కోర్టు విచారణకు దూరంగా ధనుష్, ఐశ్వర్య... మరోసారి వాయిదా! | Dhanush And Aishwaryaa Rajinikanth Divorce Case Again Postponed | Sakshi
Sakshi News home page

కోర్టు విచారణకు దూరంగా ధనుష్, ఐశ్వర్య... మరోసారి వాయిదా!

Published Tue, Oct 8 2024 10:42 AM | Last Updated on Tue, Oct 8 2024 11:04 AM

Dhanush And Aishwaryaa Rajinikanth Divorce Case Again Postponed

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌, ఐశ్వర్య రజినీకాంత్‌ల విడాకుల విషయంలో కోర్టుకు హాజరవ్వాలని చెన్నై ఫ్యామిలీ కోర్టు గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, వారిద్దరూ విచారణ కోసం కోర్టులో హాజరుకాలేదు. 2004లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట సుమారు 18 ఏళ్ల పాటు కలిసి జీవించారు. వారికి యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా 2022లో పలు విభేదాల వల్ల తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆ సమయం నుంచి ఇద్దరూ వేర్వేరుగానే ఉంటున్నారు.

ధనుష్‌, ఐశ్వర్య ఇద్దరూ తమ వైవాహిక జీవితం ముగిసిందంటూ పరస్పర విడాకుల కోసం చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టులో రెండేళ్ల క్రితమే పిటిషన్ వేశారు. కానీ, ఇప్పటి వరకు కోర్టులో మాత్రం హజరవలేదు. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే న్యాయస్థానం ముందుకు రావాలని వారికి నోటీసులు కూడా కోర్టు పంపింది. ఈ క్రమంలో అక్టోబర్‌ 7న విచారణకు రావాల్సి ఉంది. అయితే, వారిద్దరూ ఇప్పుడు కూడా కోర్టులో హాజరు కాలేదు. దీంతో అక్టోబర్ 19కి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి శుభాదేవి తెలిపారు.

2004లో ప్రేమ వివాహం చేసుకున్న ధనుష్‌, ఐశ్వర్య పలు విభేదాల వల్ల 2022 నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో వారిద్దరిని కలిపేందుకు రజనీకాంత్‌ కూడా తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయినా కూడా వారిద్దరు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, కోర్టు విచారణకు వారిద్దరూ హజరు కాకపోవడంతో మళ్లీ కలుస్తారంటూ ఫ్యాన్స్‌ చర్చించుకుంటున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement