సాక్షి, నిజామాబాద్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెళ్లిళ్ల సందడి నేటి నుంచి మొదలు కానుంది. జూన్, జులై, ఆగస్టు నెలల్లో శుభముహూర్తాలు ఉన్నా.. కరోనా సెకండ్‌వేవ్‌తో ఎక్కువ వివాహాలు జరుగలేవు. దీనికి తోడు ప్రభుత్వం కరోనా నిబంధనలు ప్రకటించడంతో అనేక పెళ్లిళ్లు అక్టోబర్, నవంబర్‌కు వాయిదా పడ్డాయి. ప్రస్తుతం దసరా నుంచి శుభముహూర్తాలు ఆరంభం కావటంతో అక్టోబర్ 17 నుంచి ఉపనయనాలు, గృహప్రవేశాలు, వివాహాలు తదితర శుభముహూర్తాలకు అనుకూలమైన రోజులు ఉన్నాయి. దీంతో శుభకార్యాలు ప్రారంభం కావడంతో అన్ని రకాల వ్యాపారాలకు చేతి నిండా పని దొరకనుంది.
కల్యాణ మండపాలకు కళ..
గత మూడు నెలల నుంచి ముహూర్తాలు లేకపోవటంతో కల్యాణ మండపాలు ఖాళీగా కన్పించాయి. కరోనా కారణంతో వాయిదా పడ్డా వివాహాలు ఈ ముహూర్తాల్లో చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. శుభ ముహూర్తాలు ప్రారంభం కావడంతో కల్యాణ మండపాలకు శుభకార్యాల కళ సంతరించనుంది. అశ్వినీ నక్షత్రంతో పౌర్ణిమ రావడంతో ఆశ్వయుజ మాసం అన్ని రకాల శుభముహూర్తాలకు అనుకూలమని పెద్దలు చెబుతారు. కృతికా నక్షత్రంతో పౌర్ణమి రావడంతో కార్తీక మా సంలో చేసే దానాలు, ధార్మికపూజలు, వ్రతాలు ఆ ధ్యాత్మిక చింతనతో పాటు ఆరోగ్యాన్ని చేకూరుస్తాయని కార్తీక పురాణం పేర్కొంటుంది. అందుకే ఆశ్వయుజ, కార్తీక మాసాల్లో వచ్చే శుభముహుర్తా ల్లో శుభకార్యాలు చేయడానికి ప్రజలు ఆసక్తి కనబరుస్తారు.
శుభకార్యాలకు అనువు...
ఆశ్వయుజ, కార్తీక, మార్గశిర మాసాల్లో పెళ్లిళ్లు ఇతర కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు శుభముహూర్తాలు ఉన్నాయి. ఈ మాసా ల్లో వివాహాలు చేసుకుంటే అఖండ సౌభాగ్యం, సుసంతానం కలుగుతుందని పురాణాలు చెబుతు న్నాయి. –గుణవంత్‌రావు జోషి, వేద పండితుడు
ముహూర్త తేదీలు ఇవే..
అక్టోబర్ 17, 18. 20, 30, నవంబర్ 14, 21, 22, 29, డిసెంబర్ 8, 10, 11, 22, 26 ఫిబ్రవరి 3,5, 6, 7, 10, 14, 16, 17, 18.
Comments
Please login to add a commentAdd a comment