సాక్షి, హైదరాబాద్ : తెలుగు ఇండస్ట్రీకి త్వరలో పరిచయం కాబోతున్న యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య లాంచింగ్ ముందే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా చీర కట్టులో ఐశ్వర్య ఫోటోలు టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాయి నీలాకాశం రంగు చీరతో ఐశ్వర్య చేసిన ఫొటోషూట్ వైరల్ అవుతోంది. తమిళ, కన్నడ భాషల్లో పలు సినిమాలు చేసిన ఐశ్వర్య 2013లో విశాల్ హీరోగా వచ్చిన పట్టాత్తు యానాయ్ సినిమాతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిపిందే. ఆ తర్వాత ప్రేమ బారాహ సినిమాతో కన్నడ ప్రేక్షకులనూ పలకరించింది. మంచి అందం, అభినయం ఉన్నా బాక్సీఫీసు వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో తన స్వీయ దర్శకత్వంలో ఐశ్వర్యను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాలని అనుకుంటున్నాడు అర్జున్. మరి ఈ భామ ఎంతవరకు ఆకట్టుకుంటుదో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment