Operation theater
-
అయ్ బాబోయ్ ఇదేంటండీ!
‘వెర్రి వెయ్యి విధాలు’ అంటారు. ఆ జాబితాలో అర్జంటుగా చేర్చదగ్గ వెర్రి ఇది. కర్నాటకలోని చిత్రదుర్గ ప్రభుత్వ ఆస్పత్రిలోని కాంట్రాక్ట్–బేస్డ్ ఫిజీషియన్ అభిషేక్ తన ప్రి–వెడ్డింగ్ షూట్ కోసం అందరిలాగా ఆహ్లాదకరమైన, అందమైన ప్రదేశాన్ని ఎంచుకోలేదు. ఏకంగా ఆపరేషన్ థియేటర్‌నే ఎంచుకున్నాడు. ఈ వీడియోలో బెడ్‌పై పడుకున్న పేషెంట్‌కు సర్జరీ చేస్తున్నట్లు డాక్టర్ నటిస్తుంటే, కాబోయే శ్రీమతి సర్జరీకి తనవంతుగా సహకరిస్తున్నట్లు నటించింది. (ఉత్తుత్తి) ఆపరేషన్ పూర్తికాగానే (ఉత్తుత్తి) పేషెంట్ లేచి ‘ఇప్పుడు నాకు ఫరవాలేదు’ అన్నట్లుగా కూర్చోవడం మరో వినోదం. ఆపరేషన్ థియేటర్లో కెమెరాలు, లైట్లతో హడావిడి చేస్తున్న వ్యక్తులు కనిపిస్తారు.ఈ వీడియో వీర లెవెల్లో వైరల్ కావడం మాట ఎలా ఉన్నా సదరు డాక్టర్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.ఈ వీడియో పుణ్యమా అని ప్రభుత్వ ఆస్పత్రుల్లోని లో΄ాల నుంచి వెర్రితలలు వేస్తున్న ప్రి–వెడ్డింగ్ షూట్ల వరకు ఎన్నో విషయాలపై గరం గరంగా నెటిజనులు చర్చ చేస్తున్నారు. -
షాకింగ్: టీ ఇవ్వలేదనే కోపంతో ఆపరేషన్ మధ్యలో వెళ్లిపోయిన డాక్టర్
ముంబై: వైద్యులను దేవుడితో పోలుస్తున్నారు. ఆ దేవుడు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మను ఇస్తారని అంటుంటారు. కేవలం డబ్బుల కోసమే కాకుండా, మానవతా హృదయంతో తన వద్దకు వచ్చిన వారి ప్రాణాలను రక్షిస్తున్న ఘనత వైద్యులకే దక్కుతుంది. అయితే ఇటీవల పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుప్రతులనే తేడా లేకుండా వైద్యవవస్థ వ్యాపారంగా మారింది. అలాంటి ఓ షాకింగ్ ఘటనే మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వృత్తి ధర్మం మరిచిన ఓ వైద్యుడు రోగిపట్ల నిర్లక్ష్యంగా వ్యహరించాడు. డ్యూటీ చేస్తుండగా తనకు టీ ఇవ్వలేదని ఆపరేషన్ థియేటర్ నుంచి మధ్యలో వెళ్లిపోయాడు సదరు వైద్యుడు. నాగ్‌పూర్‌లోని మౌడ మండల ప్రభుత్వ ఆసుపత్రిలో నవంబర్ 3న జరగ్గా.. ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల ప్రకారం.. మౌడ ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం ఎనిమిది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో నలుగురు మహిళలకు ఆపరేషన్ చేసిన వైద్యుడు తేజ్‌రంగ్ భలవి.. మిగిలిన వారికి కూడా సర్జరీ చేసేందుకు ముందుగా అనస్తీషియా ఇచ్చాడు. అయితే ఆసుపత్రి సిబ్బందిని ఓ కప్ చాయ్ తీసుకురావాలని వైద్యుడు కోరాడు. కానీ ఎవరూ అతనికి టీ తీసుకోని రాలేదు. దీంతో ఆగ్రహం చెందిన డాక్టర్ భల్వాయి.. మిగతా నలుగురికి కు.ని శస్త్రచికిత్స చేయకుండానే ఆపరేషన్ థియేటర్ నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయంపై వెంటనే ఆసుపత్రి సిబ్బంది జిల్లా వైద్యాధికారికి ఈ విషయం తెలపగా.. ఉన్నపళంగా మరో వైద్యుడిని మహిళలకు సర్జరీలు చేసేందుకు పంపించారు. అనంతరం క్టర్ భలవి ప్రవర్తనపై జిల్లా యంత్రాంగం సీరియస్ అయ్యింది. ముగ్గురు సభ్యులతో కూడిని కమిటీని ఏర్పాటు చేసి వైద్యుడిపై విచారణ చేపట్టినట్లు నాగ్‌పూర్ జిల్లా పరిషత్ సీఈవో సౌమ్య శర్మ తెలిపారు. ఇది చాలా తీవ్రమైన విషయమని, నివేదిక వచ్చిన తర్వాత అతనిపై చర్యలు తీసుకుంటామన్నారు. చదవండి: వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్టు -
ఆపరేషన్ థియేటర్లో ‘టిక్‌టాక్’
హుజూరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్లో వైద్యులు టిక్‌టాక్ చేసిన వీడియో ఒకటి ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్లో ఓ రోగికి వైద్యులు, సిబ్బంది ఆపరేషన్ చేస్తుండగా ‘సార్ మేము ప్లేయర్సే.. ఈ ఫుట్‌బాల్ ఆట మాకు తెలియదు. కానీ.. మా ఆట దడ.. దడ పుట్టిస్తది’అని ఓ సినిమాలోని డైలాగ్‌తో ఈ వీడియో ఉంది. అయితే ఈ వీడియోతో తమకేం సంబంధం లేదని హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రి ఆర్ఎంఓ శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. కొన్ని అరుదైన శస్త్ర చికిత్సలు, ప్రత్యేకమైన పరిస్థితుల్లోనే తాము వీడియో, ఫొటోలు తీసి రోగి బంధువులకు చూపిస్తామని, అయి తే ఈ వీడియో విషయంలో మామూలుగా తీసిన వీడియోను ఎవరో ఎడిట్ చేసి టిక్‌టాక్‌లో పెట్టారన్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేసి చర్యలు తీసుకోవచ్చన్నారు. -
వైరల్ : ఆపరేషన్ థియేటర్లో కునుకు తీసిన డాక్టర్
బీజింగ్ : ‘వైద్యో నారాయణో హరి’ అనే నానుడికి చైనాలోని ఓ డాక్టర్ సాక్ష్యంగా నిలిచారు. విరామమే లేకుండా ఏకధాటిగా 10 ఆపరేషన్లు చేసి రోగుల పాలిట దేవుడయ్యాడు. ఇక పనిపట్ల అతని శ్రద్ధని పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ ఫొటో వైరల్ అయింది. సౌత్ చైనాలోని లంగాంగ్ సెంట్రల్ హాస్పిటల్ (ఆర్థోపెడిక్)లో డాక్టర్ డైయూ అతని బృందం గత సోమవారం 13 గంటలపాటు పనిచేసి 10 ఆపరేషన్లు చేసింది. అయితే, డాక్టర్ డైయూ విరామమే లేకుండా పనిచేశాడు. ఉదయం 8 గంటలకు ఆపరేషన్ థియేటర్లోకి అడుగుపెట్టిన అతను సాయంత్రం అయిందింటి వరకు 7 ఆపరేషన్లు చేశాడు. అప్పటికీ అతను నిముషం కూడా విశ్రాంతి తీసుకోలేదు. ఇక 8వ సర్జరీ సమయంలో పేషంట్‌కు అనస్థీషియా ఇవ్వడంలో కాస్త ఆలస్యమైంది. దాంతో డైయూకి ఓ 10 నిముషాలు సమయం దొరకడంతో థియేటర్లోని ఫ్లోర్‌పై ఓ మూలకు కూర్చుని కునుకు తీశాడు. డాక్టర్ వృత్తి ధర్మానికి ముగ్థుడైన సిబ్బందిలో ఒకరు అతను కునుకుతీస్తున్నప్పుడ ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో డాక్టర్‌పై సేవలపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సెల్యూట్ సర్.. మీ సేవలకు కృతజ్ఞతలు అని ఒకరు, చైనా డాక్టర్లు ఎప్పుడూ బెస్టే అని మరొకరు కామెంట్లు చేశారు. ‘ఆస్పత్రి బెడ్‌పై కదల్లేని స్థితిలో ఉన్నా. అయినా సరే.. డాక్టర్ డైయూని కలిసి థాంక్స్ చెప్పాలని ఉంది’అని ఓ పేషంట్ కామెంట్ చేశాడు. రోగులకు సత్వర చికిత్సను అందించడం తన కర్తవ్యమని డాక్టర్ డైయూ చెప్పడం విశేషం. -
#మీటూ: చివరికి ఆపరేషన్ థియేటర్లో కూడా
బాధితుల ఆక్రోశంతో పెల్లుబుకిన మీటూ ఉద్యమంపై విమర్శలు గుప్పిస్తున్న వారికి చెంప పెట్టులాంటి సంఘటన ఇది. వైద్యుడు దేవుడితో సమానమని నమ్ముతాం. అలాంటిది నిస్సహాయ స్థితిలో ఉన్నమహిళను ఒక లైంగిక వస్తువుగా పరిగణించిన తీరు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. నాగరిక సమాజంలో ఇలాంటి అనాగరికమైన, ఘోరమైన ఘటనలను అసలు ఊహించలేం. కానీ బాధితురాలి ఆత్మక్షోభ సాక్షిగా, ఆసుపత్రి థియేటర్ సాక్షిగా చెప్పిన సంగతులు గుండెల్ని మండిస్తాయి. దీంతో మహిళలకు ఇక ఎక్కడ రక్షణ? వెలుగు చూడని ఇలాంటి దారుణాలు ఇంకెన్ని ఉన్నాయో? అనే ప్రశ్నలు ఉదయింకచమానవు మీటూ ఉద్యమానికి ప్రధాన సారధిగా నిలిచిన గాయని చిన్మయి శ్రీపాదకు ట్వీటర్ ద్వారా బాధితురాలి గోడు సారాంశం ఇది.. ఆపరేషన్ అనంతరం థియేటర్లోని బెడ్‌పై ఎనస్తీషియా ప్రభావంతో అపస్మారకంగా పడి వున్న ఆమెపై థియేటర్లోని జూనియర్ డాక్టర్లు అమానుషంగా ప్రవర్తించారు. చుట్టూ చేరి వెకిలిగా నవ్వుకుంటుండగా .. ఆమెకు కొద్దిగా మెలకువ వచ్చింది...అయితే బలహీనత కారణంగా ఏమీ చేయలేకపోయినా.. ఆ భయంకరమైన అనుభవం తనను వెన్నాడుతోందని ఆమె ట్వీట్ చేశారు. అయితే హెల్యూషనేషన్( భ్రాంతి) అంటూ ఈ ఆరోపణలను కొట్టిపారేసిన డాక్టర్‌ను స్పందించాల్సిందిగా (ఇది భ్రాంతి ఏమాత్రం కాదు.. 2012 డిసెంబర్లో తనకెదురైన ఈ చేదు అనుభవంతోపాటు అసిస్టెంట్ డాక్టర్ ముఖం ఇప్పటికీ గుర్తు ఉందన్న బాధితురాలి ట్వీట్ ఆధారంగా) చిన్నయి ట్విటర్లో కోరారు. Sigh. Full patient account that a lot of doctors questioned. I requested the doctor who called this ‘hallucination’ to respond to this in public domain as well. pic.twitter.com/dRraEYvueA — Chinmayi Sripaada (@Chinmayi) October 12, 2018 -
పెద్దాస్పత్రిపై చిన్నచూపు
సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆపరేషన్లు, ఎలుకల దాడిలో పసికందు మృతి వంటి ఘటనలతో పాతాళానికి పడిపోతున్న జీజీహెచ్ ప్రతిష్టను.. కొందరు వైద్యులు ఉచిత ఆపరేషన్లతో ఆకాశానికి తీసుకెళుతున్నారు. ఇది ఆసరాగా పేద రోగుల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు నిలువెల్లా నిర్లక్ష్యంతో చీకటిమయం చేస్తున్నారు. థియేటర్లలో కనీస సౌకర్యాలు కల్పించకుండా ఆపరేషన్లకు పంగనామాలు పెడుతున్నారు. ప్రభుత్వ పాలకులు గుండె మార్పిడి ఆపరేషన్లకు ప్యాకేజీ తేల్చకుండా పేదల ఊపిరి తీస్తున్నారు. ఇంప్లాంట్లు ఇవ్వకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ల కీలు విరగ్గొడుతున్నారు. మూత్రపిండాల మార్పిడి ఆపరేషన్లకు థియేటర్ సమస్య పరిష్కరించకుండా ఐసీయూలో పడేస్తున్నారు. మొత్తంగా జీజీహెచ్‌లో రోగుల వేదనలు, రోదనలను గాలికొదిలేస్తున్నారు. సాక్షి, గుంటూరు: అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందన్న చందంగా జీజీహెచ్ పరిస్థితి తయారైంది. పెద్దాస్పత్రిలో ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు అనేక మంది ప్రముఖ వైద్యులు ముందుకు వస్తున్నారు. గతంలో కనీసం చిన్న గుండె ఆపరేషనే జరగని ఆస్పత్రిలో ఏకంగా గుండె మార్పిడి, కిడ్నీ మార్పిడి, కీళ్ల మార్పిడి ఆపరేషన్లు సైతం నిర్వహించారు. పెద్దాస్పత్రి ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నారు. కానీ ప్రభుత్వం, ఉన్నతాధికారుల నిర్లక్ష్యం రోగులపాలిట శాపంగా మారింది. జీజీహెచ్‌లో కీళ్ల మార్పిడి, కిడ్నీ మార్పిడి ఆపరేషన్లకు బ్రేక్‌లు పడ్డాయి. ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్ ఏర్పాటు చేసి ఆరు నెలలు దాటుతున్నా ఇంత వరకూ ప్రారంభించకపోవడంతో యూరాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, రేడియాలజీ వంటి సూపర్‌స్పెషాలిటీ కోర్సులు చదువుతున్న వైద్య విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. స్పందించే హృదయం లేదా ? గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో అతి తక్కువ ఖర్చుతో చదువుకుని దేశ, విదేశాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగిన ఎందరో వైద్యులు.. పుట్టిన ప్రాంతానికి సేవ చేయాలనే తలంపుతో జీజీహెచ్‌లో ఉచిత వైద్య సేవలు అందించేందుకు ముందుకు వస్తున్నారు. పీపీపీ విధానం ద్వారా ఇప్పటికే జీజీహెచ్ మిలీనియం బ్లాక్‌లో సహృదయ ట్రస్టు ద్వారా డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే వైద్య బృందం 450కుపైగా గుండె ఆపరేషన్లు చేసింది. దీనికి దాతల సహాయం, సొంత డబ్బులు వెచ్చింది. గుండె మార్పిడి ఆపరేషన్లను నిరుపేద రోగులకు ఉచితంగా చేసేందుకు డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవలో చేర్చాలంటూ డాక్టర్ గోఖలే ఉన్నతాధికారులను కోరారు. దీనికి సుముఖత వ్యక్తం చేసినా ప్రభుత్వం ఏడాదిన్నరగా ప్యాకేజీ నిర్ణయించ లేదు. దీంతో గుండె మార్పిడి ఆపరేషన్లు నిలిచిపోయాయి. గుండె మార్పిడి ఆపరేషన్ల కోసం వందల మంది రోగులు దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారు. ఆపరేషన్ థియేటర్ల సమస్య జీజీహెచ్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లో రూ. 3 కోట్లతో 2014లో నాలుగు అత్యాధునిక మాడ్యూలర్ ఆపరేషన్ థియేటర్లను నిర్మించారు. వీటిలో కార్డియాలజీ విభాగానికి రెండు కేటాయించారు. ఒకటి న్యూరోసర్జరీకి అప్పగించారు. మిగిలిన ఒక్క ఆపరేషన్ థియేటర్లో గతంలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు నిర్వహించారు. కీళ్ల మార్పిడి ఆపరేషన్లకు థియేటర్ లేకపోవడంతో కిడ్నీ మార్పిడి ఆపరేషన్లకు కేటాయించిన థియేటర్‌ను వినియోగిస్తున్నారు. ఇలా చేయడంతో ఇన్ఫెక్షన్లు వస్తున్నాయని కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు నిలిపివేశారు. దీంతో కిడ్నీ, కీళ్ల మార్పిడి అపరేషన్ల నిర్వహణకు తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ ఆపరేషన్లకు లక్షలు ధారపోయాల్సి ఉండడంతో పేదలు జీజీహెచ్ మీదే ఆశలు పెట్టుకున్నారు. ప్లాస్టిక్ సర్జరీ విభాగంలోని ఎస్వోటీలో ఆపరేషన్ నిర్వహించే సమయంలో ఓటీ లైట్లు ఆరిపోవడంతో సెల్‌ఫోన్ వెలుగులో నిర్వహించారు. ఇది ఆస్పత్రికి మాయనిమచ్చగా మిగిలిపోయింది. దాతలు ముందుకొచ్చినా.. జీజీహెచ్‌లో కీళ్ల మార్పిడి ఆపరేషన్లతోపాటు ఇంప్లాంట్లను ఉచితంగా అందించి నిరుపేదలకు సేవ చేసేందుకు సాయిభాస్కర్ ఆసుపత్రి అధినేత డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి ముందుకు వచ్చారు. కానీ ఆపరేషన్ థియేటర్ల కొరత, ప్రభుత్వం ఇంప్లాంట్ల కోసం నిధులు విడుదల చేయకపోవడంతో కీళ్లమార్పిడి ఆపరేషన్లు నిలిచిపోతున్నాయి. ఇప్పటి వరకు సుమారు 200 మంది కీళ్లమార్పిడి ఆపరేషన్ల కోసం దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నారు. వీరి ఆర్తనాదాలు ప్రభుత్వానికిగానీ, ఉన్నతాధికారులకుగానీ వినిపించడం లేదు. ఆపరేషన్ థియేటర్లకు నిధులు మంజూరయ్యాయి ఎన్ఏబీహెచ్ పనుల్లో భాగంగా గుంటూరు జీజీహెచ్‌లో ఆపరేషన్ థియేటర్లు నూతనంగా నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఆరు నెలల్లో నాలుగు మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు నిర్మాణం చేసేందుకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేశారు. ప్రస్తుతం ఆపరేషన్ థియేటర్ల నిర్మాణ పనుల టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. టెండర్లు పూర్తికాగానే ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి వస్తాయి. – డాక్టర్ రాజునాయుడు, జీజీహెచ్ సూపరింటెండెంట్ -
ఆపరేషన్ థియేటర్లో డాక్టర్ డాన్స్
-
ఆపరేషన్ థియేటర్లో ఏం జరిగిందంటే..
వరంగల్ క్రైం: రోహిణిలో జరిగిన ప్రమాదంపై సోమవారం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినా అసలు కారణం పై అ«ధికారులు దృష్టి సారించా రు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకా రం.. థియేటర్లో న్యూరో ఆపరేషన్ జరుగుతోంది. ఆ సమయంలో థియేటర్‌కు వచ్చే ఆక్సిజన్ పైపు నుంచి లీకేజీ అవుతోంది. గమనించని సిబ్బంది వైద్య పరికరాల స్విచ్ ఆన్‌చేశారు. ప్లగ్ లూజ్‌గా ఉండడంతో స్విచ్‌బోర్డులో మంటలు లేచాయి. అప్పటికే ఆక్సిజన్ లీకవుతుం డడంతో ప్లగ్‌లో వచ్చిన మంటలకు గ్యాస్ తోడు కావడంతో పెద్ద ఎత్తున చెలరేగడంతో విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. ఆపరేషన్ చేస్తున్న డాక్టర్ రోగిని ఎత్తుకుని బయటకు పరుగు తీశాడు. పక్కనే ఆర్థో విభాగంలో ఆపరేషన్ చేస్తున్న మరో డాక్టర్ కరెంట్ పోవడంతో బయటకు వచ్చాడు. తిరిగి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పొగతో లోపలికి వెళ్లలేదు. దీంతో థియేటర్లోనే పేషెంట్ ఉన్నా డు. ఆపరేషన్ థియేటర్‌కు సరఫరా అయ్యే ఆక్సిజన్ సిలిండర్‌తోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. -
ఉన్నచూపూ పోయింది
► ఆపరేషన్ తర్వాత కంటిచూపు కోల్పోయిన ఏడుగురు.. సరోజినీదేవి ఆసుపత్రిలో దారుణం ► సర్జరీ అనంతరం వాడిన సెలైన్ బాటిల్లో బ్యాక్టీరియానే కారణం! ► ప్రాథమికంగా తేల్చిన వైద్యులు, వైద్య ఆరోగ్యశాఖ ► ఈ ఘటనపై సమగ్ర విచారణకు ముగ్గురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీ ► బ్యాక్టీరియా ఉన్న 13.07 లక్షల బాటిళ్లు రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రులకు సరఫరా ► సెలైన్ బాటిళ్లు సరఫరా చేసింది నాగ్‌పూర్‌కు చెందిన హసీబ్ ఫార్మాసూటికల్స్ కంపెనీ ► కంపెనీని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన ప్రభుత్వం ► బాధ్యులపై క్రిమినల్ కేసులు పెడతాం: లక్ష్మారెడ్డి ► వైద్యులపై హుమాయూన్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాధితులు సాక్షి, హైదరాబాద్: వైద్యుల నిర్లక్ష్యమో... సెలైన్ బాటిల్లో బ్యాక్టీరియానో... కారణం ఏదైతేనేం.. ఏడుగురి జీవితాల్లో చీకట్లు అలముకున్నాయి! కంటిచూపు మందగించిందని ఆసుపత్రికి వెళ్తే ఉన్న చూపూ పోయింది! కంటి శుక్లాలకు చేసే క్యాటరాక్ట్ ఆపరేషన్‌తో ఆ అభాగ్యులు వెలుగులకు దూరమయ్యారు. సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఆపరేషన్ వికటించి చూపు కోల్పోయిన వారంతా 50 ఏళ్లకు పైబడిన వారే. శస్త్రచికిత్స అనంతరం కళ్లను శుభ్రం చేసేందుకు వాడిన సెలైన్ బాటిల్లో బ్యాక్టీరియా వల్లే కంటి చూపు పోయిందని వైద్యఆరోగ్యశాఖ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. సెలైన్ బాటిళ్లను సరఫరా చేసిన కంపెనీని బ్లాక్‌లిస్టులో పెడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించింది. ఆ కంపెనీ సరఫరా చేసిన సెలైన్ బాటిళ్లు ఇంకా ఎక్కడెక్కడికి సరఫరా అయ్యాయో గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఎలా జరిగింది..? చూపు మందగించడంతో బాధితులు జూన్ 28న సరోజినీదేవి కంటి ఆసుపత్రికి వచ్చారు. వైద్యులు వారిని పరీక్షించి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయాలని సూచించారు. 30న రెండు ఆపరేషన్ థియేటర్లలో మొత్తం 21 మందికి ఆపరేషన్ చేశారు. మొదటి ఆపరేషన్ థియేటర్లో తొమ్మిది మందికి, రెండో ఆపరేషన్ థియేటర్లో 12 మందికి సర్జరీ చేశారు. డాక్టర్ సుధాకర్, డాక్టర్ కవిత, డాక్టర్ కిషోర్ల వైద్య బృందం రెండో థియేటర్లో సత్యనారాయణ(60), పీసీ మండల్(67), అంజిరెడ్డి(70), నూకాలమ్మతల్లి(60), మాణిక్యం(75), ప్రభావతి(65), అర్పిణిబాయి(65), కృష్ణయ్య(60), సరళారాణి(76), బీములు(60) నాగలక్ష్మి(65), దోబ్రూ(60)లకు క్యాటరాక్ట్ సర్జరీ చేశారు. ఆపరేషన్ చేసిన రెండ్రోజుల తర్వాత బాధితుల కంటికి తీవ్ర ఇన్ఫెక్షన్ సోకింది. కన్నువాచిపోయి భరించలేని నొప్పితోపాటు కంటి నుంచి రక్తం కారింది. దీంతో వైద్యులు వారిని మరోసారి పరీక్షించారు. వైద్యపరమైన నిర్లక్ష్యం లేదని నిర్ధారించుకున్న తర్వాత ఆపరేషన్ గదుల్లోని పరికరాలను, వాడిన మందులను పరిశీలించారు. రెండో ఆపరేషన్ గదిలో కంటిని శుభ్రం చేసేందుకు వాడిన సెలైన్ బాటిల్‌ను పరీక్షించగా అందులో ‘క్లెప్సెల్లా’ బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. ఇదే విషయాన్ని వైద్యులు వివరిస్తూ వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) రమణికి బుధవారం లేఖ రాయడంతో ఈ దారుణం వెలుగుచూసింది. బాధితుల్లో సత్యనారాయణ, పీసీ మండల్, అంజిరెడ్డి, నూకాలమ్మతల్లి ఎడమ కన్ను, మాణిక్యం, ప్రభావతి, అర్పిణిబాయిల కుడి కన్ను చూపును కోల్పోయారు. వీరిలో ప్రస్తుతం ఇద్దరికి కార్నియా మార్పిడి(ఆప్టికల్ కెరిటోప్లాస్ట్) చేసి చూపును ప్రసాదించే అవకాశం ఉందంటున్నారు. మిగిలిన ఐదుగురు మాత్రం శాశ్వతంగా చూపుకు దూరం కానున్నారు. ఇదే ఆపరేషన్ గదిలో సర్జరీ చేయించుకున్న మిగతా ఐదుగురికి కూడా ఇన్ఫెక్షన్ సోకినా వారికి కంటిచూపు పోలేదని వైద్యులు చెబుతున్నారు. మొదటి ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ చేయించుకున్న తొమ్మిది మంది కంటి చూపు బాగానే ఉంది. ఈ ఇన్ఫెక్షన్ల కేసులు వెలుగుచూడడంతో జూలై ఒకటో తేదీ నుంచి ఆస్పత్రిలో క్యాటారాక్ట్ సర్జరీలు నిలిపివేశారు. పూర్తిస్థాయి విచారణకు కమిటీ ఎంతో పేరున్న సరోజినీదేవి ఆసుపత్రిలో ఈ ఘటన జరగడంతో వైద్య ఆరోగ్యశాఖ యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి చెప్పారు. బాధితులకు నష్టపరిహారం అందించాల్సిందిగా డీఎంఈ ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. దీనిపై పూర్తిస్థాయి విచారణకు నిమ్స్ డెరైక్టర్ డాక్టర్ మనోహర్, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, డ్రగ్ కంట్రోల్ విభాగానికి చెందిన వెంకటేశ్వర్లతో ఉన్నతస్థాయి కమిటీని నియమించారు. డ్రగ్ కంట్రోల్ విభాగాన్ని కూడా విచారణ చేయాల్సిందిగా కోరారు. ఈ బాటిళ్లను కంపెనీ నుంచి కొని ఆసుపత్రులకు సరఫరా చేసిన తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) పాత్రపైనా సర్కారు విచారణ చేస్తోంది. ఇక సెలైన్ బాటిళ్లలో బ్యాక్టీరియా ఉందని డీఎంఈ ప్రభుత్వానికి నివేదించగా.. అందులో ఎలాంటి బ్యాక్టీరియా లేదని టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ వేణుగోపాల్ మరో నివేదిక ఇచ్చారు. ఎక్కడివి ఆ బాటిళ్లు.. ఎన్ని కొన్నారు? రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులన్నింటికీ మందులు, వైద్య పరికరాలను టీఎస్‌ఎంఎస్‌ఐడీసీనే సరఫరా చేస్తుంది. టెండర్లు పిలిచి వివిధ కంపెనీల నుంచి మందులు, పరికరాలను కొనుగోలు చేస్తుంది. గతేడాది కాంపౌండ్ సోడియం లాక్టేట్ ఇంజెక్షన్ ఐపీ 500 ఎంఎల్/బీఎఫ్ఎస్/ఎఫ్ఎఫ్ఎస్ (సెలైన్) సరఫరా చేసే బాధ్యతను నాగ్‌పూర్‌కు చెందిన హసీబ్ ఫార్మాసూటికల్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీకి అప్పగించారు. ఈ సెలైన్‌ను రింగర్ లాక్టేట్ అని కూడా పిలుస్తారు. ఈ సెలైన్ బాటిళ్లను సరఫరా చేయాల్సిందిగా టీఎస్ఎంఎస్ఐడీసీ గతేడాది డిసెంబర్ 31న ఆ కంపెనీకి ఆర్డర్లు ఇచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 2న వివిధ బ్యాచ్‌లకు చెందిన 7.95 లక్షల సెలైన్ బాటిళ్లు రాష్ట్రానికి వచ్చాయి. అందులో మూడు బ్యాచ్‌లకు చెందిన 1,200 సెలైన్ బాటిళ్లు సరోజినీదేవి ఆసుపత్రికి అందజేశారు. వాటిల్లో 16,385 బ్యాచ్‌కు చెందినవి 816 బాటిళ్లు, 16,386 బ్యాచ్వి 144 బాటిళ్లు, 16,387 బ్యాచ్‌కు చెందిన 240 బాటిళ్లు ఆసుపత్రికి అందాయి. రెండో థియేటర్లో ఉపయోగించిన ఏడు బాటిళ్లలోని సెలైన్ నమూనాలను పరీక్షకు పంపించారు. వీటిలో రెండింటిలో బ్యాక్టీరియా ఉందని గుర్తించారు. ఆసుపత్రికి వచ్చిన 1,200 బాటిళ్లలో ఇప్పటివరకు 624 బాటిళ్లను ఉపయోగించారని తేలింది. ఇంకా 576 బాటిళ్లు ఆసుపత్రిలోనే ఉన్నాయి. వాటిని సీజ్ చేశారు. 624 బాటిళ్లను పలువురికి ఉపయోగించినందున వారి పరిస్థితి ఎలా ఉందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ కంపెనీ నుంచి వచ్చినవి 13.07 లక్షల బాటిళ్లు నాగ్‌పూర్‌కు చెందిన కంపెనీ నుంచి ఈ ఏడాది ఇప్పటివరకు రెండు విడతలుగా 13.07 లక్షల సెలైన్ బాటిళ్లను సరఫరా చేసింది. మొదటి విడత 7.95 లక్షల బాటిళ్లు, రెండో విడత 5.11 లక్షల బాటిళ్లు సరఫరా చేసింది. మొత్తం 128 బ్యాచ్‌లుగా అవి రాష్ట్రానికి చేరాయి. అయితే వాటిని రాష్ట్రంలో ఎన్ని ప్రాంతాలకు తరలించారు? వాటిలో ఎన్ని వాడారన్న సమాచారం తెలియాల్సి ఉంది. సదరు కంపెనీని బ్లాక్‌లిస్టులో పెట్టినందున ఆసుపత్రులకు చేరిన లక్షలాది సెలైన్ బాటిళ్లను ప్రభుత్వం సీజ్ చేయాలని నిర్ణయించింది. వాటిని వాడొద్దని ఆదేశాలిచ్చినట్లు టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ వేణుగోపాల్ తెలిపారు. పోలీస్‌స్టేషన్‌లో బాధితుల ఫిర్యాదు తమ కంటిచూపు పోవడానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బాధితులు ఆరోపిస్తున్నారు. జూనియర్ వైద్యులతో శస్త్రచికిత్స చేయిం చినట్లు వెల్లడించారు. ఇందుకు కారణమైన బాధ్యులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితుల బంధువులు హుమాయూన్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వైద్యులపై ఐపీసీ 338 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, తెలంగాణ డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారులు సరోజినీదేవి ఆస్పత్రికి వెళ్లి సెలైన్ బాటిళ్లు, వాటిని నిల్వ చేసిన తీరు, ఎక్స్పైరీ డేట్ వంటి అంశాలపై ఆరా తీశారు. ఆ కాస్తా చూపు పోగొట్టారు వైద్య పరీక్షలు చేయించుకొని అవసరమైతే కంటి అద్దాలు పెట్టుకుందామని ఇక్కడికి వచ్చాను. రెండు, మూడు సార్లు ఆపరేషన్ చేశారు. కట్లు విప్పాక ఏమీ కన్పించలేదు. వైద్యులు నాకు సర్జరీ చేసి ఉన్న ఆ కొద్దిపాటి చూపు కూడా పోగొట్టారు. - ప్రభావతి, జీడిమెట్ల, హైదరాబాద్ బాధ్యులపై క్రిమినల్ కేసులు పెడతాం: లక్ష్మారెడ్డి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి బుధవారం సాయంత్రం సరోజినీదేవి ఆస్పత్రిని సందర్శించారు. ఆపరేషన్లు వికటించడంపై ఆరా తీశారు. ‘‘సెలైన్ బాటిళ్లను సరఫరా చేసిన కంపెనీని బ్లాక్‌లిస్టులో పెట్టాం. ఘటనకు బాధ్యులైన వారిపై, సంస్థలపై క్రిమినల్ కేసులు పెడతాం. మొత్తం 13 మందికి ఆపరేషన్ చేయగా.. వారిలో ఆరుగురు మంచి చూపుతో ఇంటికెళ్లారు. ఐదుగురికే ఒక కన్ను మాత్రమే పోయింది. మరో ఇద్దరు ఇంటి నుంచి ఆసుపత్రికి వస్తున్నారు. ఒక కన్ను పోయిన ఐదుగురికి కూడా పూర్తిగా ఒక కన్ను పోయిందని చెప్పలేం. వారికి ప్రభుత్వ పరంగా బయటి డాక్టర్లను తెప్పించి లేదా వేరేచోట వైద్యం చేయిస్తాం. రెండో థియేటర్లోని సెలైన్‌లో బ్యాక్టీరియా ఉందని తేలింది. మరో థియేటర్లో ఎలాంటి బ్యాక్టీరియా బయటపడలేదు. వాడిన ఏడు బాటిళ్లను పరీక్షలకు పంపగా... రెండింటిలో బ్యాక్టీరియా బయటపడింది’’ అని చెప్పారు. నగరంలో 30 ఆసుపత్రులకు 30 వేల బాటిళ్లు.. హైదరాబాద్‌లో మొత్తం 30 ఆసుపత్రులకు ఇలాంటివే 30,840 సెలైన్ బాటిళ్లను సరఫరా చేశారు. ఈ బ్యాచ్‌లకు చెందిన బాటిళ్లలోనే బ్యాక్టీరియా బయటపడింది. వాటిల్లో ఇప్పటివరకు ఎన్నింటిని వాడారన్నది తేలా ల్సి ఉంది. నగరంలో బార్కాస్ సామాజిక ఆరోగ్య కేంద్రం, కోఠి ఈఎన్టీ, నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి, గోల్కొండ ఏరియా ఆసుపత్రి, ప్రభుత్వ సాధారణ చెస్ట్ ఆసుపత్రి, ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రి, కింగ్ కోఠి జిల్లా ఆసుపత్రి, అంబర్‌పేట, లాలాపేట, పానీపుర, సీతాఫల్మండి, అడ్డగుట్ట, బైబిల్ హౌస్, బోరబండ, డీఆర్ పాల్ దాస్, గడ్డి అన్నారం, గరీబ్‌నగర్, కిషన్‌బాగ్, తార్నాక, పాన్ బజార్, పురాన్‌పూల్-1, ఆర్ఎఫ్పీటీసీ, తుకారాంగేట్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, మలక్‌పేట, మల్లేపల్లి, వనస్థలిపురం ఏరియా ఆసుపత్రుల్లో, నయాపూల్, సుల్తాన్‌బజార్ మెటర్నిటీ ఆసుపత్రుల్లో, సరోజినీదేవి కంటి ఆసుపత్రి, శాలిబండ మున్సిపల్ సామాజిక ఆసుపత్రిలో ఈ బాటిళ్లను సరఫరా చేశారు. కన్ను తెరిచి చూస్తే ఏమీ కన్పించలేదు కంటిచూపు మందగించడంతో చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చా. ఆపరేషన్ తర్వాత కళ్లు తెరిచి చూస్తే ఏమీ కనపడ లేదు. కంటి చూపు పూర్తిగా పోయింది. పెద్ద ఆసుపత్రని వస్తే నన్ను గుడ్డిదాన్ని చేశారు. - నూకాలమ్మతల్లి, నర్సీపట్నం, విశాఖపట్నం. రెండుసార్లు ఆపరేషన్ చేశారు అక్షరాలు సరిగా కన్పించక పోవడంతో వైద్యుడికి చూపించుకుందామని వచ్చా. ఆపరేషన్ చేశారు. రెండ్రోజుల తర్వాత మళ్ల్లీ రమ్మాన్నారు. చెకప్‌కు వెళ్తే మరోసారి ఆపరేషన్ చేశారు. - అర్పిణిబాయి, గోల్కొండ , హైదరాబాద్ ఇంత దూరం వచ్చి తప్పు చేశా.. మా ఊళ్లో డాక్టర్లు చెబితే ఇక్కడికి వచ్చాను. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆపరేషన్ చేయాలంటే సరే అన్నాను. ఇప్పుడు ఆపరేషన్ చేయించుకొని గుడ్డివాణ్ణి అయ్యాను. - మాణిక్యం, కుకునూరు, మెదక్ ఇలా అవుతుందని అనుకోలేదు డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఉన్న కంటిచూపు పోయింది. ఈ వయసులో గుడ్డివాడిగా ఎలా జీవిం చాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం నన్ను ఆదుకోవాలి. - అంజిరెడ్డి, పలుగుట్ట, చేవేళ్ల కళ్లు తెరిస్తే అంతా చీకటే నా కూతురు సలహా మేరకు కంటి పరీక్షల కోసం ఇక్కడికి వచ్చాను. డాక్టర్లు ఆపరేషన్ చేశారు. వారం తర్వాత కళ్లు తెరిస్తే అంతా చీకటే. ఉన్న చూపు పోయింది. - పి.సి.మండల్, కోల్‌కతా ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే.. వైద్యుల నిర్లక్ష్యం వల్లే నా కంటిచూపు పోయింది. నాకు డాక్టర్లు రెండుసార్లు ఆపరేషన్ చేశారు. చివరికి నన్ను ఇలా గుడ్డివాణ్ణిలా తయారు చేశారు. - సత్యనారాయణ, కార్వాన్, హైదరాబాద్ -
తల్లీబిడ్డ ‘క్షేమం’ కాదు..
కాన్పు జరిగింది. ఆపరేషన్ ధియేటర్ నుంచి నర్సు బయటికొచ్చి.. ‘గాబరా పడొద్దు.. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమమే’ అని చెబుతుంది. ఇలాంటి సీన్లను సినిమాల్లో మనమెన్నో చూశాం. కానీ.. రాష్ట్రంలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. తల్లీబిడ్డ ఇక్కడ ‘క్షేమం’గా లేరు. మాతాశిశువుల మరణ మృదంగం సర్కారు చెవికి వినపడటం లేదు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రిగా, ఏరియా ఆసుపత్రిని 100 పడకలుగా, జిల్లా కేంద్ర ఆసుపత్రులను సూపర్‌స్పెషాలిటీ స్థాయికి పెంచాలని కలలు కంటున్న ప్రభుత్వం వాస్తవానికి మాత్రం గ్రామాల్లో కనీస వైద్య చర్యలపై దృష్టిపెట్టట్లేదు. 700 పీహెచ్‌సీలు, 3 వేలకుపైగా ఉప వైద్య కేంద్రాలు, 42 ఏరియా ఆసుపత్రులు, 9 జిల్లా ఆసుపత్రులున్నా.. పలు చర్యలు చేపడుతున్నా మాతాశిశు మరణాలు ఆగట్లేదు. - సాక్షి, హైదరాబాద్ ప్రతి వెయ్యి మందిలో 39 మంది శిశువుల కన్నుమూత... రాష్ట్రంలో ప్రతి వెయ్యి మందిలో 39 మంది శిశువులు పుట్టిన కొన్ని రోజులకే మృత్యువాతపడుతున్నారు. ప్రసవం సమయంలో ప్రతి లక్ష మందిలో 92 మంది కన్నుమూస్తున్నారు. ఈ మరణాల రేటు ఇతర దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే రాష్ర్టంలోనే ఎక్కువగా ఉంది. కేరళలో ప్రతి వెయ్యి మంది శిశువుల్లో 12 మంది శిశువులు మరణిస్తుండగా కర్ణాటకలో 32 మంది, తమిళనాడులో 21 మంది మరణిస్తున్నారు. అలాగే కేరళలో ప్రతి లక్ష మందిలో 68 మంది తల్లులు మరణిస్తుండగా తమిళనాడులో 90 మంది చనిపోతున్నారు. జిల్లాలవారీ గణాంకాలను పరిశీలిస్తే మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రతి వెయ్యి మంది శిశువుల్లో 53 మంది మరణిస్తున్నారు. అలాగే ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి లక్ష మంది తల్లుల్లో 152 మంది మరణిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోనూ శిశు మరణాలు వెయ్యికి 20 ఉండగా తల్లుల మరణాల రేటు ప్రతి లక్షకు 71గా నమోదవడం గమనార్హం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనస్తీషియా వైద్యుల కొరత... గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాంతీయ ఆసుపత్రుల్లో ఒక గైనకాలజిస్టు, పీడియాట్రిస్ట్, అనస్తీషియన్ (మత్తు మందు ఇచ్చే వైద్యుడు) ఉండాల్సి ఉండగా అనస్తీషియన్ల కొరత ఉంది. దీంతో సిజేరియన్లు చేయడంలో ఇబ్బందులు తలెత్తి మరణాలు సంభవిస్తున్నాయి. ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలు తప్పనిసరిగా గర్భిణులను 2, 3 రోజులకోసారైనా పరిశీలించాల్సి ఉన్నా వాస్తవానికి ఆ పరిస్థితి లేనేలేదు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) ద్వారా అనేక వైద్య సేవలకు రూ. కోట్లు కేటాయిస్తున్నా అవి గ్రామీణ ప్రజలకు ఉపయోగపడట్లేదు. ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానంగా ప్రస్తావించారు. మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎక్కువగా ఉన్న మాతాశిశు మరణాల రేటును తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టడంలో వైద్య ఆరోగ్యశాఖ యంత్రాంగం ముందుకు రావాలని వైద్య నిపుణులు కోరుతున్నారు. మరణాలకు కారణాలివీ.. ⇒ గ్రామాల్లో తల్లులకు రక్తహీనత సమస్య ఎక్కువగా ఉండటం, ప్రసవ సమయంలో తల్లికి అవసరమైన రక్తం/సంబంధిత గ్రూపు దొరక్కపోవడం వల్ల అనేక మరణాలు సంభవిస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ⇒ చిన్న వయసులో పెళ్లిళ్లు జరిగి గర్భం దాల్చడం వల్ల కూడా మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ⇒ గర్భిణుల్లో తలెత్తే బీపీ, షుగర్ హెచ్చుతగ్గులను నియంత్రించడంలో వైద్య లోపాలు కూడా కారణంగా ఉంటోంది. ⇒ 51%మంది గ్రామీణ గర్భిణులకు ఐరన్, ఫోలిక్ యాసిడ్ అందట్లేదు. ⇒ గర్భస్త పిండాల ఎదుగుదల/లోపాల గురించి గర్భిణులు ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోకపోవడం నవజాత శిశువుల మరణాలకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. -
సర్వజనాస్పత్రిలో మళ్లీ షార్ట సర్క్యూట్
అనంతపురం రూరల్ : జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రిలో మళ్లీ షార్ట సర్క్యూట్ సంభవించింది. ఈ నెల 9న ఆర్థో ఆపరేషన్ థియేటర్ కాలిపోయిన ఘటనను మరువకముందే మరోసారి అదే తరహా సంఘటన జరగడంతో రోగులు భయాందోళనకు గురవుతున్నారు. శనివారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో రక్తనిధి కేంద్రం ఎదురుగా ఉన్న బోర్డులో మంటలు చెలరేగాయి. దాదాపు అరగంట పాటు పొగ కమ్ముకుంది. రోగులు, సిబ్బంది భయంతో పరుగులు తీశారు. చిన్నపిల్లల వార్డు నుంచి చిన్నారులను తీసుకుని తల్లిదండ్రులు బయటకు వెళ్లిపోయారు. ఆ వార్డు మొత్తం ఖాళీ అయ్యింది. ఎక్స్‌రే, సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ తదితర సేవలు బంద్ అయ్యాయి. కరెంటు సరఫరా ఆగిపోవడంతో పోస్టునేటల్ వార్డులో బాలింతలు ఉక్కిరిబిక్కిరయ్యారు. చంటి బిడ్డలకు చీర కొంగులతో గాలి ఊపారు. టిఫిన్ సైతం చీకట్లోనే చేయాల్సి వచ్చింది. తరచూ సమస్యలే : సర్వజనాస్పత్రిలో తరచూ కరెంటు సమస్యలు తలెత్తుతున్నాయి. ముగ్గురు కాంట్రాక్టు ఎలక్ట్రీషియన్లు మాత్రమే ఉన్నారు. వీరే అన్ని విభాగాలూ చూసుకోవాల్సి వస్తోంది. వాస్తవానికి ఆరుగురు ఉండాలి. ఈ సమస్యను పరిష్కరించాల్సిన ఏపీఎంఎస్ఐడీసీ విభాగం అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. -
శస్త్ర చికిత్స గది కోసం.. సిగపట్లు
మందస: శస్త్ర చికిత్స గది(ఆపరేషన్ థియేటర్) కోసం ఇద్దరు వైద్యాధికారుల మధ్య నెలకొన్న వివాదం కుటుంబ సంక్షేమ ఆపరేషన్ల కోసం వచ్చిన మహిళలను విస్మయపరిచింది. గంటల తరబడి నిరీక్షించేలా చేసింది. మందస పీహెచ్సీ వైద్యాధికారిగా టి.పాపినాయుడు, అదే మండల పరిధిలో హరిపురం సీహెచ్ఎన్సీ ఎస్పీహెచ్వోగా దామోదర ప్రధాన్ విధులు నిర్వహిస్తున్నారు. కాగా మండలంలోని మెజారిటీ గ్రామాలు హరిపురం సీహెచ్‌ఎన్‌సీకి దగ్గర్లో ఉన్నాయి. ఆపరేషన్ థియేటర్ కూడా ఆ ఆస్పత్రిలోనే ఉంది. అయితే ఈ గ్రామాల్లోని ఆరోగ్య ఉపకేంద్రాలను మందస పీహెచ్సీ పరిధిలో చేర్చడంతో కు.ని., తదితర ఆపరేషన్ల నిర్వహణలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబ ర్లో సీతంపేట ఐటీడీఏలో కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన వైద్యాధికారుల సమావేశంలో ఈ విషయం ప్రస్తావనకు రాగా ఆపరేషన్ థియేటర్ ఉన్న హరిపురం సీహెచ్‌ఎన్‌సీలో కు.ని శస్త్ర చికిత్సలు చేయడానికి శాఖాపరమైన ఇబ్బందులున్నాయని వైద్యాధికారులు వివరించారు. దీనికి స్పందించి కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మందస వైద్యాధికారిని డ్రాయింగ్ ఆఫీసర్‌గా నియమించాలని ఐటీడీఏ పీవో ను ఆదేశించారు. ఆ మేరకు ఈ నెల 7వ తేదీన ఆదేశాలు వచ్చాయి. దీంతో హరి పురం సీహెచ్‌ఎన్‌సీలో కు.ని. శస్త్ర చికిత్సలు చేయించే ందుకు శుక్రవారరం 22 మంది మహిళలను తరలించారు. ఆపరేషన్ గది తాళా లు ఇవ్వాలని ఎస్పీహెచ్వో దామోదర ప్రధాన్‌ను కోరగా.. ‘అది నా పరిధిలోని థియేటర్, ఇచ్చేదిలేదని’ ఆయన అన్నారని పాపినాయుడు ఆరోపించారు. ఈ సందర్భంగా వారిద్దరికీ వాగ్వాదం జరగడంతో శస్త్రచికిత్సల కోసం వచ్చిన మహిళలు సుమారు రెండు గంటల వరకు నిరీక్షించాల్సి వచ్చింది. ఎంత నచ్చజెప్పినా ప్రధాన్ అంగీకరించకపోవడంతో బలవంతంగా గది తెరిపించి ఆపరేషన్లు చేశామని పాపినాయుడు చెప్పారు. హరిపురం ఎస్‌పీహెచ్ వోను పదోన్నతిపై రిమ్స్ ప్రొఫెసర్‌గా బదిలీ చేసినా వెళ్లలేదని, డ్రాయింగ్ అథారిటీ తనకు ఇచ్చినా ఇంత వరకు బాధ్యతలు అప్పగించలేద ని పాపినాయుడు ఆరోపించారు. కాగా ఎస్పీహెచ్వో దామోదర ప్రధాన్ మాట్లాడుతూ ఆపరేషన్ థియేటర్ ఇవ్వడానికి తనకు అభ్యంతరం లేదని, కానీ డ్రాయింగ్ అధికారిగా నియమితులైనట్లు తనకు కనీసం చెప్పలేదని, అలాగే కు.ని. శస్త్రచికిత్సలకు ఆపరేషన్ గది వాడుకుంటామని ముందుగా చెప్పకుండా హడావుడి సృష్టించడం సరికాదని అన్నారు. వైద్యాధికారుల వాగ్వాదంతో కిందిస్థాయి సిబ్బంది గందరగోళానికి గురయ్యారు. -
క్యార్ మంటే కరెన్సీ!
విశాఖపట్నం-మెడికల్,న్యూస్‌లైన్ : పాప పుడితే రూ.500, బాబు అయితే వెయ్యి,, ఇదేమిటా అని అనుకుంటున్నారా.. కేజీహెచ్ ప్రసూతి వార్డులో సిబ్బంది, నర్సులకు బాలింతల బంధువులు ముట్టజెప్పాల్సిన ‘బహుమతి’. నిరుపేదలకు పెన్నిధి లాంటి పెద్దాస్పత్రికి పురుడు పోసుకునేందుకు వస్తున్న వారికి ఎదురవుతున్న ఈ మామూళ్ల వ్యవహారం పెద్ద భారంగా పరి ణమించింది. లేబర్ రూమ్, ఆపరేషన్ థియేటర్ సిబ్బంది, నర్సులు గర్భిణుల నుంచి ఈ నిర్బంధ వసూళ్లను నిర్భీతిగా వసూలు చేస్తున్నారని వారి బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రసవం జరిగిన వెంటనే సిబ్బంది మగబిడ్డ పుడితే వెయ్యి రూపాయలు, ఆగపిల్ల అయితే రూ.500 ఆనవాయితీగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే నిరుపేద, మధ్యతరగతి వారు తమ సంతోషం కొద్దీ సిబ్బందికొంత మొత్తం ఇస్తే దాన్ని తీసుకోకుండా తాము అడిగినంతా ఇవ్వకపోతే బిడ్డను చూపించకుండా నానా ఇబ్బంది పెడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై అధికారులకు ఫిర్యాదు చేసినా విచారణ జరిపి బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అధికారులు అడ్డు కట్టవేయాలి నా కుమార్తెను పురుడు కోసం గైనిక్ వార్డులో చేర్చాను. శనివారం సిజేరియన్ ఆపరేషన్ చేశారు. మగబిడ్డను పుట్టింది. బిడ్డను చూపించాలని అడిగాను. మీ కుమార్తెకు మగబిడ్డ పుట్టాడు రూ.1300 ఇవ్వాలని లేబర్ రూమ్ ఓటీ సిబ్బంది డిమాండ్ చేశారు. నాది నిరుపేద కుటుంబం, నా దగ్గర రూ.300 ఉన్నాయన్నాను. వెయ్యికి తక్కువయితే బిడ్డను చూపించేది లేదని బెదిరించారు. దీంతో చేసేది లేక ఆర్ఎంఓకు ఫిర్యాదు చేశాను. ఆయన జోక్యంతో డబ్బులు తీసుకోకుండా వదిలేశారు. ఈ నిర్బంధ వసూళ్లకు అధికారులు అడ్డుకట్టవేయాలి. -లక్ష్మణరావు, బాలింత తండ్రి పూర్తిస్థాయిలో ఆరా తీస్తా ప్రసూతి వార్డులో సిబ్బంది నిర్బంధ వసూళ్లు చేస్తున్నారని బాలింత బంధువు నాకు ఫిర్యాదు చేశాడు. దీనిపై లేబర్ రూమ్ హెడ్ నర్సును అడిగాను. సోమవారం ఈ విషయం పై పూర్తిస్థాయిలో ఆరా తీస్తాను. బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు సూపరింటెండెంట్‌కు నివేదిక అందజేస్తాను. - డాక్టర్ శాస్త్రి, డీసీఎస్ ఆర్ఎంఓ, కేజీహెచ్ -
బందరు ప్రభుత్వాస్పత్రిలో హడలిపోతున్న రోగులు
మచిలీపట్నం టౌన్, న్యూస్‌లైన్ : ఇక్కడ కళ్లు తెరచినా... మూసినా అమ్యామ్యా సమర్పించుకోవాల్సిందే. ఒకవేళ ఎవరైనా ఎందికివ్వాలని ప్రశ్నిస్తే వారి ఒళ్లు హూనం కాకతప్పదు. ఉచిత సేవలందించాల్సిన సిబ్బందే రౌడీల అవతారమెత్తి మామూళ్లు వసూలు చేస్తూ రోగుల పట్ట నిర్ధాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఇక్కడ చికిత్స కోసం చేరాలంటేనే హడలిపోతున్నారు. ఇదీ బందరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్సపొందే రోగుల దుస్థితి. ప్రైవేటు ఆస్పత్రికి వెళితే డబ్బులు ఖర్చవుతాయని ప్రభుత్వాసుపత్రికి వస్తే చికిత్స చేయించుకుని ఇంటిదారి పట్టేలోపు ఇక్కడ కూడా వేలాది రూపాయలను సిబ్బందికి సమర్పించుకోవాల్సి వస్తోంది. ఊడ్చే కార్మికుల నుంచి బట్టలు ఉతికే ధోబీ, స్ట్రేచర్ తోసే సహాయకుడు, గైనిక్‌వార్డులో సేవలందించే సహాయకులు ప్రతి పనికీ రూ. 50 నుంచి రూ. 500 వరకూ ముక్కు పిండి వసూలు చేస్తున్నారని రోగులు పేర్కొంటున్నారు. ఈ కోవలోనే ఆస్పత్రిలో ఇటీవల జరిగిన ఘటన సిబ్బంది దౌర్జన్యానికి, అక్రమ వసూళ్లకు దర్పణం పడుతోంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఘంటసాల మండలం తెలుగురావుపాలెంకు చెందిన పీ సుధారాణి అనే గర్భిణి నెలలు నిండటంతో ప్రసవం కోసం 26వ తేదీ సోమవారం రాత్రి ఆస్పత్రిలో చేరింది. ఉదయం వైద్యపరీక్షలు జరిపిన వైద్యురాలు ఈమెకు సిజేరియన్ చేశారు. సుధారాణి మగశిశువుకు జన్మనిచ్చింది. ఆపరేషన్ థియేటర్ నుంచి ఈమెను స్ట్రేచర్‌పై తోసుకుని వచ్చే దోబీ శ్రీనివాసరావు, థియేటర్ బయట ఉన్న సుధారాణి భర్త పీ బాలవర్ధనరెడ్డి వద్దకు వచ్చి నీకు బాబు పుట్టాడని చెప్పి ఆమెను వార్డుకు తీసుకు వచ్చినందుకు రూ. 500 ఇవ్వాలని అడిగారు. దీనికి విభేదించిన బాలవర్ధనరెడ్డి రూ.400 ఇస్తానని చెప్పాడు. కుదరదు రూ 500 ఇవ్వాలని దోబీ పట్టుపట్టాడు. సరే నీవడిగిన రూ. 500 ఇస్తాను. ప్రస్తుతం నావద్ద డబ్బులులేవు. ఏటీఎంకు వెళ్లి తెచ్చి ఇస్తాను. నమ్మకపోతే ఏటీఎం నీవద్దే పెట్టుకోమని రెడ్డి దోబీకి చూసించాడు. దీనికి దోబీ శ్రీనివాసరావు సంతృప్తి చెందలేదు. అనంతరం సుధారాణిని ధోబీ స్ట్రేచర్‌పై ఇష్టం వచ్చినట్లు ఎడాపెడా తోసుకుంటూ వస్తున్నాడు. దీన్ని చూసి తట్టుకోలేని రెడ్డి స్ట్రేచర్‌ను ఎందుకు అలా తోస్తున్నావ్.. నిదానంగా తోయ్.. అని కోరాడు. దీంతో కోపోద్రిక్తుడైన దోబీ నేనడిగిన డబ్బులు ఇవ్వని నీవేంటి మాట్లాడేదంటూ రెడ్డిపై చేయి చేసుకున్నాడు. దీంతో కొద్ది సేపు ఇద్దరూ ఘర్షణకు దిగారు. స్ట్రేచర్‌పై ఎడాపెడా తోసుకురావటంతో సుధారాణికి కుట్లు కదిలి విపరీతమైన నొప్పులొచ్చాయి. దీంతో రెడ్డి దోబీ శ్రీనివాసరావు వ్యవహారశైలిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ సోమసుందరరావుకు అదే రోజు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత డ్యూటీలో ఉన్న ఎన్కే రాణి అనే స్టాఫ్‌నర్స్ సుధారాణి వద్దకొచ్చి నీ భర్త ఎక్కువ చేస్తున్నాడు... నీవు ఇక్కడ ఇంకా 10 రోజులుండాలి...మా సిబ్బందిపైనే ఫిర్యాదు చేస్తాడా అని బెదిరించింది. దీంతో సుధారాణికి బీపీ అధికం కావటంతో బంధువులు ఆందోళన చెందారు. ఆస్పత్రిలో ఇలాంటి సంఘటనలు నిత్యకృత్యంగా జరుగుతున్నా దీర్ఘకాలంగా ఇక్కడే ఉద్యోగం చేస్తున్న కింది స్ధాయి సిబ్బందిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వాస్పత్రి అధికారులు సాహసం చేయలేకపోవటంపై పలు విమర్శలు వినవస్తున్నాయి. చర్యలు తీసుకుంటాం : సోమసుందరరావు, సూపరింటెండెంట్ సుధారాణి భర్త బాలవర్ధనరెడ్డి జరిగిన సంఘనటపై రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చాడు. ఈ సంఘటనపై విచారణ జరిపి లంచం అడిగి, దాడికి పాల్పడ్డాడనే ఆరోపణ ఎదుర్కొంటున్న దోబీ శ్రీనివాసరావుపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటాం.