ప్రాజెక్టులకు పోటెత్తిన వరద నీరు
హైదరాబాద్ : భారీ వర్షాలుతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు నిండకుండను తలపిస్తున్నాయి. పలు ప్రాజెక్టుల్లో వరద నీరు పోటెత్తడంతో అధికారులు లక్షల క్యూసెక్కుల నీటిని కిందకి వదులుతున్నారు. తెలంగాణలోని నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. పూర్తి స్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా... ప్రస్తుతం 1402.50 అడుగులకు నీరు చేరుకుంది.
ప్రాజెక్టులో ఇన్ ఫ్లో 1,16,000 క్యూసెక్కులు కాగా... ఔట్ ఫ్లో లక్షా 3 వేల క్యూసెక్కులుగా ఉంది. అలాగే ఇదే జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా... ప్రస్తుతం 1088.60 అడుగులకు నీరు చేరుకుంది. ప్రాజెక్టులో ఇన్ ఫ్లో 403,462 క్యూసెక్కులు కాగా... ఔట్ ఫ్లో లక్షా 3, 52, 628 క్యూసెక్కులుగా ఉంది.
కరీంనగర్ జిల్లా :
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం 485 అడుగులు కాగా... ప్రస్తుతం 481.63 అడుగులకు నీరు చేరుకుంది. ఇన్ఫ్లో 5,27,662 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 5,27,662 క్యూసెక్కులు ఉంది.
మెదక్ జిల్లా:
సింగూర్ ప్రాజెక్టులో జలకళ నెలకొంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1717 అడుగులు, ప్రస్తుతం 1716.96 అడుగులుగా ఉంది. ఇన్ఫ్లో 79 వేల క్యూసెక్కులు ఉండగా... ఔట్ ఫ్లో 95 వేల క్యూసెక్కులు ఉంది.
మహబూబ్నగర్ జిల్లా : జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. పూర్తిస్థాయి నీటిమట్టం1045 అడుగులు కాగా ప్రస్తుతం 1044.06 అడుగులుగా ఉంది. ఇన్ఫ్లో 1,45,000 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 1,42,857 క్యూసెక్కులు ఉంది.
కర్నూలు జిల్లా :
శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 881.20 అడుగులు నీరు ఉంది. ఇన్ ఫ్లో 1,40,592 క్యూసెక్కులు ఉండగా... ఔట్ ఫ్లో 77,282 క్యూసెక్కులు ఉంది.
నల్గొండ జిల్లా:
నాగార్జునసాగర్కు వరద ఉధృతి కొనసాగుతుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు, కాగా.. ప్రస్తుతం 520.20 అడుగులకు నీరు వచ్చి చేరింది. ఇన్ఫ్లో 68,511 క్యూసెక్కులు ఉండగా... ఔట్ ఫ్లో 1350 క్యూసెక్కులుగా ఉంది. అలాగే ఇదే జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. పూర్తి స్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా.. ప్రస్తుతం 163.71 అడుగులకు నీరు వచ్చి చేరింది.