48లక్షల పెళ్లిళ్లు.. రూ.5.76లక్షల కోట్లు ఖర్చు | Check Out These Auspicious Wedding Dates To Tie The Knot | Sakshi
Sakshi News home page

ఇక కళ్యాణ వైభోగమే.. 48లక్షల పెళ్లిళ్లు.. రూ.5.76లక్షల కోట్లు ఖర్చు

Published Sat, Oct 12 2024 9:24 AM | Last Updated on Sat, Oct 12 2024 9:47 AM

Check Out These Auspicious Wedding Dates To Tie The Knot

 నేటి నుంచి దేశవ్యాప్తంగా పెళ్లి సందడే..

డిసెంబర్ ఆఖరు వరకు 23 ముహూర్తాలు

48లక్షల పెళ్లిళ్లు... రూ.5.76లక్షల కోట్లు ఖర్చు

అంచనా వేసిన సీఏఐటీ సర్వే

సాక్షి అమరావతి: జూన్ నెలాఖరు నుంచి సరైన ముహూర్తాలు లేవు. వివాహాలు, శుభకార్యాలు వాయిదా పడుతూ వస్తు న్నాయి. ఎట్టకేలకు ఇక ముహూర్తం కుదిరింది. వధూవరులు ఒక్కటయ్యే తరుణం వచ్చేసింది. దేశవ్యాప్తంగా శనివారం నుంచి పెళ్లి సందడి అంబరాన్ని తాకనుంది. 

ఈ ఏడాది చివరి వరకు ఇది కోలాహలం కొనసాగనుంది. అక్టోబర్ 12 నుంచి డిసెంబర్ 81 మధ్య 23 శుభ ముహూర్తాలు ఉన్నాయి. ఈ శుభ ఘడియల్లో దాదాపు 48లక్షల వివాహాలు జరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కాన్సెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఎఐటీ) తాజాగా విడుదల చేసిన సర్వే నివేదిలో వెల్లడించింది. 

ఈ నివేదిక ప్రకారం..  దేశవ్యాప్తంగా 2023వ సంవత్సరంలో చివరి మూడు నెలల్లో దాదాపు 35 లక్షల పెళ్లిళ్లు జరిగాయి. సుమారు రూ.4.25 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. ఈ ఏడాది అక్టోబర్ 12 నుంచి డిసెంబర్ ఆఖరు వరకు ఉన్న ముహూర్తాల్లో దేశవ్యాప్తంగా మొత్తం 48లక్షలకు పైగా వివాహాలు జరిగే అవకాశం ఉంది. ఒక్కొక్క పెళ్లి వేడుకకు సగటున రూ.12 లక్షలు ఖర్చు పెడతారని అంచనా. ఈ లెక్కన ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్లో దాదాపు రూ.5,76 లక్షల కోట్లు ఖర్చు అవుతుం దాని ప్రాథమికంగా లెక్క తేల్చారు.

షాపింగ్ సందడి షురూ..

దసరా పండుగతోపాటు పెళ్లిళ్ల షాపింగ్ కూడా కొందరు. ప్రారంభించారు. దీంతో మార్కెట్లో సైతం సందడి నెలకొంది. భోజనాలు, క్యాటరింగ్, కళ్యాణ మండపాలు ఫంక్షన్ హాళ్లు, హోటళ్లు, డెకరేషన్లకు ముందస్తు ఒప్పందాలు చేసుకుంటున్నారు. శుభలేఖల ప్రీం టింగ్స్, ఫ్లెక్సీ ప్రింటర్స్, ఫొబో గ్రావర్లు, టెంట్ హౌస్, వంటమేస్త్రీలు, ముట పనివాళ్లు, క్యాటరింగ్ బాయ్స్, బ్యూటీ మనన్లు, మెహందీ ఆది పూలు అమ్మేవాళ్లు, మంగళ వాయిద్య కళాకారులు, డీజే మ్యూజి నివ్వాహకులు ఇలా పెళ్లి వేడుకతో ప్రతి ఒక్కరిని ముందుగానే ఎంపిక చేసుకుని అడ్వాన్సులు ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారు. 

దేశంలో సాధారణ, మధ్య తరగతి ప్రజల నుంచి సంపన్నుల వరకు పెళ్లి వేడుక అన్నట్లుగా ఖర్చు చేస్తున్నారు. ఎంగేజ్‌మెంట్, ఫ్రీ వెడ్డింగ్, హల్దీ, రిసెప్షన్ పోస్ట్ వెడ్డింగ్... ఇలా అనేక దశలుగా పెళ్లి వేడుకకు రాజీపడకుండా నిర్వహిస్తున్నారు.  అందువల్ల ఈ ఏడాది చివరి వరకు దేశవ్యాప్తంగా పెళ్లి సందడి ఉంటుందని సీఏఐటీ వెల్లడించింది.

ముహూర్తాలు.. ఇవీ 
అక్టోబర్ 12, 13, 16, 20,27వ తేదీల్లో మహూర్తాలు ఉన్నాయి. నవంబర్ 3, 7, 8, 9, 10, 13, 14, 16,17. డిసెంబర్‌లో 5,6,7 8, 11, 12, 14, 15, 26 వ తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత సంక్రాంతి మాసం ప్రారంభం కావడంతో మళ్లీ వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలలు వరకు శుభ ముహూ కోసం ఆగాల్సి వస్తుంది. అందువల్ల ఈ ఏడాురు దీపావళి తర్వాత పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది. అదే సమయంలో ఉపనయనాలు, గృహప్రవేశాలు కూడా ఎక్కువగా జరుగుతాయని అంచనా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement