
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సోదరుడి పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ముంబయిలోని ఓ రిసార్ట్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహ వేడుకను సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రియాంక సోదరుడు సిద్దార్థ్ చోప్రా తన ప్రియురాలు నీలం ఉపాధ్యాయ మెడలో మూడు ముళ్లు వేశారు. ఈ పెళ్లిలో ప్రియాంక చోప్రా తన డ్యాన్స్‌తో అదరగొట్టింది. బాలీవుడ్ సాంగ్స్‌కు స్టెప్పులు వేస్తూ పెళ్లి వేడుకల్లో మెరిసింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
తన సోదరుడి పెళ్లి ప్రియాంక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. మండపం వద్దకు సోదరుడిని తీసుకురావడంతో పాటు డ్యాన్స్ చేస్తూ సందడి చేసింది. కుటుంబ సభ్యులతో పాటు తన భర్త నిక్ జోనాస్‌లో కలిసి ఈ పెళ్లి వేడుకలో అలరించింది. అంతేకాకుండా డ్యాన్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment