నీ రంగంలో పనిచేసే కార్మికులకు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు.
హైదరాబాద్: సినీ రంగంలో పనిచేసే కార్మికులకు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు.శనివారం మధ్యాహ్నం ఆయన గచ్చిబౌలి చిత్రపురి కాలనీలో నిర్మించతలపెట్టిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్ సీ) నిర్మాణానాకి కేటాయించిన స్థలాన్ని పరిశీలించి చిత్రపురి సొసైటీ సభ్యులతో చర్చించారు.కాలనీ వాసులకు వైద్య సేవలందించేలా పీహెచ్‌సీలో ఏర్పాట్లు చేస్తామని, సినీ కార్మికులకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని తెలిపారు.