పెళ్లి పుస్తకం.. కొత్త సంప్రదాయం!
ప్రీ వెడ్డింగ్ షూట్ కొత్త పుంతలు
నిశ్చితార్థం నుంచే లొకేషన్‌ల కోసం వెతుకులాట
రూ.3 లక్షలైనా తగ్గేదే లేదంటున్న వైనం
పిల్లల ఇష్టాయిష్టాలు కాదనలేకపోతున్న తలిదండ్రులు
కాలం మారింది. అందుకు తగ్గట్లుగా పద్ధతులూ మారిపోయాయి. కొత్తకొత్త సంప్రదాయాలు పుట్టుకొచ్చాయి. ఇద్దరి మనసులను కలిపి ఒక్కటి చేసే వివాహమనే ఘట్టంలోనూ నూతన ఒరవడి ఒకటి పురుడుపోసుకుంది. అదే ప్రీ వెడ్డింగ్ షూట్. రూ. లక్షలు ఖర్చవుతున్నా యువత ఎక్కడా తగ్గడం లేదు. సుదూర ప్రాంతాలకు వెళ్లడానికి కూడా సై అంటున్నారు.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రీ వెడ్డింగ్ షూట్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇటీవల గ్రామీణ ప్రాంతాలకూ ఈ సంస్కృతి వ్యాపించింది. ఒకప్పుడు పెళ్లికి నాలుగు లక్షల రూపాయలైందంటేనే అంతా ఆశ్చర్యపోయేయారు. కానీ, నేడు ప్రీ వెడ్డింగ్ షూట్‌కే రూ.3 లక్షలకు పైగా ఖర్చు చేస్తున్నారు. పెళ్లికి ముందు ఏకంగా నాలుగైదు రోజుల పాటు పర్యాటక ప్రాంతాల్లోనే గడుతుపున్నారు. సంప్ర దాయాలు అడ్డొస్తున్నా పిల్లల ఇష్టాయిష్టాలను కాదనలేక తల్లిదండ్రులు ఓకే చెబుతున్నారు.
నిశ్చితార్థం నుంచే..
గతంలో పెళ్లయ్యాక హనీమూన్‌కు ఎక్కడికెళ్లాలి అంటూ అందరితో ఆరా తీసేవారు. ఇప్పుడు నిశ్చితార్థం జరిగిన రోజు నుంచే ప్రీవెడ్డింగ్ షూట్‌కు అనువైన ప్రాంతాలను వెతుకుతుండటం గమ నార్హం. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలు బెంగ ళూరుకు దగ్గరగా ఉండటంతో కర్ణాటకలోని పర్యాటక ప్రదేశాలనూ ఇంటర్నెట్‌లో చూస్తున్నారు.
గండికోటకు క్యూ..
ఎక్కువ జంటలు చారిత్రక కట్టడాలను ప్రీవెడ్డింగ్ షూట్‌కు ఎంపిక చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో చాలా మందికి నచ్చుతున్న వేదికల్లో గండికోట మొదటి వరుసలో ఉంటోంది. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని గండికోట రాజసానికి ప్రతీకగా నిలుస్తోంది. ఇటీవల ఆ ప్రాంతానికి ప్రీ వెడ్డింగ్ షూట్‌కు వెళ్తున్న జంటలు ఎక్కువయ్యాయి. ఆ తర్వాత కర్ణాటకలోని నందిహిల్స్, కూర్గ్, మైసూరు, గోవాతో పాటు బాగా డబ్బున్న వారైతే జైపూర్‌కు వెళుతున్నారు.
రెండు నుంచి మూడు లక్షలు..
ఒకేరోజులో అంటే ప్రీ వెడ్డింగ్ షూట్ అయ్యేది కాదు. 2,3 రోజులు అక్కడే ఉండాల్సి వస్తోంది. ఓ కెమెరా మెన్ లేదా ఒక ఫొటోగ్రాఫర్‌ను వెంట తీసుకెళ్లాలి. ఈ క్రమంలో కెమెరామెన్, ఫొటోగ్రాఫర్లకే రూ.1.50 లక్షల వరకూ ముట్టజెబుతున్నారు. బస, ఆహారం, దుస్తుల కొనుగోలు తదితర వాటికి మరో లక్ష పైనే ఖర్చవుతోంది. ఈ మూడు రోజుల ప్రక్రియను ఎడిట్ చేసి పెళ్లినాడు ప్రదర్శిస్తున్నారు.
ఒకరినొకరు తెలుసుకోవచ్చు..
ఒకరి మనసు మరొకరు తెలుసుకునేందుకు ప్రీ వెడ్డింగ్ షూట్ ఎంతో ఉపయోగపడుతుంది. మా స్నేహితులు, బంధు వులు ఎంతో ఆడంబరంగా ఈ వేడుక జరుపుకున్నారు. సమయాభావం వల్ల మేం మిస్ అయ్యాం. – పాండ్రే వైష్ణవి, బ్యాంకు ఉద్యోగి
Comments
Please login to add a commentAdd a comment