Pre-Wedding Shoots
-
కల్యాణం క‘మనీ’యం
ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు.. ఇప్పుడీ రెండూ బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిపోయాయి. ముఖ్యంగా పెళ్లి ఖర్చులు తడిసి మోపెడై చుక్కలు తాకుతున్నాయి. ప్రీ వెడ్డింగ్ షూట్లని, డెస్టినేషన్ వెడ్డింగ్‌లని ఎవరూ, ఎక్కడా తగ్గేదే లేదంటున్నారు. ఈ మధ్య జరిగిన కుబేరుడు ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి ఏకంగా రూ.5,000 కోట్లు ఖర్చయిందని అంచనా. బడా వ్యాపారవేత్తల పెళ్లిళ్ల భారీ ఖర్చుల విషయాన్ని అలా ఉంచితే.. మామూలు జనం కూడా ఎక్కడా తగ్గడం లేదు. దీంతో సగటు వివాహ ఖర్చు ఏకంగా రూ.32 లక్షలు దాటిపోయింది.దేశంలో వివాహ వేడుకల ముఖచిత్రం వేగంగా మారిపోతోంది. జీవితకాల జ్ఞాపకం కోసం ఖర్చుకు వెనుకాడొద్దనే ధోరణి పెరుగుతోంది. దీంతో సగటు వివాహ వేడుకల ఖర్చు 2023లో రూ.28 లక్షలుగా ఉంటే.. గతేడాది 14 శాతం పెరిగి రూ.32 లక్షల నుంచి రూ.35 లక్షలకు చేరినట్టు వెడ్డింగ్ టెక్నాలజీ ప్లాట్‌ఫాం వెడ్డింగ్ వైర్ ఇండియా నివేదిక చెబుతోంది. దీని ప్రకారం.. 2022–2024 మధ్య కాలంలో పెళ్లి ఖర్చు ఏకంగా 28 శాతం పెరిగింది.2023–24లో వివాహ వేడుకల పరిశ్రమ సుమారు రూ.10.9 లక్షల కోట్లు దాటిపోయినట్టు ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ జెఫరీస్ అధ్యయనంలో వెల్లడైంది. మరోవైపు అతిథుల విషయంలోనూ పెళ్లివారి ధోరణి మారుతోంది. భారీగా 300 మందికిపైగా అతిథులతో జరుపుకొనే వివాహాల సంఖ్య గతేడాది 16 శాతం పెరిగింది. అదే సమయంలో తక్కువ మందితో 100 మందిలోపు అతిథులతో జరుపుకొనే పెళ్లిళ్లు 27 శాతం పెరిగాయి. మొత్తమ్మీద పెళ్లిళ్లకు సగటున గెస్ట్ లిస్ట్ 119గా ఉన్నట్టు నివేదిక పేర్కొంది.కొత్త డెస్టినేషన్లపై మక్కువ..లగ్జరీ విషయంలో రాజీ పడకుండా, మరీ ఎక్కువ మందితో గందరగోళం తలెత్తకుండా కాస్తంత ప్రైవసీ కోరుకుంటున్నవారు పెరుగుతున్నారు. ఈ క్రమంలో దేశీయంగా కొత్త డెస్టినేషన్లు తెరపైకి వస్తున్నాయి. హడావుడిగా ఉండే సాధారణ వెడ్డింగ్ స్పాట్లతో పోలిస్తే ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే ప్రాంతాల వైపు మొగ్గుచూపే వారు పెరుగుతున్నారు. సాధారణంగా జైపూర్, గోవా, ఉదయ్‌పూర్ వంటి ప్రాంతాల ఆధిపత్యం కొనసాగుతున్నప్పటికీ.. మరిన్ని కొత్త ప్రాంతాలూ వెడ్డింగ్ డెస్టినేషన్లుగా తెరపైకి వస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్, డెహ్రాడూన్.. కేరళలోని వయనాడ్ వంటి ప్రాంతాలపై ఆసక్తి పెరుగుతోంది.కొత్త కాన్సెప్టులతో.. ఖర్చు తగ్గించుకునేలా.. భారీ ఖర్చు పెట్టి పెళ్లి చేసుకోవడమే కాదు.. ఖర్చును బాగా తగ్గించుకోవాలనుకునే వారూ ఉంటున్నారు. దీంతో వీక్ డే వెడ్డింగ్లనే కాన్సెప్టులూ ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. ఆదివారాలు, సెలవు రోజులైతే పొలోమంటూ అందరూ వచ్చేసి, ఖర్చులు పెరిగిపోతాయనే ఉద్దేశంతో ఆఫీసులు ఉండే రోజుల్లో పెళ్లిళ్లను ఫిక్స్ చేసుకుంటున్నారు కొందరు. ఇందుకోసం సోమవారం, మంగళవారాలు పాపులర్ చాయిస్‌గా ఉంటున్నాయి. వీకెండ్ వెడ్డింగ్లతో పోలిస్తే ఇవి తక్కువ ఖర్చులో అయిపోతున్నాయి.నవంబర్ టు మార్చ్.. కోటి పెళ్లిళ్లు..సీజన్లపరంగా చూస్తే శీతాకాలంలో పెళ్లికి మొగ్గు చూపే వారు ఎక్కువగా ఉంటున్నారు. మంచి ముహుర్తాలు ఉండటంతో నవంబర్, డిసెంబర్, ఫిబ్రవరిపై ఆసక్తి ఉంటోంది. 2024లో జరిగిన పెళ్లిళ్లలో 18.5 శాతం ఒక్క నవంబర్లోనే జరిగాయి. మొత్తమ్మీద నవంబర్–మార్చి మధ్య ఏటా కోటిపైగా పెళ్లిళ్లు జరుగుతున్నాయని అంచనా. ఆలిండియా ట్రేడర్ల సమాఖ్య గణాంకాల ప్రకారం.. 2023లో పెళ్లిళ్లకు మంచి ముహుర్తాలున్న 23 రోజుల్లో ఏకంగా రూ.4.25 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. అలాంటిది గతేడాది నవంబర్–డిసెంబర్ వెడ్డింగ్ సీజన్లో 35లక్షల పెళ్లిళ్లు జరిగిన నేపథ్యంలో.. రెండు నెలల వ్యవధిలోనే ఇంతకుమించి బిజినెస్ జరిగి ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.స్టాక్ మార్కెట్లో పెళ్లి సందడి..వివాహాల సంబంధ థీమ్‌తో లాభపడే స్టాక్స్ కూడా కొన్ని ఉన్నాయని స్టాక్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వెడ్డింగ్ ప్లానింగ్, కేటరింగ్, ఫొటోగ్రఫీ, జ్యుయలరీ.. ఇలా పెళ్లిళ్లకు సంబంధించి వివిధ రకాల సర్వీసులు అందించే కంపెనీల షేర్లలోనూ సందర్భానుసారం పెట్టుబడులు పెట్టి లాభాలు గడించవచ్చని పేర్కొంటున్నారు. వేదాంత ఫ్యాషన్స్, కల్యాణ్ జ్యువెలర్స్, ఇండియన్ హోటల్స్, టైటాన్ తదితర స్టాక్స్ ఈ జాబితాలో ఉన్నాయని అంటున్నారు.ఆహారం తర్వాత పెళ్లిళ్ల ఖర్చే ఎక్కువ..దేశంలో ఫుడ్–గ్రోసరీ ఇండస్ట్రీ తర్వాత అత్యధికంగా పెళ్లిళ్ల పరిశ్రమ విలువే అత్యధికమని జెఫరీస్ అధ్యయనంలో తేలింది. ఆ వ్యయాల విలువను చూస్తే...పరిశ్రమ విలువ (రూ.లక్షల కోట్లలో)ఫుడ్–గ్రోసరీ 56.9పెళ్లిళ్లు 10.9వస్త్రాలు, యాక్సెసరీస్ 7జ్యువెలరీ 6.5ఫర్నీచర్, హోం 3.5కన్సూమర్ పరికరాలు 3.2మొబైల్ ఫోన్లు 2.7హెల్త్, బ్యూటీ కేర్ 2.7ఫుట్ వేర్ 0.9 -
పెళ్లి మంటపాల్లో ‘డబ్బు’ వాద్యాలు
‘మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్’ అన్నమాట ఎంతవరకు నిజమో కానీ పెళ్లి వేడుకకు ఆకాశమే హద్దుగా మారిందన్నది మాత్రం వంద శాతం నిజం! కిందటేడు అంటే 2024లో ఒక్క నవంబర్, డిసెంబర్ నెలల్లోనే 4.8 లక్షల పెళ్లిళ్లయ్యాయి. అవి ఆరు లక్షల కోట్ల వ్యాపారం చేశాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ నివేదిక! దీని ప్రకారం ఈ మొత్తం 4.8 లక్షల్లో రూ. 3 లక్షల నుంచి రూ. కోటి వరకు ఖర్చు పెట్టిన వివాహాలున్నాయి. ఈ లెక్క చూశాక తెలిసింది కదా.. పెళ్లి ఖర్చుకు ఆకాశమే హద్దు అని! ఆచార సంప్రదాయాలు, వ్యవహారాలు, పెట్టుపోతలు ఇవన్నీ ఆడంబరాలుగా మారి పెళ్లిఖర్చును పెంచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పెళ్లి అనేది ఒక పెద్ద పరిశ్రమగా మారిపోయింది. జనవరి 30 నుంచి పెళ్లి ముహూర్తాలు మొదలయ్యాయి. మార్చి 10 వరకు సందడే సందడి! ఆ సందర్భంగా మ్యారేజ్ ఇండస్ట్రీ, మధ్యతరగతి (Middle Class) మీద ప్రభావం వంటివి స్పృశిస్తూ ఒక కథనం..మన దేశంలో సగటు వివాహ ఖర్చు.. ఒక ఇంటి ఏడాది ఆదాయం కంటే మూడు రెట్లు ఎక్కువ! అది మన దేశ వెడ్డింగ్ ఇండస్ట్రీని (Wedding Industry) దాదాపు రూ. లక్షాపదమూడు కోట్లతో ప్రపంచంలోని అతిపెద్ద పరిశ్రమల్లో ఒకటిగా చేర్చింది. ఇది అమెరికా వెడ్డింగ్ మార్కెట్ (US Wedding Market) కన్నా రెండింతలు పెద్దది. కోవిడ్ తర్వాత పెళ్లి వ్యయం మరింత ప్రియం అయింది. అతిథుల సంఖ్య తగ్గింది. కానీ ఖర్చు నయా పైసా కూడా తగ్గలేదు. ఇదివరకు ఆడపిల్ల పెళ్లంటే బంధువులు, స్నేహితులు అన్నిరకాలుగా అండగా నిలిచి ఉన్నదాంట్లో ఆ వేడుకను సంప్రదాయబద్ధంగా జరిపించి తల్లిదండ్రులు తేలికపడేలా చేసేవారు. మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వారైతే ఇల్లు వాకిలి, పొలమూ పుట్రా అమ్మడమో, తాకట్టు పెట్టడమో చేసి పెళ్లి జరిపించేవారు.అప్పుడు వరకట్నాలు లాంఛనాలు, బంగారం కిందే జమయ్యేవి. ఇప్పుడా సీన్ మారిపోయింది. అమ్మాయిలూ ఉద్యోగాలు చేస్తున్నారు. పర్ఫెక్ట్ ప్లాన్‌తో ఉంటున్నారు. ఆ ప్రణాళికలో పెళ్లికీ ప్రయారిటీ ఇస్తున్నారు. హల్దీ, మెహందీ, సంగీత్, పెళ్లి కూతురు– పెళ్లికొడుకు సహా పెళ్లిని అయిదు రోజుల ఈవెంట్స్‌తో ఘనంగా జరిపించుకోవాలనుకుంటున్నారు. ఫొటోలు, వీడియోలే కాదు సోషల్ మీడియా షాట్స్, రీల్స్గానూ ప్రెజెంట్ చేయాలనుకుంటున్నారు.వీటన్నిటి ఖర్చు కోసం కొలువు తొలిరోజు నుంచే ఆదా చేయడం మొదలు పెడ్తున్నారు. అలా పెళ్లి ఖర్చును అమ్మాయిలు తమ ఖాతాలో వేసుకుంటున్నారు. కట్నకానుకలను మాత్రం తల్లిదండ్రులు తమ బాధ్యతగా భావిస్తున్నారు. అవి స్థిర, చరాస్తులుగా రూపాంతరం చెందాయి. అమ్మాయి పేరు మీదే ఉంటున్నాయి. అవీ పెళ్లి ఖర్చులో భాగమయ్యి, తల్లిదండ్రులు పెట్టే ఖర్చుల జాబితాలో చేరుతున్నాయి. అయితే ఇవి మ్యారేజ్ ఇండస్ట్రీలో కలవని అదనపు ఖర్చన్నమాట. బ్యాచిలర్.. బ్యాచిలరేట్ పార్టీలు కూడా.. దేశంలో సగటు మధ్యతరగతి కుటుంబం కూడా పెళ్లి మీద భారీగా ఖర్చుపెడుతోందంటోంది సీఏఐటీ సర్వే! తెలుగు రాష్ట్రాల్లో అయితే అది కనిష్టంగా రూ. 30 లక్షలు. పెళ్లి వేదిక, వచ్చే అతిథుల సంఖ్య, వంటకాల సంఖ్య, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, సోషల్ మీడియా రీల్స్, షాట్స్ వగైరాలను బట్టి ఈ బడ్జెట్ పెరుగుతుంది. డెస్టినేషన్ వెడ్డింగ్ (Destination Wedding) అయితే అది రూ. కోటి దాటుతోంది. ఈ ΄్యాకేజ్లో బ్యాచ్‌లర్, బ్యాచ్లరెట్ ట్రిప్స్ కూడా ఉన్నాయి.ఇప్పుడు పెళ్లి ఖర్చును వధూవరులిద్దరూ సమంగా పెట్టుకునే ఆనవాయితీ మొదలైంది. ఇది ఒకందుకు మంచి పరిణామంగానే భావించినా.. అసలు పెళ్లనేది వ్యక్తిగత లేదా రెండు కుటుంబాలకు చెందిన వ్యవహారం. దానికి అంతంత ఖర్చుపెట్టాల్సిన అవసరం ఏముందని అబీప్రాయపడుతున్నారు సోషల్ ఇంజినీర్స్. ఫలానా వాళ్ల పిల్లల పెళ్లి కన్నా గొప్పగా తమ పిల్లల పెళ్లి చేయాలని తల్లిదండ్రులు, తమ స్నేహితులు.. కొలీగ్స్ కన్నా ఘనమనిపించుకోవాలని వధూవరులు.. పోటీలకు పోతూ, ఉన్న సేవింగ్స్ అన్నీ ఊడ్చేసుకుని.. అప్పులు కూడా తెచ్చుకుని మరీ పెళ్లి చేస్తున్నారు.. చేసుకుంటున్నారు.ఎస్బీఐ సహా పేరున్న ప్రైవేట్ బ్యాంకులన్నీ పెళ్లిళ్లకు లోన్స్ ఇస్తున్నాయి. పర్సనల్ లోన్ ఖాతాను పెంచడంలో వీటి పాత్ర గణనీయం. కస్టమ్ వెడ్డింగ్ లోన్ప్రోడక్ట్స్ బ్యాంకుల డిమాండ్‌నూ పెంచుతున్నాయి. ఈ అప్పులను తీర్చడానికి ఉన్న ఆస్తులను అమ్ముకుంటున్నారు. తల్లిదండ్రులు ప్రభుత్వోద్యోగులైతే ఆ అప్పులు తీర్చడానికి అవినీతికి పాల్పడిన దాఖలాలూ ఉన్నాయంటున్నారు సోషల్ ఇంజినీర్స్. ఈ అప్పులతో కొత్త పెళ్లిజంట మధ్యలో కూడా స్పర్థలు వచ్చి విడాకుల దాకా వెళ్లిన సంఘటనలూ ఉన్నాయని చెబుతున్నారు.ఇవీ ఉన్నాయి.. ఈ ఘనమైన మాయకు ఇరుగు పొరుగు, బంధుగణం, తోటివాళ్లే కాదు సినిమాలు, సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లూ బాధ్యులు. ‘మురారి’ సినిమా వచ్చిన కొత్తలో మాట.. ఒక ప్రోగ్రెసివ్ కుటుంబంలోని అమ్మాయి ‘మురారీ’ సినిమాలో పెళ్లి సీన్స్‌కి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి.. తన పెళ్లి ఆ సినిమాలో చూపించినట్టే జరగాలని పట్టుబట్టి మరీ ఆ తరహాలోనే పెళ్లి చేసుకుంది. తల్లిదండ్రులు తమ అమ్మాయి పెళ్లికోసం అప్పట్లోనే అయిదు లక్షల రూపాయలు అప్పు చేయాల్సి వచ్చింది. ఇందులో బాలీవుడ్ పాత్రా ఉంది. ఈ మెహందీ, హల్దీ, సంగీత్, డిజైనర్ వేర్ వంటివన్నీ దాని పుణ్యమే! వెడ్డింగ్ ప్లానర్స్, డెస్టినేషన్ వెడ్డింగ్స్, థీమ్ థింగ్స్, ప్రీ వెడ్డింగ్ షూట్, రీల్స్, షాట్స్ లాంటి వాటన్నిటికీ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ఓటీటీ సిరీస్‌ల ప్రభావం కారణమంటున్నారు ట్రెండ్ ఎనలిస్ట్‌లు.వృథా కూడా అదే స్థాయిలో!ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.7 బిలియన్ టన్నులు అంటే మనిషి పండించే పంటలో మూడొంతులు వృథా అవుతోందట. ఈ వృథాలో అధిక వాటా పెళ్లిళ్లు లాంటి వేడుకలదే! అందులో మనమేం తక్కువలేం! ఈ వృథా వల్ల ఇంకొకరి ఆహారపు హక్కును మనం హరించినట్టే! అంతేకాదు.. ఈ ట్రెండ్ ధరలనూ ప్రభావితం చేసి నిత్యవసరాలను అందుకోలేనంత ఎత్తులో పెట్టేస్తోంది. ఇకో ఫ్రెండ్లీ యువత అంతా లగ్జరీ వైపే చూస్తోందని ఆందోళన చెందక్కర్లేదు. పెళ్లనేది పూర్తి వ్యక్తిగత వ్యవహారంగా భావించి రిజిస్టర్ మ్యారేజ్‌తో ఒక్కటవుతున్న జంటలూ ఉన్నాయి. తమ పెళ్లికి ఆత్మీయులు, సన్నిహితుల ఆశీస్సులు అవసరమనుకునేవారు దాన్ని కుటుంబ వేడుకకే పరిమితం చేసుకుంటున్నారు. అనవసర ఖర్చు లేకుండా, స్థానికంగా దొరికే వస్తువులతోనే పర్యావరణహితంగా మలచుకుంటున్నారు. ఈ జంటలే భవిష్యత్ జంటలకు మార్గదర్శకంగా నిలవాలని ఆశిద్దాం! ఈ మెహందీ, హల్దీ, సంగీత్, డిజైనర్ వేర్ వంటివన్నీ సినిమాల పుణ్యమే! వెడ్డింగ్ ప్లానర్స్, డెస్టినేషన్ వెడ్డింగ్స్, థీమ్ థింగ్స్, ప్రీ వెడ్డింగ్ షూట్, రీల్స్, షాట్స్ లాంటి వాటన్నిటికీ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, ఓటీటీ సిరీస్‌ల ప్రభావం కారణమంటున్నారు ట్రెండ్ ఎనలిస్ట్‌లు. – సరస్వతి రమ⇒ పెరుగుతున్న పెళ్లి ఖర్చును అదుపు చేయాల్సిందిగా 2017లో రంజిత్ రంజన్ అనే కాంగ్రెస్ ఎంపీ పార్లమెంట్లో ‘ప్రివెన్షన్ ఆఫ్ వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్ ఆన్ స్పెషల్ అకేషన్స్’ అనే ప్రైవేట్ బిల్‌ను ప్రవేశపెట్టాడు. దీనిప్రకారం పెళ్లికి అతిథుల సంఖ్య వందకు, పదిరకాల వంటకాలు, కానుకల విలువ రూ. 2,500కు మించరాదు. ఎవరైనా పెళ్లి మీద రూ. 5 లక్షలకు మించి ఖర్చు పెడితే పది శాతం డబ్బును ప్రభుత్వ సంక్షేమ నిధికి ఇవ్వాలి. అలా జమ అయిన మొత్తాన్ని ప్రభుత్వం ఏటా పేదింటి ఆడపిల్లల పెళ్లికి ఖర్చుపెట్టాలి. కానీ ఈ బిల్లు ఆమోదం పొందలేదు. చదవండి: పుస్తకాలు మా ఇంటి సభ్యులు⇒ 1993లో నాటి ఒడిశా ముఖ్యమంత్రి బిజు పట్నాయక్.. పెళ్లికి ముందు పెళ్లిలో రూ. 25 వేలకు మించి ఖర్చు చేయకూడదంటూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాడు. కానీ అదీ పాస్ అవలేదు.కన్‌స్ట్రక్టివ్‌గా ఇన్వెస్ట్ చేసుకోవాలిసంపాదించుకుంటున్నాం కదాని ఉన్న సేవింగ్స్ అన్నిటినీ పెళ్లి అట్టహాసాలకే ఖర్చు చేయడం కరెక్ట్ కాదు. ఉన్న వాళ్లు ఎంత ఖర్చుపెట్టుకున్నా పర్లేదు. కాని వాళ్లను మిడిల్‌క్లాస్ పీపుల్ ఫాలో అయితేనే తర్వాత ఆర్థికంగా, ఎమోషనల్‌గా చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పులు చేసి మరీ మన చుట్టూ ఉన్నవాళ్లను మెప్పించడం వల్ల మన ఇల్లు గుల్లవడం తప్ప పైసా ప్రయోజనం ఉండదు. పెళ్లి తర్వాత ఇల్లు, పిల్లలు .. వాళ్ల చదువులు లాంటి ఎన్నో బాధ్యతలుంటాయి. వాటి కోసం సేవింగ్స్‌ని ప్లాన్ చేసుకోవాలి. కష్టపడి సంపాదించుకున్న డబ్బును ఆచితూచి మదుపు చేసుకోవాలి. దానివల్ల మనం సంతోషంగా ఉండటమే కాదు ప్రకృతి వనరులను, శ్రమను గౌరవించిన వాళ్లమవుతాం! – డాక్టర్ కస్తూరి అలివేలు, అసోసియేట్ప్రోఫెసర్, డీన్, డీజీఎస్ సెస్, హైదరాబాద్.డిమాండ్ పెరిగిందిపెళ్లి ఫొటో, వీడియోగ్రఫీలు తక్కువలో తక్కువ రెండు లక్షల నుంచి మొదలు ఈవెంట్స్ కవరేజ్‌ను బట్టి బడ్జెట్ పెరుగుతుంది. ప్రీ వెడ్డింగ్ షూట్స్ కోసం స్టూడియోస్ కూడా ఉన్నాయి. డబ్బుండి, టైమ్ లేని వాళ్లు ఆ స్టూడియోస్‌లో షూట్స్‌ని ప్రిఫర్ చేస్తుంటే.. డబ్బు, టైమ్ రెండూ ఉన్నవాళ్లు విదేశాలకూ వెళ్లి షూట్ చేయించుకుంటున్నారు. మొత్తం మీద ఫొటో, వీడియోగ్రాఫర్స్తోపాటు ఈ స్టూడియోస్కీ డిమాండ్ బాగా పెరిగింది. – వీఎన్ రాజు, వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్కాంప్రమైజ్ అవ్వట్లేదువెడ్డింగ్ సెలబ్రేషన్స్ విషయంలో ఎవరూ కాంప్రమైజ్ అవట్లేదు. కోవిడ్ తర్వాత ఈ ట్రెండ్ మరీ ఎక్కువైంది. పెళ్లికి వచ్చే అతిథులు తగ్గారు కానీ.. వేడుకల విషయంలో మాత్రం ఎవరూ వెనకడుగు వేయట్లేదు. మధ్యతరగతి వాళ్లు కూడా వెడ్డింగ్ ప్లానర్‌ని పెట్టుకుంటున్నారు. ఎంత తక్కువనుకున్నా 30 లక్షల నుంచి మొదలవుతోంది వెడ్డింగ్ బడ్జెట్. డెస్టినేషన్ వెడ్డింగ్స్ అయితే 50.. 60 లక్షలు ఇంకా ఆపై కూడా ఉంటోంది. ఇదివరకు ఈవెంట్స్ అన్నీ ఫొటోలు, వీడియోలకే పరిమితమై ఉండేవి. ఇప్పుడు రీల్స్, షాట్స్‌లో సోషల్ మీడియాలోనూ ప్రెజెంట్ చేయాలనుకుంటున్నారు.బ్రైడ్ అండ్ గ్రూమ్ కొత్త కొత్త ఐడియాలతో వచ్చి వాటిని అమలు చేయడానికి ప్లాన్లు అడుగుతున్నారు. పీర్స్ కన్నా డిఫరెంట్‌గా ఉండాలనీ, తామే ఒక కొత్త ట్రెండ్ సెట్ చేయాలనే ఆలోచనతో వస్తున్నారు. ఎంతైనా ఖర్చు పెట్టడానికి రెడీ అవుతున్నారు. దీంతో వెడ్డింగ్ ప్లానర్స్‌కి డిమాండ్ పెరుగుతోంది. వాళ్లమధ్య పోటీ కూడా ఎక్కువే ఉంటోంది. కొంచెం క్రియేటివిటీ ఉంటే చాలు వెడ్డింగ్ ప్లానర్ అనే బోర్డ్ పెట్టేసుకుంటున్నారు. – వర్ధమాన్ జైన్, వెడ్డింగ్ ప్లానర్ -
అదిరే.. అదిరే..
కాలం మారింది. అందుకు తగ్గట్లుగా పద్ధతులూ మారిపోయాయి. కొత్తకొత్త సంప్రదాయాలు పుట్టుకొచ్చాయి. ఇద్దరి మనసులను కలిపి ఒక్కటి చేసే వివాహమనే ఘట్టంలోనూ నూతన ఒరవడి ఒకటి పురుడుపోసుకుంది. అదే ప్రీ వెడ్డింగ్ షూట్. రూ. లక్షలు ఖర్చవుతున్నా యువత ఎక్కడా తగ్గడం లేదు. సుదూర ప్రాంతాలకు వెళ్లడానికి కూడా సై అంటున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రీ వెడ్డింగ్ షూట్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇటీవల గ్రామీణ ప్రాంతాలకూ ఈ సంస్కృతి వ్యాపించింది. ఒకప్పుడు పెళ్లికి నాలుగు లక్షల రూపాయలైందంటేనే అంతా ఆశ్చర్యపోయేయారు. కానీ, నేడు ప్రీ వెడ్డింగ్ షూట్‌కే రూ.3 లక్షలకు పైగా ఖర్చు చేస్తున్నారు. పెళ్లికి ముందు ఏకంగా నాలుగైదు రోజుల పాటు పర్యాటక ప్రాంతాల్లోనే గడుతుపున్నారు. సంప్ర దాయాలు అడ్డొస్తున్నా పిల్లల ఇష్టాయిష్టాలను కాదనలేక తల్లిదండ్రులు ఓకే చెబుతున్నారు. నిశ్చితార్థం నుంచే.. గతంలో పెళ్లయ్యాక హనీమూన్‌కు ఎక్కడికెళ్లాలి అంటూ అందరితో ఆరా తీసేవారు. ఇప్పుడు నిశ్చితార్థం జరిగిన రోజు నుంచే ప్రీవెడ్డింగ్ షూట్‌కు అనువైన ప్రాంతాలను వెతుకుతుండటం గమ నార్హం. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలు బెంగ ళూరుకు దగ్గరగా ఉండటంతో కర్ణాటకలోని పర్యాటక ప్రదేశాలనూ ఇంటర్నెట్లో చూస్తున్నారు. గండికోటకు క్యూ.. ఎక్కువ జంటలు చారిత్రక కట్టడాలను ప్రీవెడ్డింగ్ షూట్‌కు ఎంపిక చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో చాలా మందికి నచ్చుతున్న వేదికల్లో గండికోట మొదటి వరుసలో ఉంటోంది. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని గండికోట రాజసానికి ప్రతీకగా నిలుస్తోంది. ఇటీవల ఆ ప్రాంతానికి ప్రీ వెడ్డింగ్ షూట్‌కు వెళ్తున్న జంటలు ఎక్కువయ్యాయి. ఆ తర్వాత కర్ణాటకలోని నందిహిల్స్, కూర్గ్, మైసూరు, గోవాతో పాటు బాగా డబ్బున్న వారైతే జైపూర్‌కు వెళుతున్నారు. రెండు నుంచి మూడు లక్షలు.. ఒకేరోజులో అంటే ప్రీ వెడ్డింగ్ షూట్ అయ్యేది కాదు. 2,3 రోజులు అక్కడే ఉండాల్సి వస్తోంది. ఓ కెమెరా మెన్ లేదా ఒక ఫొటోగ్రాఫర్‌ను వెంట తీసుకెళ్లాలి. ఈ క్రమంలో కెమెరామెన్, ఫొటోగ్రాఫర్లకే రూ.1.50 లక్షల వరకూ ముట్టజెబుతున్నారు. బస, ఆహారం, దుస్తుల కొనుగోలు తదితర వాటికి మరో లక్ష పైనే ఖర్చవుతోంది. ఈ మూడు రోజుల ప్రక్రియను ఎడిట్ చేసి పెళ్లినాడు ప్రదర్శిస్తున్నారు. ఒకరినొకరు తెలుసుకోవచ్చు.. ఒకరి మనసు మరొకరు తెలుసుకునేందుకు ప్రీ వెడ్డింగ్ షూట్ ఎంతో ఉపయోగపడుతుంది. మా స్నేహితులు, బంధు వులు ఎంతో ఆడంబరంగా ఈ వేడుక జరుపుకున్నారు. సమయాభావం వల్ల మేం మిస్ అయ్యాం. – పాండ్రే వైష్ణవి, బ్యాంకు ఉద్యోగి -
నువ్వునువ్వుగా,నేనునేనుగా..నా చేయి పట్టుకో ప్రియతమా: అదు-సిద్ధూ ఫోటోషూట్ అదిరిందిగా (ఫొటోలు)
-
బర్రెలక్క పెళ్లి సందడి : ప్రీ-వెడ్డింగ్ వీడియో హల్చల్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి సంచలనం రేపిన యూట్యూబర్ బర్రెలక్క పెళ్లి కబురు ఇటీవల వార్తల్లో నిలుస్తోంది. తాజాగా తనకు కాబోయే భర్తను ఇన్‌స్టగ్రామ్ వేదికగా పరిచయం చేసింది బర్రెలక్క. దీంతో ఈ వీడియో ఇపుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. బర్రెలక్క అలియాస్ శిరీష షేర్ చేసిన వీడియో ప్రకారం ఈ వేసవిలోనే బర్రెలక్క మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనుంది. వరుడు పేరు వెంకట్. అయితే అతడి వృత్తి ఎక్కడి వాడు అనే వివరాలు మాత్రం ఇంకా సస్పెన్సే. కాగా తెలంగాణంలోని పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన శిరీష(బర్రెలక్క) నిరుద్యోగ సమస్యలపై ఇన్‌స్టగ్రామ్‌లో వీడియోలు చేస్తూ బర్రెలక్కగా పాపులర్ అయింది. భారీగా (781 వేలు) ఫాలోయర్లను సంపాదించుకుంది.ఆదాయాన్ని కూడా బాగానే ఆర్జించింది. గత ఏడాది డిసెంబరులో జరిగిన కొల్లాపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ వేయడంతో సోషల్ మీడియా స్టార్ కాస్తా పొలిటికల్ స్టార్ అతరించింది. నిరుద్యోగ యువత, పలు నిరుద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలునుంచి భారీ స్పందనతోపాటు, కొంతమంది రాజకీయ నాయకులు ఆమెకు మద్దతినిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ, రానున్న లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీచేస్తానని ప్రకటించిన శిరీష ఇలా అనూహ్యంగా పెళ్లి పీటలెక్కుతుండటం ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేసింది. View this post on Instagram A post shared by Barrelakka Siri (@princes_siri_barrelakka) -
అయ్ బాబోయ్ ఇదేంటండీ!
‘వెర్రి వెయ్యి విధాలు’ అంటారు. ఆ జాబితాలో అర్జంటుగా చేర్చదగ్గ వెర్రి ఇది. కర్నాటకలోని చిత్రదుర్గ ప్రభుత్వ ఆస్పత్రిలోని కాంట్రాక్ట్–బేస్డ్ ఫిజీషియన్ అభిషేక్ తన ప్రి–వెడ్డింగ్ షూట్ కోసం అందరిలాగా ఆహ్లాదకరమైన, అందమైన ప్రదేశాన్ని ఎంచుకోలేదు. ఏకంగా ఆపరేషన్ థియేటర్‌నే ఎంచుకున్నాడు. ఈ వీడియోలో బెడ్‌పై పడుకున్న పేషెంట్‌కు సర్జరీ చేస్తున్నట్లు డాక్టర్ నటిస్తుంటే, కాబోయే శ్రీమతి సర్జరీకి తనవంతుగా సహకరిస్తున్నట్లు నటించింది. (ఉత్తుత్తి) ఆపరేషన్ పూర్తికాగానే (ఉత్తుత్తి) పేషెంట్ లేచి ‘ఇప్పుడు నాకు ఫరవాలేదు’ అన్నట్లుగా కూర్చోవడం మరో వినోదం. ఆపరేషన్ థియేటర్లో కెమెరాలు, లైట్లతో హడావిడి చేస్తున్న వ్యక్తులు కనిపిస్తారు.ఈ వీడియో వీర లెవెల్లో వైరల్ కావడం మాట ఎలా ఉన్నా సదరు డాక్టర్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.ఈ వీడియో పుణ్యమా అని ప్రభుత్వ ఆస్పత్రుల్లోని లో΄ాల నుంచి వెర్రితలలు వేస్తున్న ప్రి–వెడ్డింగ్ షూట్ల వరకు ఎన్నో విషయాలపై గరం గరంగా నెటిజనులు చర్చ చేస్తున్నారు. -
అంకిత లోఖండే ప్రి-వెడ్డింగ్ వేడుకలు.. ఫొటోలు వైరల్
Ankita Lokhande Pre Wedding Celebrations And Photos Viral: బాలీవుడ్ నటి, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ ప్రేయసి అంకిత లోఖండే త్వరలో వివాహం చేసుకోనుంది. ముంబైలో తన ప్రియుడు విక్కీ జైన్‌తో పెళ్లి పీటలు ఎక్కనుంది. ఈ విషయాన్ని విక్కీ తన ఇన్‌స్టా గ్రామ్‌లో వారి ప్రీ-వెడ్డింగ్ వేడుకల్లోని ఫొటోలను షేర్ చేసుకున్నాడు. ఈ ఫొటోలో వధువు పింక్, గోల్డెన్ బార్డర్‌తో గ్రీన్ కలర్ సారీలో కనిపిస్తుంది. అంకిత కొన్ని సాంప్రదాయ ఆభరణాలను ధరించడం మనం చూడొచ్చు. మరోవైపు విక్కీ జైన్ ఆఫ్-వైట్ కుర్తా వేసుకున్నాడు. అంకిత కూడా 'పవిత్రం' అని క్యాప్షన్ ఇస్తూ ఒక ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంది. View this post on Instagram A post shared by Ankita Lokhande (@lokhandeankita) ఈ పోస్ట్‌లపై పలువురు ప్రముఖులు కామెంట్ బాక్స్‌లో హార్ట్ ఎమోజీస్‌తో తమ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వారం ప్రారంభంలో సన్నిహితుల మధ్య ఈ వేడుకలు జరుపుకున్నారు. వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంకిత, విక్కీ కొన్ని రోజుల క్రితం వారి వెడ్డింగ్ కార్డ్స్ కూడా పంచినట్లు సమాచారం. నవంబర్‌లో అంకిత తన ఫ్రెండ్స్ కోసం బ్యాచిలొరెట్ పార్టీ ఇచ్చిందని తెలుస్తోంది. ఈ జంట డిసెంబర్ 12, 13, 14 తేదిల్లో వివాహం చేసుకోనున్నట్లు పుకార్లు జోరందుకున్నాయి. అయితే ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు. View this post on Instagram A post shared by Vicky Jain (@jainvick) ఇండోర్‌లో జన్మించిన అంకిత 2005లో తన నటన కలను సాకారం చేసుకోడానికి ముంబైకి వచ్చింది. తన టాలెంట్ నిరూపించుకునేందుకు 'టాలెంట్ హంట్ రియాలిటీ షోలో పాల్గొంది. నాలుగేళ్ల తర్వాత 'పవిత్ర రిష్టా' టీవి సీరియల్‌తో పెద్ద బ్రేక్ వచ్చింది. ఈ సీరియల్‌తో పరిచయమైన సుశాంత్ సింగ్‌తో డేటింగ్ చేస్తున్నట్లు 2019లో అంకిత ప్రకటించింది. తర్వాత సుశాంత్‌తో ఆరేళ్ల పాటు రిలేషన్షిప్లో ఉంది. కంగనా రనౌత్ నటించిన 'మణికర్ణిక'తో సినిమాల్లోకి అడుగుపెట్టింది అంకిత. తర్వాత 'బాఘీ 3' చిత్రంలో కూడా నటించింది. -
రానా-మిహికా ప్రీ వెడ్డింగ్ సందడి షురూ!
టాలీవుడ్ అందగాడు రానా దగ్గుబాటి- మిహికా బజాజ్‌ల వివాహం ఆగస్ట్ 8న జరగనున్న విషయం తెలిసిందే. ఈ పెళ్లి కోసం ఇరు కుటుంబాలు ఇప్పటి నుంచే పెళ్లి పనుల్లో మునిగిపోయాయి. ఈ విషయాన్ని కొత్త పెళ్లి కూతురు మిహికా బజాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. వేడుకలు కొనసాగుతున్నాయంటూ తన ఫొటోను పంచుకుంది. ఇందులో వధువుగా ముస్తాబైన మిహికా రాయల్ లుక్‌లో మెరిసిపోతోంది. ధగధగ మెరిసిపోతున్న నగలు ధరించిన ఆమె చిరునవ్వులు చిందిస్తోంది. ఆమె ముఖంలో పెళ్లి కళ కొట్టొచినట్లు కనిపిస్తోంది. (ఆగస్టులోనే రానా పెళ్లి) ఈ ఫొటో చూస్తుంటే ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ ప్రారంభమైనట్లే తెలుస్తోంది. కాగా లాక్డౌన్ నిబంధనల వల్ల కొద్ది మంది అతిథుల సమక్షంలోనే వివాహం జరిపించనున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో ఈ పెళ్లి వేడుకను ఎక్కడ నిర్వహించనున్నారనేది ఇంకా వెల్లడించలేదు. కాగా తాను ప్రేమలో ఉన్నానంటూ రానా గత నెలలో బాంబు పేల్చిన విషయం తెలిసిందే. అయితే ప్రేమ విషయాన్ని ప్రకటించిన కొద్ది రోజుల్లోనే పెళ్లి ముహూర్తం పెట్టేసుకోవడం విశేషం. అటు మెగా డాటర్ నిహారిక కొణిదెల కూడా పెళ్లికి సిద్ధమైన విషయం తెలిసిందే. (ఇది ఆరంభం.. ఇక ఎప్పటికీ: మిహీకా) -
లవ్ షూట్స్
ఓ సాయంత్రం.. తారామతి బారాదరిఆవరణలో అందమైన జంట.. ఆనందంగా ఊసులాడుకుంటూ వె ళ్తోంది. అక్కడక్కడా ఆగుతున్నారు. దగ్గరగా చేరి కంటి చూపులతో గుసగుసలాడుకుంటున్నారు. ఓసారి కూర్చుంటున్నారు. అకస్మాత్తుగా పరుగులు పెడుతున్నారు. నవ్వులను పంచుకుంటున్నారు. పువ్వులు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. వారిని చూసి ఎవరైనా అందమైన ప్రేమజంట అనుకుంటారు. ఆ జంటని ఎవరైనా దొంగచాటుగా ఫొటోలు తీయడం చూస్తే.. ఒళ్లు మండుద్ది. ‘ప్రైవసీని డిస్ట్రబ్ చేస్తున్నారు.. ఎవర్రా మీరు?’ అని వాయిస్ పెంచాలనిపిస్తుంది. అయితే ఆ జంటే అలా సీక్రెట్‌గా ఫొటోలు తీయమని వారిని పురమాయించారని తెలిస్తే.. ..:: ఎస్.సత్యబాబు అరేంజ్డ్ మ్యారేజ్ అయినంత మాత్రాన, ఇలా చూసి అలా ఓకే చేసుకుని మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నంత మాత్రాన.. లవర్స్‌కు మాత్రమే దక్కే కొన్ని స్వీట్ నథింగ్స్ కోల్పోవాలా? ఈ ప్రశ్నకు సమాధానం లవ్షూట్స్ లేదా ప్రీ వెడ్డింగ్ షూట్స్. ఇవి కనీసం కొన్ని రోజులు లేదా గంటల పాటు ప్రేమికులుగా జీవించే అవకాశాన్ని యువతీ యువకులకు కల్పిస్తున్నాయి. నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్.. సిటీ పార్కులు, ఇంకా మరికొన్ని చోట్ల జంటలు కనువిందు చేస్తున్నాయి. ఫొటోగ్రాఫర్లతో మాట్లాడి ముందస్తు ప్లాన్‌తో సహజంగా ఉండేలా అరేంజ్ చేసుకుంటున్నారు. ‘సంప్రదాయం కట్టుకున్న పెళ్లి ఫొటోలకు భిన్నంగా ప్రేమ పూర్వక జ్ఞాపకాల కోసం ఫొటో షూట్ పెట్టుకున్నాం’ అని ఇటీవలే పెళ్లి చేసుకున్న హర్షా రాఘవ చెప్పారు. ఈ షూట్స్ పుణ్యమాని ‘మా ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ బాగా కుదిరింది’ అని సంతోషంగా చెప్పుకొచ్చాడు. ప్రేమికులారా జిందాబాద్.. స్నేహితుల కోసం ఫేస్బుక్, వాట్సప్‌లలో పెళ్లికి ముందుగానే కలసి దిగిన ప్రేమ ఫొటోలను అప్లోడ్ చేస్తున్నారు. పెద్దలు కుదిర్చిన వివాహమే అయినా.. తమది ప్రేమ పెళ్లి అనేంతగా అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు. ప్రేమికుల్లా గడపాలనుకోవడంతో పాటు పెళ్లికి ముందే ఈడు జోడు ఉన్న మంచి జంటగా ఆహ్వానితులు భావించాలనే కోరిక కూడా ఈ ముందస్తు ఫొటో షూట్లకు పురిగొల్పుతోంది. వీటినే వెడ్డింగ్ ఇన్వైట్స్గానూ వినియోగిస్తున్నారు. తామిద్దరూ కలసి ప్రయాణించబోతున్నామని చెప్పడానికి సింబాలిక్‌గా రోడ్ మీద నడుస్తున్నట్టు, సంసారమనే సాగరంలో ఈదబోతున్నామని చెప్పేందుకు గుర్తుగా నది ఒడ్డున కూర్చున్నట్టు.. అన్యోన్య దాంపత్యం ముంగిట ఉన్నట్టుగా చెప్పడానికి ముచ్చట్లు చెప్పుకుంటున్నట్టు, ఇలా రోజుకో రకమైన ఫొటోను అప్లోడ్ చేస్తూ నియర్ అండ్ డియర్‌లో తమ పెళ్లిపై ఆసక్తిని పెంచుతున్నారు. అంతేకాకుండా ఆ ఫొటోలపై ‘సేవ్ ద డేట్ ప్లీజ్’ వంటి క్యాప్షన్లు పెడుతూ వారికి తమ పెళ్లితేదీ గుర్తుండేలా చేస్తున్నారు. ‘మాది అరేంజ్డ్ మ్యారేజ్. ఇద్దరికీ పెద్దగా పరిచయం లేదు. ఒకేసారి పెళ్లిలో, రిసెప్షన్లో సన్నిహితంగా నిలుచుని ఫొటోలకు ఫోజులు ఇవ్వడం ఇబ్బందిగా అనిపిస్తుందేమోనని ఆలోచించినప్పుడు ఒక ఫ్రెండ్ లవ్ షూట్స్ ఐడియా చెప్పాడు. సిటీలోని కొన్ని ప్లేసెస్‌లో షూట్ చేశాం. దీని కోసం మేమిద్దరం రెండు రోజుల పాటు కలిసి గడపడం, ఫొటోగ్రాఫర్ల కోసం సహజ ప్రేమికుల్లా ప్రవర్తించడం మా ఇద్దరి మధ్యా సరికొత్త అనుభూతిని కలిగించింది’ అని చెప్పారు మాదాపూర్ నివాసి రాజ్‌కిషోర్. దిల్వాలే దుల్హనియా లేజాయేంగే.. సినిమా హీరో, హీరోయిన్ల స్టిల్స్ తరహాలో తాము కూడా కనపడాలనే తపన కూడా ఈ తరహా షూట్స్‌కు ఆదరణ పెంచుతోంది. గోవాలో నివసించే షాదిగ్రాఫర్స్ సంస్థ సహ వ్యవస్థాపకుడైన అమృత్ వాట్సా... తన పెళ్లికి ప్రీషూట్ను బాలీవుడ్ థీమ్‌తో చేశారు. దిల్వాలే దుల్హనియా లేజాయేంగే, కుచ్ కుచ్ హోతా హై వంటి సినిమా పోస్టర్లలో హీరో హీరోయిన్ల స్టిల్స్‌ను అనుసరిస్తూ తన కాబోయే భార్యతో కలిసి ఆయన తీయించుకున్న ఫొటోలు పెళ్లి మంటపంలో కనువిందు చేశాయి. ఈ షూట్స్ ద్వారా ఆయన ఎంత పాపులర్ అయ్యారంటే...ఇప్పుడు హైదరాబాద్ వాసులు సైతం ఆయనను లవ్ షూట్స్ కోసం పిలుస్తున్నారు. ఏదేమైనా ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఫొటోగ్రాఫర్లకు వరంగా మారాయి. ఎంగేజ్మెంట్ నుంచి రిసెప్షన్ వరకూ ఉండే ప్యాకేజ్‌లో ఈ షూట్స్ కూడా జత కలిశాయి. ప్రేమానురాగాన్ని, అభిమానాన్ని ప్రదర్శించడానికి ఇప్పుడు సిటీ యువత వెనుకాడడం లేదు. దీనికి ఈ తాజా ట్రెండ్ ఒక చిరు ఉదాహరణ మాత్రమే... అనుబంధానికి రూపం.. ప్రీ వెడ్డింగ్ షూట్స్ నేచురల్ ఫీల్‌ని అందించాయి. మా ఫొటోగ్రాఫర్ మంచి లొకేషన్లు సెలక్ట్ చేయడంతో మా ఫొటోలను అందరూ బాగున్నాయన్నారు. చారిత్రక కట్టడాలను ఎంచుకోవడంతో రిచ్ లుక్ వచ్చింది. సహజంగా అనిపించేలా సినిమా టిక్ స్టైల్లో ఫోజులు ఇవ్వడం అంత ఈజీ కాదు. అయితే రియల్ లైఫ్‌లో ఉన్నట్టే ఉండమన్న ఫొటోగ్రాఫర్ సూచనలకు అనుగుణంగా మేం ప్రవర్తించాం. అందుకే మా ప్రీ వెడ్డింగ్ షూట్ పిక్చర్స్ బాగా హైలెట్ అయ్యాయి. - నివాలి, పున్నా. వెరైటీ థీమ్స్ కావాలంటున్నారు ప్రీ వెడ్డింగ్ షూట్స్ పూర్తిగా ఆ జంట ఇష్ట ప్రకారం జరుతుతాయి. అందుకే తమకు నచ్చిన డిజైనర్ దుస్తులు ఎంచుకుంటూ వెరైటీ థీమ్స్, కాన్సెప్ట్స్ కావాలని మమ్మల్ని అడుగుతున్నారు. మేం కూడా దీన్నో ఫ్యాషన్ షూట్లా భావిస్తున్నాం. హెయిర్ డ్రెస్సర్, మేకప్ మ్యాన్‌తో సహా మా వెంట ఉండేలా చూసుకుంటున్నాం. - కరణ్, ఫొటోగ్రాఫర్