auspicious day
-
48లక్షల పెళ్లిళ్లు.. రూ.5.76లక్షల కోట్లు ఖర్చు
సాక్షి అమరావతి: జూన్ నెలాఖరు నుంచి సరైన ముహూర్తాలు లేవు. వివాహాలు, శుభకార్యాలు వాయిదా పడుతూ వస్తు న్నాయి. ఎట్టకేలకు ఇక ముహూర్తం కుదిరింది. వధూవరులు ఒక్కటయ్యే తరుణం వచ్చేసింది. దేశవ్యాప్తంగా శనివారం నుంచి పెళ్లి సందడి అంబరాన్ని తాకనుంది. ఈ ఏడాది చివరి వరకు ఇది కోలాహలం కొనసాగనుంది. అక్టోబర్ 12 నుంచి డిసెంబర్ 81 మధ్య 23 శుభ ముహూర్తాలు ఉన్నాయి. ఈ శుభ ఘడియల్లో దాదాపు 48లక్షల వివాహాలు జరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కాన్సెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఎఐటీ) తాజాగా విడుదల చేసిన సర్వే నివేదిలో వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. దేశవ్యాప్తంగా 2023వ సంవత్సరంలో చివరి మూడు నెలల్లో దాదాపు 35 లక్షల పెళ్లిళ్లు జరిగాయి. సుమారు రూ.4.25 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. ఈ ఏడాది అక్టోబర్ 12 నుంచి డిసెంబర్ ఆఖరు వరకు ఉన్న ముహూర్తాల్లో దేశవ్యాప్తంగా మొత్తం 48లక్షలకు పైగా వివాహాలు జరిగే అవకాశం ఉంది. ఒక్కొక్క పెళ్లి వేడుకకు సగటున రూ.12 లక్షలు ఖర్చు పెడతారని అంచనా. ఈ లెక్కన ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్లో దాదాపు రూ.5,76 లక్షల కోట్లు ఖర్చు అవుతుం దాని ప్రాథమికంగా లెక్క తేల్చారు.షాపింగ్ సందడి షురూ..దసరా పండుగతోపాటు పెళ్లిళ్ల షాపింగ్ కూడా కొందరు. ప్రారంభించారు. దీంతో మార్కెట్లో సైతం సందడి నెలకొంది. భోజనాలు, క్యాటరింగ్, కళ్యాణ మండపాలు ఫంక్షన్ హాళ్లు, హోటళ్లు, డెకరేషన్లకు ముందస్తు ఒప్పందాలు చేసుకుంటున్నారు. శుభలేఖల ప్రీం టింగ్స్, ఫ్లెక్సీ ప్రింటర్స్, ఫొబో గ్రావర్లు, టెంట్ హౌస్, వంటమేస్త్రీలు, ముట పనివాళ్లు, క్యాటరింగ్ బాయ్స్, బ్యూటీ మనన్లు, మెహందీ ఆది పూలు అమ్మేవాళ్లు, మంగళ వాయిద్య కళాకారులు, డీజే మ్యూజి నివ్వాహకులు ఇలా పెళ్లి వేడుకతో ప్రతి ఒక్కరిని ముందుగానే ఎంపిక చేసుకుని అడ్వాన్సులు ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారు. దేశంలో సాధారణ, మధ్య తరగతి ప్రజల నుంచి సంపన్నుల వరకు పెళ్లి వేడుక అన్నట్లుగా ఖర్చు చేస్తున్నారు. ఎంగేజ్మెంట్, ఫ్రీ వెడ్డింగ్, హల్దీ, రిసెప్షన్ పోస్ట్ వెడ్డింగ్... ఇలా అనేక దశలుగా పెళ్లి వేడుకకు రాజీపడకుండా నిర్వహిస్తున్నారు. అందువల్ల ఈ ఏడాది చివరి వరకు దేశవ్యాప్తంగా పెళ్లి సందడి ఉంటుందని సీఏఐటీ వెల్లడించింది.ముహూర్తాలు.. ఇవీ అక్టోబర్ 12, 13, 16, 20,27వ తేదీల్లో మహూర్తాలు ఉన్నాయి. నవంబర్ 3, 7, 8, 9, 10, 13, 14, 16,17. డిసెంబర్లో 5,6,7 8, 11, 12, 14, 15, 26 వ తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత సంక్రాంతి మాసం ప్రారంభం కావడంతో మళ్లీ వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలలు వరకు శుభ ముహూ కోసం ఆగాల్సి వస్తుంది. అందువల్ల ఈ ఏడాురు దీపావళి తర్వాత పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది. అదే సమయంలో ఉపనయనాలు, గృహప్రవేశాలు కూడా ఎక్కువగా జరుగుతాయని అంచనా. -
గంగా నదిలో స్నానానికి పోటెత్తిన జనం!
మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా ధార్మిక నగరమైన ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం నుండే వివిధ గంగా ఘాట్ వద్ద స్నానాలు చేసేందుకు భక్తులు బారులు తీరారు. మకర సంక్రాంతి వేళ గంగాస్నానానికి ఎంతో విశిష్టత ఉంది. మకర సంక్రాంతి పండుగ రోజున సూర్యభగవానుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. దీనితోపాటు దక్షిణాయణం నుండి ఉత్తరాయణంలోకి మారతాడు. అందుకే మకర సంక్రాంతి నాడు స్నానం చేయడం విశేషమైనదిగా భావిస్తారు. పురాణాలలో పేర్కొన్న వివరాల ప్రకారం ఉత్తరాయణ పర్వదినానికి ప్రత్యేక స్థానం ఉంది. ఉత్తరాయణ పర్వదినాన మరణించిన వారికి మరుజన్మ ఉండదని చెబుతారు. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినంతనే ఉత్తరాయణ పర్వదినం ప్రారంభమవుతుంది. సంక్రాంతి పండుగ దేశంలోని వివిధ రాష్ట్రాలలో పలు పేర్లతో జరుపుకుంటారు. కొన్నిచోట్ల మకర సంక్రాంతిగా, కొన్నిచోట్ల పొంగల్‌గా, మరికొన్ని చోట్ల ఉత్తరాయణ పండుగగా జరుపుకుంటారు. ఉత్తరాయణంలో పూర్వీకులకు పిండప్రదానం చేస్తే, వారు సంతృప్తి చెందుతారని పండితులు చెబుతారు. ఇది కూడా చదవండి: ‘బుల్డోజర్ బాబా’ పతంగులకు డిమాండ్! -
నేటి నుంచి శుభ గడియలు షురూ!
సాక్షి, నిజామాబాద్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెళ్లిళ్ల సందడి నేటి నుంచి మొదలు కానుంది. జూన్, జులై, ఆగస్టు నెలల్లో శుభముహూర్తాలు ఉన్నా.. కరోనా సెకండ్‌వేవ్‌తో ఎక్కువ వివాహాలు జరుగలేవు. దీనికి తోడు ప్రభుత్వం కరోనా నిబంధనలు ప్రకటించడంతో అనేక పెళ్లిళ్లు అక్టోబర్, నవంబర్‌కు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం దసరా నుంచి శుభముహూర్తాలు ఆరంభం కావటంతో అక్టోబర్ 17 నుంచి ఉపనయనాలు, గృహప్రవేశాలు, వివాహాలు తదితర శుభముహూర్తాలకు అనుకూలమైన రోజులు ఉన్నాయి. దీంతో శుభకార్యాలు ప్రారంభం కావడంతో అన్ని రకాల వ్యాపారాలకు చేతి నిండా పని దొరకనుంది. కల్యాణ మండపాలకు కళ.. గత మూడు నెలల నుంచి ముహూర్తాలు లేకపోవటంతో కల్యాణ మండపాలు ఖాళీగా కన్పించాయి. కరోనా కారణంతో వాయిదా పడ్డా వివాహాలు ఈ ముహూర్తాల్లో చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. శుభ ముహూర్తాలు ప్రారంభం కావడంతో కల్యాణ మండపాలకు శుభకార్యాల కళ సంతరించనుంది. అశ్వినీ నక్షత్రంతో పౌర్ణిమ రావడంతో ఆశ్వయుజ మాసం అన్ని రకాల శుభముహూర్తాలకు అనుకూలమని పెద్దలు చెబుతారు. కృతికా నక్షత్రంతో పౌర్ణమి రావడంతో కార్తీక మా సంలో చేసే దానాలు, ధార్మికపూజలు, వ్రతాలు ఆ ధ్యాత్మిక చింతనతో పాటు ఆరోగ్యాన్ని చేకూరుస్తాయని కార్తీక పురాణం పేర్కొంటుంది. అందుకే ఆశ్వయుజ, కార్తీక మాసాల్లో వచ్చే శుభముహుర్తా ల్లో శుభకార్యాలు చేయడానికి ప్రజలు ఆసక్తి కనబరుస్తారు. శుభకార్యాలకు అనువు... ఆశ్వయుజ, కార్తీక, మార్గశిర మాసాల్లో పెళ్లిళ్లు ఇతర కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు శుభముహూర్తాలు ఉన్నాయి. ఈ మాసా ల్లో వివాహాలు చేసుకుంటే అఖండ సౌభాగ్యం, సుసంతానం కలుగుతుందని పురాణాలు చెబుతు న్నాయి. –గుణవంత్‌రావు జోషి, వేద పండితుడు ముహూర్త తేదీలు ఇవే.. అక్టోబర్ 17, 18. 20, 30, నవంబర్ 14, 21, 22, 29, డిసెంబర్ 8, 10, 11, 22, 26 ఫిబ్రవరి 3,5, 6, 7, 10, 14, 16, 17, 18. -
ఇంకో రెండు నెలలు.. నో పెళ్లిళ్లు!
శుభ ముహూర్తాల సందడి ముగిసింది. పెళ్లి బాజాభజంత్రీలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొద్ది నెలలుగా పెళ్లిళ్లు, ఇతర శుభ ముహూర్తాలతో సందడిగా గడిచిన రోజులు శనివారంతో ముగిశాయి. మరో రెండు నెలలు ఎక్కడి బాజాలు అక్కడే మూగబోనున్నాయి. విజయనగరం మున్సిపాలిటీ : జ్యేష్ఠ మాసం చివరకు చేరుకుంది. శుభ ముహూర్తాల సందడి ముగింపునకు వచ్చింది. ఈ నెలలో ఇప్పటి వరకు వందల సంఖ్యలో పెళ్లిళ్లు జరిగాయి. జిల్లాలో ఈ నెల 27న అధిక సంఖ్యలో వివాహాలు జరగ్గా... 28న సైతం పలు నూతన జంటలు ఒక్కటయ్యాయి. ఈ తేదీలు దాటాక సుమారు రెండు నెలలకు పైగా శుభముహూర్తాలు లేవు. శనివారం నుంచి ఎదురు అమావాస్య ప్రారంభం కాగా... వచ్చే నెల 9 నుంచి శుక్రమూఢ్యం ప్రవేశించనుంది. ఈ మూఢ్యం అక్టోబర్ 19 వరకు ఉంటుంది. ఈ రోజుల్లో హిందూ సంప్రదాయాల ప్రకారం ఎటువంటి శుభ కార్యక్రమాలు నిర్వహించారు. కొత్త పెళ్లైన ఆడపిల్లలు మెట్టినింటి నుంచి పుట్టినింటికి వచ్చి సుమారు 70రోజుల పాటు అక్కడే ఉంటారు. శుభ కార్యక్రమాలకు బ్రేక్ ఎదురు అమావాస్య, 70 రోజుల పాటు శుక్రమూఢ్యం వరుసగా రావటంతో జిల్లాలో శుభ కార్యక్రమాలకు బ్రేక్ పడనుంది. హిందూ సంప్రదాయం ప్రకారం మంచి రోజుల్లో పెళ్లిళ్లు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, గృహప్రవేశాలు తదితర కార్యక్రమాల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. అయితే మూఢ్యం ప్రభావంతో ఇటువంటి కార్యక్రమాలకు బ్రేక్ పడనున్నట్టు పురోహితులు చెబుతున్నారు. ఈ ప్రభావంతో రెండు నెలల పాటు బీజీగా గడిపిన పురోహితులకు సైతం కాస్త విరామం లభించనుంది. ఇదిలా ఉండగా పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు వంటి శుభ కార్యక్రమాల నిర్వహణకు అవసరమయ్యే వస్తు కొనుగోళ్లు నిలిచిపోనుండటంతో మార్కెట్లో సందడి తగ్గనుంది. అక్టోబర్ 19 తరువాతే... జేష్ట్య మాసంలో చివరి ముహూర్తాలు దాటాకా ఆషాఢం, శ్రావణం, భాద్రపద మాసాల్లో శుక్రమూఢం కారణంగా ముహూర్తాల్లేవు. అక్టోబర్ 19 తరువాతనే మరల శుభ మూహర్తాల సందడి ప్రారంభం కానుంది. అప్పుడే వివాహాది శుభ కార్యక్రమాలతో పాటు, అన్ని కార్యక్రమాలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. అరుదైన ముహూర్తాలు జేష్ట్యమాసం ముగింపు సమయం వచ్చేసింది. 28వ తేదీ ముహూర్తాలు దాటాకా ఆషాఢం, శ్రావణం, భాద్రపద మాసాల్లో శుక్రమూఢం కారణంగా ముహూర్తాల్లేవు. హిందూ సంప్రదాయం ప్రకారం సుమారు 80 రోజుల పాటు ఎటువంటి శుభ కార్యక్రమాలు నిర్వహించరు. మళ్లీ అక్టోబర్ 19 నుంచి శుభ ముహూర్తాల సందడి ప్రారంభం కానుంది. – పవన్, పురోహితులు -
పెళ్లికి వేళాయే..
ఆలేరు /భువనగిరి : పెళ్లిళ్లు, పేరంటాలు, గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాలకు సుముహూర్తాలు రాబోతున్నాయి. ఈనెల 17 నుంచి జూలై 7వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. దీంతో వివా హ వేడుకల సందడి ప్రారంభంకానుంది. సంబంధాలను కుదుర్చుకున్న యువత మూడుమూళ్ల బంధంతో ఏకమయ్యేందుకు ముహూర్తాలను ఎంచుకుంటున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వేల సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. ఖరీదవుతున్న వేడుకలు.. ప్రస్తుతం పెళ్లిళ్ల ఏర్పాట్ల ఖర్చులు విపరీతంగా పెరుగుతోంది. కల్యాణ మండపం ఒక్కరోజు అద్దె రూ.30 వేల నుంచి గరిష్టంగా రూ.1.30లక్షల వరకు డిమాండ్ ఉంది. వీటికి అదనంగా విద్యుత్ బిల్లు, క్లినింగ్ చార్జీలు వసూలు చేస్తున్నారు. కల్యాణ మండపం బుక్ చేసుకున్నాక పెళ్లి పందిరి, సౌండ్ సిస్టమ్, సామగ్రి, ఇతర సదుపాయాలు, మండప నిర్వాహకులే సమకూరుస్తున్నారు. వీటికి అదనంగా చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. వీటి చార్జీలు కూడా సుమారు రూ. 20వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటున్నాయి. ఇక ఫొటో, వీడియో, ఆల్బమ్, తయారీదారుల ధరలు కూడా పెరిగాయి. వీటికి రూ.30వేల నుంచి రూ.80వేల వరకు వసూలు చేస్తున్నారు. విందు భోజనాలు.. ప్రస్తుతం పెళ్లంటే రకరకాల స్వీట్లు, కూరగాయలు, బిర్యాని తదితర నోరూరించే పదార్థాలు ఉండాల్సిందే. మధ్యతరగతి కుటుంబ సభ్యులకు కనీసం రూ. లక్ష నుంచి 2 లక్షల వరకు ఖర్చవుతోంది. కేటరింగ్‌కు ఇస్తే అన్ని వారే సమకూర్చుతున్నారు. ఒక్కో ప్లేట్‌కు శాఖాహారమైతే రూ.100 నుంచి రూ.200 వరకు తీసుకుంటున్నారు. అదే మాంసాహారమైతే రూ.200 నుంచి రూ.300 వరకు తీసుకుంటున్నారు. పురోహితులు దొరకడం కష్టమే.. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరగనుండడంతో అన్ని వర్గాల ప్రజలకు అవస్థలు తప్పడంలేదు. ముఖ్యంగా కొందరికి పురోహితులు దొరకడం లేదు. పూల ధరలు ఆకాశానంటుతున్నాయి. అంతేకాకుండా మునుపెన్నడూ లేని వి«ధంగా జీఎస్టీతో పెద్ద మొత్తంలో పన్ను పడుతుండడంతో పేద, మధ్య తరగతి కుటుంబాలపై జీఎస్టీ ప్రభావం పడనుంది. శుభ ముహూర్తాలు.. ఫిబ్రవరి నుంచి ఆషాడం వచ్చే వరకు జూలై 7వరకు ముహూర్తాలు ఉన్నాయి. ఒక్కో నెలలో 5 నుంచి 12వరకు ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. ఫిబ్రవరి 17, 19, 23, 24, 26 మార్చి 4, 8, 10, 12, 14 ఏప్రిల్ 1, 2, 5, 11, 19, 20, 22, 25, 27, 28, 29, 30 మే 2, 9, 10, 16, జూన్ 16, 20, 21, 