
వరంగల్ క్రైం: రోహిణిలో జరిగిన ప్రమాదంపై సోమవారం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినా అసలు కారణం పై అ«ధికారులు దృష్టి సారించా రు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకా రం.. థియేటర్‌లో న్యూరో ఆపరేషన్ జరుగుతోంది. ఆ సమయంలో థియేటర్‌కు వచ్చే ఆక్సిజన్ పైపు నుంచి లీకేజీ అవుతోంది. గమనించని సిబ్బంది వైద్య పరికరాల స్విచ్ ఆన్‌చేశారు. ప్లగ్ లూజ్‌గా ఉండడంతో స్విచ్‌బోర్డులో మంటలు లేచాయి.
అప్పటికే ఆక్సిజన్ లీకవుతుం డడంతో ప్లగ్‌లో వచ్చిన మంటలకు గ్యాస్ తోడు కావడంతో పెద్ద ఎత్తున చెలరేగడంతో విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. ఆపరేషన్ చేస్తున్న డాక్టర్ రోగిని ఎత్తుకుని బయటకు పరుగు తీశాడు. పక్కనే ఆర్థో విభాగంలో ఆపరేషన్ చేస్తున్న మరో డాక్టర్ కరెంట్ పోవడంతో బయటకు వచ్చాడు. తిరిగి ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పొగతో లోపలికి వెళ్లలేదు. దీంతో థియేటర్‌లోనే పేషెంట్ ఉన్నా డు. ఆపరేషన్ థియేటర్‌కు సరఫరా అయ్యే ఆక్సిజన్ సిలిండర్‌తోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.