సినీ ఇండస్ట్రీలో ప్రేమ- విడాకులు చాలా కామన్ అయిపోయింది. ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంతే త్వరగా విడిపోతున్నారు. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విడాకులు తీసుకున్న సెలబ్రిటీల లిస్ట్ అంతకంతకూ ఎక్కువైపోయింది. ఎంతో అన్యోన్యంగా కనిపిస్తున్న దంపతులు సైతం తమ బంధానికి ఫుల్‌స్టాప్ పెట్టేశారు. పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకొని చివరికి కోర్టు మెట్లు ఎక్కారు. 2022 ఇంకొన్ని రోజుల్లో ముగియనుంది. త్వరలోనే 2023లోకి గ్రాండ్‌గా అడుగుపెట్టబోతున్నాం. ఈ నేపథ్యంలో ఈ ఏడాది విడాకులు తీసుకున్న సెలబ్రిటీలు ఎవరెవరో ఓసారి చూసేద్దామా..
ధనుష్- ఐశ్వర్య రజనీకాంత్
తమిళ స్టార్ హీరో ధనుష్- రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ఈ ఏడాది ప్రారంభంలోనే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. తమిళ నాట స్టార్ కపుల్‌గా గుర్తింపు పొందిన ఈ జంట 2004 నవంబర్ 18న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబసభ్యుల నిర్ణయంతో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. పెళ్లి నాటికి ధనుష్ వయసు 21 ఏళ్లు, ఐశ్వర్య వయసు 23 ఏళ్లు. ఈ దంపతులకు యాత్రా రాజా (15 ఏళ్లు), లింగ రాజా (11) అని ఇద్దరు కుమారులు ఉన్నారు. సాఫీగా సాగిపోతుందనుకున్న వీరి వైవాహిక బంధంలో మనస్పర్థలు ఏర్పడి ఈ ఏడాది జనవరి 17న విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
యోయో హనీసింగ్- షాలినీ తల్వార్
బాలీవుడ్ ర్యాపర్, మ్యూజిక్ కంపోజర్ యో యో హనీసింగ్ తన పదేళ్ల వివాహ బంధానికి ముగింపు పలికాడు. సుమారు పదేళ్లపాటు ప్రేమలో మునిగితేలిన హనీసింగ్-షాలినీలు 2011లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. కానీ మనస్పర్థలు రావడంతో సెప్టెంబర్ 8న విడాకులు తీసుకున్నారు. ఇక హనీసింగ్ తనను లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురిచేయడమే కాకుండా, ఇతర మహిళలతో వివాహేతర సంబంధంపెట్టుకున్నాడని ఆరోపిస్తూ షాలిని కోర్టును ఆశ్రయించడంతో వివాదం రచ్చకెక్కింది. ఇదిలా ఉంటే షాలినీతో విడాకులు తీసుకున్న కొద్ది నెలలకే హనీసింగ్ తన గర్ల్‌ఫ్రెండ్ టీనా తడానితో చెట్టాపట్టాలేసుకొని తిరగడం మీడియా కంట పడింది.
రాజీవ్ సేన్- చారు అసోపా
మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ విడాకులు వ్యవహరం ఇప్పటికీ హాట్‌టాపిక్‌గానే ఉంది. టీవీ నటి చారు అసోపా- రాజీవ్ సేన్‌లు 2019 జూన్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఏడాది వయసున్న కూతురు జియానా ఉంది. అయితే పెళ్లయిన ఏడాదిన్నరగే విడిపోతున్నట్లు ప్రకటించి అందిరికి షాక్ ఇచ్చిన ఈ దంపతులు తమ కూతురి కోసం కలిసి ఉండాలనుకుంటున్నామంటూ ఇటీవల తమ విడాకులను రద్దు చేసుకున్నారు. కానీ మళ్లీ ఏమైందో ఏమో కానీ మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకోవడానికే మొగ్గు చూపుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం భార్యభర్తలుగా విడిపోతున్నామని, కేవలం కూతురు జియానుకు తల్లిదండ్రులుగా ఉంటున్నామని తెలిపారు.
రాఖీ సావంత్- రితేష్
వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నానుతూ ఉంటుంది రాఖీ సావంత్. బిగ్‌బాస్ షోతో మరింత పాపులర్ అయిన ఆమె ఈ ఏడాది వాలంటైన్స్ డే రోజు తన భర్త రితేశ్ సింగ్‌తో విడిపోతున్నట్లు ప్రకటించింది.రితేశ్‌కు ఆల్‌రెడీ పెళ్లైన విషయాన్ని తన దగ్గర దాచిపెట్టాడని, వారు విడాకులు తీసుకోలేదు కాబట్టి చట్టబద్ధంగా తమ వివాహం చెల్లదండూ అతడితో తెగదెంపులు చేసుకుంది. మాజీ భర్త జ్ఞాపకాలను సైతం వదిలించుకుంది. ఇక ప్రస్తుతం తనకంటే ఆరేళ్లు చిన్నవాడైన అదిల్ దురానీతో ప్రేమలో మునిగితేలుతుంది.
సుస్మితా సేన్-లలిత్ మోదీ
మాజీ విశ్వసుందరి, నటి సుస్మితా సేన్ ప్రేమ వ్యవహారం మీడియాలో ఎంత హాట్‌టాపిక్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొన్నటి వరకు తనకంటే 15 ఏళ్ల చిన్నవాడైన మోడల్ ప్రముఖ మోడల్ రోహ్‌మన్‌తో ప్రేమాయణం నడిపిన సుస్మితా తాజాగా మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోదీతో సహజీవనం చేస్తుందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరు మాల్దీవుల్లో షికార్లు చేసిన ఫొటోలు, లండన్‌లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నా పిక్స్‌ను స్వయంగా లలిత్ మోదీ షేర్ చేశాడు.
ఈ సందర్భంగా సుస్మితాను తన బెటర్ హాఫ్(భార్య) అంటూ పరిచయం చేశాడు మోదీ. ఆ తర్వాత ప్రస్తుతం తాము డేటింగ్‌లో ఉన్నామనీ, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు స్పష్టం చేశాడు. దీంతో వీరిద్దరి ప్రేమ వ్యవహరం మీడియాలో, సోషల్ మీడియాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ లలిత్ మోదీకి గుడ్‌బై చెప్పి ప్రస్తుతం రోహ్‌మన్‌తోనే సుస్మితా కలిసి ఉంటున్నట్లు తెలుస్తుంది.
సోహైల్ ఖాన్-సీమా
సల్మాన్ ఖాన్ ఫ్యామిలీకి పెళ్లిళ్లు అచ్చొచ్చినట్లు కనిపించడం లేదు. ఇప్పటికే అర్బాజ్ ఖాన్ విడాకులు తీసుకోగా, ఇప్పుడు సల్మాన్ మరో తమ్ముడు సోహైల్ ఖాన్ కూడా భార్య నుంచి విడిపోయాడు. ఎంతో అన్యోన్యంగా కనిపిస్తున్న సోహైల్- సీమా ఖాన్‌లు 24 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికారు. ప్రేమించి, పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్న సోహైల్-సీమా ఖాన్‌లు విడాకులు తీసుకోవడం బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే.
అయితే వీరి విడాకుల వెనుక ఓ హీరోయిన్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషీతో సొహైల్ ఖాన్ కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు వార్తలు జోరుగా వినిపించాయి. కారణం ఏదైనా తమ వివాహ బంధానికి ముగింపు పలికారు ఈ బ్యూటిఫుల్ కపుల్.
Comments
Please login to add a commentAdd a comment