yo yo honey singh
-
విడాకులు తీసుకున్న స్టార్ సింగర్!
పంజాబ్ చెందిన రాపర్ సింగర్ యో యో హనీ సింగ్ తన భార్యతో విడాకులు తీసుకున్నారు. పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత వివాహా బంధానికి ముగింపు పలికారు. తాజాగా యో యో హనీ సింగ్, అతని భార్య షాలిని తల్వార్లకు ఢిల్లీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. కాగా.. జనవరి 2011లో షాలిని తల్వార్‌ను హనీ సింగ్ వివాహం చేసుకున్నారు. (ఇది చదవండి: రష్మిక వీడియోలానే మరో స్టార్ హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్!) కాగా.. 2021లో తన భర్త హనీ సింగ్‌పై షాలిని గృహ హింస కేసు పెట్టింది. అంతే కాకుండా అతనికి వివాహేతర సంబంధం ఉందని కూడా ఆమె ఆరోపించింది. దీంతో ఈ జంట విడాకులు కోసం కోర్టు మెట్లెక్కారు. తాజాగా ఢిల్లీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. దీంతో షాలినికి కోటి రూపాయల చెక్కును భరణంగా ఇచ్చాడు హనీ సింగ్. కాగా.. సింగర్ ప్రస్తుతం నటి, మోడల్ టీనా థడానీతో డేటింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. హనీ సింగ్ పంజాబీతో పాటు హిందీ, హాలీవుడ్ సినిమాలకు పాటలు పాడారు. అతని అసలు పేరు హిర్దేశ్ సింగ్ కాగా.. యో యో హనీ సింగ్ పేరుతో ఫేమస్ అయ్యారు. అతను 2003లో రికార్డింగ్ ఆర్టిస్ట్‌గా ప్రారంభించాడు. ఆ తర్వాత పంజాబీ సంగీతంలో సింగర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. (ఇది చదవండి: అశ్వినిని ఏడిపించేసిన బిగ్ బాస్.. హౌస్‌లో ఏం జరిగిందంటే?) -
బెల్లంకొండ హీరోయిన్ “యో...యో”
-
హీరోయిన్‌తో సింగర్ డేటింగ్.. సోషల్ మీడియాలో వైరల్!
బాలీవుడ్ సింగర్, ర్యాపర్ యోయో హనీ సింగ్ గురించి బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. తాజాగా ముంబయిలో జరిగిన ఓ గ్రాండ్ ఈవెంట్లో ఆయన ప్రదర్శన చేశారు. ఈ ప్రోగ్రామ్‌లో బీ టౌన్‌కు చెందిన పలువురు అగ్ర తారలు హాజరయ్యారు. అయితే ఈవెంట్లో బాలీవుడ్ నటి నుస్రత్ బరుచా అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే హనీ సింగ్ ఆమె చేతులు పట్టుకుని వెళ్తూ కెమెరాల కంటికి చిక్కారు. దీంతో వీరిద్దరి డేటింగ్లో ఉన్నారంటూ బీటౌన్‌లో వార్తలు గుప్పుమంటున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా ఈ జంట ఫోటోలకు కూడా ఫోజులిచ్చారు. ఓ నెటిజన్ రాస్తూ వారిద్దరు డేటింగ్లో ఉన్నారా? అని ప్రశ్నించారు. మరో నెటిజన్ వీరి మధ్య ఏదో జరుగుతోంది అంటూ కామెంట్ చేశాడు. కాగా.. హనీ సింగ్ ఇటీవలే తన కొత్త పాటను రిలీజ్ చేశారు. ఆ సాంగ్ ఇప్పటికే యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ సాధించింది. మరోవైపు నుస్రత్ ప్రస్తుతం 'చోరీ' సినిమా కోసం సిద్ధమవుతోంది. ఆమె చివరిసారిగా అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీలతో కలిసి 'సెల్ఫీ' చిత్రంలో కనిపించింది. రణబీర్ కపూర్, శ్రద్ధా కపూర్ నటించిన 'తు ఝూతీ మైన్ మక్కార్'లో కూడా నుష్రత్ ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించింది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ఈ ఏడాది విడాకులు తీసుకున్న సెలబ్రిటీ కపుల్స్ వీళ్లే..
సినీ ఇండస్ట్రీలో ప్రేమ- విడాకులు చాలా కామన్ అయిపోయింది. ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంతే త్వరగా విడిపోతున్నారు. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విడాకులు తీసుకున్న సెలబ్రిటీల లిస్ట్ అంతకంతకూ ఎక్కువైపోయింది. ఎంతో అన్యోన్యంగా కనిపిస్తున్న దంపతులు సైతం తమ బంధానికి ఫుల్స్టాప్ పెట్టేశారు. పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకొని చివరికి కోర్టు మెట్లు ఎక్కారు. 2022 ఇంకొన్ని రోజుల్లో ముగియనుంది. త్వరలోనే 2023లోకి గ్రాండ్‌గా అడుగుపెట్టబోతున్నాం. ఈ నేపథ్యంలో ఈ ఏడాది విడాకులు తీసుకున్న సెలబ్రిటీలు ఎవరెవరో ఓసారి చూసేద్దామా.. ధనుష్- ఐశ్వర్య రజనీకాంత్ తమిళ స్టార్ హీరో ధనుష్- రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ఈ ఏడాది ప్రారంభంలోనే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. తమిళ నాట స్టార్ కపుల్‌గా గుర్తింపు పొందిన ఈ జంట 2004 నవంబర్ 18న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబసభ్యుల నిర్ణయంతో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. పెళ్లి నాటికి ధనుష్ వయసు 21 ఏళ్లు, ఐశ్వర్య వయసు 23 ఏళ్లు. ఈ దంపతులకు యాత్రా రాజా (15 ఏళ్లు), లింగ రాజా (11) అని ఇద్దరు కుమారులు ఉన్నారు. సాఫీగా సాగిపోతుందనుకున్న వీరి వైవాహిక బంధంలో మనస్పర్థలు ఏర్పడి ఈ ఏడాది జనవరి 17న విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. యోయో హనీసింగ్- షాలినీ తల్వార్ బాలీవుడ్ ర్యాపర్, మ్యూజిక్ కంపోజర్ యో యో హనీసింగ్ తన పదేళ్ల వివాహ బంధానికి ముగింపు పలికాడు. సుమారు పదేళ్లపాటు ప్రేమలో మునిగితేలిన హనీసింగ్-షాలినీలు 2011లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. కానీ మనస్పర్థలు రావడంతో సెప్టెంబర్ 8న విడాకులు తీసుకున్నారు. ఇక హనీసింగ్ తనను లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురిచేయడమే కాకుండా, ఇతర మహిళలతో వివాహేతర సంబంధంపెట్టుకున్నాడని ఆరోపిస్తూ షాలిని కోర్టును ఆశ్రయించడంతో వివాదం రచ్చకెక్కింది. ఇదిలా ఉంటే షాలినీతో విడాకులు తీసుకున్న కొద్ది నెలలకే హనీసింగ్ తన గర్ల్‌ఫ్రెండ్ టీనా తడానితో చెట్టాపట్టాలేసుకొని తిరగడం మీడియా కంట పడింది. రాజీవ్ సేన్- చారు అసోపా మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ విడాకులు వ్యవహరం ఇప్పటికీ హాట్‌టాపిక్‌గానే ఉంది. టీవీ నటి చారు అసోపా- రాజీవ్ సేన్లు 2019 జూన్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఏడాది వయసున్న కూతురు జియానా ఉంది. అయితే పెళ్లయిన ఏడాదిన్నరగే విడిపోతున్నట్లు ప్రకటించి అందిరికి షాక్ ఇచ్చిన ఈ దంపతులు తమ కూతురి కోసం కలిసి ఉండాలనుకుంటున్నామంటూ ఇటీవల తమ విడాకులను రద్దు చేసుకున్నారు. కానీ మళ్లీ ఏమైందో ఏమో కానీ మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకోవడానికే మొగ్గు చూపుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం భార్యభర్తలుగా విడిపోతున్నామని, కేవలం కూతురు జియానుకు తల్లిదండ్రులుగా ఉంటున్నామని తెలిపారు. రాఖీ సావంత్- రితేష్ వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నానుతూ ఉంటుంది రాఖీ సావంత్. బిగ్‌బాస్ షోతో మరింత పాపులర్ అయిన ఆమె ఈ ఏడాది వాలంటైన్స్ డే రోజు తన భర్త రితేశ్ సింగ్‌తో విడిపోతున్నట్లు ప్రకటించింది.రితేశ్‌కు ఆల్రెడీ పెళ్లైన విషయాన్ని తన దగ్గర దాచిపెట్టాడని, వారు విడాకులు తీసుకోలేదు కాబట్టి చట్టబద్ధంగా తమ వివాహం చెల్లదండూ అతడితో తెగదెంపులు చేసుకుంది. మాజీ భర్త జ్ఞాపకాలను సైతం వదిలించుకుంది. ఇక ప్రస్తుతం తనకంటే ఆరేళ్లు చిన్నవాడైన అదిల్ దురానీతో ప్రేమలో మునిగితేలుతుంది. సుస్మితా సేన్-లలిత్ మోదీ మాజీ విశ్వసుందరి, నటి సుస్మితా సేన్ ప్రేమ వ్యవహారం మీడియాలో ఎంత హాట్‌టాపిక్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొన్నటి వరకు తనకంటే 15 ఏళ్ల చిన్నవాడైన మోడల్ ప్రముఖ మోడల్ రోహ్మన్తో ప్రేమాయణం నడిపిన సుస్మితా తాజాగా మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోదీతో సహజీవనం చేస్తుందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరు మాల్దీవుల్లో షికార్లు చేసిన ఫొటోలు, లండన్‌లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నా పిక్స్‌ను స్వయంగా లలిత్ మోదీ షేర్ చేశాడు. ఈ సందర్భంగా సుస్మితాను తన బెటర్ హాఫ్(భార్య) అంటూ పరిచయం చేశాడు మోదీ. ఆ తర్వాత ప్రస్తుతం తాము డేటింగ్లో ఉన్నామనీ, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు స్పష్టం చేశాడు. దీంతో వీరిద్దరి ప్రేమ వ్యవహరం మీడియాలో, సోషల్ మీడియాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ లలిత్ మోదీకి గుడ్‌బై చెప్పి ప్రస్తుతం రోహ్మన్తోనే సుస్మితా కలిసి ఉంటున్నట్లు తెలుస్తుంది. సోహైల్ ఖాన్-సీమా సల్మాన్ ఖాన్ ఫ్యామిలీకి పెళ్లిళ్లు అచ్చొచ్చినట్లు కనిపించడం లేదు. ఇప్పటికే అర్బాజ్ ఖాన్ విడాకులు తీసుకోగా, ఇప్పుడు సల్మాన్ మరో తమ్ముడు సోహైల్ ఖాన్ కూడా భార్య నుంచి విడిపోయాడు. ఎంతో అన్యోన్యంగా కనిపిస్తున్న సోహైల్- సీమా ఖాన్లు 24 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికారు. ప్రేమించి, పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్న సోహైల్-సీమా ఖాన్లు విడాకులు తీసుకోవడం బాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే వీరి విడాకుల వెనుక ఓ హీరోయిన్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషీతో సొహైల్ ఖాన్ కొంతకాలంగా రిలేషన్షిప్లో ఉన్నట్లు వార్తలు జోరుగా వినిపించాయి. కారణం ఏదైనా తమ వివాహ బంధానికి ముగింపు పలికారు ఈ బ్యూటిఫుల్ కపుల్. -
విడాకులు తీసుకున్న కొద్ది నెలలకే.. గర్ల్‌ఫ్రెండ్‌తో సింగర్ షికార్లు
బాలీవుడ్ స్టార్ సింగర్, రాపర్ యోయో హనీసింగ్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. భార్య షాలినీ తల్వార్‌తో విడాకులు తీసుకున్న కొద్ది నెలలకే ఇప్పుడు మరో గర్ల్‌ఫ్రెండ్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరిగుతున్న ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఢిల్లీలో జరిగిన ఓ ఈవెంట్‌కి హనీసింగ్ తన గర్ల్‌ఫ్రెండ్ టీనా తడానిని చేయి పట్టుకొని వేదిక వద్దకు తీసుకెళ్లాడు. దీంతో ఆ అమ్మాయి ఎవరా అని అందరిలో క్యూరియాసిటీ మొదలైంది. టీనా తడానీ ఎవరా అని సెర్చ్ చేయగా ఆమె ఒక మోడల్ అని తెలిసింది. అంతేకాకుండా రీసెంట్గా రిలీజైన హనీసింగ్ మ్యూజిక్ ఆల్భమ్లోనూ ఆమె కనిపించింది. ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో హనీసింగ్ తన ప్రేమ గురించి ఓపెన్‌గానే బయటపెట్టేశిన సంగతి తెలిసిందే. 'ఆమె రూపంతో పాటు మనసు కూడా ఎంతో అందంగా ఉంటుంది. నా గతం గురించి అన్నీ తెలిసి కూడా నన్ను అంగీకరించింది. చాలా కాలంగా నేను సంతోషంగా లేను. కానీ ఆమె నా జీవితంలోకి వచ్చాక చాలా ఆనందంగా, రొమాంటిక్‌గా ఉంటున్నా. అందుకే నా కొత్త ఆల్భమ్ సాంగ్ ఆమెకి డెడికేట్ చేస్తున్నా' అంటూ హనీసింగ్ పేర్కొన్నాడు. అయితే ఆమె పేరు చెప్పడానికి ఆరోజు అంగీకరించని హనీసింగ్.. ఢిల్లీ ఈవెంట్లో మాత్రం టీనాను గర్ల్‌ఫ్రెండ్ అంటూ పరిచయం చేశాడు. దీంతో వీరిద్దరి ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. .@asliyoyo Introduce His New GF Tina 🔥 Watch full Video : https://t.co/wOZDycy7dk#Yoyohoneysingh #Honeysingh #Honeysinghgirlfriend @Yoyohon86350823 #HoneySingh pic.twitter.com/zjz4lA4Hvi — Himanshu Aswal (Artist) (@Himanshaswal) December 7, 2022 -
ప్రముఖ సింగర్ విడాకులు, పదేళ్ల బంధానికి ముగింపు
సినీ ఇండస్ట్రీలో ఈమధ్యకాలంలో విడాకుల ట్రెండ్ పెరిగిపోతుంది. తాజాగా బాలీవుడ్ ర్యాపర్, మ్యూజిక్ కంపోజర్ యో యో హనీసింగ్ తన పదేళ్ల వివాహ బంధానికి ముగింపు పలికాడు. భార్య షాలిని తల్వార్‌తో తెగదెంపులు చేసుకున్నాడు.భరణంగా కోటి రూపాయలను కూడా సమర్పించాడు.తొలుత షాలిని తనకు భరణంగా రూ. 10కోట్లు డిమాండ్ చేయగా చర్చల అనంతరం కోటి రూపాయల భరణానికి ఇద్దరూ అంగీకరించారు. కాగా హనీసింగ్ తనను లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురిచేయడమే కాకుండా, ఇతర మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ షాలిని తల్వార్ గతేడాది ల్లీలోని తీస్ హజారీ కోర్టులో ‘గృహహింస నిరోధక చట్టం’ కింద పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇరు వాదనలు విన్న కోర్టు విచారణ అనంతరం వీరికి విడాకులు మంజూరు చేసింది. ఇదిలా ఉండగా సుమారు పదేళ్లపాటు ప్రేమలో ఉన్న హనీసింగ్-షాలినీలు 2011లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. అనంతరం వీరికి మనస్పర్థలు రావడంతో చివరికి విడాకులు తీసుకున్నారు. -
అవి నీచమైన ఆరోపణలు, నన్ను నమ్మండి: హనీసింగ్
Yo Yo Honey Singh: ప్రముఖ బాలీవుడ్ సింగర్ యోయో హనీసింగ్ తనను టార్చర్ పెట్టాడంటూ అతడి భార్య షాలిని గృహహింస ఆరోపణలు చేసిన విషయం విదితమే. అతడికి వేరే మహిళలతో అక్రమ సంబంధం ఉందని, అదేంటని నిలదీస్తే తనపైకి మందు బాటిల్ విసిరాడని ఆమె తీవ్రంగా ఆరోపించింది. తాజాగా ఈ ఆరోపణలను తోసిపుచ్చాడు హనీసింగ్. 'నా భార్య షాలిని తల్వార్ నాపై, నా కుటుంబంపై మోపిన అసత్య, హానికరమైన ఆరోపణలు విని నేను చాలా బాధపడ్డాను, ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నాను. ఆమె చెప్పేవి చాలా అసహ్యంగా ఉన్నాయి. గతంలో నా మ్యూజిక్ మీద, ఆరోగ్యం మీద ఎన్నో రూమర్లు వచ్చినప్పటికీ వాటిపై నేనెప్పుడూ స్పందించలేదు. నాపై వ్యతిరేక ప్రచారం జరిగినా ఎలాంటి ప్రెస్‌నోట్ జారీ చేయలేదు. కానీ ఈసారి మౌనంగా ఉండటం కరెక్ట్ కాదనిపిస్తోంది. ఎందుకంటే నాకు ఎంతగానో అండగా నిలబడ్డ నా వృద్ధ తల్లిదండ్రులు, చెల్లె మీద ఆమె నీచమైన ఆరోపణలు చేస్తోంది. ఇవి మా పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయి' 'నేను ఇండస్ట్రీలో ఉండి 15 ఏళ్లు పైనే అవుతోంది. ఈ జర్నీలో దేశవ్యాప్తంగా ఉన్న పలువురు కళాకారులు, సంగీతకారులతో కలిసి పని చేశాను. నా భార్యతో ఎలా ఉంటాననేది అందరికీ తెలుసు. ఎందుకంటే షూటింగ్‌లు, ఈవెంట్లకు ఆమెను కూడా వెంటపెట్టుకుని వెళ్లేవాడిని. ఆమె చేసిన అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నా. నాకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది. త్వరలోనే నిజం బయటపడుతుందని ఆశిస్తున్నా. అప్పటివరకు నా గురించి, నా కుటుంబం గురించి ఎలాంటి నిర్ధారణకు రావొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నా' అని పోస్ట్ పెట్టాడు. pic.twitter.com/YiHnKbJlSW — Yo Yo Honey Singh (@asliyoyo) August 6, 2021 -
స్టార్ సింగర్ అక్రమ సంబంధాలు: అడిగితే మందు బాటిల్‌తో
Yo Yo Honey Singh Domestic Violence Case: స్టార్ సింగర్ యోయో హనీ సింగ్‌పై ఆయన భార్య షాలిని తల్వార్ గృహహింస, లైంగిక వేధింపులు, ఆర్థిక మోసం, మానసిక హింస కేసు నమోదు చేసిన సంగతి విదితమే. ఢిల్లీలోని తిస్ హజారీ కోర్టులో 'గృహ హింస నుంచి మహిళల రక్షణ' చట్టం కింద మంగళవారం ఆమె పిటిషన్ సైతం దాఖలు చేసింది. 120 పేజీలున్న ఈ పిటిషన్లో హనీసింగ్ ఆగడాల గురించి షాలిని వివరించింది. అతడి యాటిట్యూడ్ వల్ల ఎంత మానసిక క్షోభ అనుభవించాననేది పేర్కొంది. '2011లో హనీమూన్ అయిపోయిన తర్వాత హర్దేశ్ సింగ్(హనీ సింగ్ అసలు పేరు) సడన్‌గా మారిపోయాడు. ఏమైంది? ఎందుకిలా మారిపోయావని ప్రశ్నిస్తే.. తనకు ఇష్టం లేకపోయినా కేవలం నాకిచ్చిన మాట కోసం ఈ పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. హనీమూన్ ట్రిప్‌లో నన్ను ఒంటరిగా వదిలేసి తాగుబోతులా తిరిగేవాడు. ఈ ప్రవర్తన గురించి అడిగితే నా జుట్టు పట్టుకుని కొట్టి, నోరు మూసుకోమని చెప్పేవాడు. అతడికి ఇతర అమ్మాయిలతో అక్రమ సంబంధం ఉంది, అందుకే నన్ను తనవెంట టూర్లకు తీసుకెళ్లేవాడు కాదు. మా పెళ్లి విషయాన్ని ఎప్పుడూ సీక్రెట్‌గా ఉంచాలనుకునేవాడు. అందుకే వేలికి రింగ్ కూడా పెట్టుకునేవాడు కాదు. కానీ ఇంటర్నెట్లో మా ఫొటోలు లీక్ అవడంతో దానికి నేనే కారణమంటూ నన్ను దారుణంగా కొట్టాడు. అవి ఓ సినిమా షూటింగ్ స్టిల్స్ అని కవర్ చేసేందుకు ప్రయత్నించాడు. 'బ్రౌన్ ర్యాంగ్' పాట కోసం వర్క్ చేసిన ఒక మహిళతోనూ హనీ సింగ్‌కు అఫైర్ ఉంది. ఈమేరకు ఇద్దరూ కలిసి దిగిన కొన్ని అభ్యంతరకర ఫొటోలు నా కంటపడ్డాయి. వాటి గురించి నిలదీస్తే నా మీదకు మందు బాటిళ్లు విసిరాడు. ఆ తర్వాత వేరే ఆడవాళ్లతో కలిసి దిగిన ఫొటోలు చాలానే కనబడ్డాయి. నా పట్ల నా భర్త అతి క్రూరంగా ప్రవర్తించాడు. ఇదిలా వుంటే ఒకరోజు నేను బట్టలు మార్చుకుంటుంటే మామయ్య నేరుగా నా గదిలోకి వచ్చి నన్ను అసభ్యంగా తాకాడు. ఆ ఇంట్లో నన్ను హింసించారని నిరూపించేందుకు నా దగ్గర ఇంకా ఎన్నో సాక్ష్యాలున్నాయి' అని షాలిని తెలిపింది. గృహ హింస నుంచి మహిళలకు రక్షణ చట్టం కింద హనీ సింగ్ నుంచి రూ.10 కోట్ల పరిహారాన్ని ఇప్పించాలని పిటిషన్లో డిమాండ్ చేసింది. దీనిపై ఆగస్టు 28లోపు సమాధానం చెప్పాలంటూ హనీ సింగ్‌కు కోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే! -
ప్రభుదేవా సూపర్ హిట్ సాంగ్ రిమిక్స్
ప్రభుదేవా హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా ప్రేమికుడు. ఈ సినిమాలో సూపర్ హిట్ అయిన ఊర్వశి ఊర్వశి టేక్ ఇట్ ఈజీ ఊర్వశి పాటకు ఇన్నేళ్ల తరువాత ఓ రిమిక్స్ వర్సణ్ వచ్చింది. అయితే రిమిక్స్ సినిమా కోసం చేసింది కాదు ఓ వీడియో ఆల్బమ్కోసం ఆ పాటను రిమిక్స్ చేశారు. పాటలోని ఊర్వశి ఊర్వశి టేక్ ఇట్ ఈజీ ఊర్వశి మెయిన్ లైన్స్ మాత్రమే తీసుకొని మిగతా అంతా కొత్త లిరిక్స్ తో ఈ పాటను రూపొదించారు. సెన్సేషనల్ బాలీవుడ్ సింగర్ యో యో హనీ సింగ్ స్వయంగా ఈ పాటను కంపోజ్ చేసి ఆలపించారు. ఈ ఆల్బమ్‌లో అర్జున్ రెడ్డి హిందీ రీమేక్‌లో జంటగా నటిస్తున్న షాహిద్ కపూర్, కియారా అద్వానీలు జంటగా కనిపించారు. -
హర్యానా రాజకీయాల్లో యోయో హానీసింగ్!
చండీఘడ్: ర్యాప్ మ్యూజిక్ తో, ముఖ్యంగా 'లుంగీ డ్యాన్స్' పాటతో సంగీత ప్రియుల్ని ఉర్రూతలూగించిన రాప్ సింగర్ యో యో హానీసింగ్ మరో కొత్త పాత్రలో కనిపించనున్నారు. హర్యానాలో జరుగనున్న ఎన్నికల ప్రచారంలో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీ తరపున ప్రచారం చేయనున్నారు. ఎన్నికల ప్రచారంలో తమ పార్టీకి మద్దతుగా యోయో హానీసింగ్ పాల్గొంటారని ఆ పార్టీ అధినేత ఓం ప్రకాశ్ చౌతాలా మనవడు కరణ్ చౌతాలా మీడియాకు వెల్లడించారు. అవినీతి ఆరోపణల కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఓం ప్రకాశ్ చౌతాలా బెయిల్ బయటకు వచ్చారు. ఆయన కూడా పార్టీ తరపున ప్రచారంలో పాల్గొంటారని పార్టీ నేతలు వెల్లడించారు. హర్యానా రాష్ట్రానికి చౌతాలా నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2005 తర్వాత అధికారాన్ని కోల్పోయిన చౌతాలా అవినీతి ఆరోపణల కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నారు. హర్యానా రాష్ట్రంలో అక్టోబర్ 15 తేదిన ఎన్నికలు జరుగనున్నాయి. -
షూటింగ్లో గాయపడిన యో యో హనీసింగ్
యో యో హనీసింగ్.. ఈ పేరు చెబితే చాలు.. చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దవయసు వాళ్ల వరకు అందరూ ఊగిపోతుంటారు. అలాంటి హనీసింగ్ 'ఇండియాస్ రా స్టార్' అనే టీవీ రియాల్టీ షో షూటింగ్లో గాయపడ్డాడు. ఈ కార్యక్రమం షూటింగ్ చేస్తుండగా జారిపడిపోయి గాయపడ్డాడు. ఈ కార్యక్రమం మొదటి ఎపిసోడ్ షూటింగ్ చేస్తుండగా చిట్ట చివరి బిట్ షూట్ చేసేటప్పుడు జారి కింద పడిపోయాడని ఈ షో నిర్మాణ వర్గాలు తెలిపాయి. కింద పడినప్పుడు అతడికి స్వల్ప గాయాలయ్యాయని, అయినా ఏమాత్రం గొడవ చేయకుండా వెంటనే మళ్లీ షూటింగ్ మొదలుపెట్టేశాడని చెప్పాయి. 'ఇండియాస్ రా స్టార్' షోలో పోటీ చేసేవాళ్లకు హనీసింగ్ ఓ స్నేహితుడిగా, మెంటార్‌గా, మార్గదర్శిగా కనిపిస్తాడు. దేశవ్యాప్తంగా వచ్చిన గాయనీ గాయకులు ఈ టైటిల్ కోసం పోటీ పడుతుంటారు. దీనికి హోస్ట్‌గా ప్రముఖ మోడల్, నటి గౌహర్ ఖాన్ వ్యవహరిస్తున్నారు. ఆదివారాలు స్టార్ ప్లస్ ఛానల్లో ఈ షో ప్రసారం అవుతుంది.