కృష్ణా బోర్డు ప్రాజెక్టుల నిర్వహణకు ఏపీ,తెలంగాణ అంగీకారం | Ap And Telangana Agree For Operation Of Projects Under Krishna Board | Sakshi
Sakshi News home page

కృష్ణా బోర్డు ప్రాజెక్టుల నిర్వహణకు ఏపీ,తెలంగాణ అంగీకారం

Published Thu, Feb 1 2024 2:31 PM | Last Updated on Thu, Feb 1 2024 4:04 PM

Ap And Telangana Agree For Operation Of Projects Under Krishna Board - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టుల ఆపరేషన్‌కు ఏపీ, తెలంగాణ అంగీకారం తెలిపాయి. హైదరాబాద్‌లో కృష్ణా రివర్‌ బోర్డు సమావేశం గురువారం జరిగింది. అనంతరం మీడియాతో ఏపీఈఎన్‌సీ నారాయణరెడ్డి మాట్లాడుతూ, బోర్డు పరిధిలో మొత్తం 15 కాంపోనెంట్స్‌లో  9 తెలంగాణ, 6 ఆంధ్రప్రదేశ్‌వి ఉన్నాయని, కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత పై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.

‘‘ఆపరేషన్‌ కోసం ఇరు రాష్ట్రాల నుంచి స్టాప్ కేటాయింపు ఉంటుంది. వాటర్ కేటాయింపులపై త్రిసభ్య కమిటీ దే తుది నిర్ణయం. ప్రాజెక్టుల ఆపరేషనల్ ప్రోటోకాల్ త్రిసభ్య కమిటీ అప్పుడున్న పరిస్థితుల్లో తీసుకుంటారు.  లెఫ్ట్ మెన్ కెనాల్ నుంచి రెండు టీఎంసీ, మార్చిలో రైట్ మెన్ కెనాల్ నుంచి మూడు టీఎంసీలు ఏపీకి విడుదలకు ఒప్పుకున్నారన్నారు. ఏప్రిల్‌  ఐదు టీఎంసీ లు ఏపీకి ముందుగానే ఉన్నాయి. ప్రాజెక్టుల ఆపరేషన్‌ కోసం తెలంగాణ ఒప్పుకుందని నారాయణరెడ్డి వెల్లడించారు.

తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌ మాట్లాడుతూ, ప్రాజెక్టుల ఆపరేటింగ్ అంతా కేఆర్‌ఎంబీకి ఇచ్చామని, పవర్‌ స్టేషన్స్‌పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. నాగార్జున సాగర్ తెలంగాణ, శ్రీశైలం ఏపీ చూసుకుంటుంది. ప్రాజెక్టులన్నీ ఇక నుంచి బోర్డు పరిధిలో నడుస్తాయి. మా డిమాండ్స్ అన్ని కేంద్రానికి లేఖలు రాశాం. ఇంకా అక్కడ నుంచి నిర్ణయం రాలేదు’’ అని ఆయన పేర్కొన్నారు.

‘‘నీటి వాటాల పంపకంపై త్రిసభ్య కమిటీనే నిర్ణయం తీసుకుంటుంది. ప్రాజెక్టుల వద్ద భద్రత అనేది పరిస్థితిని బట్టి బోర్డు కనుసన్నల్లో జరుగుతుంది. కేఆర్‌ఎంబీ పరిధిలో ఉన్న 15  హౌట్లెట్స్ బోర్డు పరిధిలోకి వెళ్తాయి. ప్రాజెక్టులను పూర్తిగా అప్పగించలేదు ఆపరేషనల్, నీటి విడుదల బోర్డు చూసుకుంటుంది. సీఆర్‌పీఎఫ్‌ సైతం కృష్ణా బోర్డు పరిధిలోనే ఉంటాయి. నిర్వహణ కోసం స్టాప్ కేటాయింపు 40: 45 కావాలని అడుగుతున్నారు’’ అని మురళీధర్‌ వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement