అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి సంచలనం రేపిన యూట్యూబర్ బర్రెలక్క వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. ఇటీవలే తన వీడియోలు షేర్ చేస్తూ గుడ్ న్యూస్ చెప్పిన కర్నె శిరీష ఇవాళ పెళ్లి చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఇప్పటికే కాబోయే భర్తను పరిచయం చేసిన బర్రెలక్క.. తన భర్తతో మొదటి వీడియో అంటూ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.
తెలంగాణకే చెందిన పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన శిరీష.. వెంకటేశ్‌తో ఏడడుగులు వేసింది. కాగా.. నిరుద్యోగ సమస్యలపై ఇన్‌స్టగ్రామ్‌లో వీడియోలు చేస్తూ ఫేమ్ తెచ్చుకున్న శిరీషకు భారీగా ఫాలోవర్లు ఉన్నారు. ప్రస్తుతం బర్రెలక్క పెళ్లి వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment