
సాక్షి, జడ్చర్ల : టీఆర్‌ఎస్ రథసారథి, సీఎం కేసీఆర్ పాల్గొననున్న బహిరంగ సభకు సంబంధించి జడ్చర్లలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కల్వకుర్తి రోడ్డులో దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో సభా ఏర్పాట్లు యుద్ధప్రాతిపాదికన కొనసాగుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 21న ఉదయం 11 గంటలకు జరిగే సభలో కేసీఆర్ పాల్గొంటారు.
ఈ సందర్భంగా సభ ఏర్పాట్లను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జడ్చర్ల టీఆర్‌ఎస్ అభ్యర్థిడాక్టర్ సి.లక్ష్మారెడ్డి సోమవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నుండి హెలీక్యాప్టర్‌లో కేసీఆర్ జడ్చర్లకు చేరుకుంటారని తెలిపారు. ఈ సభకు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి దాదాపు 40 వేల నుండి 50వేల మంది వరకు సభకు హాజరవుతారని పేర్కొన్నారు.
ప్రజలు, టీఆర్‌ఎస్ శ్రేణులు స్వచ్ఛందంగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా, ఏర్పాట్లను మహబూబ్‌నగర్ డీఎస్పీ భాస్కర్‌గౌడ్, జడ్చర్ల సీఐ బాల్‌రాజ్ యాదవ్ తదితరులు కూడా పర్యవేక్షించారు. కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక నాటక అకాడమీ చైర్మన్ శివకుమార్, మార్కెట్ చైర్మెన్ పిట్టల మురళి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కోడ్గల్ యాదయ్యతో పాటు నాయకులు ఉమాశంకర్‌గౌడ్, రమణారెడ్డి, విష్ణువర్దన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment