
ధనుష్, ఐశ్వర్యల విడాకుల విషయం ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఎంతో అనోన్యంగా ఉండే ఈ జంట.. విడిపోతున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ధనుష్, ఐశ్వర్యల డివోర్స్ ఇష్యూపై కోలీవుడ్‌లో బాగా చర్చ జరుగుతోంది. వివాదాలకు చాలా దూరంగా ఉండే ఈ జంట.. అకస్మాత్తుగా విడిపోవడానికి కారణం ఇవేనంటూ అనేక కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ధనుష్ తండ్రి కస్తూరి రాజా .. విడాకుల ఇష్యూపై స్పందించారు. ఓ కోలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే వారు మళ్లీ కలుస్తారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
(చదవండి: ధనుష్-ఐశ్వర్య విడాకులకు కారణం ఇదేనా?)
భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం సర్వ సాధారణం. ధనుష్,ఐశ్వర్యల మధ్య కూడా అలాంటి గొడవలే చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం వారిద్దరూ చెన్నైలో లేరు. హైదరాబాద్‌లో ఉన్నారు. ఫోన్‌లో వారితో మాట్లాడాను. కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చాను. రజినీకాంత్ కూడా విడాకుల నిర్ణయాన్ని మరోసారి పరిశీలించాలని వారిద్దరిని కోరారు. పిల్లల భవిష్యత్తు రీత్యా విడాకుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చాలా మంది సినీ ప్రముఖులు, సన్నీహితులు కోరుతున్నారు’అని కస్తూరి రాజా చెప్పుకొచ్చారు. మరి రజనీకాంత్, కస్తూరి రాజాల సూచనల మేరకు ధనుష్, ఐశ్వర్యలు విడాకుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారో లేదో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment