స్త్రీలపై హింసాత్మక చర్యలను అరికట్టాలి
తమిళసినిమా: స్త్రీలపై జరుగుతున్న హింసాత్మక సంఘటనలను అరికట్టాలని ప్రఖ్యాత నటుడు రజనీకాంత్ వ్యాఖ్యానించారు. రజనీకాంత్ పెద్దకూతురు ఐశ్వర్య ధనుష్ భారతదేశం తరఫున మహిళా పరిరక్షణకు ఐక్యరాజ్య సమితి ధూతగా ఎంపికైన విషయం తెలిసిందే. ఐరాస ప్రతినిధులు సోమవారం అధికారికంగా ప్రకటించారు. ఐశ్వర్య తండ్రి, ప్రముఖ నటుడు రజనీ కాంత్ హర్షం వ్యక్తం చేశారు.
ఆయన స్పం దిస్తూ తన కూతురు ఐశ్వర్య మహి ళ సంక్షేమం కోసం పాటు పడుతున్నార న్నారు. ఐశ్వర్యకు చిన్నప్పటి నుంచి ఆత్మవిశ్వాసం మెండు అని, తను ఐరాస మహిళా విభాగం అధికారులతో కలిసి స్త్రీల సాధికారత కోసం కృషి చేయడాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు. మహిళల సమ హక్కుల కోసం ఐశ్వర్య పాటు పడడాన్ని అభినందిస్తున్నానన్నారు. ఈ విషయంలో తన మద్దతు ఐశ్వర్యకు ఎప్పడూ ఉంటుందని పేర్కొన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు వంటి హింసాత్మక సంఘటనలను అరికట్టాలని పేర్కొన్నారు.