Photographers
-
ఎన్విరాన్మెంటల్ ఫోటోగ్రాఫర్లు.. ఈ ఏడాది విజేతలు వీళ్లే
పర్యావరణ కాలుష్యం. ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న అత్యంత ముఖ్యమైన సవాళ్లలో ఇది ఒకటి. ప్రపంచానికి పెద్ద విపత్తుగా మారిన పర్యావరణ కాలుష్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించడమే పర్యావరణ ఫోటోగ్రఫీ. పర్యావరణం ఎదుర్కొంటున్న సమస్యల్ని హైలైట్ చేయడమే కాకుండా, తమ కెమెరా పనితీరుతో పర్యావరణ సంరక్షణ గురించి అనుక్షణం గుర్తు చేస్తారు. అలా ఈ ఏడాది కూడా అంతర్జాతీయ పర్యావరణ ఫోటోగ్రాఫర్ ఆప్ ది ఇయర్ విజేతలను ప్రకటించారు. చార్టర్డ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ వాటర్ అండ్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ (CIWEM) ఆద్వర్యంలో గత 16 ఏళ్లుగా ఈ పోటీని నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 159 దేశాల నుంచి ప్రతిభావంతులైన ఫోటోగ్రాఫర్లు ఇందులో పాల్గొన్నారు. వారిలో ఆరుగురిని విజేతలుగా ప్రకటించారు. వాళ్లు తీసిన ఫోటోలు ఏంటి అన్నది తెలియాలంటే ఫోటోగ్యాలరీని క్లిక్ చేయండి. (ఫోటోగ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
జాతీయస్థాయిలో సత్తాచాటిన సాక్షి ఫొటోగ్రాఫర్లు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్)/ నాగాయలంక/తిరుపతి కల్చరల్: అంత ర్జాతీయ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ఫొటో జర్నలిస్ట్ అసోసి యేషన్ (ఏపీపీజేఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి ఫొటో కాంపిటీషన్ ఫలితాలను జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు విడుదల చేశారు. గురువారం విజయవాడలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏపీపీజేఏ అధ్యక్షుడు సీహెచ్‌వీఎస్ విజయ భాస్కర రావు, ప్రధాన కార్యదర్శి వి.రూబెన్ బెసాలి యల్‌తో కలిసి కలెక్టర్ ఫలితాలను విడుదల చేశారు. పోటీల్లో జనరల్ కేటగిరీలో ఎండీ నవాజ్ (సాక్షి, వైజాగ్) ద్వితీయ బహుమతి గెలుచుకున్నారు. ఫొటో జర్నలిజం కేటగిరీలో సాక్షి ఫొటోగ్రాఫర్లు పి.లీలా మోహన్‌రావు (వైజాగ్), వి. శ్రీనివాసులు (కర్నూలు), కందుల చక్రపాణి (విజయవాడ), పి.మను విశాల్ (విజయవాడ), కె.శివకుమార్ (యాదాద్రి), కె.జయ శంకర్ (శ్రీకాకుళం), కేతారి మోహన్‌కృష్ణ (తిరుపతి), ఎస్.లక్ష్మీ పవన్ (విజయవాడ) కన్సొలేషన్ బహుమ తులు గెలుచుకున్నారు. జనరల్ కేటగిరీలో సాక్షి ఫొటోగ్రాఫర్ ఎస్ లక్ష్మీపవన్ (విజయ వాడ) కన్సొలేషన్ బహుమతి గెలుచుకు న్నాడు. ఈ సందర్భంగా ఏపీపీజేఏ అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన పత్రికా ఫొటోగ్రాఫర్ల నుంచి 700 ఎంట్రీలు వచ్చాయన్నారు. విజేతలకు ఈనెల 19న విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వ హించే కార్యక్రమంలో బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. జాతీయ ఫొటో పోటీల్లో కృష్ణప్రసాద్‌కు మెరిట్ అవార్డు వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా నిర్వ హించిన నేషనల్ ఫొటో కాంటె స్ట్–2023లో కృష్ణాజిల్లా నాగాయ లంకకు చెందిన ఫొటోగ్రాఫర్ సింహాద్రి కృష్ణప్రసాద్ పంపిన ఛాయా చిత్రానికి సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ అవార్డు దక్కింది. ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా (పీఏఐ), ఇండియా ఇంటర్నే షనల్ ఫొటోగ్రాఫిక్ కౌన్సిల్ (ఐఐపీసీ) ఆధ్వర్యంలో జాతీయస్థా యిలో నిర్వహించిన ఫొటో పోటీల్లో స్పెషల్ థీమ్ మ్యాని ఫెస్టేషన్స్ ఆఫ్ నేచర్‌లో అండర్ స్టాండింగ్ ది క్లౌడ్స్ విభాగంలో ఆయన పంపిన ‘క్లౌడ్స్ అంబరిల్లా టూ గాడ్’ ఛాయచిత్రం ప్రథమ సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ అవార్డు దక్కించుకుంది. -
ప్రిన్స్ హ్యారీ దంపతుల్ని వేటాడిన కెమెరాలు!.. కొద్దిలో తప్పిన ప్రమాదం
న్యూయార్క్: అమెరికాలో ఓ దాతృత్వ కార్యక్రమానికి వెళ్లొస్తున్న బ్రిటన్ రాచకుటుంబానికి చెందిన ప్రిన్స్ హ్యారీ, భార్య మెఘాన్, అత్త డోరియా రాగ్లాండ్లను మీడియా ఫొటోగ్రాఫర్లు ఫొటోల కోసం వెంబడించారు. ఇది పాతికేళ్ల క్రితం హ్యారీ తల్లి ప్రిన్సెస్ డయానాను పారిస్‌లో కెమెరామెన్లు వాహనాల్లో వెంబడించడం అది విషాదాంతమవడాన్ని గుర్తుచేసింది. ‘ఆరు వాహనాల్లో మీడియా వ్యక్తులు ఏకంగా రెండు గంటలపాటు హ్యారీ వాహనాన్ని వెంబడించారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో పలు వాహనాలు దాదాపు గుద్దుకున్నంత పని జరిగింది. ఈ ఘటనలో పలు వాహనాలు, పాదచారులు, ఇద్దరు న్యూయార్క్ పోలీసు అధికారులు చాలా ఇబ్బంది పడ్డారు’ అని హ్యారీ అధికార ప్రతినిధి బుధవారం వెల్లడించారు. ఘటన తర్వాత పోలీస్ రక్షణలో వారు వెళ్తున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. అయితే అధికారికంగా ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని న్యూయార్క్ పోలీసు విభాగం ప్రకటించింది. లండన్‌లో బ్రిటన్ రాజుగా చార్లెస్ పట్టాభిషేకÙకం తర్వాత దాదాపు నెలరోజుల తర్వాత తొలిసారిగా ఈ జంట మీడియా కంటపడటంతో మీడియా అత్యుత్సాహం చూపి ఉంటుందని వార్తలొచ్చాయి. చదవండి: అమెరికాలో అదృశ్యమైన ఎన్ఆర్ఐ లహరి మృతి -
సాక్షి ఫొటోగ్రాఫర్లకు జాతీయ స్థాయి అవార్డులు (ఫొటోలు)
-
సాక్షి ఫొటోగ్రాఫర్లకు జాతీయ స్థాయి అవార్డులు
సాక్షి, అమరావతి: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫొటోగ్రఫీ అకాడమీ నిర్వహించిన జాతీయస్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో తొమ్మిదిమంది సాక్షి ఫొటోగ్రాఫర్లకు అవార్డులు లభించాయి. ఆగస్టు 1 నుంచి 15వ తేదీ మధ్యలో తీసిన ఫొటోలను పోటీలకు ఆహ్వానించారు. దేశవ్యాప్తంగా 463 మంది 826 ఫొటోలను పంపించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి, సోషల్ ఆంత్రోపాలజిస్ట్ డాక్టర్ ఎస్.విజయ్‌కుమార్‌రెడ్డి, సోషల్ హిస్టోరియన్ డాక్టర్ కొంపల్లి హెచ్.హెచ్.ఎస్.సుందర్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి 75 ఉత్తమ ఛాయాచిత్రాలను ఎంపికచేశారని అకాడమీ ప్రధాన కార్యదర్శి టి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. అకాడమీ ఆవిర్భావ దినోత్సవం (ఆగస్టు 18వ తేదీ) సందర్భంగా విజేతలకు గురువారం విజయవాడలో ‘ప్లాటినం జూబ్లీ ఇమేజ్ అవార్డులు’ ఇవ్వనున్నట్లు చెప్పారు. 75 చిత్రాలతో ఫొటో ప్రదర్శన ఏర్పాటుచేసి, ప్రత్యేక సావనీర్‌ను ఆవిష్కరిస్తామని తెలిపారు. అవార్డులు పొందిన సాక్షి ఫోటోగ్రాఫర్లు: వి.రూబెన్ బెసాలియల్ (విజయవాడ), ఎన్.కిషోర్ (విజయవాడ), ఎస్.లక్ష్మీపవన్ (విజయవాడ), పి.ఎల్. మోహనరావు (వైజాగ్), ఎండీ నవాజ్ (వైజాగ్), వడ్డే శ్రీనివాసులు (కర్నూలు), కె.మోహనకృష్ణ (తిరుపతి), మహబూబ్ బాషా (అనంతపురం), శివ కొల్లోజు (తెలంగాణ). ఇదీ చదవండి: YSR Kadapa: రిజిస్ట్రేషన్లపై నిఘా నేత్రం -
సిటీలో ఇండియన్ ఫొటో ఫెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది అత్యుత్తమ ఫొటోగ్రాఫర్‌ను ఎంపిక చేయడానికి హైదరాబాద్ వేదిక కానుంది. ఇండియన్ ఫొటో ఫెస్టివల్, హెచ్ఎండీఏ, క్రెడాయ్ సంయుక్తంగా తొలిసారి ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. దీనికోసం 85 దేశాల నుంచి ఫోటోగ్రాఫర్లు తమ అత్యుత్తమ ఫోటోలను ఎంట్రీలుగా పంపించారని ఇండియన్ ఫోటో ఫెస్టివల్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ అక్విన్ మాథ్యూస్ తెలిపారు. ఫొటో జర్నలిజం, డాక్యు మెంటరీ, ట్రావెల్ అండ్ నేచర్, వైల్డ్‌లైఫ్, స్ట్రీట్, పోట్రెయిట్, వెడ్డింగ్, మొబైల్స్... మొత్తం 8 కేటగి రీల్లో ఎంపికైన అత్యుత్తమ ఫోటోలకు మొత్తం రూ.25లక్షల పారితోషికాన్ని అందించనున్నట్లు చెప్పారు. ఈ ఫొటో ఉత్సవానికి వచ్చిన ఎంట్రీల ను పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్ మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడు తూ.. వివిధ దేశాల నుంచి వచ్చిన అత్యుత్తమ ఫోటోలను ఈనెల 19 నుంచి వచ్చేనెల 19వరకు మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం రోజున ‘ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును బహూకరిస్తామన్నారు. ఈ సందర్భంగా క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు రామకృష్ణారావు మాట్లాడారు. -
ఒక్క ఫొటో నా జీవితాన్నే మార్చేసింది
సాక్షి, అమరావతి/లబ్బీపేట(విజయవాడ తూర్పు): ఒక్క ఫొటో తన జీవితాన్నే మార్చేసిందని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా చెప్పారు. ఓ ఫొటోగ్రాఫర్ తీసిన ఫొటో వల్లే తనకు సినిమాలో ఆఫర్ వచ్చిందని చెప్పారు. వెయ్యి అక్షరాలతో చెప్పలేని భావాన్ని ఒక్క ఫొటోతో చెప్పవచ్చన్నారు. విజయవాడలో శనివారం విజయవాడ ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్స్ వెల్ఫేర్ సొసైటీ, ఫొటో వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్నివాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పెళ్లిళ్లు, వేడుకలే కాదు.. పేదల ఆకలిని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లేది, వరదల్లో చిక్కుకున్న వారి స్థితిని కళ్లకు కట్టినట్లు చూపించేది, యుద్ధాల్లో భయానక పరిస్థితి ప్రపంచానికి తెలియచేసేది ఫొటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లేనని అన్నారు. ఫొటో కార్నివాల్లో మంత్రి రోజా వేదికపై జాతీయ పతాకాన్ని పట్టుకోగా.. ఒకేసారి 3 వేల మందికిపైగా ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాలతో ఏకకాలంలో ఫొటోలు తీశారు. ఇంతమంది ఒకేసారి ఫొటో తీయడం ‘ఇండియాస్ యూనిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్’లో నమోదైంది. దీనిని వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కోసం కూడా పంపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ చైర్మన్ మాదల రమేష్, అధ్యక్షుడు మెట్ట నాగరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణప్రసాద్, ప్రధాన కార్యదర్శి మోహన్‌రాజ్, కోశాధికారి చిలంకుర్తి శేషు, గెల్లా రాజు, కె.కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
మళ్లీ పొట్టి దుస్తుల్లో రష్మిక పాట్లు.. వీడియో వైరల్
Rashmika Mandanna Uncomfortable In Red Hot Dress: అతికొద్ది సమయంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా మారిపోయింది రష్మిక మందన్నా. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ నేషనల్ క్రష్. తెలుగు, తమిళంలోనే కాకుండా హిందీలోనూ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఆమె సిద్ధార్థ్ మల్హోత్రా తో కలిసిన నటించిన‘మిషన్ మజ్ను’ విడుదలకు సిద్దంగా ఉంది. త్వరలోనే మరో చిత్రం ‘గుడ్‌బై’ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమాలే కాకుండా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే రష్మికకు అభిమానులు ఎక్కువే. అలాగే ఎప్పటికప్పుడు ట్రెండీగా దుస్తులు ధరిస్తూ ఔరా అనిపిస్తుంది ఈ నేషనల్ క్రష్. అయితే ఇదివరకు పొట్టి దుస్తులు ధరించి ఇబ్బందిపడిన ఈ భామ తాజాగా మరోసారి షార్ట్ వేర్లో పాట్లు పడింది. శుక్రవారం (జులై 15) రాత్రి ముంబైలో జరిగిన ఓ అవార్డ్ ప్రోగ్రామ్‌కు హాజరైంది రష్మికా. ఈ ఫంక్షన్లో రష్మిక రెడ్ కలర్ షార్ట్ డ్రెస్‌లో సందడి చేసింది. సాధారణంగా సెలబ్రిటీలను క్లిక్‌మనిపించే ఫొటోగ్రాఫర్లు ఆ వేడుకలో రష్మికతో ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. రష్మికను ఒక సోఫాలో కూర్చొబెట్టి ఫొటోలు దిగారు. అయితే రష్మిక పైకి నవ్వుతున్నప్పటికీ.. కొంచెం ఇబ్బందిపడినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆ డ్రెస్ ఆమె మోకాలి పై వరకు ఉంది. దీంతో తన కాళ్లు కవర్ చేసుకునేందుకు రష్మికా ప్రయత్నించడం చూడొచ్చు. చదవండి: చోర్ బజార్లో రూ.100 పెట్టి జాకెట్ కొన్నా: స్టార్ హీరో అలియా భట్‌కు కవలలు ? రణ్‌బీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. అన్నదమ్ములతో డేటింగ్ చేసిన హీరోయిన్లు.. ఫొటోలు వైరల్ View this post on Instagram A post shared by Filmi United (@filmi_united) ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఇది వరకు బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ బర్త్‌డే పార్టీలో రష్మిక బ్లాక్ షార్ట్ డ్రెస్ ధరించి దర్శనమిచ్చిన విషయం తెలిసిందే. ఆ డ్రెస్‌లో నడవడానికి ఇబ్బంది పడిన రష్మికను నెటిజన్లు ట్రోల్ చేశారు. తాజాగా ఈ రెడ్ షార్ట్ డ్రెస్‌తో మరోసారి రష్మిక నెటిజన్లకు టార్గెట్ అయ్యేలా ఉంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) View this post on Instagram A post shared by rasmika 😎😋🌹 (@jaydeep_.creation) -
సమంతను కాపాడిన బాలీవుడ్ హీరో.. వీడియో వైరల్
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, సమంత తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. సిటడెల్ అనే వెబ్‌సిరీస్ కోసం వీరిద్దరూ జత కడుతున్నారు. ఈ క్రమంలో ఈ ప్రాజెక్ట్ టీం గత రాత్రి సమావేశమాయ్యారు. మీటింగ్ అనంతరం సమంత, వరుణ్ తిరిగి వెళ్లిపోతున్న సందర్భంలో ఫోటో జర్నలిస్టులు తెగ హడావిడి చేశారు. ఫోటోల కోసం చుట్టుముట్టడంతో ఆ ఫోటోగ్రాఫర్ల నుంచి వరుణ్ సమంతను కాపాడారు. 'ఎందుకు అలా ఆమెను భయపెడతున్నారు? భయపెట్టకండి' అంటూ సరదాగా కామెంట్ చేశాడు. దగ్గరుండి సమంతను కారు ఎక్కించాడు. కాగా ప్రముఖ హాలీవుడ్ సిరీస్ సిటడెల్‌కు ఇండియన్ వెర్షన్లో ఓ సిరీస్‌ను తెరకెక్కించనున్నారు. రాజ్ అండ్ డీకేలు దీనికి దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్‌సిరీస్‌తో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన సమంత ఇప్పుడు సిటడెల్‌తో మరింత దగ్గర కానుంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
క్లిక్ చేసే వన దేవతలు
పురుగును నోట కరుచుకున్న పిట్ట గూడుకు గెంతే సమయంలో క్లిక్‌మంటుంది. గట్టున బద్దకపు నిద్ర వదిలించుకున్న మొసలి తిరిగి నీళ్లల్లో దబ్బున పడే సమయాన క్లిక్. చిరుతపులి ఏమీ చేయనక్కర్లేదు. కాస్త కళ్లు మిటకరించినా చాలు– క్లిక్. ఒక ఏనుగు, తొండంతో తన గారాలపట్టిని దగ్గరగా లాక్కుంటుంది... క్లిక్కే. భీతహరిణి సౌందర్యాన్ని క్లిక్‌మనిపించే అదృష్టం అందరికీ ఉండదు. గడప దాటి అడవికి చేరి వనాలలో తిరుగుతూ వన్యప్రాణి సౌందర్యాన్ని చూపే స్త్రీలు ఉన్నారు. ఆర్జూ ఖురానా, రాధికా రామస్వామి, అపరూప డే, అర్పిత ఎస్.మూర్తి, కృష్ణకుమారి... ఈ భారతీయ మహిళా వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్లను తెలుసుకుని ఉండాలి మనం. 50,000 ఎంట్రీలు ప్రపంచవ్యాప్తంగా వస్తే వాటిలో గట్టిగా నిలిచిన మన భారతీయ మహిళా వన్యప్రాణి ఫొటోగ్రాఫర్ ఐశ్వర్య శ్రీధర్ గత సంవత్సరం ‘వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 2020’ అవార్డు గెలుచుకుని మన దేశం పేరును రెపరెపలాడించినప్పుడు వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీని సీరియస్‌గా సాధన చేస్తున్న మహిళలపై అందరి దృష్టి పడిందని చెప్పాలి. వన్యప్రాణుల అపురూప లిప్తలను కెమెరాల్లో బంధించే ఈ స్త్రీలు ఆ పనిలో పొందే ఆనందాలను, ఎదుర్కొనే సవాళ్లను కూడా తెలుసుకోవాలనే కుతూహలం అందరికీ ఏర్పడింది. సాధారణంగా పురుషులకు వీలయ్యే పనిగా ఉన్న ఈ రంగం స్త్రీల ప్రవేశంతో కొత్త కెమెరా చూపును పొందిందని చెప్పాలి. వన్యప్రాణుల పట్ల మాతృస్పర్శతో ఈ స్త్రీలు తీసే ఫొటోల వల్ల వాటి సంరక్షణకు సంబంధించిన చింతన అందరికీ వస్తుంది. ఇష్టమైన పని... కష్టమైన పని బాలీవుడ్ చిత్రం ‘3 ఇడియెట్స్’లో మాధవన్ పాత్రకు వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. కాని తల్లిదండ్రులు అతణ్ణి ఐఐటిలో చేర్పిస్తారు. ఇంజినీరు అవమని పోరుతుంటారు. వారిని ఒప్పించి వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా మారడం అతడికి తలకు మించిన పని అవుతుంది. పురుషులకు కూడా రిస్క్ అని భావించే ఈ పనిలో స్త్రీలు అడుగుపెట్టడం సామాన్యం కాదు. కుటుంబం నుంచి సమాజం నుంచి వీరి పట్ల ఒక ‘కన్సర్న్’ వ్యక్తమవుతూ ఉంటుంది. ‘ప్రమాదం కదూ... ఎందుకొచ్చిన తిప్పలు... ఈ ఫొటోలు తీస్తే ఏం వొస్తుంది’ ఇలాంటి కామెంట్స్ వస్తాయి. కాని ఈ మహిళా ఫొటోగ్రాఫర్లు ఈ అడ్డంకులన్నీ దాటి ముందుకు వచ్చారు. ‘ఒక కెమెరా అందుకో. వనాలలో ప్రవేశించు. వన్యప్రాణులను క్లిక్ చెయ్’ అనే సింపుల్ నినాదంతో కెమెరా పట్టుకుని అడవుల్లో తిరుగుతున్న మహిళా ఫొటోగ్రాఫర్లు ఉన్నారు. తొలి ఫొటోగ్రాఫర్ వసుధ భారతదేశ తొలి వైల్డ్‌లైఫ్ మహిళా ఫొటోగ్రాఫర్‌గా బెంగళూరుకు చెందిన వసుధ చక్రవర్తిని చెప్పాలి. ఆమె నీలగిరి అడవుల్లో స్థానిక గిరిజనుల సహాయంతో అద్భుతమైన వన్యప్రాణి ఫొటోలను తీసింది. వన్యప్రాణుల మీద ఇష్టంతో ఇంటర్నేషనల్ బ్యాంక్‌లో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి కుటుంబ వ్యతిరేకతను పొందింది. కాని ఒక అమాయక జంతువు కళ్లల్లోకి చూస్తే ఎంత పెద్ద కష్టమైనా మర్చిపోవచ్చు కదా అంటుంది. ‘తెలిసిన విషయాలు కొన్ని తెలియని విషయాలు కొన్ని. రెంటి మధ్య తలుపులు ఉంటాయి. చేయవలిసిందల్లా ఆ తలుపులు తెరుచుకుని తెలుసుకోవడమే’ అంటుంది వసుధ. కాని ఆ తలుపులను తెరిచే శక్తి స్త్రీలు పొందవలసి ఉంటుంది. స్వీయ ప్రయత్నం చేయాలి. కుటుంబం మద్దతు తీసుకోవాలి. రాధికా రామసామి మరో నలుగురు వసుధ చక్రవర్తి లానే రాధికా రామసామి కూడా భారతదేశంలో తొలితరం మహిళా వన్యప్రాణి ఫొటోగ్రాఫర్. చెన్నైకు చెందిన రాధిక ఢిల్లీలో స్థిరపడి వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీలో పక్షులను కెమెరాలో బంధించడం ప్రారంభించింది. భారతదేశంలోని అన్ని అభయారణ్యాల్లో తిరిగి అంతరించిపోతున్న అరుదైన పక్షులను ఫొటోలు తీసింది. ఆ తర్వాత ఆఫ్రికా అడవుల్లో కూడా ఆమె కెమెరా ఫొటోల వేట కొనసాగించింది. ‘మనకు ప్రకృతి ఎంత సమృద్ధమైన వనరులు ఇచ్చిందో అడవుల్లో తిరిగితే తెలుస్తుంది.’ అంటుంది రాధికా రామసామి. ఢిల్లీకే చెందిన ఆర్జూ ఖురానా ఇటీవల ఈ రంగంలో పేరు గడిస్తోంది. ‘మిమ్మల్ని ప్రకృతితో ప్రేమలో పడవేయించడం, వనాల పట్ల గౌరవం కలిగేలా వర్ణ చిత్రాలలో మునకలేయించడమే వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ పని’ అంటుంది ఆర్జూ. ఇక కోల్‌కటాకు చెందిన అపురూప డే రెక్కలల్లార్చే పక్షులను క్లిక్ మని పించడంలో ఎక్స్పర్ట్. ‘మీరు ఎక్కడికైనా వెళ్లండి. మీ కోసం ఒక పక్షి ఎదురు చూస్తూ ఉంటుంది’ అంటుందామె. కాలు కుదురుగా ఉండదని ఈ అమ్మాయికి పేరు. అలాగే అర్పిత ఎస్.మూర్తి చిరుతపులులను ఫొటోలు తీసే చిరుతగా గుర్తింపు పొందింది. మన తెలుగు వెలుగు కృష్ణకుమారి తెలుగు వనిత అయిన కృష్ణకుమారి ఒకటి రెండేళ్ల క్రితం సెల్‌ఫోన్‌తో ప్రకృతి చిత్రాలు తీయడాన్ని హాబీగా మొదలెట్టింది. కాని నేడు ఆమె నికాన్ డి 500 ఉపయోగించే ప్రొఫెషనల్ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా ఎదిగింది. ‘ఒకప్పుడు నేను ఇతరులు తీసే ఫొటోలను చూసి ఆశ్చర్యపోయేదాన్ని. ఇవాళ నేను తీసిన ఫొటోలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు’ అంటుందామె. ఇద్దరు పిల్లల తల్లి, వృత్తిరీత్యా జియోఫిజిసిస్ట్ అయిన కృష్ణకుమారి కుటుంబం ప్రోత్సాహంతో ఈ రంగంలో దూసుకువెళుతున్నారు. ‘ప్రకృతిలో ఆశ్చర్యాలకు అంతులేదు. తీస్తూ పో. పంచుతూ పో’ అంటారామె. ఇందుకోసం ఢిల్లీ బర్డ్ఫోటోగ్రాఫర్స్ గ్రూప్‌లో చేరి తర్ఫీదు పొందింది.వన్యప్రాణులు తమ జీవితాన్ని ప్రదర్శనకు పెట్టవు మనుషుల్లాగా. వాటిని తెలుసుకోవాల్సిన బాధ్యత మనదే. వాటి రక్షణకు నిలవాల్సింది మనమే. వారికీ మనకూ వాహకులుగా నిలిచే పని ఈ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్స్ చేస్తున్నారు. మహిళ చేతుల్లో కెమెరా కుదురుగా ఉన్న పసిపాపలా ఉంటుంది. ఆ పసిపాప ప్రతి క్లిక్ దివ్యం. ప్రతి స్నాప్ స్వచ్ఛం. - సాక్షి ఫ్యామిలీ -
‘సాక్షి’ ఫొటోగ్రాఫర్లకు అవార్డుల పంట
సాక్షి, అమరావతి: స్టేట్ ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (స్పాప్) ‘వరల్డ్ ఫొటో జర్నలిజం డే’ సందర్భంగా నిర్వహించిన ‘5వ ఇండియా ప్రెస్ ఫొటో అవార్డ్స్–2020’ జాతీయస్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో ఎ.సతీష్ తీసిన ‘అన్నకు గోరుముద్ద’ ఫొటోకు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫొటోగ్రఫీ (ఎఫ్ఐపీ) గోల్డ్ మెడల్ లభించింది. ‘సాక్షి’ తెలుగు దినపత్రిక ఏపీ, తెలంగాణ ఫొటోగ్రాఫర్లు 19 అవార్డులు సాధించారు. 22 రాష్ట్రాల నుంచి 303 మంది ఫొటో జర్నలిస్టులు ఈ పోటీలో పాల్గొన్నారు. ఓపెన్ కలర్ విభాగంలో వి.రూబెన్ (విజయవాడ)కు 3వ బహుమతి, ఫొటో జర్నలిజం విభాగంలో పి.లీలామోహన్ (వైజాగ్), ఎన్.రాజేష్‌రెడ్డి (హైదరాబాద్), ఎఫ్ఐపీ రిబ్బన్ విభాగంలో పి. విజయకృష్ణ (విజయవాడ). పి.శివప్రసాద్ (సంగారెడ్డి)లకు సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్, ఎస్.లక్ష్మీపవన్ (విజయవాడ)కు యూత్ అచీవ్మెంట్ అవార్డు లభించాయి. కె.మోహనకృష్ణ (తిరుపతి), జి.వీరేష్ (అనంత), డి.హుస్సేన్(కర్నూలు), ఎండీ నవాజ్ (వైజాగ్), జయశంకర్ (శ్రీకాకుళం), పి.సతీష్‌కుమార్ (కాకినాడ), రియాజుద్దీన్ (ఏలూరు), జె.అజీజ్ (మచిలీపట్నం), ఎన్.కిశోర్ (విజయవాడ) కె.చక్రపాణి (విజయవాడ), పి.మనువిశాల్ (విజయవాడ), సురేశ్‌కుమార్ (హైదరాబాద్), భజరంగ ప్రసాద్ (నల్లగొండ)లకు స్పాప్ నేషనల్ అచీవ్మెంట్ అవార్డులు దక్కాయి. -
ఎగతాళి చేసినా లెక్కచేయలేదు
సినిమా ఒక రంగుల ప్రపంచం. ఇరవై నాలుగు విభాగాలతో నడిచే పరిశ్రమ. వాటిల్లో ఎక్కువ భాగం పురుషులే ఉంటారు. మహిళలు రావాలనుకున్నా వింతగా చూస్తారు. ‘మీ వల్ల అవుతుందా?’ అని నిరుత్సాహపరుస్తారు. అడుగడుగునా పైకి కనిపించని అవాంతరాలు సృష్టిస్తారు. అయితే ‘‘వీటన్నిటినీ ఎదుర్కొని ముందుకు వెళ్లాలి’’ అంటున్నారు ఈ ముగ్గురు మహిళా సినిమాటోగ్రాఫర్లు. సినిమా రంగంలో మహిళా సినిమటోగ్రాఫర్ల సంఖ్య చాలా తక్కువ. ఆ తక్కువలో కాస్త ఎక్కువగా ఫౌజియా ఫాతిమా (47), దీప్తి గుప్తా (46), ప్రియా సేథ్ (44) నిలదొక్కుకోగలిగారు. ‘‘గతంతో పోలిస్తే ఇప్పుడు మహిళలు చాలామంది సినిమాఫొటోగ్రఫీ రంగంలోకి వస్తున్నారు. ముఖ్యంగా హిందీ పరిశ్రమలో. అందువల్లే 2015లో ఇండియన్ ఉమెన్ ఫొటోగ్రాఫర్స్ కలెక్టివ్‌ను ప్రారంభించాం. ఆ సంస్థ ద్వారా ఇప్పుడు మరింతమంది మహిళల్ని ఈ రంగంలోకి వచ్చేలా ప్రోత్సహించడం కోసం ఒక ప్రణాళికను రూపొందిస్తున్నాం’’ అంటున్నారు ఫాతిమా, గుప్తా, సేథ్. ప్రధానంగా మహిళా ఫొటోగ్రాఫర్ల సంఖ్య పెంచాలన్నదే వీరి లక్ష్యం. ప్రస్తుతం వీరి సంస్థలో 78 మంది సభ్యులు ఉన్నారు. ఫాతిమా ‘మిత్ర్ మై ఫ్రెండ్’, ‘ముదల్ ముదల్ ముదల్ వారాయ్’ చిత్రాలకు పనిచేశారు. చాలా సంవత్సరాలుగా సినిమాటోగ్రఫీ గురించి పాఠాలు చెబుతున్నారు. దీప్తీ గుప్తా ‘హనీమూన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్’ తో పాటు, మ్యూజిక్ వీడియోలు, డాక్యుమెంటరీలు తీశారు. ‘షటప్ సోనా’ అనే డాక్యుమెంటరీతో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఇక సేథ్‌కి ‘అండర్ వాటర్’ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. దీనితో పాటు కమర్షియల్ యాడ్స్ చేస్తున్నారు. లొకేషన్ స్టూడియో నడుపుతున్నారు. రాజా మీనన్ తీసిన ‘బారహ్ అణా’, ‘ఎయిర్ లిఫ్ట్ అండ్ చెఫ్’ సినిమాలకు పనిచేశారు. కెరీర్లో ఎదిగే క్రమంలో ఈ ముగ్గురూ ఎదుర్కొన్న మూడు భిన్నమైన అనుభవాలను చూస్తే.. వివక్ష ఈ స్థాయిలో ఉంటుందా అనిపిస్తుంది. అదే సమయంలో.. అంతటి వివక్షను తట్టుకుని నిలబడ గలిగినందుకు వీరిని అభినందించి తీరాలనిపిస్తుంది. – జయంతి ఉండే ముఖమేనా? ‘‘నాకు ఐదు సంవత్సరాల వయసున్నప్పుడు మా నాన్నగారు నాకు రేంజ్ౖ ఫెండర్ కెమెరాను ఉపయోగించడం నేర్పించారు. టెలివిజన్‌లో వచ్చే ప్రాంతీయ భాషా చిత్రాలను తప్పనిసరిగా చూస్తాను. నాకు నా ఎనిమిదో ఏట నుంచే గురుదత్ అంటే చాలా ఇష్టం. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్కి దరఖాస్తు చేసుకున్నవారిలో నేను ఒక్కర్తినే అమ్మాయిని. నా కంటే ముందు మహిళలు లేకపోవడం వల్ల నేను ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అక్కడ నన్ను ‘నువ్వు ఈ రంగంలో కొనసాగగలవా?’ అని గుచ్చి గుచ్చి అడిగేవారు. ‘నువ్వు పని చేయాలనుకుంటున్నావా, సెటిల్ అవ్వాలనుకుంటున్నావా’ అంటూ వేధించేవారు. వాళ్ల ఉద్దేశం ఉండే ముఖమేనా అని! ‘అసలు నీకు కెమెరా బరువు ఎంతో తెలుసా?’ అని నన్ను ప్రశ్నించిన సమయంలో, అక్కడ రేణూ సలూజా (ఎడిటర్) ఉన్నారు. ఆవిడ ‘షటప్’ అనటంతో ఆ ఎగతాళికి తెర పడింది’ అన్నారు దీప్తి గుప్తా. హనీమూన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ క్రేన్ ఎత్తగలవా! ‘‘మా ఇంట్లోవాళ్లు సినిమాలు చాలా తక్కువగా చూస్తారు. చిన్నప్పటి నుంచీ సంగీతం వినేదాన్ని, నాటకాలు చూసేదాన్ని. బోర్డింగ్ స్కూల్లో ఉన్నప్పుడు టీవీ చూడనిచ్చేవారు కాదు. పెయింటింగ్స్, ఫొటోల నుంచి చాలా తెలుసుకున్నాను. కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో యుటీవీలో ఇంటర్న్‌షిప్ చేశాను. అప్పట్లో సౌండ్ ఇంజినీర్‌గా కాని సినిమాటోగ్రఫర్‌గా కాని పనిచేయాలనుకునేదాన్ని. నేను న్యూయార్క్‌లో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేస్తున్నప్పుడు, మా ప్రొఫెసర్ నన్ను, ‘ఇంటికి వెళ్లిపోవాలా, పని పూర్తి చేయాలా అని ఆలోచిస్తున్నావ్ కదా’ అని వ్యంగ్యంగా అన్నారు. నాకు ఇటువంటి వివక్ష ఉంటుందని అప్పటివరకు తెలియదు. నేను వెల్హామ్ గర్ల్స్ స్కూల్లో చదువుకున్నాను. అక్కడ లింగవివక్ష ఉండేది కాదు. అక్కడి వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉండేది. నేను సినిమా సెట్లో మొదటిరోజు పనిచేయడానికి వచ్చినప్పుడు, ఒక కుర్రవాడు వచ్చి, ‘నువ్వు ఒక క్రేన్‌ను ఎత్తగలిగితే నీకు వంద రూపాయలు ఇస్తాను’ అన్నాడు వెటకారంగా. నేను రెండు క్రేన్ల బరువు ఎత్తి, రెండు వందలు ఇవ్వమని అడిగాను. నేను నిజంగానే రెండు వందలు అడిగి తీసుకున్నాను’’ అని చెప్పారు ప్రియా సేథ్. నీకో సీట్ వేస్ట్ ‘‘చెన్నైలో ఉంటున్న మా కుటుంబ సభ్యులందరికీ సినిమా పిచ్చి. మా నాన్నగారు హిచ్‌కాక్ సినిమాలు, కౌబాయ్ సినిమాలు చూస్తుంటారు. మా అత్తయ్య శివాజీగణేశన్ అభిమాని. అందువల్ల నేను ఆ పిచ్చిలో మునిగిపోయాను. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు, ‘నీ కోసం సీట్ వేస్ట్ చేయదల్చుకోలేదు’ అన్నారు. నాకు లోపల్లోపలే కోపం వచ్చింది. నేను సినిమాటోగ్రఫీ కోర్సు చేయాలని ఆ రోజే ప్రమాణం చేసుకున్నాను’’ అన్నారు ఫౌజీ ఫాతిమా. -
సుముహూర్తం..మోగనున్న పెళ్లి బాజాలు
వికారాబాద్ అర్బన్ : అధిక జేష్ఠమాసం ఈ నెల 15వ తేదీతో ముగిసింది. దీంతో గత పది రోజులుగా పలు శుభకార్యాలు కొనసాగుతున్నా.. పెళ్లిళ్లకు అనువైన మూహూర్తాలు మాత్రం దొరకలేదు. ఈ నెల 27, 30వ తేదీల్లో వివాహాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. దీంతో వధూవరుల తల్లిదండ్రులు పెళ్లి ఏర్పాట్లలో బిజీబిజీగా ఉన్నారు. జూలై 15 నుంచి ఆషాఢ మాసం రానున్న నేపథ్యంలో ఆగస్టు 15వ తేదీ వరకు ముహూర్తాలు ఉండవు. దీంతో జూలై మొదటి వారంలోనే పెళ్లిళ్లు చేసేందుకు సిద్ధమవుతున్నారు. తీపి గుర్తుగా... మనిషి జీవితంలో ఒకే సారి చేసుకునే పండుగ పెళ్లి. ఈ మూడు ముళ్ల బంధం, తలంబ్రాల కోలాహలం, ఏడు అడుగల నడక.. వందేళ్ల తీపి గుర్తులుగా ఉండిపోవాలని వధూవరులు, తల్లిదండ్రులు ఆశిస్తారు. ఈ సంబరాన్ని ఎప్పుడైనా చూసుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే ఎంత ఖర్చయినా వెనకాడకుండా ఫొటోగ్రఫీ, వీడియోలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందుకోసం ఒక్కొక్కరు తమ స్థాయిని బట్టి రూ.30 వేల నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చు పెడుతున్నారు. ఇటీవల కొందరు డ్రోన్ కెమెరాలతో పెళ్లి వేడుకలను చిత్రీకరిస్తున్నారు. గాలిలో తేలియాడుతూ అత్యంత క్వాలిటీగా ఫొటోలు, వీడియోలు తీస్తుండటంతో డ్రోన్ కెమెరాలకు ఆదరణ పెరిగింది. పెళ్లి మండపంలోనే రెండు, మూడు స్క్రీన్లు ఏర్పాటు చేసి పెళ్లి వేడుకను దగ్గరగా చూసే అవకాశం కల్పిస్తున్నారు. ఇలాంటి ఏర్పాట్లు పెద్దపెద్ద పట్టణాల్లో, ధనికుల పెళ్లి వేడుకల్లో కనిపించేవి. ఇప్పుడు వికారాబాద్, తాండూరు, పరిగి లాంటి చిన్నచిన్న పట్టణాల్లో సందడి చేస్తున్నాయి. మండపాలకు డిమాండ్... పెళ్లి వేడుకలను వైభవంగా చేయాలంటే పెళ్లి మండపాలను ఆశ్రయించాల్సిందే. అక్కడైతేనే అతిథులకు అన్ని రకాల సౌకర్యాలు, విశాలమైన స్థలం ఉంటుంది. ఇందుకోసం పెళ్లి పెద్దలు ఎంత ఖర్చుకైనా వెనకాడటం లేదు. దీంతో పెళ్లి మండపాలకు పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడింది. రెండు నెలల ముందు బుక్ చేసుకుంటే కానీ ఫంక్షన్ హాల్ దొరికే పరిస్థితి లేదు. దీంతో పాటు, డెకరేషన్, క్యాటరింగ్, వీడియో, ఫొటోగ్రాఫర్లను సైతం ముందుగానే బుక్ చూసుకోవాలి. శ్రావణమాసం, భక్తిమాసం... హిందువులు అత్యంత పవిత్రమైనదిగా భా వించేది శ్రావణమాసం. ఈ మాసంలో అత్యధిక మంది భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు, భజ నలు, దీక్షలు చేస్తారు. ఈ నెల మొత్తం చాలా మంది మాంసాహారానికి దూరంగా ఉంటా రు. ఆగస్టు 14వ తేదీ నుంచి శ్రావణ మాసం రానుంది. ఆగస్టు మాసంలో దివ్య మైన మూహూర్తాలు ఉన్నట్లు పురోహితులు చెబుతున్నారు. శ్రావణమాసం పండుగలకు, శుభకార్యాలకు అనువైన మాసం కావడంతో పెళ్లిళ్ల వేడుకలకు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు. మంచి రోజులు.. గత నెల రోజులుగా శుభగడియల కోసం ఎదురు చూసిన వారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పెళ్లి వేడుకలను జరిపించేందుకు రెడీ అవుతున్నారు. జూన్‌లో కొన్ని సుముహూర్తాలు ఉండటంతో నూతన గృహప్రవేశం, పిల్లలకు పుట్టు పంచలు వంటి కార్యక్రమాలు చేశారు. నేటి బుధవారంతో పాటు ఈ నెల 30వ తేదీన మంచి ముహూర్తాలు ఉండటంతో ఫంక్షన్ హాళ్లు ఇప్పటికే బుక్ అయిపోయాయి. జూలై మాసంలో 1, 5, 6, 7తేదీల్లో మంచి గడియలు ఉన్నాయని పురోహితుడు వైభవలక్ష్మి ఆలయ అర్చకుడు అంబదాస్ తెలిపారు. ఆగస్టు మాసంలో 15, 16, 17, 18, 19, 23, 24, 29, 30, 31వ తేదీల్లో, సెప్టెంబర్ 2, డిసెంబర్ 12, 14, 21, 22, 27, 28, 29, 30వ తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నట్లు చెప్పారు. తిరిగి 2019 ఫిబ్రవరి 7వ తేదీ నుంచి మంచి ముహూర్తాలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. -
సాక్షి ఫొటోగ్రాఫర్లకు అవార్డుల పంట
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ప్రెస్ ఫోటో అవార్డ్స్–2017 పేరిట స్టేట్ ఫొటో జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన సలోన్ కాంపిటీషన్లో సాక్షి ఫొటో జర్నలిస్టులకు అవార్డుల పంట పండింది. ఆదివారం విజయవాడలో నిర్వహించిన ఈ పోటీల్లో పలు విభాగాల్లో 24 అవార్డులు దక్కించుకున్నారు. హిందూస్థాన్ టైమ్స్ నేషనల్ ఫొటో ఎడిటర్ టి.నారాయణ్, ‘సాక్షి’ ఫొటో ఎడిటర్ కె.రవికాంత్‌రెడ్డి, ద హిందూ స్పెషల్ న్యూస్ ఫొటోగ్రాఫర్ విజయభాస్కరరావు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. నవంబర్ 1న ప్రపంచ ఫొటో జర్నలిజం దినోత్సవం సందర్భంగా విజయవాడలో అవార్డులను బహుకరిస్తామని చైర్మన్ టి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్పాట్ న్యూస్ ఫొటోల కవరేజ్: ఫస్ట్ ప్రైజ్–నోముల రాజేశ్‌రెడ్డి (హైదరాబాద్); కన్సోలేషన్ ప్రైజులు– మోహన్ కృష్ణ కేతారి (తిరుమల), కె.భజరంగ్ ప్రసాద్(నల్లగొండ), పి.మోహనాచారి (హైదరాబాద్), పి.సతీశ్‌కుమార్ (కాకినాడ) సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్: డి.హుస్సేన్ (కర్నూల్), జి.దత్తు (హైదరాబాద్), రియాజుద్దీన్ షేక్ (ఏలూరు), కందుల రమేశ్‌బాబు (హైదరాబాద్), గుంటపల్లి స్వామి (కరీంనగర్) జనరల్ న్యూస్ ఫొటో కవరేజ్: మూడో బహుమతి–వీర భగవాన్ (విజయవాడ); కన్సోలేషన్ ప్రైజులు– జి.వీరేశ్ (అనంతపూర్), కె.భజరంగ్ ప్రసాద్ (నల్లగొండ), ఐ.సుబ్రహ్మణ్యం (తిరుపతి) స్పోర్ట్స్ న్యూస్ ఫొటో కవరేజ్: రుబిన్ బెసాలియల్ వన్జా (విజయవాడ–సర్టిఫికెట్ ఫర్ మెరిట్), ఎం.అనిల్‌కుమార్ (హైదరాబాద్–మారుతీరాజ్ మెమోరియల్ అవార్డు), జి.బాలస్వామి (హైదరాబాద్–తమ్మ సుబ్బారెడ్డి మెమోరియల్ అవార్డు) స్పాప్ అచీవ్మెంట్ కేటగిరీ: సురేశ్‌కుమార్ (హైదరాబాద్), జి.ప్రసాద్ (రాజమండ్రి), పి.మనూ విశాల్ (విజయవాడ), అరుణ్‌రెడ్డి (ఆదిలాబాద్), పి.మోహన్‌రావు (విశాఖ), ప్రసాద్ మోరబోయిన (ఒంగోలు), వీర భగవాన్ (విజయవాడ) -
రాష్ట్ర స్థాయి ఫొటోగ్రాఫర్లకు బహుమతుల ప్రదానం
నల్లగొండ రూరల్ : ఉత్తమ ఫొటోగ్రాఫర్లుగా రాష్ట్రస్థాయిలో రాణించడం అభినందనీయమని మంత్రి కేటీఆర్, ప్రెస్ అకాడమి చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. శుక్రవారం హైదరాబాదులోని రవీంద్రభారతిలో ఫొటోగ్రఫీ పోటీల్లో రాణించిన వారికి అవార్డులు అందజేసి సన్మానించారు. అవార్డు పొందిన వారిలో ఆర్.ఆకాశ్ (నమస్తే తెలంగాణ), ముచ్చర్ల శ్రీనివాస్‌గౌడ్ (హన్స్ ఇండియా), సింగం వెంకటరమణ (ది హిందూ), నరేందర్ (సూర్య), భవానీప్రసాద్ (ఆంధ్రభూమి) బహుమతులను అందుకున్నారు. -
స్మైల్ ప్లీజ్!
గుంటూరు రూరల్ (అమరావతి) : ‘పుష్కర స్నానం చేశాం. అద్భుతంగా ఉన్న బుద్ధుడి విగ్రహం వద్ద ఫొటోలు దిగితే సూపర్‌గా ఉంటుంది. గుర్తుగా మిగిలిపోతుంది..’ అన్న మాటలు అమరావతిలోని పుష్కర ఘాట్ల వద్ద తరచూ వినిపిస్తున్నాయి. ఆ మాట వినపడగానే లోకల్ ఫొటోగ్రాఫర్లు వారిముందు ప్రత్యక్షమవుతున్నారు. ‘స్మైల్ ప్లీజ్..’ అంటూ ఫొటో తీసి చేతిలో పెట్టి రూ.35 నుంచి రూ.50 వరకు చార్జ్ చేస్తున్నారు. -
ఫొటోగ్రాఫర్స్, జర్నలిస్టుల సంక్షేమానికి కృషి
– రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి జడ్చర్ల : సమాజంలో ఫొటోగ్రాఫర్స్, జర్నలిస్టుల పాత్ర కీలకమని, వారి సంక్షేమానికి కృSషిచేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా బాదేపల్లిలో ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ భవనం నిర్మాణానికి రూ.5లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వెంటనే భవననిర్మాణ పనులు ప్రారంభించాలని సూచించారు. అదేవిధంగా జర్నలిస్టులకు సంబంధించి ఆదర్శవంతమైన కాలనీని నిర్మిస్తామన్నారు. అర్హులయిన ఫొటోగ్రాఫర్స్‌కు డబుల్‌బెడ్‌రూమ్‌లు మంజూరు చేస్తామన్నారు. ఎస్సీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీతో కూడిన బ్యాంకు రుణాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. దాతల సహకారంతో కెమెరాలులేని వారికి సహకరిస్తామన్నారు. అంతకుముందు ఫొటోగ్రఫీ పితామహుడు లూయూస్ డాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇటీవల అనారోగ్యంతో మతి చెందిన ఫొటోగ్రాఫర్ జైపాల్‌గౌడ్ కుటుంబానికి రూ.20వేల ఆర్థిక సాయం మంత్రి అందజేశారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ జయప్రద, ఎంపీపీ లక్ష్మి, మార్కెట్ వైస్ చైర్మన్ శ్రీశైలం, వైస్ ఎంపీపీ రాములు, కోఆప్షన్ ఇమ్ము, నగర పంచాయతీ కమిషనర్ గంగారాం, మండల అధ్యక్షుడు కోడ్గల్ యాదయ్య, ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీధర్, నాయకులు శ్రీకాంత్, కొండల్, తదితరులు పాల్గొన్నారు. -
ఫోటోగ్రాఫర్ల వేటలో హృతిక్ రోషన్!
వృత్తి పరంగా ఎప్పుడూ కెమెరా ముందే ఉండే నటీ నటులు... మిగిలిన జీవితంలో దానికి దూరంగా ఉండాలని చూస్తారు. కానీ ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించడం ఇప్పడు సినీరంగంలోని వారికే కాక, అభిమానులకూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. తన నిత్య జీవితంలో ఎప్పుడూ తన వెన్నంటి ఉండేలా కొంతమంది ఫొటోగ్రాఫర్లను ఆయన హైర్ చేసుకోవాలనుకోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకూ హృతిక్ అలాంటి భిన్నమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారో ఓసారి చూద్దాం. హాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తీసిపోని శరీరాకృతితో... బాలీవుడ్ లో యాక్షన్ సినిమాలకు మారుపేరుగా నిలిచిన హృతిక్ రోషన్.. ఇప్పుడు కొందరు ఫొటోగ్రాఫర్లను తనకోసం నియమించుకుంటున్నారట. ఇకపై తనజీవితంలోని ప్రతి అడుగునూ కెమెరాలో వీడియోలు, ఫొటోల రూపంలో పదిలపరచాలనుకుంటున్నాడట.అందుకోసం ప్రత్యేకంగా కొంతమంది ఫొటో గ్రాఫర్లను నియమించుకొని, షూటింగ్ లతోపాటు, ఇతర సందర్భాల్లోనూ తనతోపాటే ఉండేలా ఏర్పాటు చేసుకుంటున్నాడు. అయితే ఇలా తన డైలీ లైఫ్ కు సంబంధించిన వీడియోలు, ఫొటోలను కేవలం భద్రపరచుకోడానికే తీయించుకోబోతున్నాడా? లేదంటే ఏదైనా ఓ డాక్యుమెంటరీ తీయాలనుకుంటున్నాడా అన్నది ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు అశుతోష్ గోవార్కిర్ కాంబినేషన్ లో క్రీస్తు పూర్వం నాటి కథా నేపథ్యం కలిగిన చిత్రం.. మొహెంజోదారో విడుదల కోసం వేచి చూస్తున్న హృతిక్... ఇప్పుడు ఈ ఫుటేజ్ సేకరించే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నాడన్నది మాత్రం అందరికీ ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది. -
అబ్బుర పరుస్తున్న'బర్త్ ఫొటోగ్రఫీ'
జీవితంలో కొన్ని విలువైన క్షణాలను ఫోటోల రూపంలో దాచుకోవడం మామూలే. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పాటు ఫొటోగ్రఫీ రంగం కూడా అనేక కొత్త పుంతలు తొక్కింది. ఈ నేపథ్యంలో విభిన్నరకాల ఫొటోలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. వీటిలో చెప్పుకోదగ్గది బర్త్ ఫొటోగ్రఫీ. మిగతావాటితో పోలిస్తే ఇది ప్రత్యేకమైనదనే చెప్పాలి. భూ ప్రపంచంలో జీవి పుట్టుకను మించిన అందమైనది మరేదీ లేదన్న లిండ్సే స్ట్రాడ్నర్ మాటలు అక్షర సత్యాలు. బర్త్ ఫొటోగ్రాఫర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ (IAPBP) ప్రచురించిన కొన్ని ఫొటోలు చూస్తే ఇదే నిజమనిపిస్తుంది. 2016 సంవత్సరానికి నిర్వహించిన బర్త్ ఫొటోగ్రఫీ విజేతలను సంస్థ ఇటీవల ప్రకటించింది. ఈ ఫొటోలను సంస్థ వ్యవస్థాపకుడు లిండ్సే వెలువరించారు. ఈ రంగంలో ప్రావీణ్యం కలిగిన ఫొటోగ్రాఫర్లు తీసిన అద్భుతమైన షాట్లు పలువురిని ఆకట్టుకున్నాయి. ఒక కొత్త జీవి ప్రపంచంలోకి అడుగుపెట్టే క్షణాలను అపురూపంగా చిత్రించిన తీరు పలువురిని విస్మయపర్చింది. భావోద్వేగంతో కూడిన ఆ ఆనంద క్షణాలను పదిలంగా ఒడిసిపట్టుకున్న తీరు అద్భుతంగా నిలిచింది. ఈ కళలో ఆర్టిస్టుల నైపుణ్యాన్ని అభినందించి తీరాల్సిందే. ఆ ఫొటోలలో కొన్ని మీ కోసం... -
ఇక 'ఫేస్బుక్' భయం లేదు!
న్యూయార్క్: సామాజిక సంబంధాల వెబ్సైట్ ఫేస్బుక్లో ఖాతాదారులు పోస్ట్ చేసే సమాచారం, ఫొటోలు వారికే సొంతమని, వాటిని తాము అమ్మబోమని ఆ వెబ్సైట్ వర్గాలు స్పష్టం చేశాయి. ఫేస్బుక్లో ఖాతా ప్రారంభించేటప్పుడు తమ సమాచారాన్ని ఉచితంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే ఉపయోగించుకునేందుకు ఖాతాదారులు అంగీకరించాల్సి ఉంటుంది. అయితే ఈ అంగీకారంతో తమ ఫొటోలను ఫేస్బుక్ అమ్ముకుంటుందేమోనని ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఫొటోగ్రాఫర్ల నుంచి ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో యూజర్లు పోస్ట్ చేసే ఫొటోలు, సమాచారాన్ని ఇతర ఫ్లాట్‌ఫామ్‌లపై చూపేందుకే తాము ఈ లెసైన్సును వాడుకుంటామని, ఖాతాదారుల అనుమతి తీసుకోకుండా ఆ సమాచారాన్ని విక్రయించబోమని ఫేస్బుక్ అధికారి మాట్ స్టీన్ఫీల్డ్ వివరణ ఇచ్చారు. ఒక పోస్టును ఖాతాదారులు తొలగించిన వెంటనే దానిపై ఈ లెసైన్సు కూడా ముగిసిపోతుందని, అందువల్ల తొలగించిన పోస్టులను ఏ రకంగానూ వాడుకోబోమని పేర్కొన్నారు. ** -
పిల్లలు తీసిన పెద్ద ఫొటోలు!
-
సల్మాన్ ఖాన్ కార్యక్రమాల బహిష్కరణ
ముంబై: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కార్యక్రమాలను బహిష్కరించాలని ఫోటోగ్రాఫర్లు నిర్ణయించారు. సల్మాన్ 'బిగ్ బాస్ 8' విలేకరుల సమావేశానికి కూడా వారు హాజరుకాలేదు. హిందీ సినిమా 'కిక్' ప్రమోషన్ కార్యక్రమంలో సల్మాన్ బౌన్సర్లు ఫొటోగ్రాఫర్లపై దాడికి దిగడం, ఆ తరువాత ఆ వివాదం తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఆ తరువాత మీడియా ప్రతినిధులు అతనిపై ఆగ్రహంతో ఉన్నారు. ఫొటోగ్రాఫర్ల నిర్ణయం తనకు నష్టపరిచేదైనప్పటికీ, వారి నిర్ణయాన్ని గౌరవిస్తానని సల్మాన్ అన్నారు. తాను వారిపై ఎటువంటి నిషేధం విధించలేదని, వారే తనను బహిష్కరించారని తెలిపారు. ఈ వివాదం శాంతియుతంగా పరిష్కారం కావాలని మీరు అనుకుంటున్నారా? అన్న విలేకరుల ప్రశ్నకు ముందు వారు శాంతియుతంగా మెలగడం అవసరం అన్నారు. వారు మర్యాదపూర్వకంగా వ్యవహరించినంతకాలం, తాను వారితో బాగానే ఉన్నట్లు తెలిపారు. అయితే తాను పాల్గొన్న కార్యక్రమాన్ని ఫొటోగ్రాఫర్లు చేపల మార్కెట్‌గా చేయడాన్ని తాను అంగీకరించనని సల్మాన్ చెప్పారు. ** -
శిథిలాల్లో జీవితాలు
ఒక్కో ఫొటో ఒక్కో సందర్భాన్ని స్ఫురింపజేస్తుంది. ప్రతి ఫొటో వెనుక ఒక కథ ఉంటుంది. కొన్ని చిత్రాలు జీవితంలోని మధురక్షణాలను ఎప్పటికీ నిలిచిపోయేలా చేస్తే.. మరికొన్ని గడిచిన కాలంలో కలచివేసిన సన్నివేశాలను చరిత్రలో నిక్షిప్తం చేస్తాయి. వీటన్నింటినీ మనసుతో క్లిక్ మనిపించే ఫొటోగ్రాఫర్లూ చరిత్రకారులే! వాళ్లు ఒడిసిపట్టిన ఫొటోలను.. వాటి వెనుకనున్న శ్రమ, అనుభూతులను.. ‘లెన్స్ ఎన్ లైఫ్’ శీర్షికతో ప్రతి వారం ‘సిటీ ప్లస్’ మీ ముందుకు తెస్తుంది. తొలిగా.. ‘సాక్షి’ దినపత్రిక ఫొటో ఎడిటర్ కె.రవికాంత్‌రెడ్డి తాను తీసిన ఫొటోల్లో.. ది బెస్ట్‌గా నిలిచిన ఓ చిత్రం వెనుకున్న కథను వివరించారు. 2001 జనవరి 26, ఉదయం 8.46.. గుజరాత్లో భూమి ఒళ్లు విరుచుకుంది. ఆ ధాటికి కరువుసీమగా పేరొందిన కచ్ జిల్లా మొత్తం నేలమట్టమైంది. ఎటు చూసినా శవాలు.. కూలిన ఇళ్ల మధ్య జీవచ్ఛవాలుగా మిగిలిన బతుకులు. చివరకు అహ్మదాబాద్ నగరం కూడా ఓ పక్కకు ఒరిగిపోయింది. ఆ సంఘటన జరిగి 13 ఏళ్లు అయినా.. ఆ భయానక సన్నివేశాలు ఇప్పటికీ నా కళ్ల ముందు కదలాడుతున్నాయి. ఆ సంఘటనలను కవర్ చేయాలనుకున్న తపన నన్నక్కడికి వె ళ్లేలా చేసింది. 1996లో కోనసీమను వణికించిన తుపాన్ తర్వాత నేను కవర్ చేయడానికి వెళ్లిన చాలెంజింగ్ అసైన్మెంట్ ఇదే. చెప్పిందే తడవుగా.. కచ్ భూకంపం వార్త తెలియగానే (అప్పుడు వార్తలో ఉద్యోగం) ఎడిటర్ గారు నన్ను పిలిచి.. గుజరాత్‌కు వెళ్లమన్నారు. ఉన్నఫళంగా రైల్వే స్టేషన్‌కు వెళ్లి జనరల్ టికెట్ తీసుకుని ముంబై ట్రైన్ ఎక్కేశాను. రైల్ కిక్కిరిసి ఉంది. ముంబై వరకు నిలబడే ప్రయాణించాను. ముంబైలో దిగగానే అహ్మదాబాద్ రైల్ ఎక్కాను. జనం ఉండటంతో అహ్మదాబాద్ వరకూ నిలబడే వెళ్లాల్సివచ్చింది. అక్కడ దిగగానే కారు మాట్లాడుకుని కచ్ బయల్దేరా. 350 కిలోమీటర్ల దూరం రాత్రంతా ప్రయాణమే. ఎక్కడ చూసినా.. కచ్ జిల్లాలోని ప్రతి ఊళ్లో శిథిలమైన గృహాలు.. వాడవాడలా అభాగ్యులతో నిండిపోయిన శిబిరాలు.. ఇవే కనిపించాయి. ఆకలితో పేగులు మండుతున్నా.. కొందరు మొహమాటాన్ని జయించలేకపోతున్నారు. ఇంకొందరు పెద్దలు, పిల్లలు తినడానికి.. ఎవరైనా.. ఏమైనా ఇస్తారేమోనని దీనంగా చూస్తున్నారు. జనమంతా రోడ్డుపైనే మకాం వేశారు. మరోవైపు సైనికులు శిథిలాలు తొలగిస్తున్నారు. శిథిలాల లో చిక్కుకున్న తమ ఆప్తులు బతికే ఉంటారన్న ఆశతో అక్కడ వెయ్యి కళ్లతో జనం ఎదురుచూస్తున్నారు. బయట పడుతున్న శవాల్లో తమ వారు ఉండకూడదని దేవుడిని వేడుకుంటున్నారు. రోజుకు 800 కిలోమీటర్లు.. అప్పటికే శాటిలైట్ ఫోన్, డిజిటల్ కెమెరాలతో నేషనల్ మీడియా అక్కడికి వచ్చేసింది. డిజిటల్ కామ్‌తో ఫొటోలు తీయడం.. పంపించడం క్షణాల్లో జరిగిపోతున్నాయి. నా దగ్గరుంది నికాన్ ఎఫ్ఎం 2 కెమెరా. ఫిల్మ్‌తో ఫొటోలు తీయడం.. జిల్లాలో ఎక్కడా కరెంట్ లేకపోవడంతో.. మళ్లీ 350 కిలోమీటర్ల దూరంలోని అహ్మదాబాద్ చేరుకునేవాణ్ని. అక్కడ ఫొటోలు డెవలప్ చేసి.. ప్రింట్ వే సి.. స్కాన్ చేసి హైదరాబాద్ పంపేవాణ్ని. నా అసైన్మెంట్ ఇలా 8 రోజులు సాగింది. రోజుకు 800 కిలోమీటర్లకు పైగా తిరిగాను. రాత్రి ప్రయాణం.. ఉదయం ఫొటోలు తీసి.. మధ్యాహ్నం 2 గంటలకు మళ్లీ అహ్మదాబాద్ బయల్దేరేవాణ్ని. ఇంత కష్టంలోనూ ఒక్క క్షణం కూడా అలసిపోలేదు. అలా పాకిస్థాన్ సరిహద్దు వరకు వెళ్లి కవర్ చేశాను. ఈ అసైన్‌మెంట్‌లో నేను తీసిన ప్రతి ఫొటో వెనుక ఓ హృదయవిదారక కథ ఉంది. మీరు చూస్తున్న ఈ ఫొటో కూడా అలాంటిదే! - కె.రవికాంత్ రెడ్డి -
కొనసాగుతున్నఫొటోల నిషేధం
తెలుగులో హిట్టయిన ‘కిక్’ హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా రీమేకై, శుక్రవారం విడుదలై, పాజిటివ్ టాక్‌తో నడుస్తోంది. అయితే, ఈ చిత్ర ప్రచారం సందర్భంగా పది రోజుల క్రితం ఫొటోగ్రాఫర్లతో, సల్లూ భాయ్‌కి రేగిన వివాదం మాత్రం ఇంకా నడుస్తూనే ఉంది. సాజిద్ నడియాడ్వాలా దర్శకత్వంలో తయారైన ఈ చిత్రాన్ని ప్రత్యేక ప్రదర్శన వేసినప్పుడు ఫొటోగ్రాఫర్లు కూడా హాజరయ్యారు కానీ, సల్మాన్‌ను ఫొటో తీయలేదు. సినీ కార్యక్రమాల్లో సల్మాన్ ఫొటోలు తీయకూడదంటూ, తమకు తాముగా విధించుకున్న నిషేధానికి ముంబయ్ ఫొటోగ్రాఫర్లు కట్టుబడి ఉన్నారు. ఈ నిషేధం ఫలితంగా ‘కిక్’ సినిమా ప్రచార కార్యక్రమాల్లో సల్మాన్ ఖాన్ ఫొటోలు రావడం లేదు. సల్మాన్ దురుసు ప్రవర్తనకు నిరసనగా, ఆయనను బాయ్‌కాట్ చేయాలని ముంబయ్ ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ నిర్ణయించుకున్నప్పటికీ, సినిమా ప్రమోషన్‌కు మాత్రం సహకరించాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆ మాట మీదే నిలబడింది. అయితే, సల్లూ భాయ్ మాత్రం ఫొటోగ్రాఫర్ల నిషేధాన్ని తేలికగా తీసుకొని, ‘వాళ్ళ వల్ల నేనేమీ స్టార్‌ను కాలేద’న్న మాటకే కట్టుబడ్డారు. వెరసి, ప్రత్యేక ప్రదర్శనలో హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్, స్క్రీన్‌ప్లే రచనలో పాలుపంచుకొన్న ప్రముఖ రచయిత చేతన్ భగత్, నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ లాంటి వారి ఫోటోలు తీయడంలో ఫొటోగ్రాఫర్లు మునిగిపోయారు. ‘కిక్’ వాణిజ్య ఫలితం ఎలా ఉన్నా, మీడియాతో ఈ వివాదానికి సల్లూ భాయ్ ఫుల్స్టాప్ పెడితేనే, ఇరు పక్షాలకు మేలని వేరే చెప్పాలా? -
నిషేధించే నిబంధన ఎవరు పెట్టారు?:సల్మాన్ ఖాన్
ముంబై: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మరోసారి మీడియాపై చిందులు తొక్కాడు. తనకు ఫోటోగ్రాఫర్ల పట్ల గౌరవం ఉందంటూనే.. నిషేధించే నిబంధన ఎవరు పెట్టారంటూ ప్రశ్నించాడు. తెలుగులో రవితేజ హీరోగా నటించిన కిక్ సినిమా ఆధారంగా హిందీలో రూపొందుతున్న 'కిక్' ప్రమోషన్ కార్యక్రమంలో చోటు చేసుకున్న వివాదం కాస్తా తారాస్థాయికి చేరింది. ఆ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ బౌన్సర్లు.. ఫోటోగ్రాఫర్లపై దాడికి దిగడమే అగ్నికి ఆజ్యం పోసింది. ఈ ఘటన మీడియా ప్రతినిధులకు ఆగ్రహం రప్పించడంతో సల్మాన్ సినిమా ప్రమోషన్ ను బహిష్కరించాలని నిర్ణయించారు. దీనిపై అగ్గి మీద గుగ్గిలం అవుతున్న సల్మాన్.. అసలు నిషేధించి నిబంధన ఎవరు పెట్టారంటూ ఫోటోగ్రాఫర్లపై తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. 'నా ఫోటోలను చిత్రీకరించనని ఫోటోగ్రాఫర్లు చెప్పగలరా? అంటూ ప్రశ్నించాడు. అసలు నిషేధించే నియమమే ఏ న్యాయసూత్రాల్లో లేనప్పుడు అటువంటి చర్యలకు పాల్పడటం సమంజసమా?అని సల్మాన్ నిలదీశాడు. 'నేను రోడ్డుపై అటుగా వెళుతున్న సమయంలో ఫోటోగ్రాఫర్లు చేతికి పని చెప్పకుండా నిషేధానికే కట్టుబడి ఉండాలి. నా ఫోటోలను ఏ ఫోటో గ్రాఫర్ క్లిక్ మనిపించకూడదు. నేను గర్ల్ ఫ్రెండ్స్ తో వెళుతున్నా కూడా' అంటూ సల్మాన్ ఖాన్ ఫోటో గ్రాఫర్లుకు సవాల్ విసిరాడు.