
బాలీవుడ్ స్టార్ సింగర్, రాపర్ యోయో హనీసింగ్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. భార్య షాలినీ తల్వార్‌తో విడాకులు తీసుకున్న కొద్ది నెలలకే ఇప్పుడు మరో గర్ల్‌ఫ్రెండ్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరిగుతున్న ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఢిల్లీలో జరిగిన ఓ ఈవెంట్‌కి హనీసింగ్ తన గర్ల్‌ఫ్రెండ్ టీనా తడానిని చేయి పట్టుకొని వేదిక వద్దకు తీసుకెళ్లాడు. దీంతో ఆ అమ్మాయి ఎవరా అని అందరిలో క్యూరియాసిటీ మొదలైంది.
టీనా తడానీ ఎవరా అని సెర్చ్ చేయగా ఆమె ఒక మోడల్ అని తెలిసింది. అంతేకాకుండా రీసెంట్‌గా రిలీజైన హనీసింగ్ మ్యూజిక్ ఆల్భమ్‌లోనూ ఆమె కనిపించింది. ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో హనీసింగ్ తన ప్రేమ గురించి ఓపెన్‌గానే బయటపెట్టేశిన సంగతి తెలిసిందే. 'ఆమె రూపంతో పాటు మనసు కూడా ఎంతో అందంగా ఉంటుంది. నా గతం గురించి అన్నీ తెలిసి కూడా నన్ను అంగీకరించింది.
చాలా కాలంగా నేను సంతోషంగా లేను. కానీ ఆమె నా జీవితంలోకి వచ్చాక చాలా ఆనందంగా, రొమాంటిక్‌గా ఉంటున్నా. అందుకే నా కొత్త ఆల్భమ్ సాంగ్ ఆమెకి డెడికేట్ చేస్తున్నా' అంటూ హనీసింగ్ పేర్కొన్నాడు. అయితే ఆమె పేరు చెప్పడానికి ఆరోజు అంగీకరించని హనీసింగ్.. ఢిల్లీ ఈవెంట్‌లో మాత్రం టీనాను గర్ల్‌ఫ్రెండ్ అంటూ పరిచయం చేశాడు. దీంతో వీరిద్దరి ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
.@asliyoyo Introduce His New GF Tina 🔥
— Himanshu Aswal (Artist) (@Himanshaswal) December 7, 2022
Watch full Video : https://t.co/wOZDycy7dk#Yoyohoneysingh #Honeysingh #Honeysinghgirlfriend @Yoyohon86350823 #HoneySingh pic.twitter.com/zjz4lA4Hvi