మంగళూరులో పెళ్లి. బాజాబజంత్రీ. పెళ్లికూతురు, పెళ్లికొడుకు వెరీ హ్యాపీ. హండ్రెడ్ టైప్స్ ఫుడ్డు. ఫిఫ్టీ టైప్స్ స్వీట్లు. ఇక స్నాకులు, పానీయాలు లెక్కలేనన్ని. కానీ ఎవరూ అటు చూడ్డం లేదు. పెళ్లికొడుకునీ, పెళ్లికూతుర్నీ చూడటం లేదు. స్వీట్లను, హాట్లను, పానీయాలనూ చూడ్డం లేదు. ఎందుకూ అనుకుంటున్నారా? నైట్ మ్యారేజ్‌లో కరెంటు పోయిందనుకుంటున్నారా? అదేదీ కాదండీ, పెళ్లికి ఐశ్వర్యారాయ్ వచ్చింది. ఆవిడొస్తే ఇంకేమన్నా కనిపిస్తుందా అండీ. దానికి తోడు చంకలో ఇంకో అందమైన అమ్మాయి. అదేనండీ.. కూతురు ఆరాధ్య. అంతా బానే ఉందండీ, వచ్చినందుకు ఐశ్వర్యకు ప్రాబ్లమ్ లేదు. పిలిచినందుకు పెళ్లికూతురు వైపు వాళ్లకూ ప్రాబ్లం లేదు. మంగళూరు మంగళూరంతా హ్యాపీ.
కానీ అదేంటో.. షిర్‌జమాన్‌కి నచ్చలా! ‘ఎప్పుడు చూసినా ఆరాధ్య.. అమ్మ చంకలో వేలాడుతుంది. స్కూల్‌కి పోదా? అసలా స్కూలేం స్కూలు? మా అమ్మ చంక ఎక్కాలీ అన్నప్పుడల్లా సెలవిస్తుందా? వి.ఐ.పి.లకు ఇలాంటి వెసులుబాట్లు కూడా ఉంటాయా? మా పిల్లలేం పాపం చేశారు వాళ్లకు కూడా మేం పెళ్లిళ్లకు పోయినప్పుడు సెలవులు ఇవ్వొచ్చుగా. ఇవన్నీ ఎందుకు లెండి. అసలు అమ్మాయి చదువేం కావాలి? అందం చందం ఉండే చాలు, చదువు సంధ్య అక్కర్లేదు అనుకుంటున్నారా’అని కాస్త ఘాటుగానే ట్వీటిందండోయ్. ఇంతకీ షిర్‌జమాన్? ఎవరో మరి. ఆమె ఉండటం అయితే ఫారిన్‌లో నట. అక్కణ్ణుంచి, ఇక్కడి విశేషాలు చదివి ట్వీట్ చేసింది.
స్కూల్ చంకెక్కిందా?
Published Wed, Dec 6 2017 11:19 PM | Last Updated on Wed, Dec 6 2017 11:19 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment