్లవాత్మక మార్పు లు తెచ్చింది. దళిత, గిరిజనులకు కాంట్రాక్టు పనుల్లో రిజర్వేషన్లు కల్పించేలా ప్రభుత్వానికి సూచించగా, సీఎం కేసీఆర్ తక్షణమే స్పందిం చి నిర్ణయం తీసుకోవడం చరిత్రలో నిలిచిపోయింది. ఈఎండీ మినహాయింపుతో రూ.కోటి వరకు పనులు కేటాయిస్తోంది. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో క్రియాశీలంగా పనిచేసింది. మూడేళ్ల కాలంలో అట్రాసిటీతోపాటు అన్ని కేటగిరీల్లో 13,905 వినతులు స్వీకరించి పరిష్కరించాం. రూ.78.30కోట్లు బాధితులకు పరిహారం అందజేశాం. – ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ -
వాహన రుణగ్రహీతలకు ‘జీపీఎస్’ కమీషన్ వెనక్కి
ముంబై: హెచ్డీఎఫ్సీ బ్యాంకు వద్ద వాహనరుణాలు తీసుకుని, జీపీఎస్ పరికరాలను సైతం కొనుగోలు చేసిన కస్టమర్లకు ‘కమీషన్ల’ను త్వరలో తిరిగి చెల్లించనున్నట్టు ప్రకటించింది. 2013–14 నుంచి 2019–20 ఆర్థిక సంవత్సరం మధ్య వాహన రుణాలు తీసుకున్న కస్టమర్లతో హెచ్డీఎఫ్సీ బ్యాంకు జీపీఎస్ పరికరాలను కూడా కొనుగోలు చేయించింది. ఆయా పరికరాల విక్రయం రూపంలో కమీషన్లను సంపాదించుకుంది. వాహన రుణాల్లో అవకతవకలు జరిగినట్టు గతేడాది బ్యాంకు చీఫ్‌గా ఉన్న ఆదిత్యపురి సైతం అంగీకరించారు. దీనిపై ఆర్బీఐ రూ.10 కోట్ల జరిమానా కూడా విధించింది. ఈ నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. 2013–14 నుంచి 2019–20 మధ్య వాహన రుణాలు తీసుకుని, జీపీఎస్ పరికరాలనూ కొనుగోలు చేసిన వారికి కమీషన్లను తిరిగి చెల్లించనున్నట్టు ప్రకటించింది. బ్యాంకు వద్ద నమోదై ఉన్న కస్టమర్ల ఖాతాలకు వచ్చే 30 రోజుల్లో ఈ మొత్తాన్ని జమ చేయనున్నట్టు తెలిపింది. దీనిపై కస్టమర్లు బ్యాంకు శాఖలను సంప్రదించొచ్చని సూచించింది. వాహన రుణ దరఖాస్తును ఆమోదించే సమయంలో కస్టమర్‌తో రూ.18,000 విలువ చేసే జీపీఎస్ పరికరాన్ని హెచ్డీఎఫ్సీ బ్యాంకు కొనుగోలు చేయించిందన్నది ఆరోపణ. నిబంధనల ప్రకారం బ్యాంకు లు ఇతర ఉత్పత్తులను విక్రయించరాదు. సేవల ప్రారంభానికి ప్రయత్నిస్తున్నాం అదే పనిగా డిజిటల్ సేవల్లో అంతరాయాలు ఏర్పడుతుండడంతో.. నూతన క్రెడిట్ కార్డులు మంజూరు చేయకుండా ఆర్బీఐ విధించిన నిషేధం నుంచి బయటపడేందుకు తమవంతు కృషి చేస్తున్నట్టు హెచ్డీఎఫ్సీ బ్యాంకు చీఫ్ ఇన్ఫర్మేషన్ అధికారి రమేష్ లక్ష్మీనారాయణ తెలిపారు. నూతన టెక్నాలజీని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. సేవల్లో అంతరాయాలు ప్రస్తుత పాత వ్యవస్థ కారణంగానే చోటుచేసుకుంటున్నట్టు పేర్కొన్నారు. వీటిని సాధ్యమైనంత వేగంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. తరచూ సాంకేతిక అవాంతరాలు ఏర్పడుతుండడంతో కొత్తగా క్రెడిట్ కార్డులు, నూతన డిజిటల్ సేవలు ప్రారంభించకుండా 2020 డిసెంబర్లో ఆర్బీఐ నిషేధం విధించడం గమనార్హం. -
అవినీతి తిండి తిందాం రండి!
సాక్షి, హైదరాబాద్ : బాసరలో అక్రమార్కుల బాస... జ్ఞాన సరస్వతి చెంత.. అవినీతి చింత.. టెండర్లు పెంచుకున్నారు. కమీషన్లు పంచుకున్నారు. నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్‌గాంధీ విద్యా వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యా లయంలో(ఆర్జీయూకేటీ– ట్రిపుల్ ఐటీ) అక్రమాల దందా కొనసాగుతోంది. విద్యార్థులకు భోజనం, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల కొనుగోళ్లలో అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమాలు అన్నీ ఇన్నీ కావు.. బాసర ట్రిపుల్ ఐటీలో మూడేళ్ల కిందట రోజుకు ఒక్కో విద్యార్థికి పెట్టే భోజనం ఖర్చు రూ.78. అప్పట్లో 6 వేలకుపైగా విద్యార్థులు ఉండేవారు. ట్రిపుల్ఐటీ అధికారులు దానిని కిందటేడాది రూ.69కి తగ్గించి టెండర్లు ఖరారు చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరం(2019–20)లో విద్యార్థుల సంఖ్య 7,500కు చేరుకుంది. భోజ నం నిమిత్తం ఒక్కో విద్యార్థికి కనీసంగా రూ. 95 నుంచి రూ.105 చెల్లించేలా ట్రిపుల్ ఐటీ కమిటీ నిర్ణయం తీసుకొని టెండర్లు పిలిచింది. రూ.95 చొప్పున ఖరారు చేసింది. అంటే ఒక్కో విద్యార్థిపై రోజుకు చెల్లించే మొత్తాన్ని పాత రేటు కంటే రూ. 26 అదనంగా పెంచింది. 7,500 మంది విద్యార్థులకు 220 రోజులపాటు పెట్టే భోజనానికి నిర్వహించే క్యాంటీన్ టెండర్లను రూ.15.67 కోట్లకు ఖరారు చేసింది. గతంలో కంటే ఇప్పుడు రూ. 4.29 కోట్లు అదనంగా పెంచేసింది. మార్కెట్లో కాన్ఫిగ రేషన్‌ను బట్టి రూ.39 వేల నుంచి రూ. 43 వేలకు లభించే ల్యాప్‌టాప్‌లను యాన్యువల్ మెయింటెనెన్స్ కలుపుకొని రూ. 51,600 చొప్పున కొనుగోలు చేసి భారీగా కమీ షన్లు పంచు కున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. రూ.41 వేలకు ఒక ల్యాప్‌టాప్ చొప్పున లెక్కించినా 1,500 ల్యాప్‌టాప్‌లకు రూ. 6.15 కోట్లు అవుతాయి. కానీ వాటినే రూ. 7.74 కోట్లకు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏడాది, రెండేళ్ల కిందట కొనుగోలు చేసిన ల్యాప్‌టాప్‌లను బైబ్యాక్ పేరుతో ఒక్కో దానిని రూ. 6 వేలకే, అదికూడా ల్యాప్‌టాప్‌లు సరఫరా చేసిన వ్యక్తులకే అమ్మేస్తున్నారు. ఈ వ్యవహారంలో రూ.కోట్లలో దండుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఏటా 1,000 మంది విద్యార్థుల ల్యాప్‌టాప్‌లకే రూ.5.16 కోట్లు ఖర్చు చేస్తుండగా ఈసారి 1,500 ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేశారు. ఇటీవలి కాలంలో 1,200 ల్యాప్‌టాప్‌లను రూ. 6 వేలకు ఒకటి చొప్పున అమ్మేసినట్లు ఆరోప ణలు వెల్లువెత్తుతున్నాయి. అంటే రూ. 6.19 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన ల్యాప్‌టాప్ లను రూ.కోటికి మించకుండా విక్రయించినట్లు తెలిసింది. ప్రభుత్వానికి ఫిర్యాదులు.. బాసర ట్రిపుల్‌ఐటీలో జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో వాటిపై దృష్టి సారించింది. ట్రిపుల్ఐటీలోని మూడు క్యాంటిన్ల నిర్వహణ కోసం పిలిచిన టెండర్లలో ఆరు సంస్థలు పాల్గొన్నాయి. అందులో మూడు సంస్థలను డిస్క్వాలిఫై చేసి మరో మూడు సంస్థలకు మాత్రమే రూ.95ల రేటుతో నిర్వహణ పనులను అప్పగిస్తూ ఖరారు చేసింది. -
‘కోడ్’ ఉన్నా కమీషన్ల బేరం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నిబంధనావళి(కోడ్) అమల్లో ఉన్నప్పటికీ ప్రైవేట్ సంస్థలతో రూ.వేల కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏమాత్రం వెనుకాడడం లేదు. ‘ముఖ్య’నేతకు భారీగా ముడుపులు చెల్లించిన సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిదారులకు ఆఖరి నిమిషంలో భారీగా లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఫెక్లీ పవర్, ఎనర్జీ షిప్పింగ్ స్టోరేజ్ సిస్టమ్ పేరుతో కొన్ని సంస్థలతో ఒప్పందాలు చేసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రైవేట్ సంస్థలు– ప్రభుత్వ పెద్దల మధ్య కుదిరిన ఈ డీల్‌కు రాష్ట్ర కేబినెట్ మార్చిలోనే ఆమోదముద్ర వేసింది. క్షేత్రస్థాయిలో అధికారులు దీనిపై అభ్యంతరాలు లేవనెత్తినా ప్రభుత్వం లెక్కచేయలేదు. ఇంతలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రభుత్వం మళ్లీ ఈ వ్యవహారంపై ఒత్తిడి పెంచింది. ఉత్పత్తిదారుల నుంచి అధిక ధరకు కరెంటు కొనుగోలు చేసి, వారికి లాభం చేకూర్చి, కమీషన్లు దండుకోవాలని ప్రభుత్వ పెద్దలు ఎత్తుగడ వేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చేలోగానే.. తక్షణమే విద్యుత్ సమన్వయ కమిటీ సమావేశమై, ఈ ప్రాజెక్టును ఆమోదించాలని గత రెండు రోజులుగా అధికారులపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి పెంచుతున్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చేలోగానే సంబంధిత ఒప్పందాలు జరిగిపోవాలని ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) హుకూం జారీ చేయడంతో విద్యుత్ అధికారులకు దిక్కు తోచడం లేదు. బుధవారం విద్యుత్ సమన్వయ కమిటీ భేటీ ఏర్పాటు చేసి, ప్రైవేట్ విద్యుత్ ప్రాజెక్టులకు అనుకూలంగా తీర్మానం చేయాలని సీఎంవో నుంచి ఒత్తిడి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. సమన్వయ కమిటీలో సభ్యులుగా ఉన్న ట్రాన్స్‌కో సీఎండీ వ్యక్తిగత సెలవులో ఉన్నారు. దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్) సీఎండీ ఎన్నికల విధుల్లో ఇతర రాష్ట్రానికి వెళ్లారు. ప్రస్తుతం ట్రాన్స్‌కో విజిలెన్స్ జేఎండీనే అన్ని బాధ్యతలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంత హడావిడిగా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఏమిటని విద్యుత్ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కనీసం ప్రాజెక్టు సమగ్ర నివేదిక కూడా లేని ఈ ప్రాజెక్టును ఆమోదించమని ఒత్తిడి చేస్తే తాము సెలవుపై వెళ్తామని ఇద్దరు చీఫ్ ఇంజనీర్లు తేల్చిచెప్పారు. తమను బలి పశువును చేస్తున్నారని ట్రాన్స్‌కో తాత్కాలిక జేఎండీ ఆవేదన వ్యక్తం చేశారు. ఏమిటీ ప్రాజెక్టు? రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వం ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తిదారులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. ఎక్కడా లేని విధంగా అత్యధిక రేట్లకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకుంది. తాజాగా ఫెక్లీ పవర్ పేరుతో 600 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఉత్పత్తిదారులు చెప్పిన రేటుకు 25 ఏళ్ల పాటు కొనుగోలు ఒప్పందాలు చేసుకోవాలని ప్రతిపాదించింది. ఆయా సంస్థలు ఉత్పత్తి చేసిన సౌర, పవన విద్యుత్‌ను బ్యాటరీల్లో నిల్వ చేసి, విద్యుత్ డిమాండ్ ఉన్న సమయంలో డిస్కమ్‌లకు అందిస్తాయి. ఇతర రాష్ట్రాల్లో పవన, సౌర విద్యుత్ యూనిట్ రూ.3 చొప్పున లభిస్తోంది. బ్యాటరీల్లో నిల్వ చేసి అందించడం వల్ల యూనిట్ రూ.6 వరకూ పడుతుందని ప్రైవేట్ సంస్థలు పేర్కొన్నాయి. అదేవిధంగా ఏపీ జెన్కో ఉత్పత్తి చేసే సౌర విద్యుత్‌ను 400 మెగావాట్ల మేర నిల్వ చేసి, అవసరం అయినప్పుడు అందించే మరో విధానాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని నిర్ణయించారు. దీన్ని ఎనర్జీ షిప్పింగ్ స్టోరేజ్ సిస్టమ్ అంటారు. జెన్కో ఉత్పత్తి చేసేదాని కన్నా ప్రైవేటు సంస్థలు నిల్వ చేసి, తిరిగి ఇవ్వడానికే ఎక్కువ ఖర్చవుతుందని తేల్చారు. దాదాపు 1,000 మెగావాట్ల విద్యుత్‌ను బ్యాటరీల్లో నిల్వ చేయడం ఇంతవరకూ ఎక్కడా లేదని, ఏ ప్రయోగం లేకుండానే ఈ ప్రాజెక్టును ఎలా ఆమోదిస్తామని అధికారులు అంటున్నారు. అయినప్పటికీ ఆమోదించి తీరాలని ప్రభుత్వం పట్టుబడుతోంది. ప్రభుత్వ పెద్దలకు ప్రైవేట్ ఉత్పత్తిదారుల నుంచి భారీగా ముడుపులు అందాయనే అనుమానాలు బలపడుతున్నాయి. ఒత్తిడికి తాళలేక సెలవుపై అధికారులు ప్రభుత్వ పెద్దల ఒత్తిడి నేపథ్యంలో ఈ ప్రాజెక్టు వ్యవహారం వివాదాస్పదమవుతోంది. రాబోయే ప్రభుత్వం దీనిపై విచారణ జరిపిస్తే తాము చిక్కుల్లో పడతామని ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ గుర్తించారు. అందుకే ఆయన ఈ నెల 22 వరకూ సెలవు పెట్టారని విద్యుత్ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ కూడా వారం రోజులుగా సెలవులో ఉన్నారు. నిజానికి ఆయన మంగళవారం విధుల్లో చేరాల్సి ఉంది. ఆయన సెలవును పొడిగించినట్టు సమాచారం. ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న ఇంజనీర్లు సెలవుపై వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. -
టీడీపీ ప్రభుత్వంలో కమీషన్ల దందా
-
కమీషన్ల కోసమే!
-
ఫర్నిచర్‌లోనూ ‘ఫలహారం’
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు అవసరమైన కుర్చీలు, టేబుళ్లు వంటి ఫర్నిచర్ కొనుగోలులో కూడా కమీషన్లు మింగేస్తున్నారు. విద్యార్థుల కోసం కేటాయిస్తున్న కోట్లాది రూపాయల సొమ్ము పక్కదారి పడుతోంది. ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు, అధికారులు కలిసి వాటాలు పంచుకుంటున్నారు. గతంలో పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలు రాసేందుకు దాదాపు రూ.20 కోట్లతో బెంచీలు, టేబుళ్లు, కుర్చీలు కొనుగోలు చేశారు. ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా వీటిని పాఠశాలలకు పంపిణీ చేశారు. ప్రైవేట్ ఏజెన్సీలు సరఫరా చేసిన బెంచీలు, కుర్చీలు, టేబుళ్ల నాణ్యత అంతంత మాత్రంగానే ఉండడంతో అవి నాలుగు రోజులకే మూలకు చేరాయి. ఈ ఫర్నిచర్ కొనుగోలుకు సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) రూ.10 కోట్లు, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) రూ.10 కోట్లు భరించాల్సి ఉంది. ఎస్ఎస్ఏ ఇప్పటికే సగానికి పైగా నిధులు విడుదల చేసింది. ఆర్‌ఎంఎస్‌ఏ నిధులు విడుదల చేయలేదు. నాసిరకం ఫర్నిచర్ సరఫరా చేసిన ప్రైవేట్ ఏజెన్సీకి అధికారులు నోటీసులు జారీ చేశారు. పాత ఫర్నిచర్ స్థానంలో నాణ్యమైన ఫర్నీచర్‌ను సర ఫరా చేయాలని ఎస్ఎస్ఏ పేర్కొంది. అప్పటివరకు బిల్లుల చెల్లింపును నిలిపివేశారు. ఈలోగా ఉన్నతాధికారులు ఆర్ఎం ఎస్ఏ నుంచి రూ.10 కోట్ల నిధులను విడుదల చేయించారు. మరో రూ.20 కోట్లకు ఎసరు! గతంలో రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన ఫర్నిచర్ వృథాగా పడి ఉండగా, మళ్లీ 630 హైస్కూళ్లకు అవసరమైన ఫర్నీచర్ కొనుగోలుకు పాఠశాల విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రూ.20.88 కోట్లతో ఈ ఫర్నీచర్ కొనాలని నిర్ణయించారు. ఎస్ఎస్ ఇంజనీర్స్, సాయి డేటా క్రియేషన్, లక్ష్మీ ప్రసన్న ఎంటర్ప్రైజెస్, శ్రీ సిద్ధివినాయక ఇండస్ట్రీస్, ఉషోదయ ఎంటర్ప్రైజెస్ సంస్థల ద్వారా ఈ ఫర్నిచర్ కొనుగోలుకు ఉత్తర్వులిచ్చారు. డెమో టేబుళ్లు, స్లాటెడ్ యాంగిల్ రాక్స్, స్టీల్ టూల్స్, టీచర్లకు ఛైర్లు, టేబుళ్లు, డ్యూయెల్ డెస్కులు, అల్మరాలు, కంప్యూటర్ టేబుళ్లు ఇందులో ఉన్నాయి. రాష్ట్రంలోని పాఠశాలల్లో రూ.4,800 కోట్లతో పూర్తిస్థాయిలో ప్రాథమిక మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ప్రతి పాఠశాలలో ఫర్నిచర్, కంప్యూటర్లు, తరగతి గదులు, మంచినీరు, మరుగుదొడ్లు ఇలా అన్ని సదుపాయాలు కల్పిస్తారు. అయినా మళ్లీ కొత్తగా రూ.20.88 కోట్లతో ఫర్నిచర్ కొనుగోలు వెనుక లోగుట్టు ఏమిటన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
కమీషన్ల ‘ఆధునికీకరణ’
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల టెండర్లలో అక్రమాలకు మరో తార్కాణమిది. నాగావళి కాలువ లైనింగ్ పనుల్లో ఇద్దరు మంత్రులు కమీషన్ల వేట సాగిస్తున్నారు. తమకు బాగా కావాల్సిన కాంట్రాక్టు సంస్థకే 4.29 శాతం అధిక ధరలకు(ఎక్సెస్)కు పనులు కట్టబెట్టేలా చక్రం తిప్పారు. కాంట్రాక్టర్ నుంచి చెరో రూ.25 కోట్లు కమీషన్లుగా ఇద్దరు మంత్రులు వసూలు చేసుకోనున్నారు. నాగావళి నదిపై 1907–08లో బ్రిటీష్ ప్రభుత్వం తోటపల్లి రెగ్యులేటర్‌ను నిర్మించింది. ఈ రెగ్యులేటర్ నుంచి కుడి కాలువను 37.626 కి.మీ.లు, ఎడమ కాలువను 20.016 కి.మీ.ల దూరం తవ్వారు. వీటి ద్వారా 1934లోనే 64,000 ఎకరాలకు నీళ్లందించారు. రూ.162.49 కోట్లతో ఈ కాలువలను ఆధునికీకరించే పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 16న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. జాయింట్ వెంచర్లు(ఇద్దరు కాంట్రాక్టర్లు కలిసి సంస్థను ఏర్పాటుచేయడం) టెండర్లలో పాల్గొనడానికి అవకాశం లేదని నిబంధన పెట్టారు. కానీ, ఏలేరు కాలువల ఆధునికీకరణ టెండర్లలో మాత్రం జాయింట్ వెంచర్లు కూడా టెండర్లలో పాల్గొనవచ్చని నిబంధన విధించడం గమనార్హం. జీవో 94 ప్రకారం టెండర్లు నిర్వహించాలంటూ జలవనరుల శాఖ కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వులను అధికారులు తుంగలో తొక్కడానికి ప్రధాన కారణం కీలక మంత్రి, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి ఒత్తిళ్లేనని సమాచారం. మాట వినకపోతే బ్లాక్‌లిస్టులో.. నాగావళి కాలువల ఆధునికీకరణ పనులకు అంచనాలు రూపొందించే సమయంలోనే అక్రమాలకు పాల్పడ్డారు. అంచనా వ్యయం పెంచేలా ఇద్దరు మంత్రులు చక్రం తిప్పారు. ఆ పనులను ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కే అప్పగించాలని అధికారులకు హుకుం జారీ చేశారు. ఇతర కాంట్రాక్టర్లు ఎవరైనా షెడ్యూళ్లు దాఖలు చేస్తే.. వారిని ‘బ్లాక్‌లిస్ట్’లో పెడతామని హెచ్చరించారు. దాంతో ఇతర కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనేందుకు ఆసక్తి చూపలేదు. అధికారులు ఆగస్టు 31న టెక్నికల్ బిడ్ తెరిచారు. కేవలం రెండు సంస్థలు(ష్యూ ఇన్ఫ్రా, సాయిలక్ష్మి)మాత్రమే షెడ్యూళ్లు దాఖలు చేశాయి. సాయిలక్ష్మి కంటే ‘ష్యూ ఇన్ఫ్రా’ తక్కువ ధర కోట్ చేస్తూ షెడ్యూల్ దాఖలు చేసింది. ష్యూ ఇన్ఫ్రాకు పనులు దక్కే అవకాశం ఉందని గ్రహించిన మంత్రులు.. ఆ సంస్థపై అనర్హత వేటు వేయాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. దాంతో ఆ సంస్థపై అధికారులు అనర్హత వేటు వేశారు. కానీ, గత నెలలో తెలుగుగంగ కాలువల ఆధునికీకరణ పనులకు రూ.239.03 కోట్లతో పిలిచిన టెండర్లలో ష్యూ ఇన్ఫ్రా అర్హత సాధించినట్లు ఇదే జలవనరుల శాఖ అధికారులు ప్రకటించడం గమనార్హం. సింగిల్ షెడ్యూల్‌కు పచ్చజెండా ఒక సంస్థపై అనర్హత వేటు వేయడంతో బరిలో మరో సంస్థ మాత్రమే మిగిలింది. సింగిల్ షెడ్యూల్ ఉంటే ఫైనాన్స్(ఆర్థిక) బిడ్‌తెరవకూడదు. సర్కార్ జారీ చేసిన జీవో 174 ప్రకారం.. ఆ టెండర్లను రద్దు చేసి, మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయాలి. కేంద్ర విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలు కూడా ఇదే విషయం చెబుతున్నాయి. కానీ, ఇద్దరు మంత్రుల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు ఇటీవల ఆర్థిక బిడ్‌ను తెరిచారు. 4.29 శాతం అధిక ధరలకు షెడ్యూల్ దాఖలు చేసిన సాయిలక్ష్మి సంస్థకు నాగావళి కాలువ ఆధునికీకరణ పనులు అప్పగించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ కమిషనర్ ఆఫ్ టెండర్స్(సీవోటీ)కు ప్రతిపాదనలు పంపారు. సీవోటీ ఆమోదముద్ర వేయడమే తరువాయి.. పనులను సాయిలక్ష్మి సంస్థకు అప్పగించి, రూ.25 కోట్ల చొప్పున కమీషన్లు వసూలు చేసుకోవడానికి ఇద్దరు మంత్రులు పావులు కదుపుతున్నారు. 7న తమిళనాడుకు రెడ్ అలెర్ట్ సాక్షి ప్రతినిధి, చెన్నై: ఈనెల 7న తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ కేంద్రం రెడ్ అలñ ర్ట్ ప్రకటించింది. తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో ఈ నెల 7న 25 సెంటీ మీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ గురువారం అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్లంతా ముందు జాగ్రత్త చర్యలను చేపట్టాలని, సహాయక శిబిరాలను సిద్ధం చేయాలని రాష్ట్ర రెవెన్యూ కమిషనర్ సత్యగోపాల్ ఆదేశించారు. ఏసీబీ వలలో ఈవో విశాఖ క్రైం: దేవదాయ ధర్మదాయ శాఖకు చెందిన కరకచెట్టు పోలమాంబ ఆలయ ఈవో పెదిరెడ్ల సత్యనారాయణ ఉద్యోగుల వద్ద లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ)కు పట్టుబడ్డాడు. దేవదాయ «ధర్మదాయ శాఖ ఉద్యోగులకు 2015 సంవత్సరానికి రావాల్సిన పీఆర్సీ బకాయిల చెల్లింపుల కోసం ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్యనారాయణ కొంత సొమ్ము ముడుపుగా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆ మేరకు రికార్డు అసిస్టెంట్ గాలి వెంకటశివతో కలెక్షన్ చేయించి చివరకు రూ. 60 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. -
‘కమీషన్’ కేటుగాళ్లు అరెస్ట్!
సాక్షి, హైదరాబాద్: వీరు ఘరానా మోసగాళ్లు.. ఇతరుల భూములపై నకిలీ పత్రాలు సృష్టించారు.. వీటిని కొన్ని కంపెనీలకు కొలట్రల్ సెక్యూరిటీగా పెట్టారు.. భారీ మొత్తం రుణంగా ఇప్పించి నిర్ణీత శాతం కమీషన్ తీసుకున్నారు.. ఈ పంథాలో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థ లను మోసం చేసి రూ.100 కోట్ల రుణాలు ఇప్పించి, భారీగా కమీషన్లు తీసుకున్న శ్రీనివాస్‌రెడ్డి సహా పది మందిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. మరో 40 మంది పరారీలో ఉన్నారు. ప్రధాన నిందితుడు శ్రీనివాసరెడ్డిపై హైదరాబాద్, రాచకొండతోపాటు ఏపీ లో 17 కేసులు నమోదయ్యాయి. ఈ కేసు వివరాలను గచ్చిబౌలిలోని రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో ఎల్బీనగర్ ఇన్చార్జ్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డితో కలసి కమిషనర్ మహేశ్ భగవత్ శనివారం మీడియాకు వెల్లడించారు. నకిలీ పత్రాలు సృష్టించి.. గుంటూరు జిల్లాకు చెందిన శ్రీనివాస్‌రెడ్డి నగరంలోని ఎస్సార్‌నగర్‌లో ఉంటున్నాడు. తొలుత రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మెళకువలు నేర్చుకున్న అతను ఆ వ్యాపా రాన్ని పక్కకు పెట్టి మోసాలు చేయడం ప్రారంభించా డు. హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం పరిసరాల్లోని స్థలా ల్లో ఉన్న సాంకేతిక అంశాలు, చిన్న చిన్న లోపాలను గుర్తించే శ్రీనివాస్‌రెడ్డి వాటి పాత యజమానులను మభ్యపెట్టి, నకిలీ పత్రాలు సృష్టించి సదరు స్థలం తన పేరుతో ఉన్నట్లు డాక్యుమెంట్లు సిద్ధం చేసి, రుణాలు తీసుకునే కంపెనీలకు అవసరమైన కొలట్రల్ సెక్యూరిటీలు అందిస్తానంటూ ప్రచారం చేసుకుంటాడు. ఆసక్తి చూపిన వారితో కమీషన్‌పై ఒప్పందం చేసుకునేవాడు. వెలుగులోకి వచ్చింది ఇలా... అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఓ స్థలానికి సంబంధించి నకిలీపత్రాలను సృష్టించిన శ్రీనివాస్‌రెడ్డి ఇస్నాపూర్ ఎస్బీ హెచ్లో కొలట్రల్ సెక్యూరిటీగా పెట్టి ఓ సంస్థకు రూ.18 కోట్ల రుణం ఇప్పించాడు. ఈ మేరకు రూ.66 లక్షల కమీషన్ తీసుకున్నాడు. అదే స్థలంపై, మరో సెట్టు పత్రాలను ఇంకో సంస్థకు కొలట్రల్ సెక్యూరిటీగా పెట్టడానికి సిద్ధమై రామంతాపూర్‌లోని ఆంధ్రాబ్యాంక్ లో దాఖలు చేశాడు. ఈ 2 బ్యాంకులకు లీగల్ ఒపీయన్ ఇచ్చే అధీకృత సలహాదారు ఒక్కరే. అతను ఈ విష యాన్ని గుర్తించి ఎస్బీహెచ్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో రూ.18 కోట్ల రుణం పొందిన సంస్థ ఆస్తులను బ్యాంకు స్వాధీనం చేసుకోవడంతోపాటు దానిని నాన్‌పెర్ఫామింగ్ అసెర్ట్‌గా ప్రకటించింది. నష్టపోయిన ఆ సంస్థ యజమాని కొలట్రల్ సెక్యూరిటీగా పెట్టిన స్థలం పై ఆరా తీయడంతో అబ్దుల్లాపూర్‌మెట్‌కి చెందిన వారికి విషయం తెలిసింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శ్రీనివాసరెడ్డి, గోపాలకృష్ణ, వినోద్ కుమా ర్, మహమ్మద్ షఫీ, విశ్వనా థమ్, జగన్రావు, పిల్లి ఐలయ్య, వెంకటరామ్‌రెడ్డి, గంగరామ్, వేముల అశోక్‌లను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. సిబ్బంది తప్పిదంతోనే భూమి, ప్లాట్ల రిజిస్ట్రేషన్ సమయంలో యజమానులు హాజరుకావడంతోపాటు వారి గుర్తింపుకార్డులు, ఈసీ, టైటిల్ డీడ్లు, లింక్ డాక్యుమెంట్లు తనిఖీ, యజమాన్య హక్కులు తనిఖీ చేయాల్సి ఉండగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీ సు(ఎస్ఆర్వో)ల్లో అటువంటిదేమీ చేయలేదు. బ్యాం కర్లు కూడా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన చేయకుండానే రుణాలు ఇచ్చారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఈసీ లో నిక్షిప్తమైన సమాచారాన్ని తొలగించాలంటూ ఎస్ఆర్వోలకు పోలీసులు లేఖ రాయనున్నారు. కొలట్రల్ మోసాలపై తనిఖీ చేసి విధుల్లో ఉదాసీనంగా వ్యవహరించిన బ్యాంక్ అధికారులపై చర్యలు తీసుకోవాలని లేఖ రాస్తామని మహేశ్ భగవత్ తెలిపారు. -
వైద్య పరికరాల్లో కమీషన్ల వేట!
-
నిమో గేట్: మరిన్ని షాకింగ్ విషయాలు
సాక్షి, ఢిల్లీ: పీఎన్బీ-నీరవ్‌మోదీ కుంభకోణంలో మరిన్ని కఠోరవాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ముందునుంచీ అనుమానిస్తున్నట్టుగానే పంజాబ్ నేషనల్‌బ్యాంకు ఉద్యోగుల బండారం బయటపడింది. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్న చందంగా పీఎన్బీ ఉద్యోగులు లంచాలు, కమిషన్లకోసం సంస్థ నెత్తిన భారీ టోపీ పెట్టారు. స్విఫ్ట్ సిస్టమ్(సొసైటీ ఫర్ వరల్డ్‌వైడ్ ఇంటర్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్)కు కీలకమైన లెవల్ 5పాస్‌వర్డ్‌లను నీరవ్ మోదీ, తదితరులకు అందించినట్టు నిందితులు అంగీకరించారు. ఏజీఎం అధికారుల స్తాయికి అనుమతి ఉన్న లెవల్ -5 పాస్‌వర్డ్‌ను నీరవ్‌మోదీ అనుచరులుకు అందించినట్టు ఒప్పుకున్నారు. దీంతో వారు పీఎన్బీ కంప్యూటర్లలో లాగిన్ అయ్యి వెరిఫైయ్యర్/ఆథరైజర్‌గా తమ తమ ఎల్ఓయూలను క్లియర్ చేసుకుని, స్విఫ్ట్ మెసేజ్‌లను పంపేవారు. తద్వారా నీరవ్‌మోదీనుంచి అందిన కమిషన్లను ఉద్యోగులందరూ పంచుకునేవారు. సీబీఐ దర్యాప్తులో డిప్యూటీ మేనేజర్ గోకుల్‌నాథ్ శెట్టి, , సింగిల్ విండో క్లర్క్ మనోజ్ ఈ షాకింగ్ విషయాలను వెల్లడించారు. అంతేకాదు ఈ భారీ కుంభకోణంలో ఆరుగురు అధికారుల హస్తం ఉన్నట్టుగా కూడా నిందితులు సీబీఐకి చెప్పారు. అంతేకాకుండా పీఎన్బీ వ్యవస్థలోని అన్ని అకౌంట్ల కంప్యూటర్ లాన్ పాస్వర్డులు, ఆఖరికి బ్యాంకు తాలూకు కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ కోడ్లు సైతం వారి అందుబాటులో ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. ముఖ్యంగా 2017లో కేవలం 63 రోజుల వ్యవధిలో ఆయన 143 ఎల్ఓయూలను (లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్) జారీ చేశారు. 2011 నుంచి 2017 దాకా జారీ చేసిన ఎల్ఓయూలు 150 కాగా.. కేవలం ఆఖరి 63 రోజుల్లో 143 ఎల్ఓయూలు ఇచ్చారు. అయితే మూడేళ్లలో తప్పనిసరిగా బదిలీ కావాల్సిన గోకుల్ శెట్టి ..కొనసాగడంపై ప్రశ్నించినపుడు 2013లోనే ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చినప్పటికీ, రిలీవింగ్ ఆర్డర్స్ ఇవ్వకుండా కొనసాగుతూ వచ్చాడని బ్యాంక్ వర్గాలు తెలిపాయి. అయితే ఇతర అధికారుల పరిజ్ఞానం లేకుండా కేవలం ఈ ఇద్దరు బ్యాంక్ ఉద్యోగులు ఈ స్థాయిలో మోసం చేసే అవకాశం లేదని సీబీఐ వర్గాలు వ్యాఖ్యానించాయి. కాగా దేశంలో అతిపెద్ద బ్యాంకు కుంభకోణంలో పీఎన్బీ మాజీ డిప్యూటీ జనరల్ మేనేజర్ గోకుల్‌నాథ్ శెట్టి, సింగిల్ విండో క్లర్క్ మనోజ్ కరత్‌లను శనివారం సీబీఐ అరెస్ట్ చేయగా స్పెషల్ కోర్టు వీరిని 14 రోజుల పోలీస్ కస్టడీకి తరలించిన సంగతి తెలిసిందే . -
దేవినేనిని అలా వదిలేయకండి
- వైఎస్సార్సీపీ నేత వాసిరెడ్డి పద్మ సూచన - జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకే అవాకులు, చవాకులు సాక్షి, హైదరాబాద్: మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రవర్తన, మాటలు చూస్తుంటే ఒక మానసిక రోగి అయిపోయారనిపిస్తోందని, ఆయన్ని అలా వదిలేయకుండా తక్షణమే వైద్యునికి చూపించాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ సూచించారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వ అరాచకాలు, మోసాలు, అబద్ధపు హామీలను నరసరావుపేట బహిరంగ సభ సాక్షిగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎత్తిచూపడాన్ని తట్టుకోలేక.. ఆయనపై టీడీపీ నేతలు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బాధిత ప్రజల తరఫున నిలబడి ప్రశ్నించడమే జగన్ చేసిన నేరమా? కార్లు, పొలాలు తగలబెట్టినా, ప్రజలపై దాడి చేసినా చూస్తూ ఊరుకోవాలా? అని ఆమె నిలదీశారు. జగన్ లేవనెత్తే అంశాలకు సమాధానం చెప్పలేక ఆయనపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి గెలవాలని మంత్రికి వాసిరెడ్డి పద్మ సవాల్ విసిరారు. గాలి, ధూళి, మన్నూ, మశానమంతా టీడీపీలోనే.. వైఎస్ జగన్‌పై ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విమర్శలను ఆమె ప్రస్తావిస్తూ.. గాలి, ధూళి, మన్నూ, మశానం వంటి వారందరూ ఉన్న టీడీపీ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తోందని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. జగన్‌ను ఎదుర్కొనే దమ్ములేక అసెంబ్లీకి రావద్దని దేవినేని అంటున్నారని విమర్శించారు. దమ్ముంటే వీటిపై విచారణ జరిపించడండి రాజధానిలో పొలాలు, తునిలో రైలును తగలబెట్టిన విష సంస్కృతి టీడీపీదని, దమ్ముంటే ఈ కేసులపై విచారణ జరిపించాలని వాసిరెడ్డి పద్మ సవాల్ విసిరారు. చెప్పినట్లు వినలేదనే కారణంతో గుంటూరు ఎస్పీగా ఉన్న రామకృష్ణను టీడీపీ నేతలు బదిలీ చేయించారని ఆరోపించారు. -
ఉమ మంత్రా లేక మానసిక రోగా?
-
‘వేగం’ పేరిట వసూళ్లు
– ఏడాదవుతున్నా సరఫరా కాని ‘స్పీడ్‌మ్యాథ్స్’ పుస్తకాలు ............................................................................ వేగంగా లెక్కలు చేయడం ఎలాగో స్పీడ్‌మ్యాథ్స్ పుస్తకాలతో తమ విద్యార్థులకు నేర్పిద్దామనుకున్న ప్రధానోపాధ్యాయులకు ఏడాదిగా ఎదురుచూపులే మిగిలాయి. వాటిని పంపిణీ చేస్తామంటూ ముందుకొచ్చిన సంస్థ ప్రతినిధులు డబ్బుల వసూళ్లలో చూపిన ‘వేగం’ ఆ పుస్తకాలు అందజేయడంలో చూపడం లేదు. సంవత్సరం కిందటే డబ్బులు కట్టినా కనీసం మోడల్‌గానైనా ఒక్క పుస్తకం కూడా అందజేయలేదు. అనంతపురం ఎడ్యుకేషన్ : ఈ పోటీ ప్రపంచంలో వేగానికి ఎక్కడ లేని విలువా వచ్చేసింది. ఏ రంగంలోనైనా వేగం పేరు చెబితే చాలు జనాలు క్యూ కట్టేస్తున్నారు. చదువు విషయానికి వచ్చినా స్పీడ్మ్యాథ్స్తో లెక్కల్లో వేగం పెంచుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కష్టతరమైన అర్థమెటిక్స్, ఆల్జిబ్రా, జియోమెట్రి, ట్రిగొనోమెట్రి, రీజనింగ్ వంటి గణిత ప్రశ్నలకు స్పీడ్‌మ్యాథ్స్(వేద గణితం) పద్ధతుల ద్వారా సులభంగా జవాబులు తెలుసుకోవచ్చు. సాధారణ విద్యార్థికన్నా వేద గణిత విద్యార్థికి 30–40 శాతం వరకు జ్ఞాపకశక్తి అధికంగా ఉంటుంది. అందువల్ల స్పీడ్మ్యాథ్స్పై ఆసక్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గత ఏడాది విశాఖపట్టణానికి చెందిన ‘కరుణ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్’ స్పీడ్ మ్యాథ్స్ పుస్తకాలు సరఫరా చేస్తామంటూ ముందుకొచ్చింది. దీనికి దన్నుగా నిలిచిన ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి రాష్ట్రమంతటా ప్రభుత్వ పాఠశాలల్లో స్పీడ్‌మ్యాథ్స్ పుస్తకాలు సరఫరా చేసే అవకాశం కల్పించారు. ఈ క్రమంలో సదరు సంస్థ జిల్లాలోని పలు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు స్పీడ్‌మ్యాథ్స్ బుక్కులు సరఫరా చేసేందుకు డబ్బులు వసూలు చేసింది. కొనుగోలుకు డీఈఓ ఉత్తర్వులు ‘కరుణ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్’ ప్రతినిధులు గత ఏడాది సదరు మంత్రి ఆదేశాలతో వచ్చి డీఈఓ అంజయ్యను సంప్రదించారు. దీంతో ఆయన అందుబాటులో ఉన్న ఎస్ఎస్ఏ, ఆర్‌ఎంఎస్‌ఏ నిధులతో సదరు సంస్థ ద్వారా స్పీడ్‌మ్యాథ్స్ బుక్కులు కొనుగోలు చేయాలంటూ ఉత్తర్వులు (ఆర్సీ నంబర్ 513 తేదీ 10–12–2015) ఇచ్చారు. ఒక్కో కిట్ రూ.1,200 ప్రకారం ప్రతి పాఠశాలా కనీసం రెండు కిట్లు కొనుగోలు చేయాలని ఆదేశించారు. దీంతో జిల్లాలోని 590 ప్రాథమికోన్నత, 570 ఉన్నత పాఠశాలలు ఈ పుస్తకాలు కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చాయి. సుమారు 50 శాతం మంది ప్రధానోపాధ్యాయులు డబ్బులు చెల్లించినట్లు తెలిసింది. ఇలా సుమారు రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా ఆ సంస్థ వసూలు చేసినట్లు విద్యాశాఖాధికారుల అంచనా. ఆ పుస్తకాలు ఎలాగుంటాయో కూడా తెలీదంటున్న ప్రధానోపాధ్యాయులు డీఈఓ ఉత్తర్వులు ఇచ్చారు కదా అని కొనుగోలుకు ముందుకొచ్చామని చెబుతున్నారు. ఇతర జిల్లాల్లో సరఫరా చేసిన పుస్తకాలను పరిశీలించిన వారు వాటి నాణ్యతపైనా పెదవి విరుస్తున్నారు. కనీసం పుస్తకాలు ఇలా ఉంటాయని కూడా చూపించకుండా డబ్బులు వసూలు చేయడం, దానికి అధికారులు వత్తాసు పలకడం విద్యాశాఖలో చర్చనీయాంశమైంది. గతంలో నెఫ్జెల్ పథకం అమలు సమయంలో ఇలానే ఓ సంస్థ అధికారుల అండతో పాఠశాలలకు కుట్టుమిషన్లు సరఫరా చేస్తామంటూ ముందుకొచ్చింది. ముందుగానే డబ్బులు వసూలు చేసిన ఆ సంస్థ నేటికీ చాలాచోట్ల కుట్టుమిషన్లు అందజేయలేదు. ఈ స్పీడ్‌మ్యాథ్స్ పుస్తకాల వ్యవహారం కూడా ఆ కోవలోకి వెళ్లిపోతుందేమోనని ప్రధానోపాధ్యాయులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ................................................. సంస్థ ప్రతినిధులకు గట్టిగా చెప్పాం విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు కావడంతో స్పీడ్‌మ్యాథ్స్ తీసుకోవాలని చెప్పాం. చాలామంది ప్రధానోపాధ్యాయులు డబ్బులు కట్టారు. కానీ ఇప్పటిదాకా పుస్తకాలు ఇవ్వలేదు. దీనిపై సంస్థ ప్రతినిధులకు చాలా సీరియస్‌గా చెప్పాం. మరికొన్ని జిల్లాలకు కూడా సరఫరా చేస్తుండటం వల్ల ఆలస్యమైందని వాళ్లు చెబుతున్నారు. త్వరలోనే సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటాం. – అంజయ్య, డీఈఓ -
తనిఖీ ఉండదు!
మాముళ్లు ఇస్తే అక్రమ రవాణాకు రాజమార్గం చెక్‌పోస్టులు ఉన్నా ప్రయోజనం శూన్యం వ్యవసాయ ఉత్పత్తులు, విలువైన గ్రానైట్ ముడిసరుకును ప్రభుత్వానికి ఎలాంటి రాయల్టీ, పన్నులు చెల్లించకుండానే జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోని చెక్‌పోస్టులను అక్రమార్కులు దాటించేస్తున్నారు. మాముళ్లు ఇస్తే సరుకు ఎలాంటిదైనా... ఎంత పరిమాణంలో ఉన్నా... సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోవడం లేదు. ఫలితంగా రూ. కోట్లు విలువ చేసే గ్రానైట్ ముడిసరుకుతో పాటు వరి, వేరుశనగ, పత్తి, మొక్కజొన్న తదితర ధాన్యపు పంటలతో పాటు, ప్రభుత్వం పేదలకు అందజేస్తున్న చౌక బియ్యం రాష్ట్ర సరిహద్దులను దాటిపోతోంది. కర్ణాటక సరిహద్దున జిల్లా సరిహద్దులో.. రాయదుర్గం వద్ద ఉభయ రాష్ట్రాల మధ్య గతంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ చెక్‌పోస్ట్‌ను రాజకీయ ఒత్తిళ్లతో ఎత్తివేశారు. ప్రస్తుతం ఇక్కడ వ్యవసాయ ఉత్పత్తులు అక్రమంగా తరలిపోకుండా ఉండేందుకు అగ్రి చెక్‌పోస్ట్ మాత్రమే ఉంది. ఎలాంటి తనిఖీలు నిర్వహించకుండానే సంబంధిత శాఖ అధికారులు, సిబ్బంది ఈ చెక్‌పోస్ట్‌ను దాటిపోయేందుకు వాహనదారులకు అనుమతులిస్తున్నారు. ఇందుకు గాను అధికారులకు బాహటంగానే మాముళ్లు ముట్టచెబుతుండడం గమనార్హం. సరుకు అక్రమ రవాణా ద్వారా ప్రభుత్వ ఖజనాకు భారీగా గండిపడుతోంది. బయటపడిన భండారం చెక్‌పోస్ట్‌లో ఎలాంటి తనిఖీలు చేపట్టడం లేదనేందుకు గత ఆగస్ట్ 20న 225 బస్తాల చౌక బియ్యం లోడుతో రాష్ట్ర సరిహద్దు దాటిన లారీయే నిదర్శనం. వాహనం చెక్‌పోస్ట్ వదకు చేరుకోగానే అందులో ఉన్న సరుకు మొక్కజొన్న అని చెప్పగానే రూ. 1,500 తీసుకుని ఎలాంటి తనిఖీ చేపట్టకుండానే అధికారులు చెక్‌పోస్ట్‌ను దాటించారు. అదే లారీని ఓ వ్యక్తి కర్ణాటక సరిహద్దు పైతోట వద్ద అడ్డుకుని భండారాన్ని బట్టబయలు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న చెక్‌పోస్ట్ సిబ్బంది హడావుడిగా రసీదు రాసి, తమ అవినీతిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. గత ఆదివారం కర్ణాటకలోని బళ్లారి నుంచి డి.హీరేహాళ్ మీదుగా 330 బస్తాల చౌకబియ్యంతో వెళుతున్న లారీ డ్రైవర్‌తో చెక్‌పోస్ట్ సిబ్బంది మాముళ్ల విషయమై ఘర్షణ పడుతుండగా అటుగా వెళుతున్న ఓ కానిస్టేబుల్ గమనించి, వాహనాన్ని తనిఖీ చేశాడు. అందులో చౌకబియ్యాన్ని గుర్తించిన అతను వెంటనే తన ఉన్నతాధికారులకు విషయాన్ని చేరవేసి వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బియ్యం ఆంధ్రకు చెందినదే కర్ణాటక నుంచి తరలిస్తున్నట్టుగా చెప్పబడిన ఆ బియ్యం వాస్తవానికి రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్, కణేకల్లు, రాయదుర్గం ప్రాంతాల నుంచి సేకరించినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం బియ్యాన్ని బళ్లారి వద్ద ఉన్న ఆంధ్రాళ్లోని గోదాంలో నిల్వచేసి, అక్కడి నుంచి రెండు లారీల్లో ఆదివారం తెల్లవారుజామున తరలించే యత్నం చేశారు. డి.హీరేహాళ్ చెక్‌పోస్టు వద్దకు రాగానే వ్యవసాయ మార్కెట్ కమిటీ సిబ్బంది ముందు వచ్చిన వాహనం డ్రైవర్‌తో భారీ మొత్తంలో మామూళ్లు తీసుకుని వదిలేసినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. కొంత ఆలస్యంగా వచ్చిన మరొక లారీని ఆపగా, మామూళ్ల విషయం కుదరకపోవడం, పోలీసులు , ప్రజలు గమనించడంతోనే భండారం బహిర్గతమైనట్లు తెలుస్తోంది. దొరికితే దొంగ, లేదంటే దొర అన్న చందంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు, సిబ్బంది వ్యవహరిస్తున్నారు. 2016–17 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1.38 కోట్ల లక్ష్యానికిగాను సెప్టెంబర్ మాసాంతానికి కేవలం రూ.20 లక్షలు మాత్రమే వసూలు చేసి, జిల్లాలోనే అధమ స్థానంలో ఈ చెక్‌పోస్ట్ నిలిచింది. రెవెన్యూ అధికారుల ఉదాసీనత అక్రమంగా తరలిపోతున్న పేదల బియ్యం గురించి రెవెన్యూ అధికారులు ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు. గత ఆగస్టు 20న మొలకాల్మూరు చెక్‌పోస్టు వద్ద 225 బస్తాల చౌకబియ్యంతో పట్టుబడిన లారీ ఎవరిది, నిందితులు ఎవరు అనే సమాచారాన్ని బహిర్గతం చేయకుండా గోప్యంగా ఉంచారు. 225 బస్తాలు కణేకల్లు స్టాక్ పాయింట్ నుంచి లోడ్ చేసుకుని వచ్చామని పట్టుబడ్డ లారీ యజమాని చెప్పినా చర్యలు మాత్రం శూన్యం. రాజకీయ నేతల ఒత్తిళ్ళ మేరకు ఆ లారీ యజమానిని ఓ రెవెన్యూ ముఖ్య అధికారే జిల్లా అధికారుల వద్దకు తీసుకెళ్లి, కేసును నీరుగార్చినట్లు ఆరోపణలున్నాయి. రెండు నెలల్లో 20 లారీలు సీజ్ గ్రానైట్, స్లాబ్ పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకు అక్రమంగా తరలిపోకుండా ఉండేందుకు తాడిపత్రి ప్రాంతంలో రెండు నెలల క్రితం నాలుగు చెక్‌పోస్టులను విజిలెన్స్ అధికారులు ఏర్పాటు చేశారు. సిబ్బంది కొరతతో ఇక్కడి చెక్‌పోస్టులలో పోలీస్, గనుల శాఖకు చెందిన సిబ్బంది మాత్రమే విధుల్లో ఉంటున్నారంటూ విజిలెన్స్ అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఈ చెక్‌పోస్టుల ద్వారా ప్రభుత్వ ఖజనాకు ఎంత మేరకు చేరుతుందో గానీ... అవినీతి అధికారుల బొక్కసాలు మాత్రం నిండిపోతున్నాయి. పెన్నానది పాత వంతెన, కొత్త వంతెన, చుక్కలూరు క్రాస్, భోగసముద్రం వద్ద ఉన్న ఈ చెక్‌పోస్టులలో గనులు, పోలీస్, రవాణ, వాణిజ్య పన్నుల శాఖల అధికారులు 24 గంటలూ పనిచేస్తూ... సరుకు అక్రమంగా తరలిపోకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఈ నాలుగు శాఖల అధికారుల ఆమోదం పొందిన తర్వాతనే వాహనాలు చెక్‌పోస్టులు దాటి వెళుతుంటాయి. అక్రమంగా సరుకుతో వెళుతున్న వాహనదారుల నుంచి అపరాధరుసుం వసూలు చేయాల్సిన అధికారులు కాస్తా మాముళ్ల మత్తులో చెక్‌పోస్టు గేట్లను ఎత్తి వేస్తున్నారు. చెక్‌పోస్టులు దాటి వెళ్లిన వాహనాలు విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో పట్టుబడుతున్నాయి. ఈ రెండు నెలల్లో 20కి పైగా వాహనాలను విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారంటే జీరో వ్యాపారం ఎంత స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో జీరో వ్యాపారం యథేచ్ఛగా సాగిపోతోందన్న విమర్శలు ఉన్నాయి. -
పోలవరంలో కమీషన్లు షురూ!
♦ ప్రత్యేకహోదా బలిచేసి సాధించిన ప్యాకేజీ ఫలాలివే.. ♦ 25 శాతం కమీషన్‌కు సబ్‌కాంట్రాక్టర్లకు పనులు అప్పగింత ♦ ఈపీసీ నిబంధనలు.. మంత్రి వర్గం తీర్మానాలు హుష్‌కాకి ♦ కమీషన్ల కోసం కాంట్రాక్టర్‌తో సర్కారు పెద్దలు కుమ్మక్కు ♦ పనులు వేగవంతం చేసే పేరుతో మళ్లీ తెరపైకి సబ్ కాంట్రాక్టర్లు ♦ ఆమోదముద్ర వేసేందుకు నేడు ముఖ్యమంత్రి సమావేశం ♦ గతంలో బిల్లులు ఇవ్వని రాయపాటిపై సబ్ కాంట్రాక్టర్ల ఫిర్యాదు ♦ సర్కార్, పీపీఏ స్పందించకపోవడంతో పనులు ఆపేసిన వైనం సాక్షి, హైదరాబాద్: ఐదు కోట్ల మంది ప్రయోజనాలను తుంగలో తొక్కుతూ ‘ప్రత్యేక హోదా’ను కేంద్రానికి తాకట్టు పెట్టి దక్కించుకున్న మొదటి ‘ప్యాకేజీ’.. పోలవరం ప్రాజెక్టులో కమీషన్లు కొట్టేసేందుకు రంగం సిద్ధమవుతోందా? రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం పోలవరం ప్రాజెక్టును అప్పగించి 24 గంటలు గడవక ముందే హెడ్ వర్క్స్ అంచనాను రూ.1,482 కోట్లు పెంచేసి.. ఆ మేరకు కమీషన్లు కొట్టేసేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నారా? అవుననే అంటున్నారు సాగునీటి శాఖ అధికారులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే ఈ కమీషన్ల వ్యవహారం ముందుకు సాగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈపీసీ(ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్) విధానంలో సర్కార్ అనుమతితో 50 శాతం పనులను మాత్రమే సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించే వెసులుబాటు ఉంది. కానీ, ఈ నిబంధనను తుంగలో తొక్కి హెడ్ వర్క్స్ పనులను గంపగుత్తగా సబ్ కాంట్రాక్టర్‌కు కట్టబెట్టి.. ప్రధాన కాంట్రాక్టర్ రాయపాటితో కలిసి పర్సంటేజీలు పిండుకోవడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని వినిపిస్తోంది. సబ్ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడంపై ఆమోదముద్ర వేసేందుకు జలవనరుల శాఖ అధికారులతో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. ఇప్పటికే చేసిన పనులకు బిల్లులు ఇవ్వడం లేదంటూ సబ్ కాంట్రాక్టు సంస్థలు ఎల్ అండ్ టీ, బావర్ సంస్థలు ప్రధాన కాంట్రాక్టర్‌పై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో.. పనులు ఆపేశాయి. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. పోలవరం పనులను శరవేగంగా పూర్తి చేయడం కోసమే సబ్ కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తున్నామన్న ప్రభుత్వ వాదనలో వాస్తవం లేదని అర్ధం చేసుకోవచ్చు. ఐదు కోట్ల మంది ఆంధ్రుల చిరకాల స్వప్నం బహుళార్థ సాధక పోలవరం ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్(ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యాం, స్పిల్ వే, పవర్ హౌస్ పునాదుల నిర్మాణం) పనులను రష్యా, ఒమన్ దేశాల కంపెనీల భాగస్వామ్యంతో టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన టాన్స్‌ట్రాయ్(ఇండియా) లిమిటెడ్ మార్చి 2, 2013న రూ.4,054 కోట్లకు చేజిక్కించుకుంది. ఒప్పందం ప్రకారం 60 నెలల్లో అంటే మార్చి 2, 2018లోగా పనులు పూర్తి చేయాలి. కేవలం పనులను కాజేసేందుకే రష్యా, ఒమన్ సంస్థల భాగస్వామ్యాన్ని ట్రాన్స్ట్రాయ్ సంపాదించింది. ఆ సంస్థలు క్షేత్రస్థాయిలో పనులు చేయకపోవడమే ఇందుకు నిదర్శనం. దాంతో గతేడాది సెప్టెంబరు 15 నాటికి 4.54 శాతం పనులు కూడా పూర్తి కాలేదు. కాంట్రాక్టరును రక్షించి కమీషన్లు కొట్టేయడమే లక్ష్యం.. పోలవరం హెడ్ వర్క్స్ పనుల తీరుపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) అసంతృప్తి వ్యక్తం చేస్తూ పదే పదే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది. పీపీఏ అసహనం నేపథ్యంలో ఈపీసీ విధానంలో 60సీ నిబంధన కింద ట్రాన్స్ట్రాయ్పై వేటు వేసి.. మళ్లీ టెండర్ ద్వారా కొత్త కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించాలని ఉన్నతాధికారులు ప్రతిపాదించారు. స్టీలు, సిమెంటు, డీజిల్ వంటి ధరలు తగ్గిన నేపథ్యంలో అంచనా వ్యయం కూడా తగ్గుతుందని.. ఆ మేరకు ప్రభుత్వంపై భారం కూడా తగ్గుతుందని సూచించారు. కానీ.. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం తోసిపుచ్చింది. కాంట్రాక్టర్ రాయపాటిని రక్షించడం, భారీ ఎత్తున ప్రజాధనాన్ని దోచుకోవడానికి ‘పెద’బాబు ఎత్తు వేశారు. ఈ క్రమంలోనే పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలంటూ జలవనరుల శాఖ ఈఎన్సీ వెంకటేశ్వర రావు నేతృత్వంలో గతేడాది సెప్టెంబరు 30న నిపుణుల కమిటీని నియమించారు. ఆ కమిటీ ఇచ్చిన పూర్తి నివేదికను బుట్టదాఖలు చేసిన సర్కార్.. పనులు సకాలంలో పూర్తి చేసే సామర్థ్యం ట్రాన్స్ట్రాయ్కు లేదని, కొంత భాగం పనులను అనుభవజ్ఞులైన సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించాలన్న ప్రతిపాదనను మాత్రమే పరిగణనలోకి తీసుకుంది. ఇందుకు పీపీఏ అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం ఉండటంతో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ప్రధాన కాంట్రాక్టర్, సబ్ కాంట్రాక్టర్లు, ఆర్థికసంస్థలతో ‘ఎస్క్రో’ అకౌంట్ వ్యవస్థను ఏర్పాటు చేసి బిల్లులు చెల్లించాలని, పనుల ప్రగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాన కాంట్రాక్టర్, సబ్ కాంట్రాక్టర్లు సర్కార్‌తో మరో సారి ఒప్పందం చేసుకోవాలని గతేడాది అక్టోబరు 10న మంత్రివర్గం సమావేశంలో ఏకంగా తీర్మానాన్ని చేశారు. ఆ తీర్మానాన్ని అమలు చేస్తూ ఈ ఏడాది జనవరి 25న అప్పటి జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. మెజారిటీ వాటా పెదబాబుకే.. అంచనాలు పెంచేసిన నేపథ్యంలో ప్రధాన కాంట్రాక్టర్ రాయపాటి 25 శాతం కమీషన్‌పై పనులను సబ్ కాంట్రాక్టుకు ఇచ్చినట్లు ఆ ప్రాజెక్టు పనులను పర్యవేక్షించే ఓ కీలక అధికారి ‘సాక్షి’కి చెప్పారు. ఇందులో మెజారిటీ వాటా పెదబాబుకు దక్కుతుందని అధికారవర్గాలు వెల్లడించాయి. గంపగుత్తగా పనులను సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించడం నిబంధలనకు విరుద్ధం కావడంతో, సర్దుబాటు చేసేందుకు సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. ఈ వ్యవహారంపై ఆమోదముద్ర వేసేందుకు జలవనరుల శాఖ అధికారులు, పోలవరం ప్రాజెక్టు అధికారులతో సోమవారం సమావేశమవుతున్నారు. పనులను 2018లోగా పూర్తి చేయాల్సి ఉందన్న సాకు చూపి సబ్ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడంపై అధికారముద్ర వేయనున్నారు. కానీ ‘ఎస్క్రో అకౌంట్’ వ్యవస్థ ఏర్పాటుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దాంతో హెడ్ వర్క్స్ పనులు చేసిన సంస్థకు కాకుండా ప్రధాన కాంట్రాక్టర్ రాయపాటికి బిల్లులు చెల్లిస్తారు. ఇప్పటికే బిల్లులు చెల్లించడం లేదని రాయపాటిపై ఫిర్యాదు చేసినా సర్కార్ స్పందించకపోవడంతో ఎల్ అండ్ టీ, బావర్ సంస్థలు పనులు ఆపేశాయి. ఎస్క్రో అకౌంట్ ద్వారా బిల్లులు చెల్లిస్తే.. సబ్ కాంట్రాక్టు సంస్థలు కమీషన్ ఎగ్గొడతాయేమోననే భావన వల్లే సర్కార్ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదనే అభిప్రాయం అధికారవర్గాల్లో వ్యక్తమవుతోంది. అనుమతులు లేవు.. ఎస్క్రో అకౌంట్ లేదు.. మంత్రివర్గం తీర్మానం అలా ఆమోదించిందో లేదో ట్రాన్స్ట్రాయ్ ఇలా సబ్ కాంట్రాక్టర్లను తెరపైకి తెచ్చింది. రాక్‌ఫిల్ డ్యాం పనులను పెదబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఎల్ అండ్ టీకి, డయా ఫ్రం వాల్ పనులను బావర్(జర్మనీ)కు ట్రాన్స్ట్రాయ్ అప్పగించింది. కానీ.. ఇందుకు జలవనరుల శాఖ అనుమతి ఇప్పటివరకూ తీసుకోలేదు. కేబినెట్ తీర్మానం ప్రకారం ‘ఎస్క్రో’ అకౌంట్ వ్యవస్థ ను ఏర్పాటు చేయనేలేదు. సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించిన తర్వాత చేసిన పనులకు రూ.385 కోట్లకుపైగా బిల్లులను ట్రాన్స్ట్రాయ్కు ప్రభుత్వం చెల్లించింది. కానీ.. ఆ బిల్లులను సబ్ కాంట్రాక్టు సంస్థలకు చెల్లించకపోవడంతో ఆ సంస్థలు పీపీఏకు, సర్కార్‌కు ఫిర్యాదు చేశాయి. ఇవేవీ పరిగణనలోకి తీసుకోని సీఎం చంద్రబాబునాయుడు హెడ్‌వర్క్స్‌లో మట్టి పనులు, స్పిల్ ఛానల్ పనులను త్రివేణి ఎర్త్ మూవర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు, కాంక్రీట్, పవర్ హౌస్ పునాది పనులను పూజి మీయిస్టర్కు, స్పిల్ వే పనులను ఎల్ అండ్ టీ– బావర్(జేవీ)లకు సబ్ కాంట్రాక్టుకు అప్పగించాలన్న ట్రాన్స్ట్రాయ్ ప్రతిపాదనపై ఆమోదముద్ర వేసేశారు. దాంతో ఆ సంస్థలు మిషనరీని రంగంలోకి దించాయి. -
కమీషన్ల కోసమే ప్యాకేజీకి చంద్రబాబు సై
– ఏపీ అథోగతికి ఆయనే కారణం – మాటలు మార్చడంలో వెంకయ్య దిట్ట – జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ధనేకుల ధ్వజం నూజివీడు : రాష్ట్రం అథోగతి పాలవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమని డీసీసీ అధ్యక్షులు ధనేకుల మురళీ మోహన్‌రావు ధ్వజమెత్తారు. ఆదివారం ఇక్కడ జరిగిన జిల్లా కాంగ్రెస్ సమావేశంలో ధనేకుల మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ముందూ, వెనుక ఆలోచించకుండా విభజన చేయమని లేఖ ఇచ్చిన చంద్రబాబు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి కేంద్రప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీకి అంగీకరించడం చారిత్రక తప్పిదమన్నారు. విభజన బిల్లు సమయంలోనే రాష్ట్రానికి ఏం కావాలనే దానిపై చంద్రబాబు నోరు మెదపకుండా నేడు ప్యాకేజీల కోసం అర్రులు చాచడం రాష్ట్రప్రజల దౌర్భాగ్యమన్నారు. ప్రత్యేక ప్యాకేజీ అనేది కేవలం కేంద్రం ఇచ్చే డబ్బులను కమీషన్ల రూపంలో పంచుకోవడానికే తప్పితే రాష్ట్రానికి ఏమాత్రం ఉపయోగపడదన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి ఏం సాధించారని ఢిల్లీలో సన్మానాలు చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా ఇష్టారాజ్యంగా మాటమారుస్తారని ప్రజలకు అర్థమైందన్నారు. సమావేశంలో పీసీసీ కార్యదర్శి వింతా సంజీవరెడ్డి, బీడీ రవికుమార్, పాతూరి రవి, డీసీసీ ప్రధాన కార్యదర్శి పరిమి సాగర్‌కుమార్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు చాట్ల విలాస్బాబు తదితరులు మాట్లాడుతూ టీడీపీ బీజేపీ ఏపీకి తీరని ద్రోహం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. -
కమీషన్ల కోసమే ప్రాజెక్టులకు అధిక నిధులు
ఆత్మకూరు (ఎం) : కమీషన్ల కోసమే ప్రాజెక్టులకు రిడిజైనింగ్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తోందని డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్య గౌడ్ విమర్శించారు. గురువారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మహా రాష్ట్రతో జల ఒప్పందం వెనుక ప్రాజెక్టు కాంట్రాక్ట్ పనులను‡ముఖ్యమంత్రి తన బంధువైన మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు సంబంధికులకు కట్టబెట్టడం ఒక ప్రధాన కారణమన్నారు. ఎన్నికల హామీలను ఏ ఒక్కటి అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. వేసిన పంటలు ఎండిపోతూ రైతులు అల్లాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ గంగపురం మల్లేశం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొడిత్యాల నరేందర్‌గుప్త, నాయకులు కందాడి అనంతరెడ్డి, యాస లక్ష్మారెడ్డి, కొడిమాల యాదగిరిగౌడ్, కట్టెకోల హన్మంతుగౌడ్, లోడి శ్రీను పాల్గొన్నారు. -
అట్లూరు సొసైటీ..అక్రమాల పుట్ట
♦ తీగలాగితే డొంక కదిలింది! ♦ సహకార శాఖ అధికారుల నివేదికలో బట్టబయలు ♦ ఒకే రోజు కొత్తగా 931 మందికి సభ్యత్వం జారీ ♦ కొత్త సభ్యులందరికీ రుణాలు ఇచ్చేందుకు సన్నాహాలు ♦ ఎండు మిరప పేరుతో దోపిడీకి సన్నద్ధం ♦ సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలకు సిఫార్సులు సాక్షి ప్రతినిధి, కడప : ‘తీగలాగితే డొంక కదిలింది’ అన్నట్లుగా అట్లూరు సొసైటీ అక్రమాలు తెరపైకి వచ్చాయి. అధికారులు కమీషన్ల కోసం కక్కుర్తిపడ్డట్లుగా తెలుస్తోంది. దీంతో డీసీసీబ్యాంకు డొల్లతనం బహిర్గతమైంది. సహకారశాఖ యాక్ట్‌కు వ్యతిరేకంగా నిధులు కేటాయింపు, ఆపై రుణాలు మంజూరుకు సన్నద్ధం కావడమేనని విచారణ అధికారుల నివేదిక బట్టబయలు చేసింది. రుణాలు కోసమే కొత్తగా సభ్యులు చేర్పించడం, ఒకే రోజులో 931మందికి సభ్యత్వం కల్పించడం, ఆపై ఎండుమిరప పేరుతో కొల్లగొట్టేందుకు సన్నహాలు చేసినట్లు నిగ్గుతేల్చారు. నష్టాల ఊబిలో ఉన్న సొసైటీకి రెండునెలల వ్యవధిలో రూ.14కోట్లు నిధులు కేటాయించడంలో మతలబు తెలిసిపోయింది. అర్హతలేని సొసైటీకి రూ.14కోట్ల నిధులు ముందే నష్టాల ఊబిలో కూరుకుపోయి, రుణాలు ఇచ్చేందుకే అర్హతలేని సొసైటీకి రెండునెలల వ్యవధిలో దాదాపు రూ. 14కోట్లు నిధులు మంజూరు చేశారు. అక్రమాలకు నిలయంగా మారిన సొసైటీకి నిబంధనలకు విరుద్ధంగా డీసీసీ బ్యాంకు ఫండ్ కేటాయించింది. ఈ మొ త్తం వ్యవహారంలో పాలకవర్గం, సంఘం సిబ్బంది, డీసీసీబీలదే పూర్తి బాధ్యతగా నిర్ధారించింది. ఈనెల 4న ‘దోపిడీకి సహకారం!’ అంటూ సాక్షి కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టాల్సిందిగా డీసీఓ సుబ్బారావు అధికారులను ఆదేశించారు. ఆమేరకు విచారణ జరిపిన రాజంపేట డీఎల్సీఓ గుర్రప్ప డీసీసీబీ సీఈఓకు తాజాగా నివేదిక సమర్పించారు. విశ్వసనీయ వర్గాల కథనం మేరకు.. ఇదివరకే రూ.2,26,63,255 నష్టంలో అట్లూరు సొసైటీ ఉంది. 2014-15లో అదనంగా రూ.35,64,398 నికర నష్టం చవిచూసింది. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, కడపకు చెల్లించిన అప్పునకు సభ్యుల నుంచి వసూళ్లు కావాల్సిన రుణాలకు మధ్య రూ.2,26,08,499 వ్యత్యాసం ఉంది. అంతటి విపత్కర పరి స్థితిలో అట్లూరు సొసైటీ ఉంది. అయినప్పటీకీ 2015-16 రబీ సీజన్లో 650 మందికి రూ.5.77కోట్ల రుణాలు చెల్లిం చారు. రెండునెలల వ్యవధిలో 931మంది సభ్యులకు రూ. 8.22 కోట్లు మంజూరు చేశారు. సరైన ఆర్థిక పరపతి లేని సంఘానికి రూ.13, 98,86,000 మంజూరుచేయడంపై డీసీసీ బ్యాంకు వైఖరిని విచారణ అధికారులు తప్పుబట్టారు. ఎండుమిరప పేరుతో దోపిడీకి సన్నద్ధం ఎండుమిరప పంట అట్లూరు మండలంలో సాగులోనే లేదు. ఆ పంట పేరుతో సొసైటీ పరిధిలో రుణాలు కొల్లగొట్టేందుకు సన్నద్ధమయ్యారు. ఎండుమిరపకు రూ.1లక్ష పంటరుణం ఇచ్చే అవకాశం ఉంది. ఈ కారణంగా 931 మంది ఎండుమిరప వేసినట్లుగా రికార్డులు పొందుపర్చి రుణాలు పంచేందుకు సొసైటీ సిబ్బంది పావులు కదిపారు. సహకారశాఖ యాక్టు ప్రకారం ముం దుగా సంఘంలో ఉన్న సభ్యులకు రుణా లు ఇచ్చాక కొత్తగా చేరిన సభ్యులకు అవకాశం కల్పించాలి. అట్లూరు సొసైటీ పరిధిలో ఇలాంటి నిబంధనలను పక్కనపెట్టారు. ఇదివరకే 7,466 మంది సభ్యులున్నారు. వారందరికీ రుణాలు మంజూరు కాలేదు. అది అటుంచితే కొత్తగా చేరిన 931మంది సభ్యులకు ఎండుమిరప పంట రుణం పేరుతో రూ.8,21, 68,000 ఇచ్చేందుకు సన్నద్ధమయ్యారు. ఒక్కరోజులోనే 931 మందికి సభ్యత్వం సైతం ఇచ్చారు. వీరి నుంచి సెక్షన్ 19(1)(సీ), రూల్ 14(2)ననుసరించి సభ్యత్వ దరఖాస్తులు, భూమి వివరాలు తెలుపు పత్రాలు సంఘానికి సమర్పించలేదు. రుణాలు పేరుతో దోపిడీ చేసే క్రమంలో రికార్డు పరంగా ఈ ప్రక్రియను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం స్వాహా ఎత్తుగడ. ఇందులో డీసీసీబీ పాత్ర సైతం నిర్ధారణ అయ్యింది. డీకేటీలకు సైతం.. జీఓ255 ప్రకారం సహకార సంఘాల్లో డీకేటీ భూములకు రుణ సౌకర్యం 1999కి పరిమితి చేశారు. అయినప్పటికీ అట్లూరు సొసైటీ డీకేటీ భూముల కు రుణాలిచ్చింది. ఇదివరకే కలివి కోడి ఆవాస ప్రాంతంగా గుర్తింపుపొం దడం, సోమశిల బ్యాక్‌వాటర్ మునకప్రాంతంగా పరిహారం పొందారు. మండలపరిధిలో భూమి విస్తీర్ణం తగ్గిపోయింది. ఇలాంటి తరుణంలో భూ మి లేకపోయినా డీకేటీ పట్టాలు రికార్డులు నకిలీవి రూపొందించి రుణాలు కొల్లగొట్టే ఎత్తుగడలను ఎంచుకున్న ట్లు తెలుస్తోంది. సహకారయాక్టు సెక్ష న్ 19(1)(సీ), సెక్షన్ 36(1), రూల్ 14(2)లకు విరుద్ధంగా అట్లూరు సొసై టీ పరిధిలో లావాదేవిలు నిర్వహిం చారు. అందుకు పూర్తి బాధ్యత పాలకవర్గం, సిబ్బంది, డీసీసీ బ్యాంకుదేనని నివేదిక ఇచ్చారు. సిబ్బందిపై శాఖాపరంగా క్రమశిక్షణ చర్యలకు సైతం సిఫార్సులు చేసినట్లు తెలుస్తోంది. -
భెల్.. గోల్ మాల్!
♦ నాసిరకం షూస్ ఇచ్చారని కార్మికుల ఆగ్రహం ♦ సుమారు రూ.40 లక్షలు చేతులు మారినట్టు ♦ ఆరోపణలు సీబీఐకి ఫిర్యాదు చేస్తామన్న కార్మికులు ♦ కరపత్రాలు విడుదల చేసిన నేతలు భెల్: కార్మికుల భద్రతే లక్ష్యం... వారి శ్రేయస్సే ముఖ్యం అంటూ ప్రకటనలు గుప్పించే భెల్ పరిశ్రమ కమీషన్లకు కక్కుర్తి పడింది. కార్మికుల భద్రత కోసం ఇచ్చే షూస్ కొనుగోళ్లలోనూ అధికారులు కమీషన్లకు ఆశపడి నాసిరకం సరఫరా చేశారు. ప్రస్తుతం పరిశ్రమకు ఆర్డర్లు లేకపోవడంతో ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ప్రతి అంశంలోనూ కోతలు విధిస్తూ డబ్బు ఆదాకు ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలోనూ కొందరు అధికారులు అందినకాడికి దండుకునే పనిచేయడంపై కార్మిక సంఘాల నాయకులు గుర్రుమంటున్నారు. రామచంద్రాపురంలోని భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (భెల్) కార్మికులకు అందించే షూస్ నాసిరకం కొనుగోలు చేయడంపై కార్మిక సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. సంస్థలో పనిచేస్తున్న 4,961 మంది కార్మికులకు గాను రూ.1,195 చొప్పున షూస్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. యాజమాన్యం కొనుగోలు చేసిన షూస్ కనీసం రూ.250 విలువ కూడా ఉండదని, వాటికి అంత మొత్తంలో బిల్లులు చెల్లించడం ఏమిటని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. షూస్ కొనుగోళ్లలో సుమారు రూ.40 లక్షలకుపైగా చేతులు మారిన ట్టు ఆ సంఘాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో భెల్ సంస్థ ప్రతిష్ట దిగజారే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సేఫ్టీ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భెల్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేయగా అదే బాటలో మరికొన్ని యూనియన్లు కూడా ఆందోళన వ్యక్తం చేసినట్టు కార్మికుల ద్వారా తెలుస్తోంది. ఈ విషయంలో భెల్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ బులిటెన్ కూడా జారీ చేసినా యాజమాన్యం వైపు నుంచి స్పందన లేకపోవడంపై ఆయా సంఘాలు మండిపడుతున్నాయి. ఈ విషయమై సీబీఐకి ఫిర్యాదు చేసే విషయాన్ని పరిశీలిస్తామని పలువురు పేర్కొంటున్నారు. ఈ కొనుగోళ్ల విషయంలో అధికార యూనియన్ మాట్లాడ క పోవడంపై యాజమాన్యంతో కుమ్మక్కైనట్టు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ విషయంలో విచారణ జరిపి బాధ్యులుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కార్మికులకు నగదు చెల్లిస్తే వారే నాణ్యమైన షూ కొనుగోలు చేస్తారని పలువురు చెబుతున్నారు. ఈ విషయంలో యాజమాన్యం స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
వారి దృష్టంతా కమీషన్లు, కాంట్రాక్టులపైనే..
కాంగ్రెస్, టీడీపీలపై మంత్రి హరీశ్‌రావు విసుర్లు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో గతంలో టీడీపీ, కాంగ్రెస్‌లు చేపట్టిన ఏ ప్రాజెక్టు కూడా నీళ్లిచ్చే ఉద్దేశంతో చేపట్టలేదని, కమీషన్లు, కాంట్రాక్టులకు ప్రాధాన్యం ఇచ్చారని భారీ నీటిపారుదల శాఖామంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నీ ఆలోచించి ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకుంటున్నారని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, టీడీపీ నాయకులు హరీశ్‌రావు సమక్షంలో సోమవారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ కృష్ణానదిపై పూర్తి హక్కులదారులమైనందునే సీఎం ఆలోచించి శ్రీశైలం నుంచి కృష్ణా నీటిని తీసుకుని పాలమూరు ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారని వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఒక్క కొడంగల్ నియోజకవర్గంలోనే 1.08 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని వివరించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎంతమంది అడ్డుపడినా పాలమూరు పథకాన్ని పూర్తిచేసి తీరుతామన్నారు. రాష్ట్రంలో అన్ని పార్టీల పని అయిపోయిందని, కాంగ్రెస్ ఢిల్లీలో మునిగింది, గల్లీలో మునిగింది, అది మునిగిపోయిన పడవ అని వ్యాఖ్యానించారు. కొడంగల్ ప్రజలు తలవంచుకునేలా స్థానిక ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వ్యవహరించారని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ నిరంజన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పాలమూరు ప్రాజెక్టుకు ఏపీ సీఎం చంద్రబాబు అడ్డంకులు సృష్టిస్తున్నారని మంత్రులు జూపల్లి, డాక్టర్ లక్ష్మారెడ్డి విమర్శించారు. బంగారు తెలంగాణ కోసమే తాము పార్టీలో చేరుతున్నామని జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ కృష్ణ, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మల్లిక్‌రెడ్డి పేర్కొన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లకు మంత్రి హరీశ్‌రావు టీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. -
రైలు ప్రమాద బాధితులకు జగన్ పరామర్శ
-
ప్రమాదాలపై కమిషన్లే తప్ప ఫలితంలేదు:జగన్
పుట్టపర్తి: రైలు ప్రమాదాలు, వోల్వో బస్సు ప్రమాదాలు జరిగిన తరువాత కమిషన్లు వేస్తున్నారు గానీ, ఫలితం ఉండటం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బెంగళూరు నుంచి నాందేడ్ వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలు అనంతపురం జిల్లా కొత్తచెరువు సమీపంలోకి వచ్చిన తరువాత బి ఒన్ ఏసి కోచ్లోమంటలు వ్యాపించి 26 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ప్రమాద వార్త తెలిసిన వెంటనే తీవ్ర దిగ్భ్రాంతి చెందిన జగన్ కొత్తచెరువుకు చేరుకున్నారు. ఘటనాస్థలిని పరిశీలించారు. క్షతగాత్రులను, మృతి చెందిన వారి కుటుంబీకులను పరామర్శించారు. అనంతరం పుట్టపర్తి రైల్వే స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. 16 నెలల వ్యవధిలో మూడు రైలు ప్రమాదాలు జరిగాయి. అనేక మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. పలువురు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే విచారణకు కమిషన్ వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తుంది. మళ్లీ మళ్లీ మూడు రైలు ప్రమాదాలు జరిగాయి. విచారణ నివేదికలు లేవు. ప్రమాదాలు ఎలా జరిగాయో తెలియదు. వివరాలు వెల్లడించరు. మళ్లీ ఈరోజు కూడా కమిషన్ వేస్తామంటారు. పలాన సమస్య వల్ల ఇంతమంది చనిపోయారు అని తెలియజేయరు. మళ్లీ ఆ సమస్య తలెత్తకుండా పరిష్కరించడానికి ప్రభుత్వాలు ప్రయత్నించడంలేదు. పాత బోగీలు వాడుతున్నారని విమర్శించారు. ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని జగన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఓల్వో బస్సు ప్రమాదాలు నాలుగు జరిగాయి. నడిరోడ్డుపై నాలుగు ఓల్వో బస్సు లు దగ్ధమయ్యాయి. అనేక మంది చనిపోయారు. ఎన్ని ప్రమాద సంఘటనలు జరిగినా కారణాలు తెలియజేయడంలేదు. ఈ రకంగా ఇంతమంది చనిపోతుంటే కేంద్ర ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నాయని జగన్ ప్రశ్నించారు. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడకుండా వారికి రక్షణ కల్పించాలని, భరోసా ఇవ్వాలని కోరారు. విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ ఎక్స్‌గ్రేషియా ఎంత ఇచ్చారనేది కాదన్నారు. 5 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించి చేతులు దులుపుకుంటే సరిపోదని విమర్శించారు. ఎక్స్‌గ్రేషియా 5 లక్షలలా, పది లక్షలా, 20 లక్షలా అనేది కాదని, ప్రజలకు భద్రత కల్పించమని కోరుతున్నామని చెప్పారు.