‘వెర్రి వెయ్యి విధాలు’ అంటారు. ఆ జాబితాలో అర్జంటుగా చేర్చదగ్గ వెర్రి ఇది. కర్నాటకలోని చిత్రదుర్గ ప్రభుత్వ ఆస్పత్రిలోని కాంట్రాక్ట్–బేస్డ్ ఫిజీషియన్ అభిషేక్ తన ప్రి–వెడ్డింగ్ షూట్ కోసం అందరిలాగా ఆహ్లాదకరమైన, అందమైన ప్రదేశాన్ని ఎంచుకోలేదు. ఏకంగా ఆపరేషన్ థియేటర్‌నే ఎంచుకున్నాడు. ఈ వీడియోలో బెడ్‌పై పడుకున్న పేషెంట్‌కు సర్జరీ చేస్తున్నట్లు డాక్టర్ నటిస్తుంటే, కాబోయే శ్రీమతి సర్జరీకి తనవంతుగా సహకరిస్తున్నట్లు నటించింది. (ఉత్తుత్తి) ఆపరేషన్ పూర్తికాగానే (ఉత్తుత్తి) పేషెంట్ లేచి ‘ఇప్పుడు నాకు ఫరవాలేదు’ అన్నట్లుగా కూర్చోవడం మరో వినోదం.
ఆపరేషన్ థియేటర్‌లో కెమెరాలు, లైట్‌లతో హడావిడి చేస్తున్న వ్యక్తులు కనిపిస్తారు.ఈ వీడియో వీర లెవెల్లో వైరల్ కావడం మాట ఎలా ఉన్నా సదరు డాక్టర్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.ఈ వీడియో పుణ్యమా అని ప్రభుత్వ ఆస్పత్రుల్లోని లో΄ాల నుంచి వెర్రితలలు వేస్తున్న ప్రి–వెడ్డింగ్ షూట్‌ల వరకు ఎన్నో విషయాలపై గరం గరంగా నెటిజనులు చర్చ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment