ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన
ఫొటోగ్రాఫర్స్, జర్నలిస్టుల సంక్షేమానికి కృషి
Published Fri, Aug 19 2016 10:43 PM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM
– రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి
జడ్చర్ల : సమాజంలో ఫొటోగ్రాఫర్స్, జర్నలిస్టుల పాత్ర కీలకమని, వారి సంక్షేమానికి కృSషిచేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా బాదేపల్లిలో ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ భవనం నిర్మాణానికి రూ.5లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వెంటనే భవననిర్మాణ పనులు ప్రారంభించాలని సూచించారు. అదేవిధంగా జర్నలిస్టులకు సంబంధించి ఆదర్శవంతమైన కాలనీని నిర్మిస్తామన్నారు. అర్హులయిన ఫొటోగ్రాఫర్స్‌కు డబుల్‌బెడ్‌రూమ్‌లు మంజూరు చేస్తామన్నారు. ఎస్సీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీతో కూడిన బ్యాంకు రుణాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. దాతల సహకారంతో కెమెరాలులేని వారికి సహకరిస్తామన్నారు. అంతకుముందు ఫొటోగ్రఫీ పితామహుడు లూయూస్ డాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఇటీవల అనారోగ్యంతో మతి చెందిన ఫొటోగ్రాఫర్ జైపాల్‌గౌడ్ కుటుంబానికి రూ.20వేల ఆర్థిక సాయం మంత్రి అందజేశారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ జయప్రద, ఎంపీపీ లక్ష్మి, మార్కెట్ వైస్ చైర్మన్ శ్రీశైలం, వైస్ ఎంపీపీ రాములు, కోఆప్షన్ ఇమ్ము, నగర పంచాయతీ కమిషనర్ గంగారాం, మండల అధ్యక్షుడు కోడ్గల్ యాదయ్య, ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్, నాయకులు శ్రీకాంత్, కొండల్, తదితరులు పాల్గొన్నారు.
Advertisement