బర్రెలక్క పెళ్లి సందడి : ప్రీ-వెడ్డింగ్ వీడియో హల్‌చల్‌ | YouTuber-Turned-Politician Barrelakka Sirisha Pre Wedding Shoot Goes Viral | Sakshi
Sakshi News home page

బర్రెలక్క పెళ్లి సందడి : ప్రీ-వెడ్డింగ్ వీడియో హల్‌చల్‌

Published Tue, Mar 26 2024 11:57 AM | Last Updated on Sat, Aug 3 2024 12:44 PM

youtuber cum Politician barrelakka marriage pre wedding  shoot  goes viral  - Sakshi

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి సంచలనం రేపిన యూట్యూబర్‌ బర్రెలక్క పెళ్లి కబురు ఇటీవల వార్తల్లో నిలుస్తోంది.  తాజాగా తనకు కాబోయే భర్తను ఇన్‌స్టగ్రామ్ వేదికగా పరిచయం చేసింది  బర్రెలక్క. దీంతో  ఈ వీడియో ఇపుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. 

బర్రెలక్క అలియాస్‌ శిరీష షేర్‌ చేసిన వీడియో ప్రకారం ఈ వేసవిలోనే బర్రెలక్క మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనుంది.  వరుడు పేరు వెంకట్. అయితే అతడి వృత్తి ఎక్కడి వాడు అనే వివరాలు మాత్రం ఇంకా  సస్పెన్సే.

 కాగా తెలంగాణంలోని పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన  శిరీష(బర్రెలక్క) నిరుద్యోగ సమస్యలపై ఇన్‌స్టగ్రామ్‌లో వీడియోలు  చేస్తూ బర్రెలక్కగా పాపులర్‌ అయింది. భారీగా (781 వేలు) ఫాలోయర్లను సంపాదించుకుంది.ఆదాయాన్ని కూడా బాగానే ఆర్జించింది. గత ఏడాది డిసెంబరులో జరిగిన కొల్లాపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ వేయడంతో సోషల్ మీడియా స్టార్ కాస్తా పొలిటికల్‌ స్టార్‌ అతరించింది.  నిరుద్యోగ యువత,  పలు నిరుద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలునుంచి భారీ స్పందనతోపాటు, కొంతమంది రాజకీయ నాయకులు ఆమెకు మద్దతినిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ, రానున్న లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీచేస్తానని ప్రకటించిన శిరీష ఇలా అనూహ్యంగా పెళ్లి పీటలెక్కుతుండటం ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement