సల్మాన్ ఖాన్ కార్యక్రమాల బహిష్కరణ | Photographers boycott Salman's 'Bigg Boss' event | Sakshi
Sakshi News home page

సల్మాన్ ఖాన్ కార్యక్రమాల బహిష్కరణ

Published Sat, Sep 13 2014 4:40 PM | Last Updated on Sat, Sep 2 2017 1:19 PM

సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్

ముంబై: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్  కార్యక్రమాలను బహిష్కరించాలని ఫోటోగ్రాఫర్లు నిర్ణయించారు. సల్మాన్ 'బిగ్ బాస్ 8' విలేకరుల సమావేశానికి కూడా వారు హాజరుకాలేదు. హిందీ సినిమా 'కిక్' ప్రమోషన్ కార్యక్రమంలో సల్మాన్ బౌన్సర్లు ఫొటోగ్రాఫర్లపై దాడికి దిగడం, ఆ తరువాత ఆ వివాదం తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఆ తరువాత మీడియా ప్రతినిధులు అతనిపై ఆగ్రహంతో ఉన్నారు.

ఫొటోగ్రాఫర్ల నిర్ణయం తనకు నష్టపరిచేదైనప్పటికీ, వారి నిర్ణయాన్ని గౌరవిస్తానని సల్మాన్ అన్నారు. తాను వారిపై ఎటువంటి నిషేధం విధించలేదని, వారే తనను బహిష్కరించారని తెలిపారు. ఈ వివాదం శాంతియుతంగా పరిష్కారం కావాలని మీరు అనుకుంటున్నారా? అన్న విలేకరుల ప్రశ్నకు ముందు వారు శాంతియుతంగా మెలగడం అవసరం అన్నారు. వారు మర్యాదపూర్వకంగా వ్యవహరించినంతకాలం, తాను వారితో బాగానే ఉన్నట్లు తెలిపారు. అయితే తాను పాల్గొన్న కార్యక్రమాన్ని ఫొటోగ్రాఫర్లు  చేపల మార్కెట్గా చేయడాన్ని తాను అంగీకరించనని సల్మాన్ చెప్పారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement