
ఫొటో షూట్‌ల సందడి ఇటీవల బాగా ఎక్కువైంది.. ఏ శుభకార్యం జరిగినా స్పెషల్ ఫొటో షూట్ ఉండాల్సిందే.. ఇక పెళ్లిళ్ల విషయానికొస్తే ప్రీ వెడ్డింగ్.. పోస్ట్ వెడ్డింగ్.. సాంగ్ షూటింగ్ అంటూ హంగామా చేస్తున్నారు. ఇప్పుడు ఓ మంచి లోకేషన్‌లో చిన్నపాటి సినిమాను తలపించేలా.. సెట్టింగ్‌లు.. యాక్షన్.. అంటూ టేకులు తీసుకుంటూ కొత్త జంటలు మురిసిపోతున్నాయి. ఇందులో పాటలు.. అదిరిపోయే సీన్‌లు.. వెరైటీ ఫోజుల్లో నూతన జంటలు కొత్త లుక్స్‌తో కనిపిస్తున్నాయి. ఈ నయా ట్రెండ్ జిల్లాకు పాకింది. పెళ్లికి అయ్యే ఖర్చులను మించిపోతున్నా ఎవరూ తగ్గదేలేదంటూ కొత్త జంటలు ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ షూట్‌లను బాగా లైక్ చేస్తున్నారు.
కాణిపాకం : పెళ్లి.. జీవితాంతం గుర్తుండిపోయే మధుర వేడుక. ఆ సంబరాలకు సంబంధించిన జ్ఞాపకాలు భద్రంగా ఉండాలి కదా! అందుకో మార్గం ఉంది.. ఫొటో, వీడియో షూట్. అయితే.. ఈ మధ్య ఫొటో, వీడియో షూట్‌ల ట్రెండ్ మారింది. పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్, కపుల్ షూట్ తప్పనిసరి అయిపోయాయి. సినిమాను తలపించే లైటింగ్, ఎఫెక్ట్స్, సెట్టింగులతో ఫొటో, వీడియో షూట్లు నిర్వహిస్తున్నారు. చేయి తిరిగిన ఫొటోగ్రాఫర్, అత్యాధునిక కెమెరా, స్వర్గాన్ని తలపించే లొకేషన్స్ ఎంపిక చేసుకుని ప్రీ వెడ్డింగ్‌లో కిసిక్..కిసిక్‌కుగా కొత్తజంటలు మైమరిచిపోతున్నాయి.
పెళ్లంటే పందిళ్లు....సందళ్లు తప్పెట్లు..తాళాలు తలంబ్రాలూ మూడుముళ్లు..ఏడడు గులు ఇదీ అందరికీ తెలిసిందే. కానీ ప్రస్తుతం వీటి తో పాటు పెళ్లి వేడుకలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. పెళ్లి సంబరాలు చెదరని మధుర జ్ఞాపకంలా జీవితాంతం గుర్తుండి పోయేలా యువతీ యు వకులు పెళ్లికి సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగా ప్రీవెడ్డింగ్ షూట్‌లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. జిల్లాలో ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ ట్రెండ్‌గా మా రింది. కొత్తగా పెళ్లి ఫిక్స్ అయితే ముందుగా ఫ్రీ వెడ్డింగ్ ఫొటో, వీడియో షూట్‌కు రెడీ అవుతున్నారు.
అదిరేలా...
గతంలో పెళ్లాయ్యక హనీ మూన్‌కు ఎక్కడికెళ్లాలి అంటూ అందరితో ఆరా తీసేవారు. ఇప్పుడు నిశి్చతార్థం కాకముందే ప్రీవెడ్డింగ్ ఫొటో, వీడియో షూట్‌కు సిద్ధమవుతున్నారు. అందమైన ప్రదేశంలో ఫొటో, వీడియో షూట్లు తీసే లా ముందస్తుగా ప్లాన్ చేసుకుంటున్నారు. వివాహానికి ముందే వధూ వరులు తమ హావభావాలు, సంభాషణలు, సాన్నిహిత్యాన్ని చిత్రీకరించుకుంటున్నారు. భిన్న కోణాల్లో చూసు కుని మురిసిపోయేందుకు.. రేపటి తరానికి చూపించేందుకు ఎంత వ్యయమైనా వెచ్చించేందుకు వెనుకాడడం లేదు.
ప్యాకేజీలతో...
గతంలో పెళ్లికి ఫొటోలు, వీడియో తీయించుకోవాలంటే తెలిసిన ఫొటోగ్రాఫర్లకు చెప్పుకునేవాళ్లు. కానీ ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేవలం ప్రీ వెడ్డింగ్ షూట్ కాకుండా ఆల్బమ్, వీడియోలు అన్ని కలిపి ప్యాకేజీగా తీసుకుంటున్నారు. దీనికి రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు పలు రకాల ప్యాకేజీలున్నాయి. ఇందులో ప్రీ వెడ్డింగ్ షూట్, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ ఉంటాయి. వివాహానికి కొద్ది రోజుల ముందు, వివాహమైన తర్వాత రెండు రోజుల పాటు ప్రత్యేకంగా షూటింగ్ చేసి వీడియోలను చిత్రీకరిస్తున్నారు. పెళ్లి సీజన్‌లకు అనుగుణంగా ఫొటో, వీడియో గ్రాఫర్లు ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు.
ఈ ప్రాంతాల్లోనే...
జిల్లాలోని రిసార్ట్‌లు, పెద్ద హోటల్ ప్రాంతాలు, రద్దీగా లేని జాతీయ రహదారులు, తమిళనాడులోని వేలూరు, చెన్నై బీచ్, సినిమా స్పాట్లు, పాండిచ్చేరిలోని బీచ్, సినిమా చిత్రీకరించిన ప్రదేశాల్లో ఫొటో, వీడియో షూట్‌కు ఇష్టపడుతున్నారు. కర్ణాటకలోని జారువాలే జలపాతాలు, పొగ మంచుతో కమ్ముకునే ఉండే ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. పల్లె ప్రాంతాల్లో పచ్చని పంట పొలాలు, కొబ్బరి తోటల గట్ల మీద, చెరువులు, పచ్చదనం పరుచుకున్న కొండ ప్రాంతాలను ఎంపిక చేసుకుంటున్నారు.
మీమ్స్ నయా ట్రెండ్
నూతన దంపతులు దిగిన ఫొటోలు, వీడియోలను మీమ్స్ మార్చి వాటిని పెళ్లిలోనే ప్రదర్శించి నవ్వులు పూయిస్తున్నారు. ఎల్‌ఈడీ తెరను ఏర్పాటు చేసుకుని కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి వీక్షిస్తున్నారు. ఈ క్షణాలనూ వీడియో తీసుకుంటున్నారు. ప్రీవెడ్డింగ్ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో రీల్స్ పెట్టడానికి ఎక్కువ జంటలు ఆసక్తి చూపిస్తున్నాయి. అలాగే కుటుంబంలో చనిపోయిన కుటుంబీకులను కూడా బతికి ఉన్నట్లుగా చూపిస్తున్నారు. వధూ వరులను ఆశీర్వదించేలా, కుటుంబీకులతో కలిసి ఫొటోలు దిగేలా తెర మీద చూసుకుంటున్నారు. ఇలాంటి వాటికి ఇప్పుడు మరింత క్రేజ్ ఏర్పడింది.
సాంకేతికతతో.. అద్భుతంగా చిత్రీకరణ
‘ప్రీ వెడ్డింగ్ షూట్’ ద్వారా ఆధునిక కెమెరాలతో ఓ సినిమా పాటలా చిత్రీకరిస్తున్నారు. దీంతో పాటు జీవితాంతం గుర్తుండిపోయేలా ఫొటోకు అదిరిపోయేలా ఫోజులిస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్‌ను చిత్రీకరించేందుకు హైడెన్సిటీ (హెచ్‌ఏ) టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. మంచి క్వాలిటీ ఉన్న‡ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. ఒక షూట్ చేయడానికి కనీసం నలుగురు కెమెరామెన్లు పనిచేస్తున్నారు. డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారు. మూడు నుంచి 4 నిమిషాల నిడివిగల పాటకు సుమారు 2 నుంచి 3 రోజుల పాటు పనిచేస్తారు. ఒక పాటకు ఒక్కోసారి ప్రదేశాలను మార్చాల్సి ఉంటుంది. ప్రదేశం మారిన సమయంలో దుస్తులను మార్చుకోవడం, మేకప్ వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వడంతో సమయం ఎక్కువ పడుతుంది. చిత్రీకరణను పాట రూపంలో తీసుకొచ్చేందుకు ఎంతో శ్రమించాల్సి ఉంటోంది. ఎడిటింగ్‌కు కనీసం 10 రోజుల సమయం పడుతుంది.
ప్రీ వెడ్డింగ్‌తో పనులొచ్చాయి
ముందు అయితే పెళ్లి సీజన్‌లో మాత్రమే గిరాకీలుండేవి. ప్రస్తుతం నడుస్తున్న నయా ట్రెండ్ వల్ల కాస్త చేతికి కావాల్సినంత పని దొరికింది. ప్రీ వెడ్డింగ్ షూట్ల వల్ల పెళ్లికి ఫొటో గ్రాఫర్లు, వీడియో గ్రా ఫర్లు పెళ్లికి ముందే గిరాకీలు వస్తున్నాయి. మంచి నైపుణ్యం ఉన్న వారికి భలే డిమాండ్ ఉంది. అత్యా ధునిక కెమెరాలనే షూట్‌కు వినియోగిస్తున్నాం.
– కృష్ణంరాజు, ఫొటోగ్రాఫర్, చిత్తూరు
Comments
Please login to add a commentAdd a comment