Actor Dhanush And Aishwarya Rajinikanth Love Story In Telugu - Sakshi
Sakshi News home page

Dhanush Love Story: ఇంటికి బొకే పంపి.. టచ్‌లో ఉండమని చెప్పింది.. ధనుష్‌-ఐశ్వర్యల లవ్‌స్టోరీ

Published Tue, Jan 18 2022 9:03 AM | Last Updated on Tue, Jan 18 2022 11:46 AM

Dhanush and Aishwaryaa Love Story In Telugu - Sakshi

Dhanush And Aishwaryaa Love Story: చిత్ర పరిశ్రమలో పెళ్లిళ్లు ఎంత త్వరగా జరుగున్నాయో.. విడాకులు అనేది కూడా అంతే త్వరగా జరిగిపోతున్నాయి. అది హాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా చివరికి టాలీవుడ్ అయినా విడాకులు తీసుకోవడమనేది చాలా సహజంగా మారిపోయింది. టాలీవుడ్‌లో ఇప్పటికే స్టార్‌ కపూల్‌ సమంత, నాగచైతన్య విడిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా కోలీవుడ్‌ బ్యూటీఫుల్ కపూల్‌ ధనుష్‌, ఐశ్వర్య రజనీకాంత్‌ విడాకులు తీసుకున్నారు.

తమ 18 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు వీరిద్దరూ సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ వార్త విని రజనీకాంత్‌, ధనుష్‌ అభిమానులు షాకయ్యారు. ఎంతో అనోన్యంగా కలిసి ఉండే ధనుష్‌-ఐశ్వర్యలు విడాకులు తీసుకోవడం ఏంటని నివ్వెరపోయారు. అసలు వీరి పెళ్లి ఎలా జరిగింది? వీరిద్దరి లవ్‌స్టోరీ ఏంటి? అనేది వెతకడం ప్రారంభించారు నెటిజన్స్‌. ధనుష్‌, ఐశ్వర్యలది ప్రేమ వివాహం అన్న సంగతి తెలిసిందే. 2004లో ఇరుకుటుంబాల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. 

Actor Dhanush And Aishwarya Love Story

ధనుష్‌ సినిమా కాదల్ కొండై విడుదలైన సమయంలో వీరికి పరిచయం ఏర్పడింది. థియేటర్‌కి వెళ్లి సినిమా చూసిన ఐశ్వర్యను ధనుష్‌కి పరిచయం చేసింది చిత్ర యూనిట్‌. ఆ సమయంలో ధనుష్‏కు అభినందనలు తెలిపింది ఐశ్వర్య. ఆ మరుసటి రోజు ధనుష్‌కి ఒక బోకే పంపిస్తూ..  టచ్ లో ఉండమని చెప్పింది. అయితే యాక్టింగ్‌ పైనే ఫోకస్‌ పెట్టిన ధనుష్‌.. మొదట్లో ఐశ్వర్యను పెద్దగా పట్టించుకోలేదట.

Dhanush Aishwarya Love Story In Telugu

కొన్నాళ్ల తర్వాత వీరిద్దరి మధ్య స్నేహం చిగురించింది. అది కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. ‘నా రెండో సినిమా కాదల్‌ కొండై సినిమా చూసిన ఐశ్వర్య.. నా యాక్టింగ్‌ బాగుందని ప్రశంసించింది. ఇంటికి బొకే పంపించి టచ్‌లో ఉండమని చెప్పింది. ఆ పదం మా ఇద్దరిని మరింత దగ్గరకు చేసింది. మేము స్నేహితులుగా ఉన్న సమయంలోనే మేము ప్రేమలో ఉన్నట్లు కథనాలు వచ్చాయి. కొన్నాళ్ల తర్వాత ఒకరినొకరం ఇష్టపడి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఈ విషయాన్ని మా కుటుంబ సభ్యులకు తెలిపి.. వారి అంగీకారంతోనే వివాహం చేసుకున్నాం’ అని గతంలో ఓ ఇంటర్యూలో ధనుష్‌ చెప్పారు. 

Dhanush And Aishwarya Rajinikanth

2004, నవంబరు 18న వీరిద్దరి వివాహం  జరిగింది. అప్పుడు ధనుష్ వయసు కేవలం 21 మాత్రమే. ధనుష్ కంటే ఐశ్వర్య రెండేళ్లు పెద్ద. వీరికి యాత్రా రాజా (15 ఏళ్లు), లింగ రాజా (11) అని ఇద్దరు కుమారులు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement