Aishwaryaa
-
ఆ ఇల్లు వల్లే ధనుష్-ఐశ్వర్య విడిపోయారా..?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్-ఐశ్వర్యలు విడాకులు తీసుకుంటున్నట్లు సుమారు రెండేళ్ల క్రితం ప్రకటించడం ఆపై వారిద్దరూ వేరువేరుగా ఉంటున్న విషయం తెలిసిందే. సుమారు 18ఏళ్ల పాటు కలిసి ఉన్న ధనుష్ దంపతులు ఈ నిర్ణయం తీసుకోవడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనేది బహిరంగంగా వారిద్దరిలో ఎవరూ తెలపలేదు. కానీ వారిద్దరి విడాకులకు కారణం ధనుష్ కట్టించుకున్న ఇళ్లే అని సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. (ఇదీ చదవండి: బ్రోలో సాయిధరమ్ తేజ్ రెండో చెల్లెలిగా నటించిందెవరో తెలుసా?) చెన్నైలోని పోయేస్ గార్డెన్లో హీరో ధనుష్ రూ.150 కోట్లతో కొత్త ఇంటిని నిర్మించిన సంగతి తెలిసిందే.. ఆ ఇంటిని నిర్మించే సమయంలో ధనుష్‌కు రజనీకాంత్ ఒక సలహా ఇచ్చారట. ఇళ్లు ఈ ప్రాంతంలో కాకుండా మరోచోట కట్టేందుకు ప్లాన్ చేయమని రజనీకాంత్ సలహా ఇచ్చారట. దీనికి ప్రధాన కారణం వాస్తు, జ్యోతిష్యం పట్ల రజనీకి విశ్వాసం ఎక్కువ. దీంతో ఈ ఇళ్లు కడితే కుటుంబానికి కూడా అంతగా కలిసిరాదని వద్దన్నారట. కానీ ఇవేమి లెక్కచెయకుండా పోయేస్‌గార్డెన్‌లో రజనీ ఇంటికి అతి సమీపంలోనే ధనుష్ ఇళ్లు నిర్మించడం 2021లో ప్రారంభించాడు. కానీ ఈ ఇంటి పనులను ప్రారంభించిన కొద్ది నెలల్లోనే ధనుష్-ఐశ్వర్య ఇద్దరి మధ్య గొడవలు రావడం స్టార్ట్ అయ్యాయట. తన నాన్నకంటే ఇంత రిచ్‌గా ఇళ్లు కట్టడం ఎందుకని వారిద్దరి మధ్య గొడవ మొదలైందట. వీటితో పాటు ఐశ్వర్య సినిమా డైరెక్టర్,నిర్మాత అవడం, అందువల్ల భారీగా డబ్బు నష్టపోవడం ధనుష్‌కు ఏ మాత్రం ఇష్టం లేదని అందుకే వారి మధ్య గొడవలు వచ్చాయిని కొందరు చెప్పుకొచ్చారు. ఇవన్నీ కాదు ధనుష్ మరో హీరోయిన్‌తో ఎఫైర్ పెట్టుకోవడం వల్లే విడాకుల వరకు వెళ్లారని మరికొందరి వాదనగా ఉంది. ఏదేమైన ఇక్కడ ఇళ్లు కట్టడం అంత మంచిది కాదని రజనీకాంత్ సూచించడం వాస్తవమేనని పలువురు చెప్పుకొచ్చారు. అలా ధనుష్ నిర్మించిన ఇంటికి వాస్తు లేకపోవడంతోనే వారిద్దరి మధ్య దూరం పెరిగిందని ఇప్పుడు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది. 2021లో ధనుష్ ఇంటి నిర్మాణం ప్రారంభిస్తే.. 2022లో వారిద్దరు విడిపోయారు. 2023లో ధనుష్ తన తల్లిదండ్రులతో ఆ కొత్త ఇంటిలోకి ప్రవేశించారు. (ఇదీ చదవండి: తన 'కొత్త ప్రేమ'ని వెల్లడించిన సమంత) -
ఈ ఏడాది విడాకులు తీసుకున్న సెలబ్రిటీ కపుల్స్ వీళ్లే..
సినీ ఇండస్ట్రీలో ప్రేమ- విడాకులు చాలా కామన్ అయిపోయింది. ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంతే త్వరగా విడిపోతున్నారు. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విడాకులు తీసుకున్న సెలబ్రిటీల లిస్ట్ అంతకంతకూ ఎక్కువైపోయింది. ఎంతో అన్యోన్యంగా కనిపిస్తున్న దంపతులు సైతం తమ బంధానికి ఫుల్స్టాప్ పెట్టేశారు. పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకొని చివరికి కోర్టు మెట్లు ఎక్కారు. 2022 ఇంకొన్ని రోజుల్లో ముగియనుంది. త్వరలోనే 2023లోకి గ్రాండ్‌గా అడుగుపెట్టబోతున్నాం. ఈ నేపథ్యంలో ఈ ఏడాది విడాకులు తీసుకున్న సెలబ్రిటీలు ఎవరెవరో ఓసారి చూసేద్దామా.. ధనుష్- ఐశ్వర్య రజనీకాంత్ తమిళ స్టార్ హీరో ధనుష్- రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ఈ ఏడాది ప్రారంభంలోనే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. తమిళ నాట స్టార్ కపుల్‌గా గుర్తింపు పొందిన ఈ జంట 2004 నవంబర్ 18న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబసభ్యుల నిర్ణయంతో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. పెళ్లి నాటికి ధనుష్ వయసు 21 ఏళ్లు, ఐశ్వర్య వయసు 23 ఏళ్లు. ఈ దంపతులకు యాత్రా రాజా (15 ఏళ్లు), లింగ రాజా (11) అని ఇద్దరు కుమారులు ఉన్నారు. సాఫీగా సాగిపోతుందనుకున్న వీరి వైవాహిక బంధంలో మనస్పర్థలు ఏర్పడి ఈ ఏడాది జనవరి 17న విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. యోయో హనీసింగ్- షాలినీ తల్వార్ బాలీవుడ్ ర్యాపర్, మ్యూజిక్ కంపోజర్ యో యో హనీసింగ్ తన పదేళ్ల వివాహ బంధానికి ముగింపు పలికాడు. సుమారు పదేళ్లపాటు ప్రేమలో మునిగితేలిన హనీసింగ్-షాలినీలు 2011లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. కానీ మనస్పర్థలు రావడంతో సెప్టెంబర్ 8న విడాకులు తీసుకున్నారు. ఇక హనీసింగ్ తనను లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురిచేయడమే కాకుండా, ఇతర మహిళలతో వివాహేతర సంబంధంపెట్టుకున్నాడని ఆరోపిస్తూ షాలిని కోర్టును ఆశ్రయించడంతో వివాదం రచ్చకెక్కింది. ఇదిలా ఉంటే షాలినీతో విడాకులు తీసుకున్న కొద్ది నెలలకే హనీసింగ్ తన గర్ల్‌ఫ్రెండ్ టీనా తడానితో చెట్టాపట్టాలేసుకొని తిరగడం మీడియా కంట పడింది. రాజీవ్ సేన్- చారు అసోపా మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ విడాకులు వ్యవహరం ఇప్పటికీ హాట్‌టాపిక్‌గానే ఉంది. టీవీ నటి చారు అసోపా- రాజీవ్ సేన్లు 2019 జూన్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఏడాది వయసున్న కూతురు జియానా ఉంది. అయితే పెళ్లయిన ఏడాదిన్నరగే విడిపోతున్నట్లు ప్రకటించి అందిరికి షాక్ ఇచ్చిన ఈ దంపతులు తమ కూతురి కోసం కలిసి ఉండాలనుకుంటున్నామంటూ ఇటీవల తమ విడాకులను రద్దు చేసుకున్నారు. కానీ మళ్లీ ఏమైందో ఏమో కానీ మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకోవడానికే మొగ్గు చూపుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం భార్యభర్తలుగా విడిపోతున్నామని, కేవలం కూతురు జియానుకు తల్లిదండ్రులుగా ఉంటున్నామని తెలిపారు. రాఖీ సావంత్- రితేష్ వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నానుతూ ఉంటుంది రాఖీ సావంత్. బిగ్‌బాస్ షోతో మరింత పాపులర్ అయిన ఆమె ఈ ఏడాది వాలంటైన్స్ డే రోజు తన భర్త రితేశ్ సింగ్‌తో విడిపోతున్నట్లు ప్రకటించింది.రితేశ్‌కు ఆల్రెడీ పెళ్లైన విషయాన్ని తన దగ్గర దాచిపెట్టాడని, వారు విడాకులు తీసుకోలేదు కాబట్టి చట్టబద్ధంగా తమ వివాహం చెల్లదండూ అతడితో తెగదెంపులు చేసుకుంది. మాజీ భర్త జ్ఞాపకాలను సైతం వదిలించుకుంది. ఇక ప్రస్తుతం తనకంటే ఆరేళ్లు చిన్నవాడైన అదిల్ దురానీతో ప్రేమలో మునిగితేలుతుంది. సుస్మితా సేన్-లలిత్ మోదీ మాజీ విశ్వసుందరి, నటి సుస్మితా సేన్ ప్రేమ వ్యవహారం మీడియాలో ఎంత హాట్‌టాపిక్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొన్నటి వరకు తనకంటే 15 ఏళ్ల చిన్నవాడైన మోడల్ ప్రముఖ మోడల్ రోహ్మన్తో ప్రేమాయణం నడిపిన సుస్మితా తాజాగా మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోదీతో సహజీవనం చేస్తుందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరు మాల్దీవుల్లో షికార్లు చేసిన ఫొటోలు, లండన్‌లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నా పిక్స్‌ను స్వయంగా లలిత్ మోదీ షేర్ చేశాడు. ఈ సందర్భంగా సుస్మితాను తన బెటర్ హాఫ్(భార్య) అంటూ పరిచయం చేశాడు మోదీ. ఆ తర్వాత ప్రస్తుతం తాము డేటింగ్లో ఉన్నామనీ, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు స్పష్టం చేశాడు. దీంతో వీరిద్దరి ప్రేమ వ్యవహరం మీడియాలో, సోషల్ మీడియాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ లలిత్ మోదీకి గుడ్‌బై చెప్పి ప్రస్తుతం రోహ్మన్తోనే సుస్మితా కలిసి ఉంటున్నట్లు తెలుస్తుంది. సోహైల్ ఖాన్-సీమా సల్మాన్ ఖాన్ ఫ్యామిలీకి పెళ్లిళ్లు అచ్చొచ్చినట్లు కనిపించడం లేదు. ఇప్పటికే అర్బాజ్ ఖాన్ విడాకులు తీసుకోగా, ఇప్పుడు సల్మాన్ మరో తమ్ముడు సోహైల్ ఖాన్ కూడా భార్య నుంచి విడిపోయాడు. ఎంతో అన్యోన్యంగా కనిపిస్తున్న సోహైల్- సీమా ఖాన్లు 24 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికారు. ప్రేమించి, పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్న సోహైల్-సీమా ఖాన్లు విడాకులు తీసుకోవడం బాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే వీరి విడాకుల వెనుక ఓ హీరోయిన్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషీతో సొహైల్ ఖాన్ కొంతకాలంగా రిలేషన్షిప్లో ఉన్నట్లు వార్తలు జోరుగా వినిపించాయి. కారణం ఏదైనా తమ వివాహ బంధానికి ముగింపు పలికారు ఈ బ్యూటిఫుల్ కపుల్. -
ఏఆర్ రెహమాన్ సంగీత బాణీలకు సలామ్ చేసిన ఐశ్వర్య
తమిళసినిమా: ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇటీవల విడుదల అయిన పొన్నియిన్ సెల్వన్ త్రంతో తనకు తానే సాటి అని మరోసారి నిరపించుకున్నారు. చేతిలో పలు చిత్రాలతో బిజీగా ఉన్న రెహమాన్ ప్రస్తుతం లాల్ సలాం సినిమాకి సంగీతం అందించడంలో నిమగ్నమయ్యారు. సపర్ స్టార్ రజనీకాంత్ అతిథి పాత్రలో నటించనున్న చిత్రం ఇది. ఆయన పెద్ద కతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈమె 2012లో ధనుష్, శృతిహాసన్ జంటగా నటింన 3 త్రం ద్వారా దర్శకురాలిగా పరిచయమయ్యారు. ఆ తరువాత గౌతమ్ కార్తీక్ హీరోగా వై రాజా వై చిత్రం చేశారు. మళ్లీ తాజాగా లాల్ సలాం చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటించనున్నారు. ఈ చిత్రం ఈనెల 5వ తేదీన పూజా కార్యక్రవలతో ప్రారంభమైంది. ప్రస్తుతం పాటల రికార్డింగ్ జరుగుతోంది. ఏఆర్.రెహమాన్ సంగీత బాణీలకు దర్శకురాలు ఐశ్వర్య మైమర పోతూ సలామ్ చేశారు. ఆ వీడియోను ఏఆర్ రెహవన్ సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. అది ఇప్పుడు వైరల్ అవుతోంది. కాగా లాల్ సలాం చిత్రంపై ఇప్పటి నుంచే అంచనాలు పెరుగుతున్నాయి. లైకా ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. Jamming with the most promising female Director @ash_rajinikanth for #lalsalaam in mumbai.#தமிழ் pic.twitter.com/Qg83tefxxv — A.R.Rahman (@arrahman) November 25, 2022 -
ఆసుపత్రి పాలైన ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య..
Dhanush Ex wife Aishwaryaa R Dhanush Admitted Into Hospital: రజనీకాంత్ కూతురు, స్టార్ హీరో ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య ఆసుపత్రి పాలైంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా వచ్చింది. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. దయచేసి అందరూ మాస్కులు ధరించి సురక్షితంగా ఉండండి. 20211..ఇంకా నాకోసం ఏమేమి తీసుకొస్తావో చూస్తాను అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేసింది. దీంతో ఐశ్వర్య త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా కొన్ని రోజుల క్రితమే ధనుష్‌కి సైతం కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయిన సంగతి తెలిసిందే. ఇక మొన్నటిదాకా కోలీవుడ్‌లో స్టార్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న ధనుష్-ఐశ్వర్యలు ఇటీవలె విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని వారి అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ధనుష్-ఐశ్వర్యలు మళ్లీ కలిస్తే బావుండని ఆశగా ఎదురుచూస్తున్నారు. View this post on Instagram A post shared by Aishwaryaa R Dhanush (@aishwaryaa_r_dhanush) -
ధనుష్, ఐశ్వర్య విడాకులపై కస్తూరి రాజా ఆసక్తికర వ్యాఖ్యలు
ధనుష్, ఐశ్వర్యల విడాకుల విషయం ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఎంతో అనోన్యంగా ఉండే ఈ జంట.. విడిపోతున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ధనుష్, ఐశ్వర్యల డివోర్స్ ఇష్యూపై కోలీవుడ్‌లో బాగా చర్చ జరుగుతోంది. వివాదాలకు చాలా దూరంగా ఉండే ఈ జంట.. అకస్మాత్తుగా విడిపోవడానికి కారణం ఇవేనంటూ అనేక కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ధనుష్ తండ్రి కస్తూరి రాజా .. విడాకుల ఇష్యూపై స్పందించారు. ఓ కోలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే వారు మళ్లీ కలుస్తారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (చదవండి: ధనుష్-ఐశ్వర్య విడాకులకు కారణం ఇదేనా?) భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం సర్వ సాధారణం. ధనుష్,ఐశ్వర్యల మధ్య కూడా అలాంటి గొడవలే చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం వారిద్దరూ చెన్నైలో లేరు. హైదరాబాద్‌లో ఉన్నారు. ఫోన్లో వారితో మాట్లాడాను. కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చాను. రజినీకాంత్ కూడా విడాకుల నిర్ణయాన్ని మరోసారి పరిశీలించాలని వారిద్దరిని కోరారు. పిల్లల భవిష్యత్తు రీత్యా విడాకుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చాలా మంది సినీ ప్రముఖులు, సన్నీహితులు కోరుతున్నారు’అని కస్తూరి రాజా చెప్పుకొచ్చారు. మరి రజనీకాంత్, కస్తూరి రాజాల సూచనల మేరకు ధనుష్, ఐశ్వర్యలు విడాకుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారో లేదో వేచి చూడాలి. -
Dhanush Divorce: స్టే స్ట్రాంగ్ తలైవా.. రజనీకాంత్‌కు అండగా అభిమానులు
కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజనీకాంత్‌కు అభిమానులు కాదు. భక్తులు ఉన్నారు. ఆయన్ని ఆరాధించే కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. వారందరూ ఇఫ్పుడు రజనీకాంత్ గురించి టెన్షన్ పడుతున్నారు. వారింట్లో జరుగుతున్న సంఘటనలు చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందు రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్య 2017లో అశ్విన్ రామ్ కుమార్ కు డైవోర్స్ ఇచ్చింది. ఏడు ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికారు. వీరిద్దరికి ఒక బాబు ఉన్నాడు. అతని పేరు వేద్. ఆ తర్వాత సౌందర్య.. 2019లో విషాగన్ వానంగమూడి అనే బిజినెస్ మెన్ ను పెళ్లాడింది. ఇప్పుడు చెల్లెలి దారిలోనే అక్క కూడా నడిచింది. ధనుష్ కు బ్రేకప్ చెప్పింది. రజనీకాంత్ డాటర్స్ డైవోర్స్ ఇష్యుపై కోలీవుడ్ లో బాగా చర్చ జరుగుతోంది. అందరూ సూపర్ స్టార్ స్టే స్ట్రాంగ్ అంటూ ట్వీట్స్ చేస్తూ రజనీకాంత్ కు మద్దతుగా నిలుస్తున్నారు. అక్క డైవోర్స్ అనౌన్స్ మెంట్ తర్వాత సౌందర్య కూడా తన సోషల్ మీడియా ఎకౌంట్ లో చిన్నప్పుడు వారిద్దరు రజనీకాంత్ తో దిగిన ఫోటోను డీపీగా మార్చించి. మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి అంటూ ట్వీట్స్ నెటిజన్స్ రీట్వీట్ చేస్తున్నారు. -
ధనుష్-ఐశ్వర్య విడాకులు: అక్కకు సపోర్ట్‌గా సౌందర్య.. ఫోటో వైరల్
స్టార్ కపూల్ ధనుష్- ఐశ్వర్యల విడాలకుల విషయం ఇప్పుడు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట.. విడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 2004లో ప్రేమ వివాహం చేసుకున్న ఐశ్వర్య, ధనుష్‌లు.. 18 ఏళ్ల తర్వాత తమ వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. (చదవండి: ధనుష్-ఐశ్వర్య విడాకులకు కారణం ఇదేనా?) ‘స్నేహితులుగా, దంపతులుగా, తల్లిదండ్రులుగా, పరస్పర శ్రేయోభిలాషులుగా 18 ఏళ్లు కలిసి బతికాం. పురోగతి, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, సర్దుకుపోవడం, పరిస్థితులకు అలవాటుపడటం.. ఇలా సాగిందీ ప్రయాణం. ఈ రోజు ఇరువురివి భిన్నమార్గాలుగా కనపడుతున్నాయి... ధనుష్, నేను దంపతులుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మంచి భవిష్యత్తు కోసం.. మమ్మల్ని మేము అర్థం చేసుకోవడానికి కొంత సమయం తీసుకోవాలనుకుంటున్నాం. మా నిర్ణయాన్ని గౌరవించాల్సిందిగా విజ్ఞప్తి. ఈ పరిస్థితులను అధిగమించడానికి మాకు తగిన ప్రైవసీ ఇవ్వండి’అంటూ ఐశ్వర్య సోషల్ మీడియా ద్వారా తమ విడాకుల విషయాన్ని వెల్లడించారు. అలాగే ధనుష్ కూడా ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో తెలియజేస్తూ..తమ నిర్ణయాన్ని గౌరవించాలంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. కాగా వీరి విడాకుల ప్రకటనపై రజనీకాంత్ ఇప్పటికీ స్పందించకపోవడం గమనార్హం. అయితే విడాకుల ప్రకటనకు ముందే రజనీకాంత్‌కు ధనుష్, ఐశ్వర్యలు ఫోన్ చేశారని, ఆయన వారి నిర్ణయానికి ఎలాంటి అడ్డు చెప్పలేదని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కూతురుకు మద్దతుగా మాత్రం రజనీకాంత్ ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ అక్క నిర్ణయానికి సపోర్ట్‌గా నిలిచింది రజనీకాంత్ చిన్న కూతురు, ఐశ్వర్య చెల్లెలు సౌందర్య. అక్క విడాకుల నిర్ణయానికి మద్దతు ఇస్తున్నట్లుగా ట్విటర్ ఖాతాలోని ప్రొఫైల్ పిక్‌ని మార్చింది. తండ్రి రజనీకాంత్‌తో చిన్నప్పుడు దిగిన ఫోటోని తన ప్రొఫెల్ పిక్‌గా మార్చింది. అందులో రజనీకాంత్ ఇద్దరి కూతుళ్లను ఎత్తుకొని ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కకు సపోర్ట్‌గా ఉండమని నెటిజన్స్ కోరుతున్నారు. #NewProfilePic pic.twitter.com/0SnIQYvkkg — soundarya rajnikanth (@soundaryaarajni) January 17, 2022 -
ధనుష్-ఐశ్వర్య విడాకులకు కారణం ఇదేనా?
కోలీవుడ్‌లో బ్యూటిఫుల్ కపూల్‌గా గుర్తింపుపొందిన ధనుష్, ఐశ్వర్యలు విడిపోవడం సినీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ స్టార్ కపూల్.. విడాకులు తీసుకోవడం అభిమానుకులకు మింగుడుపడటం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరూ.. 18 ఏళ్ల తర్వాత తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు సోమవారం ప్రకటించారు. స్నేహితులుగా, దంపతులుగా, తల్లిదండ్రులుగా, పరస్పర శ్రేయోభిలాషులుగా 18 ఏళ్లు కలిసి బతికామని, ఇప్పుడు విడిపోవాలాని నిర్ణయం తీసుకున్నామని, తమ నిర్ణయాన్ని గౌరవించాలంటూ సోషల్ మీడియా వేదికగా ధనుష్, ఐశ్వర్య అభిమానులకు విజ్ఞప్తి చేశారు. అయితే వివాదాలకు చాలా దూరంగా ఉండే ఈ జంట.. అకస్మాత్తుగా విడిపోవడానికి కారణం ఇవేనంటూ అనేక కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కొన్నేళ్ల క్రితం జరిగిన సుచిలీక్స్ ఉదంతంలో ధనుష్ ఫొటోలు కూడా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే .ఆ సమయంలో ధనుష్-ఐశ్వర్యల మధ్య గొడవలు జరిగినట్లు వార్తలు వినిపించాయి. మామగారి(రజనీకాంత్)జోక్యంతో మళ్లీ వీరు కలిసిపోయారు. అయితే ఈ సారి ధనుష్ కారణంగానే విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ధనుష్ ఓ హీరోయిన్‌తో చనువుగా ఉండటం ఐశ్వర్యకి నచ్చలేదని, అందుకే గత కొంతకాలంగా ఐశ్వర్య దూరంగా ఉంటుందని తెలుస్తోంది. ధనుష్‌కు ఉన్న అఫెర్లను ఐశ్వర్య చాలా కాలంగా భరిస్తూ వచ్చిన ఐశ్వర్య.. చివరకు చేసేదేమిలేక విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారని తమిళ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు రజనీకాంత్ హీరోగా ధనుష్ నిర్మించిన ‘కాలా’సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రజనీకాంత్ ఆర్థికంగా ఆదుకోలేదని, అప్పటి నుంచి ధనుష్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. ధనుష్‌తో ఐశ్వర్య ఓ పాన్ ఇండియా సినిమా నిర్మించాలని ప్రయత్నించగా.. ఆయన ఒప్పుకోలేదని , ఈగోల కారణంగానే వీరిద్దరు విడిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులు చాలా సార్లు కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ.. తమ నిర్ణయాన్ని మార్చుకోలేమని చెప్పి సోమవారం సోషల్ మీడియా ద్వారా విడిపోతున్నట్లు ప్రకటించారు. విడాకుల నిర్ణయానికి ముందు ఇద్దరూ రజనీకాంత్‌కు ఫోన్ చేశారట. అయితే రజనీకాంత్ మాత్రం ఆ నిర్ణయాన్ని వారిద్దరకే వదిలేసినట్లు తెలుస్తోంది. కాగా, ధనుష్, ఐశ్వర్యల వివాహం 2004, నవంబరు 18న జరిగింది. వీరికి యాత్రా రాజా (15 ఏళ్లు), లింగ రాజా (11) అని ఇద్దరు కుమారులు ఉన్నారు. -
ఆ సినిమా చూసి ఐశ్వర్య ఫిదా, బొకే పంపి మరీ.. ధనుష్-ఐశ్యర్యల లవ్‌స్టోరీ
Dhanush And Aishwaryaa Love Story: చిత్ర పరిశ్రమలో పెళ్లిళ్లు ఎంత త్వరగా జరుగున్నాయో.. విడాకులు అనేది కూడా అంతే త్వరగా జరిగిపోతున్నాయి. అది హాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా చివరికి టాలీవుడ్ అయినా విడాకులు తీసుకోవడమనేది చాలా సహజంగా మారిపోయింది. టాలీవుడ్లో ఇప్పటికే స్టార్ కపూల్ సమంత, నాగచైతన్య విడిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా కోలీవుడ్ బ్యూటీఫుల్ కపూల్ ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ విడాకులు తీసుకున్నారు. తమ 18 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు వీరిద్దరూ సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ వార్త విని రజనీకాంత్, ధనుష్ అభిమానులు షాకయ్యారు. ఎంతో అనోన్యంగా కలిసి ఉండే ధనుష్-ఐశ్వర్యలు విడాకులు తీసుకోవడం ఏంటని నివ్వెరపోయారు. అసలు వీరి పెళ్లి ఎలా జరిగింది? వీరిద్దరి లవ్‌స్టోరీ ఏంటి? అనేది వెతకడం ప్రారంభించారు నెటిజన్స్. ధనుష్, ఐశ్వర్యలది ప్రేమ వివాహం అన్న సంగతి తెలిసిందే. 2004లో ఇరుకుటుంబాల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. ధనుష్ సినిమా కాదల్ కొండై విడుదలైన సమయంలో వీరికి పరిచయం ఏర్పడింది. థియేటర్‌కి వెళ్లి సినిమా చూసిన ఐశ్వర్యను ధనుష్‌కి పరిచయం చేసింది చిత్ర యూనిట్. ఆ సమయంలో ధనుష్‌కు అభినందనలు తెలిపింది ఐశ్వర్య. ఆ మరుసటి రోజు ధనుష్‌కి ఒక బోకే పంపిస్తూ.. టచ్ లో ఉండమని చెప్పింది. అయితే యాక్టింగ్ పైనే ఫోకస్ పెట్టిన ధనుష్.. మొదట్లో ఐశ్వర్యను పెద్దగా పట్టించుకోలేదట. కొన్నాళ్ల తర్వాత వీరిద్దరి మధ్య స్నేహం చిగురించింది. అది కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. ‘నా రెండో సినిమా కాదల్ కొండై సినిమా చూసిన ఐశ్వర్య.. నా యాక్టింగ్ బాగుందని ప్రశంసించింది. ఇంటికి బొకే పంపించి టచ్‌లో ఉండమని చెప్పింది. ఆ పదం మా ఇద్దరిని మరింత దగ్గరకు చేసింది. మేము స్నేహితులుగా ఉన్న సమయంలోనే మేము ప్రేమలో ఉన్నట్లు కథనాలు వచ్చాయి. కొన్నాళ్ల తర్వాత ఒకరినొకరం ఇష్టపడి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఈ విషయాన్ని మా కుటుంబ సభ్యులకు తెలిపి.. వారి అంగీకారంతోనే వివాహం చేసుకున్నాం’ అని గతంలో ఓ ఇంటర్యూలో ధనుష్ చెప్పారు. 2004, నవంబరు 18న వీరిద్దరి వివాహం జరిగింది. అప్పుడు ధనుష్ వయసు కేవలం 21 మాత్రమే. ధనుష్ కంటే ఐశ్వర్య రెండేళ్లు పెద్ద. వీరికి యాత్రా రాజా (15 ఏళ్లు), లింగ రాజా (11) అని ఇద్దరు కుమారులు ఉన్నారు. -
హీరోయిన్ ఐశ్వర్య అర్జున్ ఫోటోషూట్: వైరల్
సాక్షి, హైదరాబాద్ : తెలుగు ఇండస్ట్రీకి త్వరలో పరిచయం కాబోతున్న యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య లాంచింగ్ ముందే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా చీర కట్టులో ఐశ్వర్య ఫోటోలు టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాయి నీలాకాశం రంగు చీరతో ఐశ్వర్య చేసిన ఫొటోషూట్ వైరల్ అవుతోంది. తమిళ, కన్నడ భాషల్లో పలు సినిమాలు చేసిన ఐశ్వర్య 2013లో విశాల్ హీరోగా వచ్చిన పట్టాత్తు యానాయ్ సినిమాతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిపిందే. ఆ తర్వాత ప్రేమ బారాహ సినిమాతో కన్నడ ప్రేక్షకులనూ పలకరించింది. మంచి అందం, అభినయం ఉన్నా బాక్సీఫీసు వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో తన స్వీయ దర్శకత్వంలో ఐశ్వర్యను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాలని అనుకుంటున్నాడు అర్జున్. మరి ఈ భామ ఎంతవరకు ఆకట్టుకుంటుదో వేచి చూడాలి. View this post on Instagram A post shared by Aishwarya Arjun (@aishwaryaarjun) -
కామెడీ.. థ్రిల్
‘హ్యాపీడేస్’ ఫేమ్ రాహుల్, చేతన్, సాక్షీ చౌదరి, ఐశ్వర్య, యమీ ప్రధాన పాత్రల్లో విరాట్ చక్రవర్తి దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభమైంది. దివిజా సమర్పణలో సాయి కార్తీక్, నాగం తిరుపతి రెడ్డి, శ్రీకాంత్ దీపాల నిర్మిస్తున్నారు. నిర్మాత ‘మధుర’ శ్రీధర్ పూజ కార్యక్రమాలు మొదలుపెట్టగా నాగం తిరుపతి రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. సాయి కార్తీక్ క్లాప్ ఇవ్వగా, చిత్ర సహనిర్మాత శ్రీకాంత్ దీపాల గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘ఇంతకాలం మ్యూజిక్ డైరెక్టర్‌గా చేసిన నేను తొలిసారి ప్రొడక్షన్లోకి ప్రవేశించాను’’ అన్నారు సాయి కార్తీక్. ‘‘నిర్మాతగా నాకిది నాలుగో చిత్రం’’ అన్నారు నాగం తిరుపతి రెడ్డి. ‘‘వైవిధ్యమైన కామెడీ థ్రిల్లర్ ఇది’’ అన్నారు విరాట్ చక్రవర్తి. ‘‘ఈ కథ విని, థ్రిల్ అయ్యాను’’ అన్నారు రాహుల్. ‘‘కన్నడలో 10 సినిమాలు చేసిన నాకు తెలుగులో ఇది మొదటి సినిమా’’ అన్నారు చేతన్. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, కెమెరా: ముర్గిల్. -
వెలుగు ఛాయల అడవి చుక్క.
ఫ్రేమ్‌ని కాస్త వైడ్ చేసింది ఐశ్వర్య. మిణుగురులలోకి నక్షత్రాలు వచ్చి చేరాయి. పచ్చని పాలపుంత విచ్చుకుంది. కడలి నురుగై కాంతి పరచుకుంది. టాపిక్‌కి కరెక్టు సెట్టింగ్. ఫొటో తీసి పోటీకి పంపింది. అండ్ ది అవార్డ్ గోస్ టు.. ఐశ్వర్య! వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీలో తొలి భారతీయ మహిళా విజేత! వెలుగు ఛాయల అడవి చుక్క. ఫొటోగ్రఫీలో ఐశ్వర్యకు వచ్చిన అవార్డులను, ఆమె ప్రతిభా విశేషాలను చెప్పుకోవడం మొదలు పెడితే ఆ మహారణ్యంలో ఎక్కడో దారి తప్పుతాం. లేదంటే, ఎంతకూ తరగని ఒక ఫొటో అల్బమ్‌ను రోజంతా తిప్పుతూ కూర్చోవడమే. ఇంతా చేసి ఈ అమ్మాయి వయసు ఇరవై మూడు! ఇప్పుడు ఇంకొక ఘనత. ‘వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు పొందిన తొలి భారతీయ మహిళ! ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల నుంచి 50 వేల మంది పోటీకి ఎంట్రీలను పంపితే ఐశ్వర్య తీసిన ‘లైట్స్ ఆఫ్ ప్యాషన్’ ఫొటో దగ్గర జడ్జీల కళ్లన్నీ ఆగిపోయాయి! వండర్ఫుల్ అన్నారు. పదివేల పౌండ్ల ప్రైజ్ మనీ. అవుట్‌స్టాండింగ్ అన్నారు. ట్రోఫీ. కంగ్రాచ్యులేషన్స్ అన్నారు. ప్రత్యేక ప్రశంశాపటం. పదివేల పౌండ్లంటే సుమారు పది లక్షల రూపాయలు. ఒక మంచి కేనన్ కెమెరా కొనడానికి అయ్యే ఖర్చుకు మాత్రమే ఆ మొత్తం సమానం అయినది కావచ్చు. కానీ, లండన్‌లోని ‘నేచురల్ హిస్టరీ మ్యూజియం’ నుంచి చిన్న గుర్తింపునైనా పొందడం వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్లకు చిన్న వయసులోనైనా జీవిత సాఫల్య పురస్కారమే! పోటీలో విజేత ఎంపిక అంత టఫ్‌గా ఉంటుంది. ఫొటోలు తియ్యమని వాళ్లిచ్చే థీమ్ కూడా ఫ్రేమ్‌లో ఎలా ఇమడ్చాలో తెలియని విధంగా ఉంటుంది! ‘వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్–2020’ విజేతగా ఐశ్వర్యను నిలబెట్టిన ఫొటో ‘లైట్స్ ఆఫ్ ప్యాషన్’. బిహేవియర్ : ఇన్‌వెర్టిబ్రేట్స్.. ఇదీ నేచురల్ హిస్టరీ మ్యూజియం ఈ ఏడాది ఇచ్చిన ఫొటోగ్రఫీ పోటీ థీమ్. భూమి మీద కానీ, గాలిలో గానీ, నీటి మీద గానీ కనిపించే వెన్నెముక ఉండని ప్రాణుల నడవడికను ఫొటో తియ్యాలి! టాపిక్ వినగానే.. పోటీకి ఉత్సాహపడుతున్న ‘వైల్డ్’ ఫొటోగ్రాఫర్ల మెడలలోని కెమెరాలు సగానికన్నా ఎక్కువ తక్కువగా చేతుల్లోంచి కిందికి వాలిపోతాయి. మిగిలిన వాళ్లలో ఐశ్వర్య ఉండనే ఉంటారు. పన్నెండేళ్ల వయసు నుంచి అరణ్యాలను చూస్తోంది ఐశ్వర్య. అరణ్యాలలోని ఇన్‌వెర్టిబ్రేట్స్ నడవడికల్ని చూడలేదా?! ఈ పోటీ కోసం మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లోని భందర్దరా అడవుల్లోకి రాత్రిపూట వెళ్లి అక్కడి మిణుగురులను (ఫైర్‌ఫ్లైస్) ఎంపిక చేసుకుంది ఐశ్వర్య. అవి ఒక చెట్టునిండా ఉన్నాయి. చెట్టు చుట్టూ తిరుగుతున్నాయి. ఫ్రేమ్‌లోకి చెట్టును, మిణుగురులను తీసుకుంది. ఊహు.. ఇలాక్కాదు అనుకుంది. ఫ్రేమ్‌ని కొంచెం వైడ్ చేసింది. మరికొంచెం చేసింది. నక్షత్రాలను, ఆకాశాన్నీ ఫ్రేమ్‌లోకి లాక్కుంది. ఇక చూడండి. అదొక పాలపుంత. చుక్కల భ్రమణం. ఆ ఫొటోకి ‘లైట్స్ ఆఫ్ ప్యాషన్’ అని పేరు పెట్టి పోటీకి పంపించింది. మోహన కాంతులు అని! అంతే. అవార్డు గ్రహీతగా ఆమె ఫొటో క్లిక్ మంది. గత మంగళవారం లండన్ నుంచి వర్చువల్‌గా (స్క్రీన్‌పై) జరిగిన వేడుకలో విజేతగా ఐశ్వర్య పేరును ప్రకటించింది ‘నేచురల్ హిస్టరీ మ్యూజియం’. ఐశ్వర్య వైల్డ్‌లైఫ్ మీద, ఆడపులుల మీద కొన్ని డాక్యుమెంటరీలు కూడా తీసింది. మాస్ మీడియాలో పట్టభద్రురాలు. పుట్టింది, ఉంటున్నదీ ముంబైలో. తండ్రి శ్రీధర్ రంగనాథన్ బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీలో సభ్యుడు. తండ్రితోపాటు అరణ్య పర్యటనలకు వెళుతుండేది ఐశ్వర్య. అలా ఆమెకు వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ మీద ఆసక్తి ఏర్పడింది. తల్లి రాణి సపోర్ట్ కూడా ఉంది. -
‘నవ్య, నేను ఫ్రెండ్స్‌లానే ఉంటాం’
అనుబంధాలతో అల్లుకున్న పొదరింట్లో ఉన్న అమ్మాయి.. నాలో ఏదో చిలిపి కల అంటూ సరదాగా ఆడుతూ పాడుతూ ఉన్న ఆమె జీవితంలో.. కల్లోలం రేపేందుకు ఓ విలన్ వచ్చేస్తాడు.. అతడి రాకతో, డాక్టర్‌గా ప్రాక్టిస్ చేస్తున్న అమ్మాయి జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది.. విలన్ పన్నే కుట్రలను ఆమె ఎలా తిప్పికొట్టింది.. అతడిని తట్టుకుని నిలబడిందా లేదా? అన్నది చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.. ప్రముఖ ఛానెల్ ‘స్టార్ మా’లో ప్రసారం కానున్న ‘కస్తూరి’ సీరియల్ గురించే ఈ ఉపోద్ఘాతమంతా.. అగ్నిసాక్షి సీరియల్‌తో ఇన్ని రోజులు గౌరీగా ప్రేక్షకుల మనసులో నిలిచిన ఆ అందమైన అమ్మాయే.. ఇకపై కస్తూరిగా మనల్ని అలరించనుంది. ఆమె మరెవరో కాదు.. ఐశ్వర్య పిస్సే! అల్లరిపిల్ల ‘గౌరీ’కి సంబంధించిన ముచ్చట్లు మీకోసం.. నిజ జీవితంలోనూ అంతే.. స్టార్ మాలో వచ్చిన ‘‘అగ్నిసాక్షి’’ ముగింపు సమయంలోనే ఐశ్వర్యకు ‘‘కస్తూరి’’ సీరియల్ ఆఫర్ వచ్చిందట. నిజానికి ఫిబ్రవరిలో ఈ షూటింగ్ మొదలవ్వాలి. అయితే లాక్డౌన్ కారణంగా కాస్త ఆలస్యమైనా త్వరలోనే సీరియల్ బుల్లితెరపై ప్రసారం కానుంది. ఐశ్వర్య ఇందులో మెడికోగా కనిపించనుంది. ఇందులో క్యారెక్టర్ ఐశ్వర్య నిజజీవితానికి చాలా దగ్గరగా ఉంటుందట. ఐశ్వర్యకి ఓపిక ఎక్కువేనట. బాధ కలిగినా వెంటనేగా ముఖం మీద చూపించదు. కస్తూరిలో అలాంటి క్యారెక్టర్ తనకు ఇచ్చిన యూనిట్‌కు, తన వెన్నంటి ప్రోత్సహిస్తున్న స్టార్ మాకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పాలంటున్నది ఐశ్వర్య. డాక్టర్ కావాలని.. ఐశ్వర్య బెంగళూరులో పుట్టింది. చిన్నప్పుడే వాళ్ల నాన్న తనను, తల్లిని వదిలేసి వెళ్లిపోయాడు. ఐశ్వర్య వాళ్ల అమ్మ హెల్త్ వర్కర్‌గా పని చేసేది. అందుకే ఐశ్వర్య చిన్నప్పుడు ఆయుర్వేదం డాక్టర్ కావాలని కలలు కన్నది. కానీ అమ్మ కష్టం అర్థమై డాక్టర్ చదువును పక్కకు పెట్టేసింది. పదో తరగతిలో ఉన్నప్పుడు థియేటర్స్‌లో జాయినయింది. అలా మెల్లగా నటన మీద ఆసక్తి పుట్టడంతో చాలా ఆడిషన్లకు వెళ్లింది. అలా నటిగా మారి ఇప్పుడు ప్రేక్షకుల ఆదరాభిమానాలు సొంతం చేసుకుంది. తన చిన్ననాటి కల తీరనప్పటికీ, ఇప్పుడు ‘స్టార్ మా’ వల్ల కస్తూరిలో తను డాక్టర్ పాత్ర పోషిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందంటున్నది ఈ కన్నడ భామ. కన్నడతో కెరీర్.. సినిమాల్లో కంటే సీరియల్ ‘బెస్ట్’ అని భావించింది ఐశ్వర్య. అప్పటికే సీరియల్స్ హవా నడుస్తుండటంతో.. అటు వైపుగా అడుగులు వేసింది. మొదట రెండు సీరియల్స్‌లో చిన్న పాత్రలు చేసింది. ఆ తర్వాత ఓ సీరియల్లో మెయిన్ లీడ్ చేసింది. అలా నటన కొనసాగిస్తూనే డిగ్రీ పూర్తి చేసింది. ఈ క్రమంలో రెండు సినిమాల్లో కూడా చిన్న పాత్రలు చేసింది. కానీ సీరియళ్లలో వరుస అవకాశాల కారణంగా సినిమా అవకాశాలను పక్కకు పెట్టింది. అన్నట్లు.. ఒక సినిమాలోనూ హీరోయిన్గా నటించింది ఐశ్వర్య. కానీ అది ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. ఆ తర్వాత ఆర్కా మీడియాలో పని చేసినప్పుడు తెలుగులో ఆఫర్ వచ్చింది. తెలుగు లోగిళ్లలో.. తెలుగులోకి రావాలని అస్సలు అనుకోలేదట ఐశ్వర్య. అయితే ఇక్కడ అడుగు పెట్టాక చాలా కంఫర్ట్‌గా ఫీలయిందట. ముందు ఇంగ్లిష్‌లో రాసుకొని డైలాగులు చెప్పేదాన్నని... ఇప్పుడు తెలుగు బాగా మాట్లాడగలనంటున్నదీ అమ్మడు. ఇక స్టార్ మాలో వచ్చిన అగ్నిసాక్షి సీరియల్ తన కెరీర్‌కి చాలా ప్లస్ అయిందని, ఇప్పటికీ తనను గౌరిగానే గుర్తు పెట్టుకుంటారంటున్నరని మురిసిపోయింది. అయితే ఇప్పడు కస్తూరి వచ్చాక మాత్రం తనని కస్తూరి అని పిలువడం ఖాయమంటున్నది. చాలా కాలం తర్వాత వస్తున్నా, ఇటీవల విడుదలైన ప్రోమోకి వచ్చిన రెస్పాన్స్ చూస్తే చాలా సంతోషంగా ఉందంటున్నది. వాళ్ల అన్నయ్యనే పెళ్లి చేసుకున్నా.. ‘‘నటి నవ్య నాకు మొదటి సీరియల్ నుంచి పరిచయం. వాళ్లన్నయ్యనే నేను పెళ్లి చేసుకున్నా. మేం వదిన, ఆడపడుచులుగా కాకుండా ఫ్రెండ్స్‌లా ఉంటాం. తన దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నా. కరోనా సమయంలో కూడా తను చూపిన గుండె నిబ్బరం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. తను స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టే అలా నిలబడగలిగింది. స్టార్ మాలో వచ్చిన ‘ఇస్మార్ట్ జోడి’ వల్ల నేను చాలా నేర్చుకున్నా. భార్యభర్తల అన్యోన్యత గురించి చాలా తెలుసుకున్నా’’అని అంటున్నది ఐశ్వర్య. పద్ధతిగా ఉంటే.. ‘‘ప్రతీ పనిలో అమ్మ తోడ్పాటు మరువలేనంటుననది. తెలుగులో నాకంటూ ఒక గుర్తింపు రావడానికి స్టార్ మా ముఖ్య కారణం. వారి అండతో మరిన్ని మంచి ప్రాజెక్ట్‌లతో కనిపించాలని అనుకుంటున్నారు. అగ్నిసాక్షి సీరియల్‌కి రెండు అవార్డులు అందుకున్నా. ప్రేక్షకుల అభిమానం వల్లే ఈ అవార్డులు అందుకోగలిగాను. పద్ధతిగా ఉండే క్యారెక్టర్లు వస్తే తప్పకుండా సినిమాల్లో కూడా చేస్తాను. గౌరిగా ఆదరించినట్టే.. ఇప్పుడు కస్తూరిగా కూడా అదే అభిమానం చూపిస్తారని ఆశిస్తున్నా’’ అంటున్న ఐశ్వర్యకు ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం!! -
కొత్తగా గుట్టు చప్పుడు
అభిషేక్, ఐశ్వర్య జంటగా మణీంద్రన్ దర్శకత్వంలో డాన్ ఎంటర్టైన్మెంట్ (డ్రీమ్స్ ఆఫ్ నెట్వర్క్) బ్యానర్‌పై లివింగ్ స్టన్ నిర్మిస్తోన్న చిత్రం ‘గుట్టు చప్పుడు’. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన అనంతరం లివింగ్ స్టన్ మాట్లాడుతూ– ‘‘నేటి యువతీ యువకుల బాధ్యతారాహిత్యానికి, సామాజిక పరిస్థితులకు అద్దం పట్టేలా మణీంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. లవ్, రొమా¯Œ ్స, థ్రిల్లర్ నేపథ్యంలో ఉంటుంది. కథనం కొత్తగా ఉంటుంది. మా బ్యానర్లో మరో పెద్ద బడ్జెట్ సినిమా కూడా నిర్మాణంలో ఉంది’’ అన్నారు. ‘‘మంచి కథాకథనాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అన్నారు మణీంద్రన్. ఈ చిత్రానికి సంగీతం: కున్ని గుడిపాటి, కెమెరామెన్: రాము, రచయిత: వై. సురేష్ కుమార్, ఎడిటింగ్: శివకుమార్. -
కాఫీ డే సిద్ధార్థ కోడలిగా డీకేశి కుమార్తె!
సాక్షి, బెంగళూరు : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కుమార్తె ఐశ్వర్యను కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకులు వీజీ సిద్ధార్థ కుమారుడు అమర్త్య హెగ్డేకు ఇచ్చే వివాహం జరిపించాలని వారి కుటుంబ పెద్దలు నిర్ణయించారు. శివకుమార్ పెద్ద కుమార్తె అయిన ఐశ్వర్య (22) బిజినెస్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసి తన తండ్రి వ్యాపారాలను చూసుకుంటున్నారు. ఇక అమెరికాలో ఉన్నత చదువులు అభ్యసించిన అమర్త్య సైతం వ్యాపారంలో కొనసాగుతున్నారు. కాగా వీరిద్దరి పెళ్లిపై చర్చించేందుకు గత ఆదివారం సిద్ధార్థ ఇంటికి డీకేశి కుటుంబ సభ్యులు వెళ్లినట్టు అయన సన్నిహితుల ద్వారా తెలిసింది. (‘కాఫీ కింగ్’ విషాదాంతం) ఇక ఐశ్యర్య-అమర్త్య వివాహంపై శివకుమార్ మాట్లాడుతూ.. సిద్ధార్థ ఉన్నప్పుడు వీరి వివాహానికి సంబంధించి ఓ సారి ప్రస్తావన వచ్చిందని చెప్పారు. జూలై 31 నాటికి ఆయన మృతి చెందిన ఏడాది పూర్తి అవుతుందని.. ఆ తరువాత పెళ్లి తేదీల నిర్ణయంపై స్పష్టత వస్తుందని తెలిపారు. సిద్ధార్థకు శివకుమార్ మధ్య ఎప్పటి నుంచో మంచి స్నేహం ఉన్నట్లు వారి సన్నిహితుల ద్వారా తెలిసింది. కాగా కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ 2019 జులైలో అదృశ్యమయ్యారు. తర్వాత కొద్ది రోజులకు నేత్రావతి నదిలో ఆయన మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. ఆర్థికసమస్యలతోనే సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు తేల్చారు. ఆ తరువాత ఆయన వ్యాపారాలను సిద్ధార్థ బార్య మళవికా చూసుకుంటున్నారు. (ఐశ్వర్యను 7 గంటలపాటు ప్రశ్నించిన ఈడీ) -
కళ్లు లేవు.. చూపు ఉంది!
ఐశ్వర్య చూపుకు బ్రేక్ పడింది కానీ, ఆమె కలలకు బ్రేక్ పడలేదు. కళ్లున్నప్పుడు లోకాన్ని చూశాను కాబట్టి కళ్లు లేకున్నా ఆ లోకాన్ని చిత్రీకరించగలను అనుకున్నారు ఐశ్వర్య. కళ్లు అందరికీ ఒకేలా ఉంటాయి. చూడ్డంలోనే భిన్నత్వం ఉంటుంది. పైపైన చూసేవాళ్లుంటారు. లోతుగా చూసేవాళ్లుంటారు. ఫిల్మ్ మేకింగ్కైతే లోతుగా చూసి, తేలిగ్గా చెప్పగలిగే కనెక్టివిటీ ఉండాలి.. అంతర్నేత్రానికీ, బహిర్నేత్రానికీ! తేలిగ్గా చెప్పడం అంటే గుండెకు హత్తుకునేలా చెప్పడం. గాఢత ఉంటుంది కానీ, గర్భితంగా ఉండదు! అలాగన్నమాట. సబ్జెక్ట్ ఎంత టఫ్ అయినా ఈజీగా నరాల్లోకి ఇంకిపోయేలా షూట్ చెయ్యాలంటే.. చూసే చూపులో ప్రత్యేకత ఉండాలి. ఆ ప్రత్యేకత ఐశ్వర్యా పిళ్లైకి ఉంది. కానీ.. కళ్లే.. లేవు! అవును. ఈ ఫిల్మ్ మేకర్‌కు రెండు కళ్లూ లేవు. కానీ.. గొప్ప చూపు ఉంది! అందుకే ఈ ఏడాది ‘హోల్మన్’ అవార్డుకు ఆమెకు ఎంట్రీ లభించింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ అంతర్జాతీయ అవార్డుకు ఇండియా నుంచి వెళ్లిన ఒకే ఒక్క ఎంట్రీ ఐశ్వర్యదే. విజేతకు 25 వేల డాలర్ల నగదు బహుమతి లభిస్తుంది. పదహారు లక్షలకు పైగా అమౌంట్! అదొక్కటే కాదు, విజేత కెరీర్‌కు అవసరమైన సహకారం కూడా లభిస్తుంది. అంతకన్నా ముందు ఐశ్వర్యకు మన సహకారం ఉండాలి. మార్చి 7 వరకు జరిగే ఆన్లైన్లో ఐశ్వర్యకు మనం ఓటెయ్యాలి. The Blind Filmmaker holman అని యూట్యూబ్‌లో కొడితే ఒకటిన్నర నిమిషాల వీడియో వస్తుంది. అది చూస్తే ఐశ్వర్య ‘లుక్’ ఎంత విలక్షణమైనదో తెలుస్తుంది. చూపుంటేనే కదా ఫిల్మ్ డైరెక్షన్. కానీ ఐశ్వర్య చేస్తున్నారు కదా.. రెండు కళ్లూ లేకుండా! ఎలా? అనంతమైన అంతర్దృష్టి! హైదరాబాద్‌లోని ‘ఎల్వీప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్’లో పునరావాస సలహాదారుగా (రిహ్యాబిలిటేషన్ కౌన్సెలర్)గా పని చేస్తున్నారు ఐశ్వర్య. ఫిల్మ్ మేకింగ్ ఆమె కల. అందుకే మాస్ కమ్యూనికేషన్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ చేశారు. విషాదం ఏంటంటే.. థర్డ్ ఇయర్లో ఆమె చూపు పోయింది! అయితే ఆమె చూపుకు బ్రేక్ పడింది కానీ, కలలకు బ్రేక్ పడలేదు. కళ్లున్నప్పుడు లోకాన్ని చూశాను కాబట్టి కళ్లు లేకున్నా ఆ లోకాన్ని చిత్రీకరించగలను అనుకున్నారు ఐశ్వర్య. స్క్రిప్టింగ్.. పోస్ట్ ప్రొడక్షన్.. డైరెక్షన్.. అన్నిటి దగ్గరా తనే కూర్చున్నారు. ఆ పనంతా ఆమె తన టీమ్‌తో కలిసి చేశారు. ఆ ‘ఏవీ’ని ఐశ్వర్య సన్నిహితులు ‘హోల్మన్’ అవార్డుకు పంపారు. అక్కడ విన్ అయితే ఫిల్మ్ మేకింగ్‌లో ‘శిక్షణ’ను ప్రారంభించాలని ఆమె ఆకాంక్ష. ఇక ఆమె అంతిమలక్ష్యం.. చూపులేనివారి నైపుణ్యాలతో సమాజానికి దారి చూపించే ఓ మంచి చిత్రాన్ని తియ్యడం. -
స్కూల్ చంకెక్కిందా?
మంగళూరులో పెళ్లి. బాజాబజంత్రీ. పెళ్లికూతురు, పెళ్లికొడుకు వెరీ హ్యాపీ. హండ్రెడ్ టైప్స్ ఫుడ్డు. ఫిఫ్టీ టైప్స్ స్వీట్లు. ఇక స్నాకులు, పానీయాలు లెక్కలేనన్ని. కానీ ఎవరూ అటు చూడ్డం లేదు. పెళ్లికొడుకునీ, పెళ్లికూతుర్నీ చూడటం లేదు. స్వీట్లను, హాట్లను, పానీయాలనూ చూడ్డం లేదు. ఎందుకూ అనుకుంటున్నారా? నైట్ మ్యారేజ్‌లో కరెంటు పోయిందనుకుంటున్నారా? అదేదీ కాదండీ, పెళ్లికి ఐశ్వర్యారాయ్ వచ్చింది. ఆవిడొస్తే ఇంకేమన్నా కనిపిస్తుందా అండీ. దానికి తోడు చంకలో ఇంకో అందమైన అమ్మాయి. అదేనండీ.. కూతురు ఆరాధ్య. అంతా బానే ఉందండీ, వచ్చినందుకు ఐశ్వర్యకు ప్రాబ్లమ్ లేదు. పిలిచినందుకు పెళ్లికూతురు వైపు వాళ్లకూ ప్రాబ్లం లేదు. మంగళూరు మంగళూరంతా హ్యాపీ. కానీ అదేంటో.. షిర్జమాన్కి నచ్చలా! ‘ఎప్పుడు చూసినా ఆరాధ్య.. అమ్మ చంకలో వేలాడుతుంది. స్కూల్‌కి పోదా? అసలా స్కూలేం స్కూలు? మా అమ్మ చంక ఎక్కాలీ అన్నప్పుడల్లా సెలవిస్తుందా? వి.ఐ.పి.లకు ఇలాంటి వెసులుబాట్లు కూడా ఉంటాయా? మా పిల్లలేం పాపం చేశారు వాళ్లకు కూడా మేం పెళ్లిళ్లకు పోయినప్పుడు సెలవులు ఇవ్వొచ్చుగా. ఇవన్నీ ఎందుకు లెండి. అసలు అమ్మాయి చదువేం కావాలి? అందం చందం ఉండే చాలు, చదువు సంధ్య అక్కర్లేదు అనుకుంటున్నారా’అని కాస్త ఘాటుగానే ట్వీటిందండోయ్. ఇంతకీ షిర్జమాన్? ఎవరో మరి. ఆమె ఉండటం అయితే ఫారిన్లో నట. అక్కణ్ణుంచి, ఇక్కడి విశేషాలు చదివి ట్వీట్ చేసింది. -
స్త్రీలపై హింసాత్మక చర్యలను అరికట్టాలి
తమిళసినిమా: స్త్రీలపై జరుగుతున్న హింసాత్మక సంఘటనలను అరికట్టాలని ప్రఖ్యాత నటుడు రజనీకాంత్ వ్యాఖ్యానించారు. రజనీకాంత్ పెద్దకూతురు ఐశ్వర్య ధనుష్ భారతదేశం తరఫున మహిళా పరిరక్షణకు ఐక్యరాజ్య సమితి ధూతగా ఎంపికైన విషయం తెలిసిందే. ఐరాస ప్రతినిధులు సోమవారం అధికారికంగా ప్రకటించారు. ఐశ్వర్య తండ్రి, ప్రముఖ నటుడు రజనీ కాంత్ హర్షం వ్యక్తం చేశారు. ఆయన స్పం దిస్తూ తన కూతురు ఐశ్వర్య మహి ళ సంక్షేమం కోసం పాటు పడుతున్నార న్నారు. ఐశ్వర్యకు చిన్నప్పటి నుంచి ఆత్మవిశ్వాసం మెండు అని, తను ఐరాస మహిళా విభాగం అధికారులతో కలిసి స్త్రీల సాధికారత కోసం కృషి చేయడాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు. మహిళల సమ హక్కుల కోసం ఐశ్వర్య పాటు పడడాన్ని అభినందిస్తున్నానన్నారు. ఈ విషయంలో తన మద్దతు ఐశ్వర్యకు ఎప్పడూ ఉంటుందని పేర్కొన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు వంటి హింసాత్మక సంఘటనలను అరికట్టాలని పేర్కొన్నారు.