three-member committee
-
కృష్ణా బోర్డు ప్రాజెక్టుల నిర్వహణకు ఏపీ,తెలంగాణ అంగీకారం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టుల ఆపరేషన్‌కు ఏపీ, తెలంగాణ అంగీకారం తెలిపాయి. హైదరాబాద్‌లో కృష్ణా రివర్ బోర్డు సమావేశం గురువారం జరిగింది. అనంతరం మీడియాతో ఏపీఈఎన్‌సీ నారాయణరెడ్డి మాట్లాడుతూ, బోర్డు పరిధిలో మొత్తం 15 కాంపోనెంట్స్‌లో 9 తెలంగాణ, 6 ఆంధ్రప్రదేశ్‌వి ఉన్నాయని, కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత పై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ‘‘ఆపరేషన్ కోసం ఇరు రాష్ట్రాల నుంచి స్టాప్ కేటాయింపు ఉంటుంది. వాటర్ కేటాయింపులపై త్రిసభ్య కమిటీ దే తుది నిర్ణయం. ప్రాజెక్టుల ఆపరేషనల్ ప్రోటోకాల్ త్రిసభ్య కమిటీ అప్పుడున్న పరిస్థితుల్లో తీసుకుంటారు. లెఫ్ట్ మెన్ కెనాల్ నుంచి రెండు టీఎంసీ, మార్చిలో రైట్ మెన్ కెనాల్ నుంచి మూడు టీఎంసీలు ఏపీకి విడుదలకు ఒప్పుకున్నారన్నారు. ఏప్రిల్ ఐదు టీఎంసీ లు ఏపీకి ముందుగానే ఉన్నాయి. ప్రాజెక్టుల ఆపరేషన్ కోసం తెలంగాణ ఒప్పుకుందని నారాయణరెడ్డి వెల్లడించారు. తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ మాట్లాడుతూ, ప్రాజెక్టుల ఆపరేటింగ్ అంతా కేఆర్ఎంబీకి ఇచ్చామని, పవర్ స్టేషన్స్‌పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. నాగార్జున సాగర్ తెలంగాణ, శ్రీశైలం ఏపీ చూసుకుంటుంది. ప్రాజెక్టులన్నీ ఇక నుంచి బోర్డు పరిధిలో నడుస్తాయి. మా డిమాండ్స్ అన్ని కేంద్రానికి లేఖలు రాశాం. ఇంకా అక్కడ నుంచి నిర్ణయం రాలేదు’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘నీటి వాటాల పంపకంపై త్రిసభ్య కమిటీనే నిర్ణయం తీసుకుంటుంది. ప్రాజెక్టుల వద్ద భద్రత అనేది పరిస్థితిని బట్టి బోర్డు కనుసన్నల్లో జరుగుతుంది. కేఆర్ఎంబీ పరిధిలో ఉన్న 15 హౌట్లెట్స్ బోర్డు పరిధిలోకి వెళ్తాయి. ప్రాజెక్టులను పూర్తిగా అప్పగించలేదు ఆపరేషనల్, నీటి విడుదల బోర్డు చూసుకుంటుంది. సీఆర్పీఎఫ్ సైతం కృష్ణా బోర్డు పరిధిలోనే ఉంటాయి. నిర్వహణ కోసం స్టాప్ కేటాయింపు 40: 45 కావాలని అడుగుతున్నారు’’ అని మురళీధర్ వివరించారు. -
కృష్ణా బోర్డు & తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో మిగిలి ఉన్న కొద్దిపాటి నిల్వల పంపిణీ విషయంలో..తెలంగాణ రాష్ట్రం, కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) మధ్య వివాదం తీవ్రమైంది. తాగునీటి అవసరాల కోసం సెప్టెంబర్ 30 వరకు ఏపీకి 25.29 టీఎంసీలు, తెలంగాణకు కేవలం 6.04 టీఎంసీల కృష్ణా జలాలను విడుదల చేయాలని ప్రతిపాదిస్తూ గత నెలలో ‘త్రిసభ్య కమిటీ’ పేరుతో రూపొందించిన వివాదాస్పద ముసాయిదా మినిట్స్‌ను ఆమోదించాలని తాజాగా కృష్ణా బోర్డు ఇరు రాష్ట్రాలను కోరినట్టు తెలిసింది. ఈ మేరకు ముసాయిదా మినిట్స్‌ను తాజాగా రెండు రాష్ట్రాలకూ కృష్ణా బోర్డు పంపించింది. ఇప్పటికే తెలంగాణ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసినా బేఖాతరు చేస్తూ మినిట్స్‌ను కృష్ణా బోర్డు రెండు రాష్ట్రాలకు పంపించడం గమనార్హం. కృష్ణా బోర్డుపై సీఎం కేసీఆర్ ఆగ్రహం... గత నెల 21న హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం జరగ్గా తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ గైర్హాజర య్యారు. కమిటీ కన్వీనర్ డీఎం రాయిపూరే, ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి హాజ రై నీటి కేటాయింపులపై చర్చించారు. ఈ సమా వేశా న్ని వాయిదా వేయాలని అంతకుముందే తెలంగాణ లేఖ రాసినా, కృష్ణా బోర్డు సమావేశాన్ని నిర్వహించింది. సమావేశం నిర్ణయాల మేరకు ఏపీకి 25.29 టీఎంసీలు, తెలంగాణకు కేవలం 6.04 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయించాలని ప్రతిపాదిస్తూ.. ముసాయిదా మినిట్స్‌ను కృష్ణా బోర్డు రూపొందించింది. తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ గైర్హాజరైనా, రాష్ట్రానికి అవసరమైన నీటి కేటాయింపులను కోరు తూ గతంలో ఆయన రాసిన లేఖను పరిగణనలోకి తీసుకుని ఈ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. తెలంగాణకు నామమాత్రంగా నీటి కేటాయింపులు జరుపుతూ మినిట్స్‌ను రూపొందించినట్టు పత్రికల్లో వార్తలు రావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేశారు. దీంతో ఈఎన్సీ సి.మురళీధర్ కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ కన్వీనర్ డీఎం రాయి పూరేను కలిసి మినిట్స్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు త్రిసభ్య కమిటీ సమావేశమే జరగలే దని, నీటి కేటాయింపులపై ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదని, ఒకవేళ చేసినా తెలంగాణ సమ్మతి తెలపలేదని స్పష్టం చేస్తూ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. త్రిసభ్య కమిటీ సమావేశాన్ని సత్వరంగా నిర్వహించి నీటికేటాయింపులపై నిర్ణయం తీసుకోవాలని కృష్ణా బోర్డును కోరినట్టు వెల్లడించింది. మొత్తంగా.. తెలంగాణ అభ్యంతరాలను పట్టించుకోకుండా నీటి కేటాయింపుల ప్రతిపాదనలను కృష్ణా బోర్డు రెండు రాష్ట్రాలకు పంపించడం వివాదాస్పదంగా మారింది. -
ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీం సంచలనాత్మక తీర్పు
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ), ఎన్నికల కమిషనర్(ఈసీ)ల నియామకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తమకు అనుకూలమైన వ్యక్తులను నియమిస్తోందనే తీవ్ర ఆరోపణల నడుమ సర్వోన్నత న్యాయస్థానం సంచలనాత్మక తీర్పును వెలువరిచింది. ఇన్నాళ్లూ కేంద్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు ఎన్నికల సంఘంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్లను రాష్ట్రపతి నియమిస్తున్నారు. ఇకపై ఈ వ్యవస్థను రద్దుచేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. ప్రధాన మంత్రి, లోక్‌సభలో విపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యులుగా ఉండే త్రిసభ్య కమిటీ సిఫార్సు మేరకు రాష్ట్రపతి కేంద్ర ఎన్నికల సంఘంలో నియామకాలు జరపాలని జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం చరిత్రాత్మక తీర్పు చెప్పింది. అది ప్రజాస్వామ్యానికి సమాధి కడుతుంది ‘శక్తివంతమైన తుపాకీ కంటే బ్యాలెట్ మరింత శక్తిమయం. ఎన్నికల ప్రక్రియ అతిగా దుర్వినియోగానికి గురైందంటే అది చివరకు ప్రజాస్వామ్యానికి సమాధి కడుతుంది. అధికారం ముందు సాగిలపడే వ్యక్తి ఎన్నికల కమిషనర్‌గా ఎన్నికకాకూడదు. ఇంకొకరి ఆదేశాలను శిరసావహించే వ్యక్తి ప్రజాస్వామ్య తలరాతను మార్చే హోదాలో ఉండకూడదు. ఎన్నికల ప్రక్రియ స్వతంత్రతను మరింతగా ఇనుమడింపజేసేందుకే ఈ ఆదేశాలు ఇస్తున్నాం. స్వచ్ఛత తగ్గిపోతే వినాశక పరిణామాలు సంభవిస్తాయి. పార్లమెంట్లో కొత్త చట్టం వచ్చేవరకు నూతన నియామక ప్రక్రియ అమలులో ఉంటుంది’ అని ధర్మాసనం పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం ఇన్నాళ్లూ కేంద్రప్రభుత్వం రాష్ట్రపతికి కొత్త సీఈసీ, ఈసీల కోసం సిఫార్సుచేసేది. సిఫార్సులమేరకు రాష్ట్రపతి వారిని నియమించేవారు. ఇకపై కొత్త ప్రక్రియ ప్రకారం లోక్‌సభలో విపక్షనేత లేని సందర్భంలో లోక్‌సభలో సంఖ్యపరంగా అతిపెద్ద విపక్ష పార్టీ నేత త్రిసభ్య కమిటీలో సభ్యునిగా ఉంటారు. సీఈసీ, ఈసీల నియామకం కోసం కొలీజియం తరహా వ్యవస్థను ఏర్పాటుచేయాలంటూ పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో గతంలో దాఖలైన నేపథ్యంలో వాటిని విచారించిన కోర్టు గురువారం ఈ తీర్పు చెప్పింది. రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ అనురుద్ధ బోస్, జస్టిస్ హ్రిషికేశ్ రాయ్, జస్టిస్ సీటీ రవికుమార్‌లు సభ్యులుగా ఉన్నారు. తీర్పును స్వాగతించిన విపక్షాలు ‘ప్రభుత్వ ప్రమేయం, ప్రభావం బారిన పడకుండా ఈసీని కాపాడుతూ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు కోర్టు తీర్పు బాటలు పరిచింది’ అని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. తీర్పును ప్రజాస్వామ్యం సాధించిన విజయంగా తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ అభివర్ణించారు. ‘ఇంతకాలం ప్రధాని ఎన్నికల ర్యాలీలు, ప్రభుత్వ పథకాల ప్రకటనలకు అనుగుణంగా ఎన్నికల తేదీలను ఈసీ నిర్ణయించేది. ఇకపై ఎన్నికల సంఘంలో ఎవరు ఉంటారనే త్రిసభ్య కమిటీ చూసుకుంటుంది’ అని ఆప్ నేత సంజయ్ సింగ్ ఆశాభావం వ్యక్తంచేశారు. -
రాష్ట్రపతి ఎన్నికలు; బీజేపీ కీలక కమిటీ
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మిత్రుల మద్దతు కూడగట్టేందుకు బీజేపీ వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ విషయమై ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరిపేందుకుగానూ సోమవారం త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేసింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సోమవారం ఒక ప్రకటన చేశారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అరుణ్‌జైట్లీ, వెంకయ్య నాయుడు సభ్యులుగా కమిటీని ఏర్పాటుచేసినట్లు, రాష్ట్రపతి ఎన్నికల విషయమై ఈ కమిటీ భాగస్వామ్య పక్షాతలో చర్చలు జరపనున్నట్లు అమిత్ షా వెల్లడించారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే విషయాన్ని బీజేపీ ఇంకా వెల్లడించలేదు. ఆయా పార్టీలతో త్రిసభ్య కమిటీ చర్చల తర్వాతే అభ్యర్థిని ప్రకటిస్తారన్నది సుస్పష్టం. ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 14న రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఆ రోజు నుంచే నామినేషన్లు స్వీకరిస్తారు. జూలై 17న పోలింగ్, 20న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల్లో ఎవరి బలమెంత? ఎన్డీయేలోని మిత్రపక్షాలు, మద్దతునిస్తున్న ఇతర చిన్నాచితక పార్టీలతో కలుపుకొంటే అధికార బీజేపీకి ఇప్పుడు ఎలక్టోరల్ కాలేజీలో 48.64 శాతం ఓట్లున్నాయి. యూపీఏ, బీజేపీ వ్యతిరేక పార్టీలను కలుపుకొని ఉమ్మడి అభ్యర్థిని నిలబెడితే వీరికి 35.47 శాతం ఓట్లున్నాయి. మరో ఆరు ప్రాంతీయపార్టీలైన అన్నాడీఎంకే, బీజేడీ, టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, ఆప్, ఐఎన్ఎల్డీలు తమ రాష్ట్ర రాజకీయ అవసరాల దృష్ట్యా బీజేపీ, కాంగ్రెస్‌లకు సమదూరం పాటిస్తూ తటస్థంగా వ్యవహరిస్తున్నాయి. బీజేపీ అభ్యర్థే గెలిచే అవకాశమున్నపుడు మరో అభ్యర్థిని పెట్టడం ఎందుకని, రాష్ట్రపతి, స్పీకర్ లాంటి పదవులకు ఎన్నిక ఏకగ్రీవమవ్వాలని.. దీనిపై చర్చ జరగాలని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వైఎస్సార్సీపీ ఎలక్టోరల్ ఓట్ల శాతం 1.53గా ఉంది. బీజేపీ శిబిరానికి ఇప్పుడున్న బలానికి (48.64 శాతం) వైఎస్సార్సీపీ కలిస్తే వారి అభ్యర్థికి 50.17 శాతం ఎలక్టోరల్ కాలేజీ మద్దతు ఉన్నట్లే. అన్నాడీఎంకే, టీఆర్ఎస్ కూడా ఎన్డీఏ అభ్యర్థికే మద్దతిచ్చే అవకాశాలెక్కువ. (చదవండి: జూలై 17న రాష్ట్రపతి ఎన్నిక) -
అర్చకులకు వేతన నిధి!
దేవాదాయ శాఖ పరిపాలనా నిధి నుంచి ఏర్పాటుకు త్రిసభ్య కమిటీ సిఫారసు దేవాదాయ శాఖ పరిధిలోని అర్చకులు, దేవాలయ ఉద్యోగుల వేతనాల సమస్య త్వరలోనే ఓ కొలిక్కి రానుంది. దేవాదాయ శాఖ పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లిస్తున్నట్లుగానే తమకూ జీతాలు చెల్లిం చాలంటూ అర్చకులు, ఆలయ ఉద్యోగులు ఆందోళన చేస్తున్న తరుణంలో దీనిపై ఓ నిర్ణ యం తీసుకునేందుకు సర్కారు సిద్ధమైంది. ఈ అంశంపై గతంలో నియమించిన త్రిసభ్య కమిటీ తాజాగా నివేదికను అందజేసింది. దేవాదాయ శాఖలోని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర సంచిత నిధి (ఎస్సీఎఫ్) నుంచి... అర్చకులు, దేవాలయ ఉద్యోగులకు దేవాదాయశాఖ పరిపాలన నిధి (ఈఏఎఫ్) నుంచి జీతాలు చెల్లించాలని సూచించింది. ముఖ్యమంత్రి ఆమోదం వస్తే ఈ విధానం త్వరలోనే అమల్లోకి రానుంది. దీంతో సర్కారుపై దాదాపు ఏటా రూ.20 కోట్ల వరకు భారం పడనుంది. - సాక్షి, హైదరాబాద్ దేవాలయ ఉద్యోగుల డిమాండ్.. దేవాదాయశాఖ పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వ సంచిత నిధి నుంచి నెలనెలా వేతనాలు చెల్లిస్తుండగా... ఈ వేతనాల మొత్తాన్ని ఏడాదికోసారి దేవాదాయశాఖ తిరిగి ప్రభుత్వానికి రీయింబర్స్ చేస్తోంది. అర్చకులు, దేవాలయ ఉద్యోగులకు ఆయా దేవాలయాల నుంచే నేరుగా జీతాలు చెల్లిస్తున్నారు. దీంతో తాము వివక్షకు గురవుతున్నామని, తమకు కూడా ట్రెజరీ నుంచే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ దేవస్థానాల ఉద్యోగులు, అర్చకులు జేఏసీగా ఏర్పడి ఆందోళనలు ప్రారంభించారు. గతేడాది ఆలయాల్లో ఆర్జిత సేవలు నిలిపివేసి నిరసన తెలిపారు. దీనిపై స్పందించిన సర్కారు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయగా... తాజాగా ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. కమిటీ ప్రతిపాదనలు.. దేవాదాయ శాఖలోని ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను నేరుగా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రభుత్వానికి రీయింబర్స్ చేసే విధానం నిలిచిపోతుంది. దీంతో దేవాదాయ శాఖకు ఏటా రూ.20 కోట్ల వరకు మిగులుతాయి. ఈ మొత్తాన్ని దేవాదాయశాఖ పరిపాలన నిధికి మళ్లిస్తారు. ప్రతి దేవాలయం తన ఆదాయంలో 12 శాతాన్ని పరిపాలన నిధికి చెల్లిస్తుంది. దీనిని ఇప్పుడు 30 శాతానికి పెంచుతారు. తద్వారా దాదాపు రూ.50 కోట్లు సమకూరుతుంది. ఈ మొత్తాన్ని వేతన నిధిగా రూపొం దించి, అర్చకులు, ఆలయ ఉద్యోగులకు ఒకేరకంగా వేతనాలను చెల్లిస్తారు. దీన్ని సెక్షన్-65 వేతన నిధిగా పరిగణిస్తారు. చట్టాన్ని సవరించాల్సిందే.. దేవాదాయ శాఖలోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించే జీతాల మొత్తాన్ని ఏటా దేవాదాయశాఖ తిరిగి రీయింబర్స్ చేయాలని దేవాదాయశాఖ చట్టం సెక్షన్-69 పేర్కొంటోంది. ఇప్పుడు రీయింబర్స్ విధానాన్ని తొలగించేందుకు చట్టాన్ని సవరించాల్సి ఉంది. ఇక సుప్రీంకోర్టు ఓ కేసులో వెలువరించిన తీర్పు ప్రకారం... ఏదైనా ఓ మతానికి సంబంధించిన సంస్థల్లో ప్రభుత్వ నిధులను వేతనాలుగా వినియోగించకూడదు. అందుకే ప్రభుత్వం చెల్లించే జీతాలను దేవాదాయశాఖ రీయింబర్స్ చేస్తోంది. ఇప్పుడా విధానాన్ని మార్చడం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమనే వాదన వినిపిస్తోంది. అయితే దేవాలయాలు, ప్రార్థనా మందిరాలకు ప్రభుత్వ నిధులు కేటాయించడం వంటివి ఇప్పటికే అమల్లో ఉన్నందున కొత్త విధానం వల్ల ఇబ్బందేమీ ఉండదనే అభిప్రాయాన్ని త్రిసభ్య కమిటీ వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. -
ఆ నియామకాలు అక్రమం అయినా... జీతాలు పెంపు
♦ త్రిసభ్య కమిటీ నివేదిక బుట్టదాఖలు ♦ వైఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో 23 మందికి మేలు ♦ మాజీ ఎమ్మెల్యే అండా దండా..! ప్రొద్దుటూరు టౌన్ : ప్రొద్దుటూరులోని వైఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో 23 మంది నియామకాలు అక్రమంగా జరిగాయని యోగివేమన విశ్వవిద్యాలయం నియమించిన త్రిసభ్య కమిటీ నిర్థారించింది. కాలేజీలో నియామకాలపై వచ్చిన ఆరోపణలు నేపథ్యంలో 2013లో టీవీ.కృష్ణారెడ్డి సారధ్యంలో త్రిసభ్య కమిటీ నియమించారు. కాగా అయినా వారందరికీ జీవో నంబర్- 3 అడ్డు పెట్టుకుని ఈ ఏడాది నుంచి జీతాలు కూడా పెంచేశారు. ఏమి జరిగింది పొద్దుటూరు వైఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఔట్సోర్సింగ్ ద్వారా 32 మంది నియామకానికి ప్రభుత్వం 2013 సెప్టెంబర్ 26వ తేదీ జీవో నంబర్-287 జారీ చేసింది. అయితే వ ర్సిటీ ఉన్నతాధికారులు ఈ జీవోకు విరుద్ధంగా, ప్రభుత్వ నియమాలు పాటించకుండా దినసరి ప్రాతిపదికన 23 మందిని నియమించుకున్నారు. అయితే నోటిఫికేషన్ ఇవ్వకపోవడం తోపాటు రోస్టర్ పద్ధతి కూడా పాటించలేదు. అధికార పార్టీకి చెందిన ఓ నేత ఒత్తిడితో యూనివర్సిటీ అధికారులు ఈ నియామకాలు సాగించారని తెలిసింది. 2008 నుంచి వీరికి డైలీ వేజెస్ కింద ఇప్పటి వరకు వారికి జీతాలు చెల్లిస్తున్నారు. కాగా ప్రభుత్వం 1994 యాక్టు ప్రకారం సెక్షన్(3) సబ్‌సెక్షన్(1)లో ఎంఎంఆర్(నాన్ మస్టర్ రోల్), డైలీ వేజెస్‌లను యూనివర్సిటీ, స్థానిక లోకల్ బాడీస్లలో నియామకాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని కొనసాగింపుగా కొత్త నియామకాలపై నిబంధనలు జారీ చేస్తూ 2013 మార్చి 28న జీవో నంబర్ -94ను కూడా విడుదల చేసింది. త్రిసభ్య కమిటీ విచారణ ఈ నియామకాలపై ఫిర్యాదులు రావడంతో 2013లో అప్పటి యూనివర్సిటీ ఇన్చార్జ్ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ రాజేంద్రప్రసాద్ స్పందించారు. ప్రొఫెసర్లు పాపారావు, టీవీ కృష్ణారెడ్డి, ధనుంజయ నాయుడుతో త్రిసభ్య కమిటీని నియమించారు. ఈ కమిటీ విచారణ చేసి 23 మందిని జీవో, ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా నియమించారని విచారణ నివేదికను వీసికి అందించింది. అడ్డదారిలో జీతాల పెంపు 2010లో ప్రభుత్వ ఉద్యోగులకు పెరిగిన పీఆర్సీ ప్రకారం ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు కింద పని చేసే సిబ్బందికి కూడా జీతాలు పెంచడానికి 2011 జనవరి 12నజీవో నంబర్- 3 ప్రభుత్వం విడుదల చేసింది. ఆ 23 మందికి ఈ జీవో అడ్డు పెట్టుకొని ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జీతాలు పెంచేశారు. ఎలా బయటికి వచ్చిందంటే అక్రమనియామకాల విషయం సమాచార హక్కు చట్టంతో బయట పడింది. దీంతో యూనివర్సిటీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అంతా అధికార పార్టీ నేత ఒత్తిడితోనే ఈ నియామకాలు జరిగాయని ఇటీవల విద్యార్థి సంఘాల ఆందోళనలో యూనిర్సిటీ అధికారి చెప్పారని సమాచారం. -
'మధ్య'లో ఎన్నాళ్లు మునగాలి
‘మధ్యమానేరు ప్రాజెక్ట్‌లో సర్వం కోల్పోతున్నాం. పిల్లజెల్ల సర్వం ఆగమైతంది. నాలుగు రేకులున్నోనికి నలభై వేలోస్తే.. లంకంత కొంప ఉన్నోనికి గవ్వే పైసలిచ్చిరి. ఇవేం లెక్కలు..? ఇదెక్కడి అన్యాయం..? గత సర్కారు నిండా ముంచింది. మన సర్కారు వస్తే బతుకులు బాగుపడతయంటిరి.. ఇప్పుడు మళ్లా గతే పాట పాడుతండ్రెందుకు..?’ అంటూ మధ్యమానేరు నిర్మాణంలో ముంపునకు గురవుతున్న చీర్లవంచ ప్రజలు ఇరిగేషన్ ఈఈ గోవిందరావును నిలదీశారు. - సిరిసిల్ల రూరల్ మంగళవారం సిరిసిల్ల మండలం చీర్లవంచలో త్రిసభ్య కమిటి సభ్యులు ముంపు నిర్వాసితులతో సమావేశమయ్యారు. ప్రాజెక్టు పనులకు సహకరించాలని కోరారు. దీంతో నిర్వాసితులు ఒక్కసారిగా తమ ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు వంద ఇళ్లకు పరిహారం తక్కువ నమోదు చేశారని, ఇష్టం లేకున్నా రెవెన్యూ డిపాజిట్ చేశారని, వాటిని రద్దు చేసి ఇళ్లను రీసర్వే చేయాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు ఎక్కడా లేని అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ సర్కారు వచ్చాక పూర్తి స్థాయిలో పరిహారం వస్తుందని ఆశించామని, మళ్లీ ఇప్పుడూ పాత పాటే ఎత్తుకోవడం విడ్డూరంగా ఉందని నిలదీశారు. ఇతర ప్రాజెక్టుల విషయం తమకు అవసరం లేదని, తమకెంత పరిహారం ఇస్తారో చెప్పాలని కోరారు. అధికారులను తప్పు పట్టడం లేదని, తమ త్యాగాలను గుర్తించాలని సూచించారు. ఈఈ గోవిందరావు మాట్లాడుతూ.. అర్హులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని, అయితే అవార్డు ఎంక్వైరీ అయ్యాక వాటిని మార్చే అధికారం తమకు లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలు, జీవోలను అమలు చేయాల్సిన బాధ్యత తమపై ఉందని, నిర్వాసితుల డిమాండ్లను మంత్రి దృష్టికి తీసుకెళ్తానని హా మీ ఇచ్చారు. ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ కిషన్‌రావు, ఫా రెస్టు సబ్-డీఎఫ్‌వో అశోక్‌రావు, ఆర్డీవో భిక్షానాయక్, తహశీల్దార్ ప్రభాకర్, సర్పంచ్ మంజుల, ఎంపీటీసీలు నర్మెట బాబు నిర్వాసితులు పాల్గొన్నారు. -
బెజవాడలో వైఎస్ఆర్ సీపీ సమీక్షా సమావేశం
విజయవాడ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శనివారం సమీక్షా సమావేశం నిర్వహించింది. హోటల్ ఐలాపురంలో జరుగుతున్న ఈ సమీక్షా సమావేశానికి త్రిసభ్య కమిటీ సభ్యులు విజయ సాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాగి ప్రసాదరావు హాజరయ్యారు. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయటానికి చేపట్టాల్సిన నిర్మాణాత్మక కార్యక్రమాలు, పార్టీపరమైన ఇతర అంశాలపై ఈ సమీక్షా సమావేశంలో చర్చించనున్నారు. జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, 16 నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఇతర ముఖ్యనేతలు సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. -
పార్లమెంటుకు ‘ప్రిలిమ్స్’ సెగ!
పరీక్ష విధానంపై పార్లమెంటులో ఆందోళన సివిల్స్ అభ్యర్థులకు అన్యాయం జరగనివ్వబోమని ప్రభుత్వం హామీ న్యూఢిల్లీ: కేంద్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్ష విధానంపై తలెత్తిన వివాదం శుక్రవారం పార్లమెంటు ఉభయ సభలను కుదిపేసింది. హిందీతోపాటు ప్రాంతీయ భాషల అభ్యర్థులకు నష్టం చేకూర్చేలా ఉన్న సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్(సీఎస్ఏటీ) పేపర్-2ను మార్చాలన్న విపక్షాల డిమాండ్‌తో రాజ్యసభ రెండుసార్లు వాయిదా పడగా లోక్‌సభలో ఈ అంశాన్ని తక్షణమే చర్చకు చేపట్టాలంటూ విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. దీంతో స్పందించిన ప్రభుత్వం అభ్యర్థులకు భాషాపరంగా అన్యాయం జరగబోనివ్వమని హామీ ఇచ్చింది. వివాదాన్ని పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీని వారంలోగా నివేదిక అందించాల్సిందిగా కోరినట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ రాజ్యసభలో ప్రకటన చేశారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకూ అభ్యర్థులు నిరసనల వంటి భౌతిక చర్యలకు దిగరాదని కోరారు. ప్రాంతీయ అభ్యర్థులపై వివక్ష: శరద్ యాదవ్ ప్రభుత్వ ప్రకటనపై విపక్ష సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశంపై జేడీయూ ఎంపీ శరద్ యాదవ్ మాట్లాడుతూ యూపీఎస్సీ పరీక్షలో ప్రాంతీయ భాషల అభ్యర్థులపై వివక్ష ఉంటోందన్నారు. ఈ పరీక్షలో పాసయ్యే తమిళం, తెలుగు, హిందీ, ఇతర భాషల అభ్యర్థుల సంఖ్య భారీగా పడిపోతుంటే అదే సమయంలో ఆంగ్ల మాధ్యమం అభ్యర్థుల సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యిందన్నారు. డీఎంకే ఎంపీ కనిమొళి మాట్లాడుతూ పరీక్ష ప్రశ్నపత్రాలను ప్రాంతీయ భాషల్లోనూ రూపొందించాలని కోరారు. యూపీఎస్సీ పరీక్ష నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలని సీపీఐ ఎంపీ డి. రాజా డిమాండ్ చేశారు. దేశంలో 500 భాషల్లో పరీక్షను నిర్వహించాలా? అంటూ ఇంగ్లిష్ భాషకు అనుకూలంగా కాంగ్రెస్ ఎంపీ గిల్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీలు మండిపడ్డారు. లోక్‌సభలోనూ నిరసనలు... లోక్‌సభలోనూ ఈ అంశంపై విపక్షాలు నిరసనలకు దిగాయి. సభ ప్రారంభం కాగానే ఆర్జేడీ, ఎస్పీ, జేడీయూ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి ఈ అంశంపై తక్షణమే చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. చర్చకు అనుమతించాలంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను ఎస్పీ చీఫ్ ములాయంసింగ్ కోరగా అందుకు ఆమె నిరాకరించారు. మాతృభాషలోనే రాసేందుకు అనుమతించాలి: కేశవరావు సాక్షి, న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ పరీక్షలను మాతృభాషలో రాసేందుకు అనుమతించాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన రాజ్యసభలో ఈ అంశంపై మాట్లాడుతూ.. ‘‘ఒక సమస్యను పార్లమెంటు చర్చించిందంటే ఆ సమస్య దేశ సమస్యగా కేంద్రం అర్థం చేసుకోవాలి. సమస్య లేకుండా చేయాలనే మేమంతా కోరుతున్నాం. మీ వద్ద ఉన్న నిగ్వేకర్ కమిటీ నివేదికను పక్కన పెట్టేశారు. ముందుగా హాల్టిక్కెట్ల పంపిణీని ఆపండి. ఇది ఆందోళన తీవ్రతను తగ్గిస్తుంది. 2012 నుంచి సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూట్ పరీక్ష(సీశాట్)లో రెండు సబ్జెక్టులను ప్రవేశపెట్టారు. విద్యార్థి సామర్థ్యాన్ని పరీక్షించాల్సిన చోట ఆంగ్లాన్ని ప్రవేశపెట్టారు. ఆ పరీక్షను తమ భాషలో నిర్వహించాలని హిందీతోపాటు ఇతర మాతృ భాషల అభ్యర్థులు కోరుతున్నారు.’’ అని కేంద్రాన్ని అన్నారు.గ ఏమిటీ వివాదం... సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో భాగంగా నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్(సీఎస్ఏటీ) పేపర్-2లో కమ్యూనికేషన్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, జనరల్ మెంటల్ ఎబిలిటీ వంటి విభాగాల్లో ప్రశ్నలను ఆంగ్లంలోనే అడగడం వల్ల హిందీ, ఇతర ప్రాంతీయ భాషల అభ్యర్థులు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. అలాగే ప్రశ్నలు కఠినంగా ఉండటంతోపాటు సైన్స్ విద్యార్థులకు ఎక్కువ ప్రయోజనం కలిగించేలానే ఉంటున్నాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.