![Rana Daggubati Pre Wedding Celebrations Begin Says Mihika Bajaj - Sakshi](/styles/webp/s3/article_images/2020/06/21/Mihika-Bajaj.jpg.webp?itok=ydMm1cuV)
టాలీవుడ్ అందగాడు రానా దగ్గుబాటి- మిహికా బజాజ్‌ల వివాహం ఆగస్ట్ 8న జరగనున్న విషయం తెలిసిందే. ఈ పెళ్లి కోసం ఇరు కుటుంబాలు ఇప్పటి నుంచే పెళ్లి పనుల్లో మునిగిపోయాయి. ఈ విషయాన్ని కొత్త పెళ్లి కూతురు మిహికా బజాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించింది. వేడుకలు కొనసాగుతున్నాయంటూ తన ఫొటోను పంచుకుంది. ఇందులో వధువుగా ముస్తాబైన మిహికా రాయల్ లుక్‌లో మెరిసిపోతోంది. ధగధగ మెరిసిపోతున్న నగలు ధరించిన ఆమె చిరునవ్వులు చిందిస్తోంది. ఆమె ముఖంలో పెళ్లి కళ కొట్టొచినట్లు కనిపిస్తోంది. (ఆగస్టులోనే రానా పెళ్లి)
ఈ ఫొటో చూస్తుంటే ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ ప్రారంభమైనట్లే తెలుస్తోంది. కాగా లాక్‌డౌన్ నిబంధనల వల్ల కొద్ది మంది అతిథుల సమక్షంలోనే వివాహం జరిపించనున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో ఈ పెళ్లి వేడుకను ఎక్కడ నిర్వహించనున్నారనేది ఇంకా వెల్లడించలేదు. కాగా తాను ప్రేమలో ఉన్నానంటూ రానా గత నెలలో బాంబు పేల్చిన విషయం తెలిసిందే. అయితే ప్రేమ విషయాన్ని ప్రకటించిన కొద్ది రోజుల్లోనే పెళ్లి ముహూర్తం పెట్టేసుకోవడం విశేషం. అటు మెగా డాటర్ నిహారిక కొణిదెల కూడా పెళ్లికి సిద్ధమైన విషయం తెలిసిందే. (ఇది ఆరంభం.. ఇక ఎప్పటికీ: మిహీకా)
Comments
Please login to add a commentAdd a comment