22, 27, 28, 30 జూలై 1, 5, 6, 7వ తేదీల్లో దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత ఆషాడమాసం ప్రారంభం అవుతుందని వేదపండితులు చెబుతున్నారు. మే 16వ తేదీ నుంచి జూన్ 13 వరకు అధిక జ్యేష్ట మాసం ఉంటుంది. అధికంగా జరగనున్నాయి మార్చి 4, 8, 10, 14 తేదీల్లో పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరుగనున్నాయి. మార్చి 4వ తేదీ ముహుర్తానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఇదేరోజు ఆదివారం కావడంతో ఎక్కువగా ముహుర్తాలను నిర్ణయించుకున్నారు. – పవన్‌శర్మ, పురోహితుడు -
నేడు నగరంలో ఎనిమిది వేలకు పైగా పెళ్లిళ్లు
కార్తీక మాసం, బలమైన ముహూర్తం హైదరాబాద్ : మహా నగరానికి పెళ్లి కళ వచ్చింది. పవిత్ర కార్తీక మాసం... బలమైన ముహూర్తాలు ఉండడంతో ఆదివారం పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరుగనున్నాయి. ఆదివారం ఒక్క రోజే 8 వేలకు పైగా వివాహాలు జరుగనున్నట్లు అంచనా. గత 4 నెలలుగా ముహూర్తాలు లేకపోవడం... ఆదివారం ఉదయం, రాత్రి రెండు బలమైన ముహూర్తాలు కలిసి రావడంతో ఎంతోమంది పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. దీంతో శనివారం నుంచే ఫంక్షన్ హాళ్లు, మండపాలు, కమ్యూనిటీ హాళ్ల వద్ద సందడి నెలకొంది. ఫంక్షన్ హాళ్లు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. పురోహితులకు, బాజాభజంత్రీలకు డిమాండ్ పెరిగింది. నగరంలోని అబిడ్స్, మెహదీపట్నం, లంగర్‌హౌస్, అమీర్‌పేట్, పంజగుట్ట, తిరుమలగిరి, అల్వాల్, మేడ్చెల్, ఈసీఐఎల్, తార్నాక, రామంతాపూర్, కూకట్పల్లి హౌసింగ్ బోర్డు, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మియాపూర్, చందానగర్, హైటెక్ సిటీ, ఐడీఏ బొల్లారం, మాదాపూర్, ఎల్బీ నగర్, హయత్‌నగర్, కర్మన్‌ఘాట్, సరూర్ నగర్, దిల్సుఖ్ నగర్, తదితర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో వివాహాలు జరుగనున్నాయి. వీటి నిర్వహణ ఖర్చు సైతం భారీగా ఉండబోతోంది. దివ్యమైన ముహూర్తాలు ఉదయం 11 గంటలకు కుంభలగ్నం. గ్రహాల స్థితి ఎంతో బాగుంది. వృశ్చిక రాశిలో రవి ప్రవేశించడం. గురువు 9వ స్థానంలో ఉండడంతో మంచి ముహూర్తం. రాత్రి 8 గంటలకు మిథున లగ్నం ఉంది. ఇది కూడా మంచి ముహూర్తం. కేంద్ర స్థానంలో గురువు, 6వ స్థానంలో రవి, బలమైన స్థానంలో బుధుడు ఉన్నారు. గ్రహాలు అనుకూలంగా ఉండడం ఒక కారణమైతే... ఇది పవిత్ర కార్తీక మాసం కావడం మరో కారణం. ఆ తరువాత ఈ నెల 26, 29, 30 తేదీల్లో మాత్రమే మంచి ముహూర్తాలు ఉన్నాయి. -భానుమూర్తి, తెలంగాణ అర్చక సంఘ అధ్యక్షులు